విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్.. | Pune rising ipl matches scheduled at visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్..

Published Wed, Apr 20 2016 11:38 AM | Last Updated on Tue, May 29 2018 6:13 PM

విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్.. - Sakshi

విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్..

విశాఖపట్నం: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైంది. దీంతో సాగర తీరంలో సందడి నెలకొంది. మే 10 నుంచి మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కరవు కారణంగా మహారాష్ట్రలో మ్యాచ్‌లను తరలించాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో అక్కడ జరగాల్సిన 13 మ్యాచ్‌లను తరలించారు. దీంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు విశాఖ వైఎస్సార్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌గా ఎంచుకుంది.

పుణే, ముంబాయిలకు చెందిన జట్ల ఫ్రాంచైజీ ప్రతినిధులు ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. ముంబాయి ఇండియన్స్ జట్టు వాంఖడే స్టేడియం, పుణే జట్టు మహారాష్ట్ర స్టేట్ స్టేడియాన్ని హోమ్‌ పిచ్‌లుగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పుణే ఫ్రాంచైజీ కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలుకున్నా అవాంతరాలు ఏర్పాడ్డాయి. దీంతో పుణే జట్టు విశాఖలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఈ సీజన్‌లో ఐపీఎల్‌ లీగ్‌లో పుణే ఆడాల్సిన చివరి మూడు మ్యాచ్‌లకు వైఎస్సార్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రైజింగ్ పుణే జట్టుకు కెప్టెన్‌గా ధోని, కోచ్‌గా స్టీపెన్ ఫ్లెమింగ్ వ్యవహారిస్తున్నారు.
 
షెడ్యూల్
మే 10 - రైజింగ్ పుణే VS సన్‌రైజర్స్ హైదరాబాద్
మే 17 - రైజింగ్ పుణే VS ఢిల్లీ డేర్‌డెవిల్స్
మే 21 - రైజింగ్ పుణే VS కింగ్స్ ఎలెవన్ పంజాబ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement