కోరుకున్నదే దక్కింది: ధోని
విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న 40వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎక్కువ పరుగులు సాధించడం కీలకమైన అంశమని వార్నర్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో మార్పులు ఏమీ లేవని తెలిపాడు.
తాము ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని, కోరుకున్నదే దక్కిందని పుణే కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. ముందుగా ఫీల్డింగ్ దక్కడం పట్ల తమ ఆటగాళ్లు అందరూ సానుకూలంగా ఉన్నారని చెప్పాడు. తమ టీమ్ లో కూడా ఎటువంటి మార్పులు లేవని తెలిపాడు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, పుణే ఏడో స్థానంలో ఉంది.