IPL-9
-
అభిమానుల కోసం ఐపీఎల్ ట్రోఫీ
హైదరాబాద్: ఐపీఎల్-9లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు సాధించిన ట్రోఫీని అభిమానులు చూసే అవకాశాన్ని కల్పించింది ఆ జట్టు యాజమాన్యం. ఐపీఎల్ ట్రోఫీని శనివారం ఇనార్బిట్ మాల్లో, ఆదివారం ఫోరం సుజనామాల్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వ రకు ట్రోఫీని అభిమానులకు అందుబాటులో ఉంచుతారు. జట్టు గెలవడంలో హైదరాబాదీల సహకారం మరువలేనిదని యాజమాన్యం పేర్కొంది. ‘అభిమానుల సహకారం, వారి ప్రోత్సాహం జట్టులో స్ఫూర్తిని కలిగించాయి. వీరి అభిమానమే జట్టు విజేతగా నిలిచి కప్ గెలవడానికి కారణమైంది. వారి సహకారాన్ని గుర్తించేందుకు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె. షణ్ముగం వ్యాఖ్యానించారు. -
యువరాజ్ సింగ్ రికార్డ్
బెంగళూరు: టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్... ఐపీఎల్-9 టైటిల్ దక్కించుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన ఫైనల్లో యువరాజ్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. తమ జట్టుకు ఐపీఎల్ టైటిల్ దక్కడంతో యువీకి అరుదైన రికార్డ్ సొంతమైంది. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్న టీమ్స్ లో సభ్యుడిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా సత్తా చాటాడు. -
బెంగళూరు 3, హైదరాబాద్ 2
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల నెరవేరలేదు. ఐపీఎల్ లో బలమైన జట్టుగా పేరుగా గాంచిన ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ కప్ అందుకోలేకపోయింది. తాజాగా జరిగిన మెగా టోర్నీలోనూ ఆర్సీబీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. మూడుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది. ఐపీఎల్-2016లోనూ రన్నరప్ గానే సరిపెట్టుకుంది. 2009, 2011లో ఫైనల్ కు చేరినా టైటిల్ దక్కించుకోలేకపోయింది. అయితే ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్‌దే. రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు ఫైనల్లో పరాజయం పాలైంది. కాగా, హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఐపీఎల్ కప్ దక్కించుకోడం ఇది రెండోసారి. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచింది. అప్పడు కూడా బెంగళూరుపైనే హైదరాబాద్ గెలవడం విశేషం. రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సారథ్యంలోనే హైదరాబాద్ జట్టు కప్పు సొంతం చేసుకుంది. ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్లో అవకాశం దక్కింది. -
ఇది విరాట్ సీజన్
హర్షా భోగ్లే ఐపీఎల్ -9 సీజన్ ముగింపు దశకు చేరింది. అయితే ఇప్పటికే ఈ సీజన్‌పై విరాట్ కోహ్లి తనదైన ముద్ర వేశాడు. మున్ముందు తొమ్మిదో సీజన్ అంటే అది కోహ్లీదేనని అంతా గుర్తుంచుకుంటారు. గతంలో క్రిస్ గేల్, మైక్ హస్సీ అత్యధికంగా ఓ సీజన్లో 733 పరుగులతో అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని ఎవరైనా అధిగమిస్తారా? అని భావించినా కోహ్లి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏకంగా తను వెయ్యి పరుగులకు దరిదాపులో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ సీజన్లో అతడి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పరుగులు మాత్రమే కాకుండా నిష్ర్కమణ స్థితి నుంచి జట్టును ఫైనల్‌దాకా తీసుకొచ్చిన ఘనత కూడా తనదే. అలాగే ఆ జట్టును మనమంతా అభిమానించేలా చేశాడు. మరోవైపు ఇదే తరహాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తుది పోరుకు చేర్చించింది ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్. స్టార్లతో ఉన్న జట్టు ఓ వైపు.. మ్యాచ్ విన్నర్‌తో ఉన్న జట్టు మరోవైపు నేటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. నపోలి తరఫున మారడోనా అద్వితీయ ప్రదర్శనతో జట్టుకు లా లిగా టైటిల్‌ను అందించినట్టు చిన్నతనంలో విన్నాం. ఇప్పుడు సన్ కప్ గెలిస్తే వార్నర్ గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. బెంగళూరు బౌలర్లలో వాట్సన్, చాహల్ వికెట్ల వేటలో దూసుకెళుతున్నారు. క్రిస్ జోర్డాన్, శ్రీనాథ్ అరవింద్ కూడా కీలకంగా ఉన్నారు. అయితే నెహ్రా, ముస్తఫిజుర్ గాయాల కారణంగా హైదరాబాద్ ఆందోళనగా ఉంది. అయితే వారి స్థానాలను భర్తీ చేసిన బెన్ కట్టింగ్, బౌల్ట్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఆర్సీబీకి కెప్టెన్ కోహ్లి ఒక్కడే కాకుండా గేల్, డి విలియర్స్, వాట్సన్, రాహుల్ రూపంలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అందుకే ఈ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ధావన్, యువరాజ్, హెన్రిక్స్‌లతో పోల్చుకుంటే వారే మెరుగ్గా ఉన్నారు. వీరందరి విన్యాసాలను వీక్షించాలంటే ఐపీఎల్-9 ఫైనల్ పోరును అంతా ఆసక్తికరంగా చూడాల్సిందే. అద్భుత టోర్నమెంట్‌కు చక్కటి ముగింపు లభించాలని ఆశిద్దాం. -
మేం ఐపీఎల్ గెలిచేశాం..!
ఈ సీజన్ ఐపీఎల్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గెలిచినట్లే తాము భావిస్తున్నామని ఆ జట్టు క్రికెటర్ కె.ఎల్.రాహుల్ అన్నాడు. ‘ఓ దశలో మేం ప్లేఆఫ్‌కు చేరడమే కష్టంలా అనిపించింది. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవోలా పోరాడి పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరడమే గొప్ప ఘనత. జట్టులో అందరిలోనూ ఆత్మవిశ్వాసం ఉంది. మేం ఈ సీజన్ విజేతలమనే భావిస్తున్నాం’ అని రాహుల్ చెప్పాడు. -
అమ్మో.. అతడికి బౌలింగా?
టీమిండియా స్టార్ బాట్స్ మన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడానికి భయపడతానని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. బ్యాటింగ్ లో అతడి సామర్థ్యం, టెక్నిక్ అసమాన్యమని కొనియాడాడు. తనపై తనకున్న విశ్వాసంతో మైదానంలో కోహ్లి అద్భుతాలు చేస్తున్నాడని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు. 'నమ్మకం, సామర్థ్యం, టెక్నిక్ కారణంగా అతడు బ్యాటింగ్ లో అందరికంటే ముందు ఉంటున్నాడు. కోహ్లి.. రివర్స్ షాట్, ల్యాప్ షాట్లు ఆడడం మనం ఎప్పుడూ చూడలేదు. కొలిచినట్టుగా పక్కాగా క్రికెటింగ్ షాట్లే ఆడతాడు. చాలా స్థిరత్వంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడికి బౌలింగ్ చేయాల్సి వస్తే ఆందోళన చెందుతా. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ ఓపెనర్ గా వస్తే అవుట్ చేయడానికి చాలా కష్టపడే వాళ్లం. కోహ్లి కూడా అంతే. తొందరగా వికెట్ ఇవ్వడానికి అతడు ఇష్టపడడు' అని అక్రమ్ అన్నాడు. కోహ్లి సిక్సర్లు సులువుగా కొట్టేస్తున్నాడని తెలిపాడు. 'ఈ ఐపీఎల్ కోహ్లి ఇప్పటివరకు 36 సిక్సర్లు బాదాడు. నా క్రికెట్ కెరీర్ లో 50 ప్లస్ సిక్సర్లు సాధించాను. అతడు ఎంత శక్తివంతుడో దీన్ని బట్టే అర్థమవుతోంది. అతడి ఆటను చూడడం కన్నుల పండుగే' అని అక్రమ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ కు ఉందని ప్రశంసించాడు. అయితే కోహ్లి, ఏబీని పోల్చడం కష్టమని అన్నాడు. -
'అమ్మాయిలకు ఎప్పుడూ అలా చెప్పలేదు'
ముంబై: ఐపీఎల్ ప్లేఆఫ్ లో తమ జట్టు ఓటమిపై కోల్ కతా నైట్ రైడర్స్(కేకేఆర్) యజమాని, బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ విచారం వ్యక్తం చేశాడు. శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫయిర్ లో హైదరాబాద్ విజయం సాధించాలని ఆకాంక్షించాడు. 'ఎలిమినేటర్ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఈ మ్యాచ్ లో సరిగా ఆడలేకపోయాం. ఒక్కోసారి మనం ఎంత బాగా ఆడినా సరిపోదు. ఆల్ ద బెస్ట్ ఎస్ ఆర్ హెచ్' అంటూ షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశాడు. తమ టీమ్ ఓటమిని తట్టుకోలేక కేకేఆర్ చీర్ గాల్స్ కన్నీళ్లు పెట్టుకోవడంపైనా ట్విటర్ లో ఆయన స్పందించాడు. 'కేకేఆర్ ఆటగాళ్లు బాగా ఆడాలని ఎప్పుడూ కోరుకునేవాణ్ని. బాగా అలరించాలని ఎప్పుడూ చీర్స్ గాల్స్ కు చెప్పలేదు. లవ్ యూ గాల్స్ అండ్ థ్యాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో భాగంగా బుధవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ 22 పరుగులతో ఓడిపోయింది. Can’t deny,feeling very sad we didn’t get it right. Ami KKR till next year now.Sumtimes our best is just not good enuff. All the best SRH. — Shah Rukh Khan (@iamsrk) 25 May 2016 Always wish my KKR boys the best and never said anything to the girls who bring so much cheer. Lov u girls & thanx pic.twitter.com/sxkNxqgrrg — Shah Rukh Khan (@iamsrk) 25 May 2016 -
'వాళ్లే మ్యాచ్ ను గెలిపించారు'
న్యూఢిల్లీ: ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించడంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలకపాత్ర పోషించారని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 22 పరుగులతో సన్ రైజర్స్ విజయం సాధించింది. 'బౌలర్లు అద్భుతంగా రాణించారు. గాయంతో సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడిలేని లోటు తెలియకుండా చేశారు. ముఖ్యంగా బరీందర్ శరణ్ చాలా బాగుంది. అతడికి భువనేశ్వర్ కుమార్ మంచి సహకారం అందించాడు. మంచి విషయాలు నేర్చుకోవాలన్న ఆకాంక్ష టీమ్ లో చాలా ముఖ్యమ'ని వార్నర్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్ లోనూ తమ ఆటగాళ్లు స్థాయిమేరకు రాణించారని అన్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ మంచి క్యాచ్ లు పట్టారని ప్రశంసించాడు. రెండో క్వాలిఫయిర్ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. -
ABCDE
AB Can Do Everything... నిస్సందేహంగా ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అతనే’...డివిలియర్స్ గురించి బెంగళూరు కెప్టెన్ కోహ్లి చేసిన ప్రశంస ఇది. ఒక వైపు తాను పరుగుల వరద పారిస్తున్నా...సహచరుడు కాబట్టి మొహమాటానికో, ముఖస్తుతికో కోహ్లి ఈ మాట చెప్పినట్లు అనిపించవచ్చు. కానీ క్వాలిఫయర్‌లో డివిలియర్స్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అలాంటి ఆటతీరు మరెవరికీ సాధ్యం కాదని అర్థమవుతుంది. ఇప్పుడు అతను ఏబీడీ మాత్రమే కాదు. ఎప్పుడైనా, ఏ అద్భుతాన్నయినా ఆవిష్కరించగలిగే ఏబీసీడీఈ అనేది నిజం! ఐపీఎల్-9లో విరాట్ కోహ్లి అద్భుతాలను ఆస్వాదిస్తున్నవారికి అటు పక్క మరో మనిషి మెరుపులు కనిపించడం లేదు గానీ ఈ సీజన్లో డివిలియర్స్ ధ్వంస రచన తక్కువేమీ కాదు. ప్రస్తుతం అతను 682 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. పరుగులకంటే కూడా 170.07 స్ట్రైక్‌రేట్‌తో అతను పరుగులు బాదిన తీరు అందరికంటే అగ్రభాగాన నిలబెట్టింది. ఎక్కువ సిక్సర్ల (37) మోత మోగించిన ఘనత కూడా డివిలియర్స్‌దే. ప్రత్యర్థి బౌలింగ్‌పై జరిగిన సామూహిక హననంలో కొన్ని సార్లు కోహ్లికి భాగస్వామిగా నిలిచిన ఏబీ... మరి కొన్ని మ్యాచ్‌లలో ఒంటిచేత్తో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. విరాట్ తరహాలో తాను అతిగా ఆలోచించనని, అప్పటికప్పుడు ఎలా అనిపిస్తే అలా షాట్ ఆడతానని స్వయంగా చెప్పుకున్నా... అసలు సమయంలో అతని ‘మాస్టర్ మైండ్’ మాత్రం అద్భుతంగా పని చేస్తుందని ఏబీ బ్యాటింగ్ చూస్తే చెప్పవచ్చు. ప్రతీ సారి కొత్తగా... మంగళవారం మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్, పదును డివిలియర్స్ మళ్లీ చూపించాడు. జకాతి బంతిని విసరక ముందే ఆఫ్‌సైడ్‌కు వెళ్లి మోకాళ్లపై కూర్చుని బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్ నిజంగా అద్భుతం. ఈ షాట్‌కు అచ్చెరువు పొందిన కోహ్లి కూడా గాల్లో పంచ్‌లు విసురుతూ తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. భిన్నంగా, ఎవరూ ఆడలేని వైవిధ్యమైన షాట్లు ఆడటం ఏబీకి అలవాటే. కానీ అలాంటి షాట్లు కూడా ఆడుతుంటే మళ్లీ కొత్త కొత్తగా కనిపించడం ఏబీ చేస్తున్న మాయ మాత్రమే! మ్యాచ్ చివర్లో ప్రవీణ్ కుమార్ లెగ్ స్టంప్ బయట వేసిన బంతిని రివర్స్ స్వీప్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీకి తరలించడం క్లాసిక్ అంటే అతిశయోక్తి కాదు. తొలి ఇన్నింగ్స్‌లో లెక్కా పత్రం లేకుండా విరుచుకు పడటం ఒక శైలి. కానీ జట్టు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో టెయిలెండర్ సహాయంతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ఆ బ్యాటింగ్ గొప్పతనం ఏమిటో కనిపిస్తుంది. ఈ రెండూ సందర్భాల్లోనూ ఏబీలోని హిట్టర్‌కు తెలిసింది ఒత్తిడికి లోను కాకుండా భారీ షాట్లతో పరుగులు రాబట్టడమే. ఫైనల్ సవాల్... అభిమానుల మది దోచిన పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు డివిలియర్స్ ఖాతాలో ఉన్నాయి. కానీ అటు అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలు ఇటు లీగ్‌ల వరకు అతనికి ఫైనల్ మ్యాచ్‌లు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆ చాన్స్ అతని ముందు నిలిచింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్ దానికి సన్నాహకంగా చెప్పుకోవచ్చేమో. ‘నేను నా గణాంకాల గురించి అసలు పట్టించుకోను. నా సెంచరీ, హాఫ్ సెంచరీల గురించి ఏ మాత్రం ఆలోచించను. జట్టును లక్ష్యానికి చేర్చడమే నాకు ఆనందాన్నిస్తుంది తప్ప ఏ ఒక్క ఇన్నింగ్సో ప్రత్యేకమైంది కాదు. నేను క్రికెట్ ఆడేదే ఆ ఆనందం కోసం’ అంటూ ఏబీ చెప్పుకున్నాడు. అయితే అతను పట్టించుకోకపోయినా, అతని ప్రతీ పరుగు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంది. సొంతగడ్డపై జరగనున్న ఫైనల్లో కూడా అతను బెంగళూరును గెలిపించగలిగితే ఆ ఆనందానికి ఇక హద్దు ఉండదు. - సాక్షి క్రీడా విభాగం -
కోహ్లి ప్రియురాలిని కాపాడిన డివిలియర్స్!
బెంగళూరు: ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్-9 తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై ట్విటర్ లో పుంఖాను పుంఖాలుగా సరదా కామెంట్లు వచ్చాయి. పంచ్ లు విసిరారు, సలహాలు ఇచ్చారు. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ట్వీట్లు వదిలారు. కోహ్లి సేనను కంగారు పెట్టిన ధవళ్ కులకుర్ణి పుట్టినరోజు మంగళవారమే(మే 24) అన్న విషయాన్ని ఒకరు గుర్తు చేయగా, అతడు గల్లీ క్రికెట్ కూడా ఇన్ని వికెట్లు తీసుండడని మరొకరు కామెంట్ చేశారు. షార్ట్ బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్న లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు వజ్ ఇట్ వెరీ షాట్? అంటూ ప్రశ్న సంధించారు. లయన్స్ నుంచి ఏబీడీ మ్యాచ్ ను లాగేసుకున్నాడని ప్రీతి జింతా ట్వీట్ చేసింది. సున్నాకే అవుటై కోహ్లి మిషన్ కాదు మనిషినని రుజువు చేసుకున్నాడని ఇంకొరు వ్యాఖ్యానించారు. బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ షేర్లు కన్నా వేగంగా ఆర్సీబీ వికెట్లు పతనమయ్యాయని పంచ్ విసిరారు. మ్యాచ్ గెలిపించి కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ విమర్శల బారిన పడకుండా డివిలియర్స్ రక్షించాడని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లి-డివిలియర్స్ అనుబంధం గురించి చెబుతూ వీరిద్దరి లవ్ స్టోరీ 'టైటానిక్'ను మించిపోయిందని ఇంకొరు పేర్కొన్నారు. గుజరాత్ లయన్స్ తమ థిమ్ సాంగ్ లోని మొదటి పదాలు 'గేమ్ మారీ చె' మార్చుకోవాలని సలహాయిచ్చారు. AB de Villiers Just Saved Anushka From Trending Worldwide. ;)#RCBvGL #IPL2016 #IPL #IPL9 — Sir Ravindra Jadeja (@SirJadeja) 24 May 2016 RCB wickets falling faster than Kingfisher Airlines shares. — Trendulkar (@Trendulkar) 24 May 2016 What a game between #RCBvGL tonight#ABD stole the game away & won it in style. Feel sad for Raina but it was #AB's night #Iqbal #VIVOIPL — Preity zinta (@realpreityzinta) 24 May 2016 -
బెంగళూరు టాప్!
బెంగళూరు: ఐపీఎల్-9లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) దుమ్మురేపుతోంది. ఫైనల్లోకి దూసుకెళ్లిన కోహ్లి టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆరంభంలో కాస్త వెనకబడినా తర్వాత పుంజుకుని ఫైనల్ చేరింది. ముఖ్యంగా కోహ్లి అద్భుతంగా ఆడుతూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. విధ్వంసకర ఆటగాళ్లు డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ అండదండలతో ఆర్సీబీని టైటిల్ కు చేరువ చేశాడు. ఈ ఐపీఎల్ లో అన్ని విభాగాల్లోనూ ఆర్సీబీ ఆటగాళ్లే ముందుడడం ఆ జట్టు సత్తాను వెల్లడిస్తోంది. కోహ్లి అత్యధిక వ్యక్తిగత పరుగులు(919)తో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా, వాట్సన్ అత్యధిక వికెట్లు(20) పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరో బౌలర్ యజువేంద్ర చాహల్ కూడా 20 వికెట్లు తీశాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అత్యధిక సిక్సర్లు, అత్యధిక ఫోర్లు, హయ్యస్ట్ స్కోరు, అత్యధిక వ్యక్తిగత స్కోరు, ఎక్కువ సెంచరీలు సాధించారు. అందరికంటే ఎక్కువగా కోహ్లియే ఎక్కువ విభాగాల్లో టాప్ లో ఉన్నాడు. ఫెయిర్ ప్లే అవార్డు రేసులోనూ ఆర్సీబీ ముందుంది. అత్యధిక సెంచరీలు: విరాట్ కోహ్లి(4) అత్యధిక సిక్సర్లు: డివిలియర్స్(37) అత్యధిక ఫోర్లు: విరాట్ కోహ్లి(78) హయ్యస్ట్ టీమ్ స్కోరు: 248/3(బెంగళూరు) అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129(డివిలియర్స్) అత్యంత విలువైన ఆటగాడు: విరాట్ కోహ్లి(334.5) -
వాట్ ఏ ఫెర్ఫార్మెన్స్...
బెంగళూరు: ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించిన విధ్వంసకర బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. డివిలియర్స్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడని పేర్కొన్నాడు. అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడని మెచ్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన కీలక మ్యాచ్ లో డివిలియర్స్ గొప్పగా పోరాడాడని, ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ ఆటగాడని ఆకాశానికెత్తాడు. అతడిలా మరొకరు ఆడలేరని ట్విటర్ పోస్ట్ చేశాడు కోహ్లి. ఐపీఎల్-9 భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్ తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బెంగళూరు జట్టును డివిలియర్స్ అసమాన పోరాటంతో విజయ తీరాలకు చేర్చాడు. అతడి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో (47 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) బెంగళూరు ఫైనల్లోకి దూసుకెళ్లింది. What a performance. Big Game, Pressure Situation & the best in the world, @ABdeVilliers17, delivers like no one else pic.twitter.com/NNGc24shV2 — Virat Kohli (@imVkohli) May 24, 2016 -
కోహ్లి కొడతాడా?
బెంగళూరు: అందరి దృష్టి అతడి మీదే. అతడు ఎలా చెలరేగుతాడో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. సొంత మైదానంలో అరుదైన రికార్డు సాధిస్తాడా, లేదా అని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు కలిసొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో 'విరాట్' పర్వం లిఖించాలని కోరుకుంటున్నారు. నేడు జరగనున్న ఐపీఎల్-9 మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్.. విరాట్ కోహ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బెంగళూరు కెప్టెన్ మరో 81 పరుగులు చేస్తే అరుదైన ఘనత అతడి సొంతమవుతుంది. 14 మ్యాచ్‌లలో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో ఏకంగా 919 పరుగులు చేసిన కోహ్లి 81 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు పూర్తవుతాయి. కోహ్లి ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే అతడు వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేలా కన్పిస్తున్నాడు. ఈ మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లలో కలిపి 351 పరుగులు చేసిన 'మిస్టర్ అగ్రసివ్' ఈ ఫీట్ సాధిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో విఫలమైనా అతడికి మరో అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్స్ కు చేరితే మరో మ్యాచ్ ఆడతాడు. బెంగళూరు ఓడితే అతడికి రెండు మ్యాచ్ లు ఆడొచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో రెండో క్వాలిఫయిర్ లో ఆడొచ్చు. ఈ మ్యాచ్ నెగ్గితే ఫైనల్లో ఆడే అవకాశం ఉంటుంది. మొత్తం మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది కాబట్టి కోహ్లి వెయ్యి పరుగులు పూర్తి చేయడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇప్పటికే సింగిల్ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. -
సిక్స్ లు: 580, వికెట్లు: 606
క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొమ్మిదో సీజన్ లీగ్ మ్యాచ్ లు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 24 నుంచి తుది పోటీలకు తెర లేస్తుంది. మంగళవారం నుంచి మొదలయ్యే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లు అన్ని రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతాయి. ఎప్పటిలానే ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఈ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించి టాప్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. 919 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 658 పరుగులు చేశాడు. డివిలియర్స్(603 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు టీమ్ కే చెందిన యజువేంద్ర చాహల్ 19 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో ఆర్సీబీ 144 పరుగులతో గుజరాత్ పై బిగ్గెస్ట్ విన్ సాధించింది. సెకండ్ బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గుజరాత్ ను ఓడించి అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఇలాంటి విశేషాలు ఐపీఎల్-9 లీగ్ మ్యాచుల్లో చాలానే ఉన్నాయి. మొత్తం పరుగులు: 17,510 బౌండరీలతో వచ్చిన పరుగులు: 9552 అర్థసెంచరీలు: 103 వికెట్లు: 606 సిక్స్ లు: 580 అత్యధిక సిక్సర్లు: 36(కోహ్లి) లాంగెస్ట్ సిక్స్: 111 హయ్యస్ట్ టీమ్ స్కోరు: 248/3(బెంగళూరు) అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129(డివిలియర్స్) బెస్ట్ బౌలింగ్: 6/19(ఆడమ్ జంపా) ఫాస్టెస్ట్ బాల్: 150. 02 హ్యాట్రిక్: ఒకటి (అక్షర్ పటేల్-పంజాబ్) బెస్ట్ ఎకానమీ: 5.00(మిచెల్ మార్ష్) లీగ్ మ్యాచుల్లో సూపర్ ఓవర్లు నమోదు కాలేదు -
శార్దూల్ ఠాకూర్‌కు చోటు
► వైస్‌కెప్టెన్‌గా రహానే ► షమీ పునరాగమనం ► వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు ముంబై: వెస్టిండీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు సోమవారం భారత జట్టును ప్రకటించారు. రెండు మార్పులు మినహా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన జట్టుపైనే కమిటీ నమ్మకముంచింది. ఆ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో కొత్త ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడని మరో పేసర్ మొహమ్మద్ షమీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమ్‌తో పాటు ఉన్నా, మ్యాచ్ ఆడని గుర్కీరత్ సింగ్‌ను తప్పించారు. 17 మంది సభ్యుల జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఫార్మాట్లో కీలక ఆటగాడిగా ఎదిగిన అజింక్య రహానేకు తొలి సారి టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కడం విశేషం. ముంబైకి చెందిన 24 ఏళ్ల శార్దూల్ ఒక్కడే ఈ టీమ్‌లో పూర్తిగా కొత్త ఆటగాడు. నాలుగేళ్ల క్రితం రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టిన అతను 37 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 27.53 సగటుతో 133 వికెట్లు పడగొట్టాడు. 2014-15 సీజన్లో 48 వికెట్లతో సంయుక్తంగా రంజీ టాపర్‌గా నిలిచిన శార్దుల్... 2015-16 సీజన్లో 41 వికెట్లు తీసి ముంబై చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనే అతనికి టెస్టు జట్టులో చోటు కల్పించింది. ఇంకా తుది తేదీలు ఖరారు కాని ఈ పర్యటనలో భారత్, విండీస్‌తో నాలుగు టెస్టులు ఆడుతుంది. ఐపీఎల్లో పట్టించుకోకపోయినా...: రెండు వారాల క్రితం పనికి రాడంటూ ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని ఇంటికి పంపించింది. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ నేరుగా టీమిండియాకే ఎంపికయ్యాడు. 2014నుంచి మూడు సీజన్లలో కలిపి ఐపీఎల్లో అతడిని పంజాబ్ కేవలం ఒకే మ్యాచ్‌లో ఆడించింది. తనను తప్పించిన తర్వాత అసహనంతో ‘ఐపీఎల్ నిజంగానే అద్భుతాలు చేసింది’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన శార్దూల్‌కు ఇప్పుడు సరైన అవకాశం లభించింది. ముంబై కీలక బౌలర్‌గా అతని ప్రదర్శనను సెలక్టర్లు గుర్తించారు -
'రాంగ్ టైమ్ లో అవుటయ్యా'
రాయ్ పూర్: మంచి గేమ్ ప్లాన్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం సాధించిందని ఢిల్లీ డేర్ డెవిల్స్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ అన్నాడు. ఒత్తిడిలో మ్యాచ్ ఓడిపోయామని చెప్పాడు. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీని బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్-9 ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డీకాక్ మాట్లాడుతూ.. బెంగళూరు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురయ్యామని, మంచి భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయామని చెప్పాడు. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ చేసిన మార్పులు ఆ జట్టుకు లాభించాయని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయామని, తాను కూడా రాంగ్ టైమ్ లో అవుటయ్యానని తెలిపాడు. మరో 20 పరుగులు చేసివుంటే ఆర్సీబీకి గట్టిపోటీ ఇచ్చేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి ఐపీఎల్ దోహద పడిందని, స్పిన్ బౌలింగ్ ఆడడం నేర్చుకున్నానని తెలిపాడు. అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై డీకాక్ ప్రశంసలు కురిపించాడు. -
బ్రావోకు జరిమానా
కాన్పూర్: గుజరాత్ లయన్స్ ఆల్-రౌండర్ డ్వేన్ బ్రావోకు జరిమానా పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిబంధనలు ఉల్లఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ముంబై ఇండియన్స్ తో కాన్పూర్ లో శనివారం జరిగిన మ్యాచ్ లో అతడు నిబంధనలు ఉల్లఘించినట్టు రుజువు కావడంతో మ్యాచ్ రిఫరీ జరిమానా విధించినట్టు ఐపీఎల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ సందర్భంగా ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ తో బ్రావో గొడవ పడ్డాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఐపీఎల్-9 గంభీర్, కోహ్లి సహా పలువురు ఆటగాళ్లు జరిమానాకు గురైయ్యారు. -
పియూష్ చావ్లా లేడు
కోల్ కతా: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 55వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది. ఒక మార్పుతో సన్ రైజర్స్ బరిలోకి దిగుతోంది. ఇయాన్ మోర్గాన్ స్థానంలో కానే విలియమ్సన్ జట్టులోకి వచ్చాడు. కోల్ కతా ఆటగాడు రసెల్స్ గాయం కారణంగా ఆడడం లేదు. మోర్నీ మోర్కల్, పియూష్ చావ్లాకు బదులుగా కొలిన్ మున్రో, కుల్దీప్ యాదవ్ ను టీమ్ లోకి తీసుకున్నారు. -
టాప్-2పైనే సన్‌రైజర్స్ దృష్టి
హర్షా భోగ్లే ఐపీఎల్లో కొన్ని అంచనాలు తలకిందులైనా ఇప్పుడు టోర్నీ పోటాపోటీ స్థితికి చేరింది. రేసులో ఉన్న జట్లకు ఇప్పుడు ప్రతీ మ్యాచ్ కీలకంగానే మారింది. గతంలో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్)లాగే తాజాగా డిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్ కోసం తమ శాయశక్తులా పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే వారికి రాహుల్ ద్రవిడ్ రూపంలో రాయల్స్ డీఎన్ఏ జట్టులో ఉంది. ఆటగాళ్లను ఎక్కువగా రొటేట్ చేస్తున్నా బ్రాత్‌వైట్‌ను ఎక్కువగా వాడుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టికలో ఉత్తమ స్థానంపై కన్నేసింది. నేటి మ్యాచ్‌లో వీరు గెలిస్తే టాప్-2లో కచ్చితంగా స్థానం దక్కుతుంది. ఫామ్‌లో ఉన్న ధావన్ మరోసారి మెరిస్తే జట్టుకు ప్రయోజనమే. పేసర్ ముస్తఫిజుర్ ప్రదర్శనపై నాకు ఆసక్తిగా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతడి బంతులను బ్యాట్స్‌మెన్ సులువుగానే ఎదుర్కొని పరుగులు చేశారు. ఇప్పుడు తను ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడో చూడాలి. -
కృనాల్ పాండ్యా వీరబాదుడు
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్లోముంబై ఇండియన్స్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కృనాల్ పాండ్యా(86;37 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కృనాల్.. ఆ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించి ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(31;21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), గప్తిల్(48;42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశారు.అనంతరం కృనాల్ పాండ్యా వీరబాదుడు బాది ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా కృనాల్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. అయితే 18.0 ఓవర్ లో ఆఫ్ స్టంప్ బయటకు వెళుతున్న బంతిని వెంటాడిన కృనాల్ బౌల్డ్ కావడంతో ముంబై జోరు కాస్త తగ్గింది. ఇక చివర్లో బట్లర్(18 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్),అంబటి రాయుడు(13 నాటౌట్;5 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు రెండు వికెట్లు దక్కగా, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. -
ముంబైకి చావో రేవో
విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 47వ లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. విశాఖలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ముంబైకు నేటి మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితో ఆత్మవిశ్వాసంతో ప్లేఆప్ కు చేరువవుతుంది. ఢిల్లీ టీమ్ కూడా ఈ మ్యాచ్ కీలకం. పాయింట్ల పట్టికలో ఢిల్లీ నాలుగు, ముంబై ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. జయంత్ యాదవ్, నాథన్ కౌంటర్-నిలె, మహ్మద్ షమీ స్థానంలో ఢిల్లీ టీమ్ లో జహీర్ ఖాన్, నదీం, తాహిర్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో ఢిల్లీకి డుమిని కెప్టెన్ గా వ్యవహరించాడు. ముంబై టీమ్ లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉన్ముక్త్ చాంద్ స్థానంలో మార్టిన్ గప్టిల్.. సౌతీ ప్లేస్ లో వినయ్ కుమార్ జట్టులోకి వచ్చారు. -
ప్లే ఆఫ్‌కు హైదరాబాద్
మొహాలీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో అంచనాలు మించి రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంది. ఈ తాజా విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. కింగ్స్ పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(52;41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్), శిఖర్ ధవన్ (25;22 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం దీపక్ హూడా(34; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ 16.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆపై యువరాజ్ సింగ్(42 నాటౌట్;24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాటు, కట్టింగ్(21నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందివ్వడంతో సన్ రైజర్స్ ఇంకా రెండు బంతులుండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ మురళీ విజయ్(6) నిరాశపరచగా, హషీమ్ ఆమ్లా(96;56 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం సాహా(27), గుర్ కీరత్ సింగ్(27), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. -
వార్నర్ ను వెంటాడిన దురదృష్టం
మొహాలి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టకర రీతిలో అవుటయ్యాడు. జాగ్రత్తగా ఆడినప్పటికీ 'హిట్ వికెట్'గా పెవిలియన్ చేరాడు. 180 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే బరిలోకి సన్ రైజర్స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఎప్పటిలాగానే వార్నర్ విజృభించి ఆడాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అక్షర్ పటేట్ వేసిన బంతిని ఆడే క్రమంలో అతడి బ్యాక్ ఫుట్ వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడ్డాయి. అంపైర్ హిట్ వికెట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. ఈ సీజన్ లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు హిట్ వికెట్ అవుట్ కావడం విశేషం. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ హిట్ వికెట్ గా అవుటయ్యారు. మిచెల్ మెక్లీగన్ బౌలింగ్ లో ఆడబోయి యువీ బ్యాట్ తో వికెట్లను కొట్టాడు. ఐపీఎల్ లో హిట్ వికెట్ గా అవుటైన ఏడో బ్యాట్స్ మన్ వార్నర్ నిలిచాడు. -
'కోహ్లి గొప్ప ఆటగాడు, అతడిని ఆరాధిస్తా'
ముంబై: భారత స్టార్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కానే విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి గొప్ప ఆటగాడని, అతడిని ఆరాధిస్తానని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు. 'కోహ్లి గ్రేట్ ప్లేయర్. నేను ఆరాధించే ఆటగాళ్లలో అతడు ఒకడు. మిగతా క్రీడాకారులను నేను అభిమానిస్తాను. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లి అద్భుతంగా ఆడడం సాధారణ విషయం కాద'ని విలియమ్సన్ అన్నాడు. మైదానంలో దూకుడు ప్రదర్శించడం కోహ్లికి కలిస్తొందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో కోహ్లితో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా బాగా ఆడుతున్నాడని అన్నాడు. యువరాజ్ సింగ్ తో కలిసి ఐపీఎల్ లో ఆడడం పట్ల విలియమ్సన్ సంతోషం వ్యక్తం చేశాడు. -
హషీమ్ ఆమ్లా దూకుడు
మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అదరగొట్టాడు. 56 బంతుల్లో 14 ఫోర్లు,2 సిక్సర్లతో చెలరేగి ఆడి 96 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన ఆమ్లా ఆద్యంతం దూకుడుగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మురళీ విజయ్(6) నిరాశపరిచాడు.ఆ తరుణంలో ఆమ్లాకు జత కలిసిన సాహా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 54 పరుగులు జత చేసిన అనంతరం సాహా(27) పెవిలియన్ కు చేరాడు. అనంతరం గుర్ కీరత్ సింగ్(27), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. దీంతో పంజాబ్ 180 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచకల్గింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హెన్రీక్యూస్లకు తలో వికెట్ దక్కింది. -
శరణ్ అవుట్, శర్మ ఇన్
మొహాలి: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 46వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించేలా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. మంచి స్కోరు సాధించి, కాపాడుకోవడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా చెప్పాడు. కేసీ కరియప్ప స్థానంలో అనురీత్ సింగ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. తాము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. మొత్తానికి తాము కోరుకున్నవిధంగా ముందుగా బౌలింగ్ దక్కిందని వెల్లడించాడు. సన్ రైజర్స్ టీమ్ రెండు మార్పులు జరిగాయి. కానే విలియమ్సన్, బరీందర్ శరణ్ స్థానంలో బెన్ కటింగ్, కర్ణ్ శర్మను తీసుకున్నారు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్ లో ఉండగా, పంజాబ్ ఏడో స్థానంలో ఉంది. -
'మ్యాక్స్ వెల్ మళ్లీ వచ్చాడు'
విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా శుక్రవారమిక్కడ జరుగుతున్న 43వ లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలించేలా పిచ్ ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. తమ టీమ్ ఒక మార్పు జరిగిందని చెప్పాడు. పార్థీవ్ పటేల్ స్థానంలో ఉన్ముక్త్ చాంద్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నామని పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ అన్నాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగాయని చెప్పాడు. మ్యాక్స్ వెల్ మళ్లీ జట్టులోకి వచ్చాడని, అనురీత్ సింగ్ స్థానంలో గురుకీరత్ ను తీసుకున్నామని వెల్లడించాడు. ఇప్పటి వరకు సరైన ఇన్నింగ్స్ ఆడకపోవడంతో గత మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ను తొలగించారు. పాయింట్ల పట్టికలో ముంబై ఐదో స్థానంలో ఉండగా, పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది. -
మ్యాక్స్ వెల్, జాన్సన్ ఫైర్
న్యూఢిల్లీ: ఐపీఎల్-9 ఆరంభం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వార్తల్లో ఉంటూ వస్తోంది. సరిగా రాణించడం లేదని మిల్లర్ ను తప్పించి సిరీస్ మధ్యలో మురళీ విజయ్ ను జట్టు కెప్టెన్ గా నియమించింది. బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో కోచ్ సంజయ్ బంగర్ ను జట్టు సహయజమాని ప్రీతి జింతా దూషిచింనట్టు వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా షాన్ మార్ష్ ను స్వదేశానికి తిప్పి పంపడంపై ఓ ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. గాయం కారణంగా అతడిని స్వదేశానికి పంపలేదని, సహచర ఆటగాడితో గొడవ పడినందుకే మార్ష్ ను తొలగించారని పేర్కొంది. డ్రెస్సింగ్ రూములో తోటి ఆటగాడిని అతడు కొట్టాడని వెల్లడించింది. దీనిపై 'కింగ్స్' ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, మిచెల్ జాన్సన్ ఘాటుగా స్పందించారు. ఇవన్నీ చెత్త వార్తలు అంటూ మ్యాక్స్ వెల్ కొట్టిపారేశాడు. 'టీమ్మేట్ ను కొట్టినందుకే మార్ష్ ను స్వేదేశానికి పంపారంట. గాయపడినందుకు కాదంటా. ఇంతకన్నా జోక్ మరోటి ఉండదంటూ' ట్వీట్ చేశాడు. ఇలాంటి కథనం రాసినందుకు దీపాంకర్ లాహిరిని ఫిక్షన్ స్టోరీ రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని జాన్సన్ ట్విటర్ లో పేర్కొన్నాడు. -
జహీర్ ఖాన్ లేడు
హైదరాబాద్: ఐపీఎల్-9లో భాగంగా గురువారమిక్కడ జరుగుతున్న 42వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డుమిని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి టీమ్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఢిల్లీ జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. జహీర్ ఖాన్, బ్రాత్ వైట్, బిల్లింగ్స్, నదీం స్థానంలో డుమిని, కౌల్టర్-నిల్, జయంత్ యాదవ్, మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చారు. హైదరాబాద్ టీమ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది. -
'నన్ను ఆమె తిట్టలేదు'
న్యూఢిల్లీ: ప్రీతి జింతా తనను ఏమీ అనలేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. తనను ఆమె దూషించిందని వచ్చిన వార్తలు కల్పితమని కొట్టిపారేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో బంగర్ పై ప్రీతి నోరు పారేసుకుందని, అతడిని కోచ్ పదవికి నుంచి పీకేస్తానని హెచ్చరించిందని ముంబైకి చెందిన దినపత్రిక ప్రచురించింది. 'మ్యాచ్ ముగిసిన తర్వాత కింగ్స్ టీమ్ యాజమానులతో మామూలుగానే మాట్లాడా. దీనికి మీడియా విపరీత అర్థాలు తీసి కల్పిత కథనాలు అల్లింది. అసభ్య, అగౌరవపరిచే మాటలు నన్ను అనలేదు. ఒక్క పరుగుతో మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఓడిపోయినప్పటికీ మా టీమ్ బాగా క్రికెట్ ఆడింది. టోర్నమెంట్ లో చివరి వరకు నిలిచేందుకు పోరాటం కొనసాగిస్తామ'ని బంగర్ తెలిపారు. బంగర్ ను తాను తిట్టినట్టు వచ్చిన వార్తలను ప్రీతి జింతా తీవ్రంగా ఖండించింది. కల్పిత కథనాలు ప్రచురించిన పత్రికలపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చింది. -
గేల్ మళ్లీ వచ్చాడు
బెంగళూరు: ఐపీఎల్-9లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న 41వ లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోవడం పట్ల ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బోర్డుపై పరుగులు ఎక్కువ నమోదయ్యేలా చూసుకుంటామని దీమాగా చెప్పాడు. ఆర్సీబీ టీమ్ లో ట్రవీస్ హెడ్ స్థానంలో క్రిస్ గేల్ జట్టులోకి వచ్చాడు. ఇక్బాల్ అబ్దుల్లా బదులు శ్రీనాథ్ అరవింద్ ను తీసుకున్నారు. ముంబై టీమ్ లో ఒక మార్పు జరిగింది. హార్థిక్ పాండ్యా స్థానంలో నితీష్ రాణాను టీమ్ లోకి వచ్చాడు. నితీశ్ కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. పాయింట్ల పట్టికలో ముంబై 5, బెంగళూరు 6 స్థానాల్లో ఉన్నాయి. -
బౌలింగ్ లో తిరుగులేని మొనగాడు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-9లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న భారత వెటరన్ పేసర్ అశిష్ నెహ్రా తొలి నాలుగు మ్యాచుల్లో తీసింది రెండు వికెట్లు. దీంతో నెహ్రా బౌలింగ్ పదును తగ్గిందని భావించిన వారికి ఎప్పిటిలాగే బంతితోనే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆడిన రెండు కీలక మ్యాచుల్లో సరైన సమయంలో రాణించి మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ నెహ్రా తనదైన బంతులతో వైవిధ్యాన్ని చూపెట్టాడు. దీంతో ముంబై ఈ సీజన్లోలోనే దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ అయితే దాదాపుగా పుణే గెలిచిందని ఆఖరికి సన్ రైజర్స్ కూడా భావించి ఆశలు వదిలేసుకుంది. ఎప్పటిలాగే నమ్మకస్తుడైన నెహ్రాకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బంతిని అందిస్తే అతడి నమ్మకాన్ని నిలబెట్టి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. చివరి ఓవర్లో 14 పరుగులు చేస్తే పుణే విజయం సాధిస్తుంది.. మరోవైపు క్రీజులో ఉన్నది తిషారా పెరీరా, మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇద్దరూ హార్డ్ హిట్టర్సే. కానీ, ఓ తెలివైన బంతితో పెరీరాను పెవిలియన్ కు పంపాడు నెహ్రా. ఆ వెంటనే ధోనీ సిక్స్ కొట్టి ఆశలు రేపినా.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. మ్యాచ చివరి బంతికి అడం జంపాను అవుట్ చేసి సన్ రైజర్స్ ను 4 పరుగుల తేడాతో గట్టెక్కించి అత్భుత విజయాన్ని అందించాడు. పుణే బౌలర్ జంపా ఐపీఎల్-9లో (6/19)తో బెస్ట్ గణాంకాలు నమోదు చేసినా హైదరాబాద్ ను పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిపిన నెహ్రానే అందరి ప్రశంసలు అందుకున్న బౌలరయ్యాడు. -
కోరుకున్నదే దక్కింది: ధోని
విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న 40వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎక్కువ పరుగులు సాధించడం కీలకమైన అంశమని వార్నర్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో మార్పులు ఏమీ లేవని తెలిపాడు. తాము ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని, కోరుకున్నదే దక్కిందని పుణే కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. ముందుగా ఫీల్డింగ్ దక్కడం పట్ల తమ ఆటగాళ్లు అందరూ సానుకూలంగా ఉన్నారని చెప్పాడు. తమ టీమ్ లో కూడా ఎటువంటి మార్పులు లేవని తెలిపాడు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, పుణే ఏడో స్థానంలో ఉంది. -
మ్యాక్స్ వెల్ అవుట్
మొహాలి: ఐపీఎల్-9లో భాగంగా సోమవారమిక్కడ జరుగుతున్న 39వ లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్టు విజయ్ తెలిపాడు. వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తొలగించారు. అతడి స్థానంలో బెహరిద్దీన్ జట్టులోకి వచ్చాడు. గురుకీరత్ సింగ్ స్థానంలో అనురీత్ సింగ్ ను తీసుకున్నారు. బెంగళూరు టీమ్ లో ఒక మార్పు జరిగింది. పర్వేజ్ రసూల్ స్థానంలో అబ్దుల్లా ఇక్బాల్ కు జట్టులో స్థానంలో కల్పించారు. పాయింట్ల పట్టికలో బెంగళూరులో ఏడో స్థానంలో ఉండగా, పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది. -
'అక్షర్ అద్భుతం చేశాడు'
రాజ్ కోట్: 'హ్యాట్రిక్' నమోదు చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ప్రశంసలు కురింపించాడు. అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... 'ఈ రోజు విజయం క్రెడిట్ అక్షర్ కు దక్కుతుంది. గత మ్యాచుల్లో అతడు ఒత్తిడికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని పేర్కొన్నాడు. ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో టాప్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను 'హ్యాట్రిక్' వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. మిల్లర్ ను తప్పించి విజయ్ కు కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అక్షర్ తో పాటు పేసర్లు మొహిత్ శర్మ, సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారని విజయ్ అన్నాడు. మిల్లర్ ఫామ్ గురించి అడగ్గా.. ఏ జట్టుకైనా అతడు ఎసెట్ అని పేర్కొన్నాడు. ఏడు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. -
కొత్త పెళ్లికొడుక్కి చివాట్లు
రాజ్ కోట్: ఐపీఎల్ లో ఆటగాళ్లకు మందలింపుల పర్వం కొనసాగుతోంది. చీవాట్లు తిన్న వారి సరసన కొత్త పెళ్లికొడుకు రవీంద్ర జడేజా కూడా చేరాడు. పంబాబ్ బ్యాట్స్ మన్ షాన్ మార్ష్, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇప్పటికే మందలింపులు ఎదుర్కొన్నారు. తాజాగా గుజరాత్ లయన్స్ ఆల్-రౌండర్ జడేజా ఈ లిస్టులో చేరాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని మందలించారు. ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడు మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో జడేజాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ను పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడించింది. కాగా, రవీంద్ర జడేజా ఏప్రిల్ 17న రాజ్ కోట్ లో పెళ్లిచేసుకున్నాడు. వివిధ కారణాలతో డు ప్లెసిస్, కోహ్లి, శరణ్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్నారు. -
ధోని సేనకు దెబ్బమీద దెబ్బ
పుణే: ఐపీఎల్ లో ఎంఎస్ ధోని సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కు దెబ్బమీద తగులుతోంది. గాయాలతో విదేశీ స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగారు. వీరి సరసన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. మణికట్టు గాయంతో స్మిత్ ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధ పడుతున్న అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. వరుసగా స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో పుణే విజయావకాశాలపై ఆ ప్రభావం పడుతోంది. ఆరంభ మ్యాచుల్లో ఆకట్టుకోని స్మిత్ తర్వాత పుంచుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాడు. ఇలాంటి సమయంలో అతడు టీమ్ కు దూరం కావడంతో పుణేకు ప్రతికూలంగా మారే అవకాశముంది. -
లయన్స్‌కు కింగ్స్ షాక్
రాజ్‌కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ లయన్స్ కు కింగ్స్ పంజాబ్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన పోరులో లయన్స్ పై పంజాబ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ తడబడి ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు కెప్టెన్ మురళీ విజయ్(55;41 బంతుల్లో 6 ఫోర్లు), స్టోయినిస్(27;17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్ కు 40 బంతుల్లో 65 పరుగులు నమోదు చేసి శుభారంభాన్ని అందించారు. తరువాత పంజాబ్ వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ టాపార్డర్ ఆటగాళ్లలో షాన్ మార్ష్(1), మ్యాక్స్‌వెల్(0), గురకీరత్ సింగ్(0) లు తీవ్రంగా నిరాశపరిచారు. మురళీ విజయ్ తో పాటుడేవిడ్ మిల్లర్(31), సాహా(33;19 బంతుల్లో 4ఫోర్లు) లు ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ 154 పరుగులు స్కోరును నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో శివిల్ కౌశిక్ వికెట్లతో ఆకట్టుకోగా, బ్రేవో, ప్రవీణ్ కుమార్ లు తలో రెండు వికెట్లు సాధించారు. సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాళ్లు బ్రెండన్ మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(15) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఆ తరువాత సురేష్ రైనా(18), దినేష్ కార్తీక్(2), రవీంద్ర జడేజా(2), బ్రేవో(0)లు ఘోరంగా విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గుజరాత్ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్(27), ఫల్కనర్ (32) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఓటమి చెందింది. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించగా, మోహిత్ శర్మకు మూడు వికెట్లు దక్కాయి. తద్వారా టోర్నీలో పంజాబ్ కు రెండో విజయం సాధించగా, గుజరాత్ రెండో ఓటమిని ఎదుర్కొంది. -
శుభారంభం లభించినా..
రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు కెప్టెన్ మురళీ విజయ్(55;41 బంతుల్లో 6 ఫోర్లు), స్టోయినిస్(27;17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్ కు 40 బంతుల్లో 65 పరుగులు నమోదు చేసి శుభారంభం అందించినా.. ఆ తరువాత పంజాబ్ వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ టాపార్డర్ ఆటగాళ్లలో షాన్ మార్ష్(1), మ్యాక్స్‌వెల్(0), గురకీరత్ సింగ్(0) లు తీవ్రంగా నిరాశపరిచారు. మురళీ విజయ్ తో పాటుడేవిడ్ మిల్లర్(31), సాహా(33;19 బంతుల్లో 4ఫోర్లు) లు ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ 154 పరుగులు స్కోరును నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో శివిల్ కౌశిక్ మూడు వికెట్లతో రాణించగా, బ్రేవో, ప్రవీణ్ కుమార్ లు తలో రెండు వికెట్లు సాధించారు. -
కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్
రాజ్ కోట్: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 28వ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ టీమ్ లో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. వృద్ధిమాన్ సాహా, గురుకీరత్ సింగ్, కారియప్పా, స్టయనిస్ జట్టులోకి వచ్చారు. గుజరాత్ టీమ్ లో ఎటువంటి మార్పులు లేవు. పాయింట్ల పట్టిక గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది. -
‘సన్’ ఎరుపెక్కింది...
► బెంగళూరుపై ఘన విజయం ►15 పరుగులతో నెగ్గిన హైదరాబాద్ ► వార్నర్ మరో అర్ధ సెంచరీ సన్‌రైజర్స్ సొంతగడ్డపై మళ్లీ చెలరేగింది... ఎప్పటిలా బౌలింగ్‌తో కాకుండా ఈ సారి బ్యాటింగ్‌తో సత్తా చాటింది. భారీ స్కోరు చేస్తే విజయాన్ని ఎంతటి జట్టయినా ఆపలేదని నిరూపించింది. వార్నర్ మెరుపు షాట్లతో ముందుండి నడిపించగా, విలియమ్సన్ అండగా నిలిచాడు. దాంతో సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమికి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా పేలవ బౌలింగ్‌తో పరుగులిచ్చుకున్న బెంగళూరు ఆపై బ్యాటింగ్‌లో విఫలమైంది. రాహుల్ ఓపెనింగ్‌తో పాటు డివిలియర్స్ కొద్దిగా ఆశలు రేపినా, కోహ్లి వైఫల్యం, గేల్ లేకపోవడం జట్టును దెబ్బ తీశాయి. ఫలితంగా టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపిన ఆర్సీబీ ఈ సీజన్లో జరుగుతున్నట్లుగా గెలుపు సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోయింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (50 బంతుల్లో 92; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకం కోల్పోగా, విలియమ్సన్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు) సహకరించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోకేశ్ రాహుల్ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గేల్‌కూ చోటు లేదు: హైదరాబాద్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగగా, బెంగళూరు ఏకంగా నలుగురు ఆటగాళ్లను మార్చింది. గేల్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా కోహ్లి తమ బలహీన బౌలింగ్‌ను కాస్త పటిష్టంగా మార్చాలని ఆలోచించినట్లున్నాడు. అందుకే రిచర్డ్సన్, షమ్సీలలో ఎవరినీ తప్పించలేదు. మెరుపు భాగస్వామ్యం: గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న ధావన్ (11) ఈసారి ప్రభావం చూపకుండానే వెనుదిరిగాడు. అయితే వార్నర్, విలియమ్సన్ కలిసి రైజర్స్ స్కోరును పరుగులు పెట్టించారు. వార్నర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా, సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ కూడా తన కళాత్మక బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. హర్షల్ వేసిన ఆరో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, 1 సిక్స్ బాదగా 16 పరుగులు వచ్చాయి. పది ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 82 పరుగులకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు ఎంతగా శ్రమించినా వీరిద్దరి దూకుడును ఆపలేకపోయారు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే వార్నర్ సీజన్లో ఐదో అర్ధ సెంచరీ నమోదు చేయడం విశేషం. రిచర్డ్సన్ వేసిన 15వ ఓవర్లో రైజర్స్ అత్యధికంగా 19 పరుగులు రాబట్టింది. ముఖ్యంగా 12-16 మధ్య ఐదు ఓవర్లలోనే 66 పరుగులు కొల్లగొట్టడం విశేషం. ఎనిమిది పరుగుల తేడాతో వార్నర్, విలియమ్సన్వెనుదిరిగినా, హెన్రిక్స్ (14 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఆఖరి ఓవర్లో వాట్సన్ 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో సన్ స్కోరు 200 పరుగులు చేరలేకపోయింది. రాహుల్ దూకుడు: ఒక వైపు క్రీజ్‌లో కోహ్లి ఉన్నా, మరో వైపు లోకేశ్ రాహుల్ జోరు కొనసాగింది. గుజరాత్‌తో గత మ్యాచ్‌లో చెలరేగిన తరహాలోనే ఈ సారి ఓపెనర్‌గా రాహుల్ తన ధాటిని ప్రదర్శించాడు. వరుసగా బౌండరీలతో చెలరేగడంతో తొలి 4 ఓవర్లలో బెంగళూరు 37 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్లో ముస్తఫిజుర్ రెండో బంతికే కోహ్లి (17 బంతుల్లో 14; 1 ఫోర్)ని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. బరీందర్ వేసిన ఓవర్లో మరో సిక్స్, ఫోర్ కొట్టిన రాహుల్ ... 26 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే హెన్రిక్స్ చక్కటి బంతితో అతడిని అవుట్ చేయడంతో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం లేని రెండో పరుగుకు ప్రయత్నించి బరీందర్ డెరైక్ట్ త్రోకు వాట్సన్ (2) వెనుదిరిగాడు. అయితే మరో వైపు నిలదొక్కున్న తర్వాత డివిలియర్స్ తనదైన శైలిలో ఆడాడు. హెన్రిక్స్ వేసిన 14వ ఓవర్లో ఏబీ వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టగా, ఓవర్లో మొత్తం 19 పరుగులు లభించాయి. అయితే ఈ దూకుడుకు బరీందర్ అడ్డుకట్ట వేయడంతో సన్ ఊపిరి పీల్చుకుంది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డివిలియర్స్ లాంగాన్‌లో విలియమ్సన్కు చిక్కాడు. ఆ తర్వాత సచిన్ బేబీ, కేదార్ జాదవ్ పోరాడినా గెలిచేందుకు అది సరిపోలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డివిలియర్స్ (బి) షమ్సీ 92; ధావన్ (సి) అండ్ (బి) రిచర్డ్సన్ 11; విలియమ్సన్ (సి) రాహుల్ (బి) వాట్సన్ 50; హెన్రిక్స్ (నాటౌట్) 31; నమన్ ఓజా (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 1; హుడా (రనౌట్) 2; ఆశిష్ రెడ్డి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1-28; 2-152; 3-160; 4-161; 5-190. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-45-2; వాట్సన్ 4-0-33-1; రసూల్ 4-0-33-0; ఆరోన్ 3-0-27-0; హర్షల్ 1-0-16-0; షమ్సీ 4-0-39-1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఆశిష్ రెడ్డి (బి) ముస్తఫిజుర్ 14; లోకేశ్ రాహుల్ (సి) నమన్ ఓజా (బి) హెన్రిక్స్ 51; ఏబీ డివిలియర్స్ (సి) విలియమ్సన్ (బి) శరణ్ 47; వాట్సన్ (రనౌట్) 2; సచిన్ బేబీ (సి) శిఖర్ ధావన్ (బి) నెహ్రా 27; కేదార్ జాదవ్ (నాటౌట్) 25; రసూల్ (సి) హెన్రిక్స్ (బి) భువనేశ్వర్ 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 179 వికెట్ల పతనం: 1-42, 2-83, 3-90, 4-129, 5-152, 6-179. బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-32-1, భువనేశ్వర్ 4-0-36-1, ముస్తఫిజుర్ 4-0-34-1, శరణ్ 4-0-36-1, హెన్రిక్స్ 4-0-40-1. -
వైజాగ్‌లో ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లు
► ముంబై, పుణేల సొంత వేదిక ► మే 8, 10, 13, 15, 17, 21 తేదీల్లో మ్యాచ్‌లు న్యూఢిల్లీ: ఐపీఎల్-9 సీజన్లో అనూహ్యంగా ఆరు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం విశాఖపట్నం దక్కించుకుంది. నీటి ఎద్దడి కారణంగా మే 2 తర్వాతి నుంచి మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో రాష్ట్రానికి తరలించాల్సి రావడంతో ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లకు సంయుక్తంగా ‘సొంత వేదిక’గా విశాఖ ఉంటుంది. ఇరు జట్లకు చెందిన చెరో మూడు మ్యాచ్‌లు కలిపి మొత్తం ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నిర్వహిస్తారు. తాజా మార్పు అనంతరం ఐపీఎల్ షెడ్యూల్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ల వేదికను మార్చారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ బదులుగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం ఈ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. -
లయన్స్ ‘సిక్సర్’
► గుజరాత్‌కు ఆరో విజయం ► భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైనా జట్టు ► దుమ్మురేపిన మెకల్లమ్, డ్వేన్ స్మిత్ ► పుణేకు తప్పని ఓటమి స్మిత్ సెంచరీ వృథా పుణే: ఆఖర్లో ఉత్కంఠ చోటు చేసుకున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నా గట్టెక్కింది. దీంతో ఐపీఎల్-9 సీజన్లో ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు స్లాగ్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోయిన పుణే ఖాతాలో మరో పరాజయం చేరిం ది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పుణేపై గెలిచింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. రహానే (45 బంతుల్లో 53; 5 ఫోర్లు), ధోని (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (37 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. భారీ భాగస్వామ్యం... స్టార్ ఆటగాళ్లు పీటర్సన్, డు ప్లెసిస్‌లు దూరంకావడంతో పుణే కొత్త కూర్పుతో బరిలోకి దిగింది. రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరభ్ తివారి (1) మూడో ఓవర్లోనే రనౌటయ్యాడు. ఈ దశలో వచ్చిన స్మిత్... యాంకర్ పాత్రతో అదరగొట్టాడు. ఐదో ఓవర్లో వరుస బౌండరీలతో కుదురుకున్న అతను ఆ తర్వాతి దశల్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే నెమ్మదిగా ఆడినా... స్మిత్ మాత్రం లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సింగిల్స్ రావాల్సిన చోట డబుల్స్ తీస్తూ... ఆపై బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదం తొక్కించాడు. దీంతో పవర్‌ప్లేలో 48/1 ఉన్న పుణే స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 85/1కు చేరింది. ఈ క్రమంలో స్మిత్ 29, రహానే 43 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. 13వ ఓవర్లో రెండో సిక్స్, ఫోర్‌తో స్మిత్ 14 పరుగులు రాబట్టినా... 14వ ఓవర్లో రహానే అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ధోని... స్మిత్‌కు స్ట్రయిక్ ఇవ్వడంతో మరో రెండు సిక్సర్లు బాదేశాడు. 17వ ఓవర్లో ధోని కూడా వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి జోరుతో తర్వాతి రెండు ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్ రెండో బంతికి సెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ వెంటనే అవుటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 64 పరుగులు జతయ్యాయి. ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ఇప్పటికే డికాక్ (ఢిల్లీ), విరాట్ కోహ్లి (బెంగళూరు) ఒక్కో సెంచరీ చేశారు. మెకల్లమ్ మోత... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెకల్లమ్ భారీ విధ్వంసాన్ని సృష్టించాడు. తొలి రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే రాగా... మూడో ఓవర్లో మెకల్లమ్ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 24 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి మూడు ఓవర్లలో 39 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో లయన్స్ 72 పరుగులు చేసింది. తర్వాత మరో సిక్స్ బాదిన మెకల్లమ్ 9వ ఓవర్లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ తర్వాత అశ్విన్‌ను ఫోర్లతో మడత పెట్టేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో లయన్స్ స్కోరు 112/1కి చేరింది. కానీ 11వ ఓవర్లో స్మిత్ అవుట్ కావడంతో పుణే కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత కెప్టెన్ రైనా (28 బంతుల్లో 34; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. దీంతో ఐదు ఓవర్లలో 35 పరుగులు సమకూరాయి. తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి 17వ ఓవర్లో కార్తీక్ అవుటయ్యాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో బ్రేవో (7), జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ స్థితిలో వరుస బంతుల్లో రైనా, ఇషాన్ కిషన్ (0) అవుటైనా చివరి బంతికి ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టును గట్టెక్కించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 53; సౌరభ్ తివారి రనౌట్ 1; స్మిత్ (బి) బ్రేవో 101; ధోని నాటౌట్ 30; పెరీరా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1-13; 2-124; 3-188. బౌలింగ్: ప్రవీణ్ 4-0-37-0; ధవల్ కులకర్ణి 3-0-25-0; జడేజా 4-0-37-0; కౌశిక్ 3-0-32-0; ఫాల్క్‌నర్ 2-0-22-0; బ్రేవో 4-0-40-1. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) పెరీరా 63; మెకల్లమ్ (సి) మోర్కెల్ (బి) భాటియా 43; రైనా (బి) పెరీరా 34; దినేశ్ కార్తీక్ (సి) రహానే (బి) దిండా 33; బ్రేవో (సి) ధోని (బి) దిండా 7; జడేజా రనౌట్ 0; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఇషాన్ కిషన్ రనౌట్ 0; ప్రవీణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-93; 2-115; 3-166; 4-180; 5-180; 6-193; 7-193. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-30-0; అశోక్ దిండా 4-0-40-2; పెరీరా 4-0-41-2; ఆర్.అశ్విన్ 4-0-37-0; రజత్ భాటియా 3-0-26-1; ఎం.అశ్విన్ 3-0-22-0. -
రో‘హిట్’తో ముంబై విన్డియన్స్
► కోల్‌కతాపై రెండో విజయం ► రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్ ► గంభీర్ శ్రమ వృథా మళ్లీ ఆ ఇద్దరే... అప్పుడు కోల్‌కతాలో... ఇప్పుడు వాంఖడేలో... కానీ ఫలితం మాత్రం మారలేదు. రెండుసార్లూ ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతాలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ చెలరేగి భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే... రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఛేదించేశాడు. మళ్లీ అదే సీన్ ఇప్పుడు వాంఖడేలోనూ పునరావృతమైంది. ముంబై: ప్రతీకార పోరులో కోల్‌కతాకు మళ్లీ పరాజయమే ఎదురైంది. భారీ లక్ష్యం నిర్దేశించినా పేలవమైన బౌలింగ్‌తో... రోహిత్ శర్మ (49 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (17 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ హిట్టింగ్‌ను అడ్డుకోలేకపోయింది. దీంతో ఐపీఎల్-9లో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ (45 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) మూడో అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, రాబిన్ ఉతప్ప (20 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. రెండో ఓవర్లో క్యాచ్ అవుట్ నుంచి బయటపడ్డ గౌతీ జోరు చూపెట్టడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 59 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించాక ఉతప్ప వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో షకీబ్ (6) విఫలమైనా... సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిలకడగా ఆడాడు. 13వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన కెప్టెన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. సూర్యకుమార్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివర్లో రసెల్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు), క్రిస్ లిన్ (10 బంతుల్లో 10 నాటౌట్), యూసుఫ్ పఠాన్ (8 బంతుల్లో 19 నాటౌట్; 4 ఫోర్లు) దుమ్మురేపారు. లిన్, యూసుఫ్ ఆరో వికెట్‌కు అజేయంగా 16 బంతుల్లో 29 పరుగులు జత చేశారు. తొలి 10 ఓవర్లలో 87 పరుగులు చేసిన నైట్‌రైడర్స్ చివరి 10 ఓవర్లలోనూ అన్నే పరుగులు చేసింది. సౌతీ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 18 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. అంబటి తిరుపతి రాయుడు (20 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (1) తొందరగా అవుటైనా... రోహిత్, రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నైట్‌రైడర్స్ బౌలర్లపై ఆధిపత్యం చూపెడుతూ భారీ సిక్స్‌లు, బౌండరీల మోత మోగించారు. దీంతో 10కిపైగా రన్‌రేట్ నమోదు కావడంతో పవర్‌ప్లేలో ముంబై స్కోరు 64/1కి చేరింది. అయితే ఏడో ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడు అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రునాల్ పాండ్యా (6) నిరాశపర్చినా... బట్లర్ (15) వేగంగా ఆడాడు. దీంతో తొలి 10 ఓవర్లలో ముంబై 3 వికెట్లకు 85 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, నరైన్ వేసిన 13వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద క్రిస్ లిన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బట్లర్ వెనుదిరిగాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 28 పరుగులు సమకూరాయి. తర్వాత పొలార్డ్ వచ్చి రావడంతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో ఎండ్‌లో రోహిత్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. 16వ ఓవర్లో పొలార్డ్ మూడు భారీ సిక్సర్లు సంధించి 23 పరుగులు రాబట్టాడు. 24 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన దశలో రోహిత్ ఓ ఫోర్, పొలార్డ్ మూడు సిక్స్‌లు కొట్టి మరో 12 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేశారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 36; గంభీర్ (సి) పొలార్డ్ (బి) మెక్లీనగన్ 59; షకీబ్ (సి) పార్థీవ్ (బి) హార్దిక్ 6; సూర్యకుమార్ (సి అండ్ బి) సౌతీ 21; రసెల్ (బి) సౌతీ 22; క్రిస్ లిన్ నాటౌట్ 10; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1-69; 2-77; 3-121; 4-130; 5-145. బౌలింగ్: సౌతీ 4-0-38-2; మెక్లీనగన్ 4-0-33-1; బుమ్రా 4-0-34-0; హర్భజన్ 4-0-32-1; హార్దిక్ పాండ్యా 2-0-15-1; క్రునాల్ పాండ్యా 2-0-21-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 68; పార్థీవ్ (సి) యూసుఫ్ (బి) ఉమేశ్ 1; రాయుడు (సి) సూర్యకుమార్ (బి) షకీబ్ 32; క్రునాల్ (బి) నరైన్ 6; బట్లర్ (సి) క్రిస్ లిన్ (బి) నరైన్ 15; పొలార్డ్ నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (18 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-8; 2-67; 3-78; 4-106. బౌలింగ్: ఉనాద్కట్ 3-0-49-0; ఉమేశ్ యాదవ్ 2-0-19-1; షకీబ్ 4-0-30-1; నరైన్ 4-0-22-2; సతీష్ 2-0-30-0; రసెల్ 3-0-28-0. -
రైనా టీమ్ ఫస్ట్ బ్యాటింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్-9లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగుతున్న 23 లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ టీమ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన ఆరోన్ ఫించ్, జకాతి స్థానంలో ఫాల్కనర్, ఇషాన్ కిషాన్ టీమ్ లోకి వచ్చారు. ఢిల్లీ టీమ్ లోనూ రెండు మార్పులు జరిగాయి. మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ స్థానంలో నదీమ్, రిషబ్ పంత్ ను తీసుకున్నారు. పాయింట్ల పట్టికలో గుజరాత్, ఢిల్లీ రెండు-మూడు స్థానాల్లో ఉన్నాయి. సురేశ్ రైనా నాయకత్వంలోని గుజరాత్ టీమ్ ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి నాలుగింటిలో నెగ్గి, ఒకటి ఓడింది. ఢిల్లీ నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచి, ఒకటి చేజార్చుకుంది. -
ముంబై మెరిసింది
► 25 పరుగులతో పంజాబ్‌పై విజయం ► గెలిపించిన పార్థివ్, రాయుడు ముందుగా పార్థివ్, అంబటి రాయుడు భారీ భాగస్వామ్యం... ఆ తర్వాత బుమ్రా పదునైన బౌలింగ్ కలగలిసి ముంబై ఇండియన్స్ మళ్లీ విజయం బాట పట్టింది. ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమితో కోలుకున్న రోహిత్ సేన సమష్టిగా రాణించి పంజాబ్‌ను చిత్తు చేసింది. బౌలింగ్ వైఫల్యంతో భారీగా పరుగులిచ్చిన కింగ్స్ ఎలెవన్, ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ అండతో పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఫలితంగా మిల్లర్ బృందం పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. మొహాలీ: ఐపీఎల్-9లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 25 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (58 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (37 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 85 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టుకు లీగ్‌లో వరుసగా ఇది మూడో పరాజయం. మెరుపు భాగస్వామ్యం... ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0)ను సందీప్ శర్మ అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ తర్వాత పార్థివ్, రాయుడు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగడంతో ముంబై స్కోరు వేగంగా దూసుకుపోయింది. ఒక్క జాన్సన్ బౌలింగ్‌లోనే పార్థివ్ ఆరు ఫోర్లు బాది ఆధిపత్యం ప్రదర్శించగా, అక్షర్ బౌలింగ్‌లో రాయుడు మూడు భారీ సిక్సర్లు కొట్టి తన పదును చూపించాడు. ఇదే జోరులో రాయుడు 31 బంతుల్లో, పార్థివ్ 41 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో రాయుడు టి20 క్రికెట్లో 3000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. తొలి ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసిన ముంబై, తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ మాత్రమే కోల్పోయి 115 పరుగులు చేసిందంటే దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. పొలార్డ్ (10), హార్దిక్ పాండ్యా (4) విఫలమైనా... బట్లర్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో ముంబై మరో 49 పరుగులు జత చేసింది. మోహిత్‌కు 3 వికెట్లు దక్కాయి. రాణించిన మ్యాక్స్‌వెల్... భారీ లక్ష్య ఛేదనలో కింగ్స్ ఎలెవన్ తక్కువ వ్యవధిలోనే విజయ్ (13 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), వోహ్రా (7) వికెట్లు కోల్పోయింది. అయితే మార్ష్, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. విధ్వంసకరంగా ఆడకపోయినా, చక్కటి సమన్వయంతో వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. మార్ష్ తన ఫామ్ కొనసాగించగా, చాలా కాలం తర్వాత మ్యాక్స్‌వెల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 61 బంతుల్లో 89 పరుగులు జోడించిన అనంతరం సౌతీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్ష్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 33 బంతుల్లో మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎప్పుడో 2014 సీజన్లో కొట్టిన అనంతరం 25 ఇన్నింగ్స్‌ల తర్వాత మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. పంజాబ్ గెలుపుపై ఆశలు పెంచుకున్న సమయంలో బుమ్రా దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో అతను మ్యాక్స్‌వెల్‌తో పాటు నాయక్ (1)ను బౌల్డ్ చేయడంతో లక్ష్య ఛేదన కష్టం కాగా, మ్లిలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నాయక్ (బి) సందీప్ 0; పార్థివ్ (సి) మార్ష్ (బి) జాన్సన్ 81; రాయుడు (సి) వోహ్రా (బి) అక్షర్ 65; బట్లర్ (బి) మోహిత్ 24; పొలార్డ్ (సి) సందీప్ (బి) మోహిత్ 10; హార్దిక్ పాండ్యా (సి) మిల్లర్ (బి) మోహిత్ 4; కృనాల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1-0; 2-137; 3-174; 4-180; 5-189; 6-189. బౌలింగ్: సందీప్ 4-0-20-1; జాన్సన్ 4-0-43-1; అక్షర్ 4-0-41-1; మోహిత్ 4-0-38-3; మ్యాక్స్‌వెల్ 1-0-11-0; సాహు 3-0-35-0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బట్లర్ (బి) సౌతీ 19; వోహ్రా (సి) బట్లర్ (బి) బుమ్రా 7; మార్ష్ (సి) రాయుడు (బి) సౌతీ 45; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 56; మిల్లర్ (నాటౌట్) 30; నాయక్ (బి) బుమ్రా 1; అక్షర్ (బి) మెక్లీన్గన్ 0; జాన్సన్ (బి) మెక్లీన్గన్ 1; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-20; 2-32; 3-121; 4-139; 5-141; 6-149; 7-151. బౌలింగ్: సౌతీ 4-0-28-2; మెక్లీన్గన్ 4-0-32-2; బుమ్రా 4-0-26-3; కృనాల్ పాండ్యా 2-0-20-0; హర్భజన్ 4-0-31-0; పొలార్డ్ 2-0-25-0. -
ఒకరికి జరిమానా, మరొకరికి వార్నింగ్
హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనలు ఉల్లఘించినందుకు అతడిపై మ్యాచ్ రిఫరీ ఈ చర్య తీసుకున్నారు. మరో బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ కు అధికారికంగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు మందలించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ మైదానంలో అతిగా ప్రవర్తించినట్టు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మార్ష్ 40 పరుగులు సాధించాడు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. -
కోల్‌కతా తీన్మార్
► వరుసగా మూడో విజయం ► రాణించిన సూర్యకుమార్, యూసుఫ్ ► రహానే శ్రమ వృథా పుణే: జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న ఓపెనర్లు తొలిసారి విఫలమైనా... చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతంగా కాపాడుకుంది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పుణేను ఓడించి వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. రహానే (52 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (28 బంతుల్లో 31; 2 ఫోర్లు) రాణించారు. ఆరంభంలో నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించడంతో నాలుగో ఓవర్లోనే డు ప్లెసిస్ (4) వికెట్ కోల్పోయింది. అయితే స్మిత్, రహానే నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు రాణించడంతో పుణే తొలి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ దశలో పెరీరా (9 బంతుల్లో 12; 1 సిక్స్) నిరాశపర్చినా.... ఆల్బీ మోర్కెల్ (9 బంతుల్లో 16; 2 సిక్సర్లు), రహానేలు భారీ సిక్సర్లతో రన్‌రేట్‌ను పెంచారు. ఆఖర్లో ధోని (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు సమకూరడంతో పుణే భారీ స్కోరు సాధించింది. తర్వాత కోల్‌కతా 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కాడు. మూడు ఓవర్లు ముగియకముందే ఓపెనర్లు ఉతప్ప (0), గంభీర్ (11) అవుట్‌కాగా, వన్‌డౌన్‌లో షకీబ్ (3) కూడా నిరాశపర్చాడు. దీంతో కోల్‌కతా 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్, యూసుఫ్ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించినా...వరుస ఓవర్లలో అవుట్ కావడం దెబ్బతీసింది. తర్వాత రసెల్ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) వేగంగా ఆడినా వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు. ఇక 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో సతీష్ (10) సిక్స్ కొట్టి అవుట్ కావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో చావ్లా (8) కూడా అవుటైనా... ఉమేశ్ (7 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి అండ్ బి) నరైన్ 67; డు ప్లెసిస్ (బి) షకీబ్ 4; స్మిత్ రనౌట్ 31; పెరీరా (బి) సతీష్ 12; ఆల్బీ మోర్కెల్ (బి) ఉమేశ్ 16; ధోని నాటౌట్ 23; భాటియా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-24; 2-80; 3-99; 4-119; 5-133. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 3-0-30-0; రసెల్ 2-0-16-0; షకీబ్ 3-0-14-1; నరైన్ 4-0-32-1; చావ్లా 3-0-26-0; సతీష్ 3-0-20-1; ఉమేశ్ 2-0-16-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 0; గంభీర్ రనౌట్ 11; సూర్యకుమార్ ఎల్బీడబ్ల్యు (బి) ఎం.అశ్విన్ 60; షకీబ్ (బి) భాటియా 3; యూసుఫ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 36; రసెల్ (సి) డు ప్లెసిస్ (బి) పెరీరా 17; సతీష్ (బి) మోర్కెల్ 10; చావ్లా (సి) స్మిత్ (బి) పెరీరా 8; ఉమేశ్ నాటౌట్ 7; నరైన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-0; 2-31; 3-60; 4-111; 5-119; 6-139; 7-151, 8-156. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 3-0-36-2; పెరీరా 3.3-0-28-2; ఆర్.అశ్విన్ 2-0-21-0; భాటి యా 4-0-19-2; అంకిత్ శర్మ 3-0-26-0; ఎం.అశ్విన్ 4-0-32-1. -
పుణేకు షాక్; పీటర్సన్ ఇంటికి
పుణే: ఎంఎస్ ధోని నేతృత్వంలోని పుణే సూపర్ జెయింట్స్ కు షాక్ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్యాట్సమన్ కెవిన్ పీటర్సన్ జట్టుకు దూరమయ్యాడు. కాలిపిక్క గాయంతో అతడు ఐపీఎల్ 9 నుంచి వైదొలగాల్సి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గాయానికి చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లిపోయాడు. గాయంతో ఐపీఎల్ కు దూరం కావడం పట్ల సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాళ్లను మిస్సవుతున్నానని, నవంబర్ వరకు తనకు సెలవులు దొరికాయని వ్యాఖ్యానించాడు. పీటర్సన్ త్వరగా కోలుకోవాలని పుణే సూపర్ జెయింట్స్ ట్వీట్ చేసింది. దీనికి అతడు థ్యాంక్స్ చెప్పాడు. -
సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్..
-
ముచ్చటగా మూడోది
► సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ విజయం ► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు ► చెలరేగిన సన్ బౌలర్లు ► వార్నర్ నాలుగో అర్ధ సెంచరీ వార్నర్ టాస్ గెలిచాడు... వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... వార్నర్ మళ్లీ వేగంగా అర్ధసెంచరీ చేశాడు... రీప్లే షో లాగా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అదే వ్యూహం, మళ్లీ అదే ఫలితం. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. ఫలితంగా జట్టుకు ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయం. ముందుగా సన్ బౌలర్లు చెలరేగి ప్రత్యర్థిని కట్టడి చేస్తే, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ తమ పని పూర్తి చేశారు. ముఖ్యంగా ముస్తఫిజుర్‌ను ఆడలేక పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత హైదరాబాద్ 13 బంతుల ముందే గమ్యం చేరింది. వరుస వికెట్లతో కొంత తడబడినా పెద్దగా ఇబ్బంది లేకుండానే గెలుపును అందుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ బండి వేగం పుంజుకుంది. లక్ష్యాన్ని వేటాడటంలో గురి తప్పకుండా దూసుకుపోతూ మరో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (34 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, చివర్లో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. సన్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముస్తఫిజుర్, హెన్రిక్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (31 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో నాలుగో అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించగా, మరోసారి శిఖర్ ధావన్ (44 బంతుల్లో 45; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రాణించిన మార్ష్, అక్షర్: గత మ్యాచ్ ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే సన్ బరిలోకి దిగింది. భువనేశ్వర్ చక్కటి బంతితో విజయ్ (2)ను అవుట్ చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన వోహ్రా (23 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ముస్తఫిజుర్ ఓవర్లో ఇబ్బంది పడిన తర్వాత లేని పరుగు కోసం ప్రయత్నించి శిఖర్ ధావన్ త్రోకు రనౌటయ్యాడు. షాన్ మార్ష్ ఒక్కడే కొద్దిగా పోరాడినా, మిల్లర్ (9), మ్యాక్స్‌వెల్ (1) వైఫల్యం పంజాబ్‌ను దెబ్బ తీసింది. ఈ ఇద్దరినీ హెన్రిక్స్ ఒకే ఓవర్లో వెనక్కి పంపించాడు. హుడా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి దూకుడు కనబర్చిన మార్ష్‌ను ముస్తఫిజుర్ అవుట్ చేయడంతో ఆ జట్టు మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే నిఖిల్ నాయక్ (28 బంతుల్లో 22; 1 ఫోర్) అండగా అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భువీ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అక్షర్, హెన్రిక్స్ ఓవర్లోనూ సిక్స్ కొట్టి జోరు ప్రదర్శించాడు. అక్షర్, నాయక్ ఆరో వికెట్‌కు 35 బంతుల్లోనే 50 పరుగులు జోడించి పంజాబ్‌ను ఆదుకున్నారు. చెలరేగిన కెప్టెన్: తొలి ఓవర్లో, రెండో ఓవర్లో శిఖర్ ధావన్ ఒక్కో ఫోర్ కొట్టాడు. అంతే... తర్వాత అతడిని మరో ఎండ్‌లో నిలబెట్టి వార్నర్ పరుగుల ప్రవాహం మొదలైంది. సందీప్ ఓవర్లో 2 సిక్సర్లు, 1 ఫోర్... అబాట్ ఓవర్లో 2 ఫోర్లు... మ్యాక్స్‌వెల్ ఓవర్లో సిక్స్, ఫోర్... ఈ జోరు ఇలాగే కొనసాగింది. చూస్తూ ఉండగానే 23 బంతుల్లోనే వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈ హాఫ్ సెంచరీలో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సీజన్లో ఐదు మ్యాచ్‌లలో నాలుగో అర్ధ సెంచరీ సాధించిన అనంతరం వార్నర్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే తారే (0) కూడా రనౌటయ్యాడు. అయితే తొలి 10 ఓవర్లలోనే 90 పరుగులు చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత మిగిలిన పరుగులు సాధించడంలో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. 14వ ఓవర్ చివరి బంతికి ధావన్ వెనుదిరిగిన తర్వాత మోర్గాన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. స్కోరు వివరాలు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; వోహ్రా (రనౌట్) 25; మార్ష్ ఎల్బీడబ్ల్యూ (బి) ముస్తఫిజుర్ 40; మిల్లర్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 9; మ్యాక్స్‌వెల్ (సి) ముస్తఫిజుర్ (బి) హెన్రిక్స్ 1; నాయక్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 22; అక్షర్ (నాటౌట్) 36; రిషి ధావన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1-14; 2-35; 3-63; 4-65; 5-89; 6-139. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-1; బరీందర్ 4-0-33-0; హుడా 4-0-30-0; ముస్తఫిజుర్ 4-1-9-2; హెన్రిక్స్ 4-0-33-2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 59; ధావన్ (సి) నాయక్ (బి) రిషి ధావన్ 44; తారే (రనౌట్) 0; మోర్గాన్ (సి) వోహ్రా (బి) మోహిత్ 25; హుడా (రనౌట్) 5; హెన్రిక్స్ (నాటౌట్) 5; ఓజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-90; 2-90; 3-115; 4-139; 5-139. బౌలింగ్: సందీప్ 4-0-30-1; అబాట్ 3-0-34-0; మ్యాక్స్‌వెల్ 2-0-16-0; మోహిత్ 3-0-20-1; రిషి ధావన్ 4-0-35-1; అక్షర్ 1.5-0-11-0. -
భలా.... బెంగళూరు
► సమష్టి ప్రదర్శనతో పుణేపై విజయం ► మళ్లీ చెలరేగిన డివిలియర్స్, కోహ్లి ► బంతితో మెరిసిన రిచర్డ్సన్, వాట్సన్ ► లక్ష్య ఛేదనలో ధోని సేన విఫలం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసినా దక్కని విజయాలు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు పరిస్థితి ఇది. కానీ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాటింగ్కుతోడు బౌలర్లూ రాణించడంతో బెంగళూరు గాడిలో పడింది. లక్ష్య ఛేదనలో పుణే విజృంభించినా... చివర్లో సూపర్ బౌలింగ్‌తో బెంగళూరు గట్టెక్కింది. పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పైచేయి సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణే బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించినా... స్లాగ్ ఓవర్లలో తిరుగులేని బౌలింగ్‌తో ధోనిసేనను కోహ్లి బృందం కట్టడి చేసింది. దీంతో ఐపీఎల్-9లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 13 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై నెగ్గింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. డివిలియర్స్ (46 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తర్వాత పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. రహానే (46 బంతుల్లో 60; 8 ఫోర్లు), ధోని (38 బంతుల్లో 41; 3 ఫోర్లు), తిసారా పెరీరా (13 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అద్భుత భాగస్వామ్యం... ఆర్సీబీ ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (7) నిరాశపర్చినా... కెప్టెన్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడో ఓవర్లోనే సిక్స్, ఫోర్‌తో జోరు పెంచినా... తొలి 22 బంతుల్లో 27 పరుగులు చేశాక రాహుల్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. పుణే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీల మోత మోగించాడు. దీంతో పవర్ ప్లేలో 48/1తో ఉన్న స్కోరు తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 79/1కి చేరుకుంది. ఆ తర్వాత మురుగన్ అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఏబీ మరింత రెచ్చిపోయాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్‌లో కోహ్లి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో ఏబీ 25; కోహ్లి 47 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఈ ఇద్దరి దెబ్బకు పుణే బౌలర్లు పరుగులు భారీగానే సమర్పించుకున్నారు. 18వ ఓవర్లో తొలి సిక్స్ కొట్టిన విరాట్... తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అదే ఓవర్లో డివియర్స్ మరో సిక్సర్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 95 బంతుల్లో 155 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పెరీరా 3 వికెట్లు తీశాడు. పెరీరా దూకుడు... ఓపెనర్లలో రహానే కుదురుగా ఆడినా... డు ప్లెసిస్ (2) నిరాశపరిచాడు. పీటర్సన్ ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్ (4) పెవిలియన్‌కు చేరడంతో పుణేకు సరైన శుభారంభం లభించలేదు. రహానేతో కలిసి ధోని ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నా రన్‌రేట్ మందగించింది. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 36/2కు చేరుకుంది. ఈ దశలో వీరిద్దరు బ్యాట్లు ఝుళిపించి మూడు ఓవర్లలో 32 పరుగులు రాబట్టడంతో ధోని సేన కాస్త కోలుకుంది. ఇక ఇక్కడి నుంచి వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలైనప్పుడు బౌండరీలు సాధించడంతో స్కోరు చకచకా కదిలింది. ఈ క్రమంలో రహానే 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే 15వ ఓవర్లో అతను స్టంపౌట్ కావడంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత పెరీరా సిక్స్‌తో కుదురుకున్నా... 16వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధోని వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన దశలో పెరీరా చెలరేగిపోయాడు. మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ 19వ ఓవర్లో వాట్సన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. విజయానికి 25 పరుగులు అవసరమైన స్థితిలో... మూడు బంతుల తేడాలో పెరీరా, అశ్విన్ (0)లను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో రిచర్డ్సన్ మరో రెండు వికెట్లు తీయడంతో పుణే పరుగుల వేటలో వెనుకబడిపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రహానే (బి) పెరీరా 80; రాహుల్ (సి) ఇషాంత్ (బి) పెరీరా 7; డివిలియర్స్ (సి) అంకిత్ (బి) పెరీరా 83; వాట్సన్ నాటౌట్ 1; సర్ఫరాజ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-27; 2-182; 3-182. బౌలింగ్: ఇషాంత్ 4-0-47-0; పెరీరా 4-0-34-3; అంకిత్ శర్మ 4-0-31-0; రజత్ భాటియా 3-0-22-0; ఆర్.అశ్విన్ 3-0-22-0; ఎం.అశ్విన్ 2-0-29-0. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (స్టం) రాహుల్ (బి) షమ్సీ 60; డు ప్లెసిస్ (సి) హర్షల్ (బి) రిచర్డ్సన్ 2; పీటర్సన్ రిటైర్డ్‌హర్ట్ 0; స్మిత్ రనౌట్ 4; ధోని (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 41; పెరీరా (సి) మన్దీప్ (బి) వాట్సన్ 34; భాటియా (సి) వాట్సన్ (బి) రిచర్డ్సన్ 21; ఆర్.అశ్విన్ (సి) హర్షల్ (బి) వాట్సన్ 0; అంకిత్ నాటౌట్ 3; ఎం.అశ్విన్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-12; 2-18; 3-109; 4-120; 5-164; 6-165; 7-169; 8-169. బౌలింగ్: బిన్నీ 2-0-23-0; రిచర్డ్సన్ 3-0-13-3.; హర్షల్ పటేల్ 4-0-46-1; వాట్సన్ 4-0-31-2; షమ్సీ 4-0-36-1; ఇక్బాల్ అబ్దుల్లా 3-0-22-0. -
'టర్నింగ్ పాయింట్ అదే'
ముంబై: విరాట్ కోహ్లి, డివిలియర్స్ తొందరగా అవుట్ కావడంతో మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా అన్నాడు. వీరిద్దరూ మరింతసేపు క్రీజులో ఉంటే తాము గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇక్బాల్ 4 నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 'కోహ్లి, డివిలయర్స్ లను అవుట్ అవడం టర్నింగ్ పాయింట్. టీమ్ లోని టాప్ బ్యాట్స్ మెన్స్ తొందరగా అవుట్ అయితే పరుగులు ఎక్కువగా రావు. ఈ ప్రభావం మొత్తం జట్టుపై ఉంటుంద'ని మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. తనకు జట్టులో చోటు దక్కుతుందా, లేదా అనేది కెప్టెన్ పై ఆధారపడి ఉంటుందని 26 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అన్నాడు. మరో ఎనిమిది తొమ్మిదేళ్లు క్రికెట్ ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ముంబై మురిసింది
► బెంగళూరుపై స్ఫూర్తిదాయక విజయం ► రాణించిన రోహిత్, రాయుడు, పొలార్డ్ సొంతగడ్డపై రెండు ఓటములు... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు... స్థాయికి తగ్గట్లుగా ఆడని ఆటగాళ్లు... ఇదీ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ముంబై పరిస్థితి. కానీ పటిష్టమైన రాయల్ చాలెంజర్స్‌పై భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించిన రోహిత్‌సేన... ఈ సీజన్లో సొంతగడ్డపై విజయాల బోణీ చేసింది. ముంబై: లక్ష్య ఛేదనలో చెలరేగిన ముంబై ఇండియన్స్... ఈ సీజన్లో సొంతగడ్డపైతొలి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పొలార్డ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో బుధవారం జరిగిన ఐపీఎల్-9 లీగ్ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో బెంగళూర్‌పై గెలిచింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 33; 3 ఫోర్లు), డివిలియర్స్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (18 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. తర్వాత ముంబై 18 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. తిరుపతి రాయుడు (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. సమష్టిగా రాణింపు ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లి, రాహుల్ శుభారంభాన్నిచ్చారు. నాలుగో ఓవర్లో రాహుల్ వరుసగా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో జోరు పెరిగింది. కానీ తర్వాతి బంతికే అతను అవుట్‌కావడంతో బెంగళూరు 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డివిలియర్స్, కోహ్లి మరింత దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగించారు. దీంతో పవర్‌ప్లేలో 49/1 ఉన్న బెంగళూరు స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 89/1కి చేరింది. ఈ దశలో క్రునాల్ (11వ ఓవర్) ఐదు బంతుల వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేసి ఆర్సీబీకి షాకిచ్చాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 6.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశారు. తర్వాత వాట్సన్ (5) నిరాశపర్చినా.. హెడ్, సర్ఫరాజ్‌లు సమయోచితంగా ఆడారు. ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 63 పరుగులు జోడించాక హెడ్ రనౌటయ్యాడు. మరో రెండు బంతుల తర్వాత సర్ఫరాజ్, ఆ వెంటనే బిన్నీ (1) కూడా వెనుదిరిగాడు. బుమ్రా 3, క్రునాల్ 2 వికెట్లు తీశారు. రోహిత్ అదుర్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై రెండో ఓవర్లోనే పార్థీవ్ (5) వికెట్ కోల్పోయినా... రోహిత్ శర్మ యాంకర్ పాత్ర పోషించాడు. రాయుడుతో కలిసి ఇన్నింగ్స్‌ను క్రమంగా నిర్మించాడు. పవర్‌ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో రోహిత్ భారీ సిక్సర్ బాదితే.. పదో ఓవర్లో రాయుడు వరుస ఫోర్లతో వేగం పెంచాడు. కానీ 11వ ఓవర్లో అబ్దుల్లా... రాయుడును అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత బట్లర్ (14 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కుదురుగా ఆడినా... 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రోహిత్ 13వ ఓవర్లో మరో సిక్స్, ఫోర్ బాది ఆ వెంటనే అవుటయ్యాడు. ఇక 36 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన దశలో బిగ్ హిట్టర్ పొలార్డ్ చెలరేగడంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సౌతీ (బి) క్రునాల్ 33; రాహుల్ (సి) హర్భజన్ (బి) మెక్లీనగన్ 23; డివిలియర్స్ (స్టం) పార్థీవ్ (బి) క్రునాల్ 29; వాట్సన్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 5; హెడ్ రనౌట్ 37; సర్ఫరాజ్ (సి) క్రునాల్ (బి) బుమ్రా 28; బిన్నీ (సి) హార్దిక్ (బి) బుమ్రా 1; హర్షల్ నాటౌట్ 0; రిచర్డ్సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-32; 2-91; 3-93; 4-99; 5-162; 6-169; 7-169. బౌలింగ్: సౌతీ 4-0-25-0; మెక్లీనగన్ 4-0-46-1; బుమ్రా 4-0-31-3; హర్భజన్ 2-0-20-0; క్రునాల్ పాండ్యా 4-0-27-2; హార్దిక్ పాండ్యా 2-0-18-2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డివిలియర్స్ (బి) ఇక్బాల్ అబ్దుల్లా 62; పార్థీవ్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 5; రాయుడు (సి) రిచర్డ్సన్ (బి) అబ్దుల్లా 31; బట్లర్ (సి) వాట్సన్ (బి) అబ్దుల్లా 28; పొలార్డ్ నాటౌట్ 40; హార్దిక్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (18 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1-6; 2-82; 3-109; 4-140. బౌలింగ్: ఆరోన్ 4-0-37-0; రిచర్డ్సన్ 3-0-26-1; వాట్సన్ 4-0-40-0; హర్షల్ 2-0-20-0; ఇక్బాల్ అబ్దుల్లా 4-0-40-3; బిన్నీ 1-0-8-0. -
విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్..
విశాఖపట్నం: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైంది. దీంతో సాగర తీరంలో సందడి నెలకొంది. మే 10 నుంచి మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కరవు కారణంగా మహారాష్ట్రలో మ్యాచ్‌లను తరలించాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో అక్కడ జరగాల్సిన 13 మ్యాచ్‌లను తరలించారు. దీంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు విశాఖ వైఎస్సార్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌గా ఎంచుకుంది. పుణే, ముంబాయిలకు చెందిన జట్ల ఫ్రాంచైజీ ప్రతినిధులు ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. ముంబాయి ఇండియన్స్ జట్టు వాంఖడే స్టేడియం, పుణే జట్టు మహారాష్ట్ర స్టేట్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌లుగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పుణే ఫ్రాంచైజీ కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలుకున్నా అవాంతరాలు ఏర్పాడ్డాయి. దీంతో పుణే జట్టు విశాఖలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఈ సీజన్లో ఐపీఎల్ లీగ్‌లో పుణే ఆడాల్సిన చివరి మూడు మ్యాచ్‌లకు వైఎస్సార్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రైజింగ్ పుణే జట్టుకు కెప్టెన్‌గా ధోని, కోచ్‌గా స్టీపెన్ ఫ్లెమింగ్ వ్యవహారిస్తున్నారు. షెడ్యూల్ మే 10 - రైజింగ్ పుణే VS సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 17 - రైజింగ్ పుణే VS ఢిల్లీ డేర్‌డెవిల్స్ మే 21 - రైజింగ్ పుణే VS కింగ్స్ ఎలెవన్ పంజాబ్ -
రైజర్... విన్నర్
► ఐపీఎల్లో హైదరాబాద్ తొలి విజయం కెప్టెన్ వార్నర్ సూపర్ ఇన్నింగ్స్ ► రాణించిన బౌలర్లు 7 వికెట్లతో ముంబై ఇండియన్స్ చిత్తు రెండు రోజుల క్రితం ఇదే మైదానంలో 142 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఓటమిని ఆహ్వానించింది. ఇప్పుడు సరిగ్గా అదే స్కోరును ఛేదించి లీగ్‌లో బోణీ చేసింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ మెరుపులు కీలక విజయాన్ని అందించాయి. రెండు పరాజయాల తర్వాత దక్కిన విజయం రైజర్స్‌లో ఆనందం నింపింది. పేరుకు పెద్ద హిట్టర్లే ఉన్నా... బ్యాటింగ్‌లో తడబడిన ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. రాయుడు, కృనాల్ భాగస్వామ్యం మినహా ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. భారీ స్కోరు చేయడంలో విఫలమై ఆ జట్టు మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. సోమవారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అంబటి రాయుడు (49 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 15 బంతులు ఉండగానే సన్‌కు విజయం దక్కడం విశేషం. 63 పరుగుల భాగస్వామ్యం: ఐపీఎల్ కెరీర్ ఆరంభం గప్టిల్ (2)కు కలిసి రాలేదు. లీగ్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న అతను, భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత శరణ్ చక్కటి బంతులతో పార్థివ్ (10), బట్లర్ (11)లను అవుట్ చేశాడు. అంతకుముందు నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ (5) కూడా అనవసర సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక రనౌటయ్యాడు. తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఆ సమయానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో రాయుడు, కృనాల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రాయుడు చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, గత మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్న కృనాల్ మరోసారి చెలరేగాడు. ముందుగా నెమ్మదిగా ఆడిన వీరిద్దరు ఆ తర్వాత ధాటిని ప్రదర్శించారు. సన్ ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా చకచకా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 43 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీ పూర్తయింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 39 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాయుడుతో పాటు హార్దిక్ (2) కూడా అవుటైనా కృనాల్ చివరి వరకు నిలబడ్డాడు. తొలి 10 ఓవర్లలో 58 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, తర్వాతి 10 ఓవర్లలో 84 పరుగులు చేసింది. వార్నర్ ఒక్కడే: ఎప్పటిలాగే ధావన్ (2) వైఫల్యంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. సౌతీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతను వెనుదిరిగాడు. అయితే రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ ఫోర్, సిక్స్ బాది దూకుడును మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో హర్భజన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన హెన్రిక్స్ (22 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు వార్నర్‌కు అండగా నిలిచాడు. 10 ఓవర్లలో రైజర్స్ స్కోరు 66 పరుగులకు చేరిన తర్వాత సౌతీ చక్కటి బంతితో హెన్రిక్స్‌ను అవుట్ చేయగా... ఆ తర్వాత మోర్గాన్ (11) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. మరో వైపు భారీ షాట్లతో తన జోరు కొనసాగించిన వార్నర్ 42 బంతుల్లో ఈ సీజన్లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించిన అతను కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. చివర్లో దీపక్ హుడా (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) అండతో అతను మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; పార్థివ్ (బి) శరణ్ 10; రాయుడు (సి) హెన్రిక్స్ (బి) శరణ్ 54; రోహిత్ (రనౌట్) 5; బట్లర్ (సి) నమన్ ఓజా (బి) శరణ్ 11; కృనాల్ (నాటౌట్) 49; హార్దిక్ (బి) ముస్తఫిజుర్ 2; హర్భజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-2; 2-23; 3-43; 4-60; 5-123; 6-135.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-17-1; శరణ్ 4-0-28-3; హెన్రిక్స్ 4-0-23-0; ముస్తఫిజుర్ 4-0-32-1; బిపుల్ శర్మ 4-0-40-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 90; ధావన్ (బి) సౌతీ 2; హెన్రిక్స్ (సి) పార్థివ్ (బి) సౌతీ 20; మోర్గాన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 11; దీపక్ హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-4; 2-66; 3-100.; బౌలింగ్: సౌతీ 4-0-24-3; మెక్లీన్గన్ 3.3-0-33-0; జస్ప్రీత్ బుమ్రా 3-0-19-0; హర్భజన్ సింగ్ 4-0-38-0; హార్దిక్ పాండ్యా 3-0-29-0. -
లయన్స్ ‘పవర్’
► గుజరాత్‌కు వరుసగా రెండో విజయం ►7 వికెట్లతో పుణే జెయింట్స్ చిత్తు ► చెలరేగిన ఫించ్, మెకల్లమ్ ► బంతితో మెరిసిన జడేజా ఐపీఎల్లో తొలి సారి బరిలోకి దిగి తలపడిన రెండు జట్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లేవర్ కనిపించింది. ధోని, అశ్విన్, డు ప్లెసిస్ ఒక వైపు... రైనా, జడేజా, మెకల్లమ్, బ్రేవో మరో వైపు నిలిచారు. అయితే పుణేతో పోలిస్తే లయన్స్ జట్టులో భారీ షాట్లు ఆడే ‘పవర్’ హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చింది. పుణేలో అత్యుత్తమ క్లాసిక్ ఆటగాళ్లు ఉన్నా... టి20కి కావలసిన ‘పవర్’తో ఆడలేకపోయారు. మొత్తానికి తమిళుల కొత్త సంవత్సరం రోజున రెండు పాత తమిళ జట్ల పోరాటంలా సాగిన మ్యాచ్‌లో ధోనిపై రైనా పైచేయి సాధించాడు. రాజ్‌కోట్:ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో సాధికార విజయం సాధించింది. గురువారం పుణే జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (43 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ పీటర్సన్ (31 బంతుల్లో 37; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 61 బంతుల్లో 86 పరుగులు జోడించగా... చివర్లో ధోని (10 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. జడేజా, తాంబే చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లయన్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (31 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 51 బంతుల్లోనే 85 పరుగులు జత చేసి జట్టు విజయాన్ని సులువు చేశారు. భారీ భాగస్వామ్యం: సూపర్‌జెయింట్స్‌కు చక్కటి ఆరంభం అందించిన ఓపెనర్ రహానే (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) చకచకా పరుగులు చేసినా తాంబే బంతికి వెనుదిరిగాడు. దీంతో డు ప్లెసిస్, పీటర్సన్ జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వరుసగా రెండు ఓవర్లలో కలిపి 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 57 పరుగులకు చేరింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. అయితే గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్కసారిగా పరుగుల వేగం తగ్గింది. ఒక దశలో డు ప్లెసిస్, పీటర్సన్ ధాటిగానే ఆడినా... తమ స్థాయికి తగినట్లుగా మెరుపులు ప్రదర్శించలేకపోయారు. ఈ క్రమంలో 33 బంతుల్లో ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత బ్రేవో చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ప్లెసిస్, స్మిత్ (5), మార్ష్ (7) వెనుదిరిగారు. దాంతో రన్‌రేట్ తగ్గిపోయి జట్టు 150 పరుగులు కూడా దాటుతుందా అనిపించింది. అయితే చివర్లో ధోని మెరుపులతో పుణే చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. బ్రేవో వేసిన ఈ ఓవర్లో ధోని 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 20 పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులతో పటిష్టంగా ఉన్న పుణే... చివరి 10 ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. తన చివరి రెండు ఓవర్లలో 3 పరుగులే ఇచ్చి జడేజా ఇందులో కీలక పాత్ర పోషించాడు. మెరుపు ఓపెనింగ్: లయన్స్‌కు ఓపెనర్లు ఫించ్, మెకల్లమ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఆర్పీ సింగ్ ఓవర్లో మెకల్లమ్ రెండు సిక్సర్లు బాదగా, ఆ తర్వాత ఇషాంత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. తన తొలి ఓవర్లో నాలుగే పరుగులు ఇచ్చి అశ్విన్ కాస్త తెరిపినిచ్చినా... తర్వాతి రెండు ఓవర్లు గుజరాత్ పంట పండించాయి. మురుగన్ అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన ఫించ్... భాటియా తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 33 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో 33 బంతుల్లోనే ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మురుగన్ అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత తన దూకుడు కొనసాగించిన మెకల్లమ్ అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మెకల్లమ్, కొద్ది సేపటికే రైనా (24 బంతుల్లో 24; 1 ఫోర్) కూడా వెనుదిరిగినా... బ్రేవో (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీ) (బి) తాంబే 21; డు ప్లెసిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) తాంబే 69; పీటర్సన్ (బి) బ్రేవో 37; స్మిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) జడేజా 5; ధోని (నాటౌట్) 22; మార్ష్ (బి) జడేజా 7; భాటియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-27; 2-113; 3-132; 4-134; 5-143. బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0; జకాతి 4-0-40-0; తాంబే 4-0-33-2; బ్రేవో 4-0-43-1; జడేజా 4-0-18-2; ఫాల్క్‌నర్ 2-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) ఇషాంత్ (బి) మురుగన్ 50; మెకల్లమ్ (సి) డు ప్లెసిస్ (బి) ఇషాంత్ 49; రైనా (స్టంప్డ్) ధోని (బి) మురుగన్ 24; బ్రేవో (నాటౌట్) 22; జడేజా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-85; 2-120; 3-147. బౌలింగ్: ఆర్పీ సింగ్ 2-0-21-0; ఇషాంత్ 4-0-39-1; అశ్విన్ 4-0-26-0; మురుగన్ 4-0-31-2; భాటియా 3-0-30-0; మార్ష్ 1-0-10-0. జడేజా స్పెషల్... గతంలో మూడు ఐపీఎల్ జట్ల తరఫున బరిలోకి దిగినా... సొంత రాష్ట్రంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని లోటు జడేజాకు ఉండేది. ఇప్పుడు గుజరాత్ లయన్స్ తరఫున అతను తొలిసారి తన సొంత ప్రేక్షకుల మధ్య రాజ్‌కోట్‌లో ఆడి సత్తా చాటాడు. రాజ్‌కోట్‌లోనూ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. తన తొలి రెండు ఓవర్లలో ఒక సిక్స్‌తో 15 పరుగులు ఇచ్చిన జడేజా తర్వాతి రెండు ఓవర్లు మ్యాచ్ దిశను మార్చాయి. 17వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చిన అతను, 19వ ఓవర్లో మరో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. ఓ దశలో 180 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించిన పుణే... జడేజా స్లాగ్ ఓవర్ల ప్రదర్శన కారణంగా 163 పరుగులకే పరిమితమైంది. -
'అది క్రికెటర్ల ఫిర్యాదుగా భావించడం లేదు'
న్యూఢిల్లీ: ఐపీఎల్-9వ సీజన్ ఆరంభంలోనే ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆకస్మికంగా తొలగించడం వెనుక కారణాలేమిటన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ టీ 20 అనంతరం భారత క్రికెట్ జట్టులోని కొంతమంది సీనియర్ క్రికెటర్లు బోగ్లేపై ఫిర్యాదు చేయడంతోనే అతన్ని కామెంటేటర్ పదవికి ఉద్వాసన పలికారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హర్షా బోగ్లే ఖండించాడు. టీమిండియా క్రికెటర్లు తనపై ఫిర్యాదు చేసి తొలగింపుకు కారణమవుతారని అనుకోవడం లేదన్నాడు. 'వ్యాఖ్యాతగా ఉన్న నేను ప్రతీ క్రికెటర్ గురించి మాట్లాడుతుంటాను. వాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కామెంటరీతో వారు చేసే పరుగుల్ని, వికెట్లను, క్యాచ్‌లను ఆపలేను. ఒక యూనివర్శిటీ స్థాయి క్రికెటర్ అయినా వారి గురించి చెప్పడమే నా విధి. అటువంటప్పుడు క్రికెటర్లు నా గురించి ఫిర్యాదు చేస్తారని ఎలా అనుకుంటాను. అది క్రికెటర్ల పని కాదనేది నా బలమైన నమ్మకం' అని హర్షాబోగ్లే పేర్కొన్నాడు. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. -
ఐపీఎల్-9 వివాదంలో మిస్టరీ
ఐపీఎల్-9వ సీజన్‌నూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ నుంచి ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను ఉన్నఫళంగా తొలగించడానికి కారణమేంటన్నది మిస్టరీగా మారింది. దీనికి కొందరు టీమిండియా సీనియర్ క్రికెటర్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. భోగ్లేకు వ్యతిరేకంగా వారు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. టి-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ క్రికెటర్లు భోగ్లేపై బోర్డుకు ఫిర్యాదు చేసి ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు సురేష్ రైనా, అశ్విన్ మీడియా సమావేశాల్లో దురుసుగా మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. భోగ్లే ఇటీవల విదర్భ క్రికెట్ సంఘం గురించి పరుష వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. భోగ్లే పేరును ప్రస్తావించకుండా ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భోగ్లే ఉద్వాసనకు కారణమేంటన్నది మిస్టరీగా మారింది. -
ఢిల్లీ మళ్లీ ఢమాల్...
► సీజన్ మారినా మారని రాత తొలి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన ► 9 వికెట్లతో కోల్‌కతా ఘన విజయం ► ఐపీఎల్-9లో గంభీర్ సేన శుభారంభం గత మూడేళ్లలో ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 10 మ్యాచ్‌లు గెలిస్తే, 32 మ్యాచ్‌లు ఓడింది. ప్రతీ సీజన్‌కు ఆ జట్టు ఆట తీసికట్టుగా మారింది. దాంతో ఈసారి సమూల మార్పులు అంటూ సగం జట్టును మార్చి పడేశారు. యువ ఆటగాళ్లను భారీ మొత్తాలు చెల్లించి తీసుకున్నారు. మెంటార్‌గా ద్రవిడ్ మార్గనిర్దేశనం కూడా ఉంది. ఇక దూసుకెళ్లడమే తరువాయి అనిపించింది. కానీ రూపు మారినా జట్టు రాత మారలేదు. 2016 ఐపీఎల్‌ను ఆ జట్టు మరింత అధ్వాన్నంగా ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 98 పరుగులకే చాపచుట్టేసిన ఢిల్లీ కనీసం 18 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఏ దశలోనూ కనీస ప్రదర్శన ఇవ్వలేక ఆ జట్టు కుప్పకూలిపోయి లీగ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఏడోసారి వంద లోపే ఆలౌటయింది. కోల్‌కతా: ఐపీఎల్-9లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ హాగ్ (3/19), రసెల్ (3/24), హేస్టింగ్స్ (2/6) ఢిల్లీని దెబ్బ తీశారు. అనంతరం నైట్‌రైడర్స్ 14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. గౌతం గంభీర్ (41 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు), రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 35; 7 ఫోర్లు) రాణించారు. రసెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అందరూ అందరే... తొలి 14 బంతుల్లో 24 పరుగులు... ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనింగ్ భాగస్వామ్యమిది. అంతే... ఆ తర్వాత పరుగులు తీయడమే చేతకాక అంతకుమించిన పార్ట్నర్షిప్ నెలకొల్పడం జట్టు బ్యాట్స్‌మెన్ వల్ల కాలేదు. డి కాక్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు కావడం పరిస్థితిని సూచిస్తోంది. నైట్‌రైడర్స్ చక్కటి బౌలింగ్ ముందు ఒక్క బ్యాట్స్‌మన్ కూడా క్రీజ్‌లో నిలవలేకపోయాడు. రసెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డి కాక్, శ్రేయస్ అయ్యర్ (0) అవుట్ కావడంతో ఢిల్లీ పతనం ప్రారంభమైంది. తన తర్వాతి ఓవర్లోనే అతను మయాంక్ అగర్వాల్ (9)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే మెయిడిన్ ఓవర్ వేసిన హేస్టింగ్స్... కరుణ్ నాయర్ (3) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత పడిన ఐదు వికెట్లను స్పిన్నర్లు హాగ్, పీయూష్ చావ్లా పంచుకున్నారు. చావ్లా తన వరుస ఓవర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ (6), క్రిస్ మోరిస్ (11)లను పెవిలియన్ పంపించగా... పవన్ నేగి (11), శామ్సన్ (13 బంతుల్లో 15; 2 ఫోర్లు), అమిత్ మిశ్రా (3)లను హాగ్ అవుట్ చేశాడు. కెప్టెన్ జహీర్ ఖాన్(4)ను హేస్టింగ్స్ అవుట్ చేయడంతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అలవోకగా... స్వల్ప లక్ష్య ఛేదనలో ఉతప్ప, గంభీర్ ఎక్కడా తడబడలేదు. జహీర్ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లతో 16 పరుగులు రావడంతో వీరి జోరు మొదలైంది. ఢిల్లీ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు రాబట్టిన ఈ జోడి తొలి వికెట్‌కు 58 బంతుల్లో 69 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో వీరిద్దరు ఐపీఎల్లో అత్యధిక పరుగులు జోడించిన ఓపెనర్ల జాబితాలో రెండో స్థానానికి చేరగా... ఉతప్ప లీగ్‌లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా విజయం దిశగా సాగుతున్న దశలో భారీ షాట్‌కు ప్రయత్నించి ఉతప్ప అవుటైనా, మనీశ్ పాండే (12 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) సహకారంతో మరో 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే గంభీర్ మ్యాచ్‌ను ముగించాడు. వరుసగా ఐదో సిక్సర్... సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే మైదానంలో అతనేంటో ప్రపంచానికి తెలిసింది. నాడు ప్రపంచ కప్ ఫైనల్లో వరుసగా నాలుగు సిక్సర్లతో దుమ్ము రేపిన బ్రాత్‌వైట్ అదే ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దానిని కొనసాగించినట్లు కనిపించాడు. ముగించిన చోటే మొదలు పెట్టినట్లు చావ్లా ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అతను భారీ సిక్సర్ బాదాడు. ఇక్కడ అతనికి ఇది వరుసగా ఐదో సిక్సర్ కావడం విశేషం. అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాత్‌వైట్ ఈ జోరు మళ్లీ చూపించలేక నాలుగో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. ►ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన కోల్‌కతా బౌలర్లు హేస్టింగ్స్, రసెల్ స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: అగర్వాల్ (సి) హాగ్ (బి) రసెల్ 9; డి కాక్ (సి) పఠాన్ (బి) రసెల్ 17; అయ్యర్ (ఎల్బీ) (బి) రసెల్ 0; నాయర్ (సి) పాండే (బి) హేస్టింగ్స్ 3; శామ్సన్ (సి) ఉతప్ప (బి) హాగ్ 15; నేగి (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 11; బ్రాత్‌వైట్ (ఎల్బీ) చావ్లా 6; మోరిస్ (బి) చావ్లా 11; కూల్టర్ నీల్ (నాటౌట్) 7; మిశ్రా (సి) గంభీర్ (బి) హాగ్ 3; జహీర్ (సి) పాండే (బి) హేస్టింగ్స్ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 98. వికెట్ల పతనం: 1-24; 2-25; 3-31; 4-35; 5-55; 6-67; 7-84; 8-84; 9-92; 10-98. బౌలింగ్: రసెల్ 3-0-24-3; ఉమేశ్ యాదవ్ 3-0-21-0; హేస్టింగ్స్ 2.4-1-6-2; మున్రో 1-0-7-0; హాగ్ 4-1-19-3; చావ్లా 4-0-21-2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మోరిస్ (బి) మిశ్రా 35; గంభీర్ (నాటౌట్) 38; పాండే (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 99. వికెట్ల పతనం: 1-69. బౌలింగ్: కూల్టర్‌నీల్ 4-0-32-0; జహీర్ 2.1-0-24-0; మోరిస్ 4-0-21-0; బ్రాత్‌వైట్ 2-0-9-0; మిశ్రా 2-0-11-1. -
'అతను చాలా ప్రమాదకరమైన బౌలర్'
కోల్‌కతా: వెస్టిండీస్ స్పిన్నర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఐపీఎల్-9వ సీజన్లో అత్యంత ప్రమాదకర బౌలర్ అని కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ టోర్నీలో నరైన్ నిలకడగా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వివాదాస్పద బౌలింగ్ కారణంగా నిషేధానికి గురైన నరైన్ ఇటీవల జరిగిన టి-20 ప్రపంచ కప్‌నకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్ విజేతగా నిలిచినా నరైన్ ఆ విజయంలో భాగస్వామి కాలేకపోయాడు. కాగా సునీల్‌కు ఐపీఎల్ లో ఆడేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-9వ సీజన్ పోటీలు శనివారం ఆరంభమయ్యాయి. -
కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా మిల్లర్
ఐపీఎల్-9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 2012 సీజన్‌నుంచి అతను పంజాబ్ జట్టు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గత ఏడాది వరకు కెప్టెన్‌గా ఉన్న బెయిలీని ఆ జట్టు విడుదల చేయడంతో కొత్త నాయకుడి అవసరం ఏర్పడింది. పంజాబ్ తరఫున 47 ఐపీఎల్ మ్యాచ్‌లలో మిల్లర్ 147.53 స్ట్రైక్ రేట్‌తో 1319 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా మిల్లర్ సమర్థంగా జట్టును నడిపిస్తాడని కోచ్ సంజయ్ బంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.