ధోని సేనకు దెబ్బమీద దెబ్బ | Steven Smith latest Supergiant to bow out of IPL | Sakshi
Sakshi News home page

ధోని సేనకు దెబ్బమీద దెబ్బ

Published Mon, May 2 2016 9:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

ధోని సేనకు దెబ్బమీద దెబ్బ

ధోని సేనకు దెబ్బమీద దెబ్బ

పుణే: ఐపీఎల్ లో ఎంఎస్ ధోని సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కు దెబ్బమీద తగులుతోంది. గాయాలతో విదేశీ స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగారు. వీరి సరసన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు.

మణికట్టు గాయంతో స్మిత్ ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధ పడుతున్న అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. వరుసగా స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో పుణే విజయావకాశాలపై ఆ ప్రభావం పడుతోంది. ఆరంభ మ్యాచుల్లో ఆకట్టుకోని స్మిత్ తర్వాత పుంచుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాడు. ఇలాంటి సమయంలో అతడు టీమ్ కు దూరం కావడంతో పుణేకు ప్రతికూలంగా మారే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement