బెంగళూరు 3, హైదరాబాద్ 2
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల నెరవేరలేదు. ఐపీఎల్ లో బలమైన జట్టుగా పేరుగా గాంచిన ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ కప్ అందుకోలేకపోయింది. తాజాగా జరిగిన మెగా టోర్నీలోనూ ఆర్సీబీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. మూడుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది. ఐపీఎల్-2016లోనూ రన్నరప్ గానే సరిపెట్టుకుంది. 2009, 2011లో ఫైనల్ కు చేరినా టైటిల్ దక్కించుకోలేకపోయింది. అయితే ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్‌దే. రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు ఫైనల్లో పరాజయం పాలైంది.
కాగా, హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఐపీఎల్ కప్ దక్కించుకోడం ఇది రెండోసారి. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచింది. అప్పడు కూడా బెంగళూరుపైనే హైదరాబాద్ గెలవడం విశేషం. రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సారథ్యంలోనే హైదరాబాద్ జట్టు కప్పు సొంతం చేసుకుంది. ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో అవకాశం దక్కింది.