‘‘రూట్ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌పై వచ్చిన విమర్శలు.
అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు రూట్. రాంచి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్.. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్‌లో 139 టెస్టు ఆడుతున్న రూట్.. 31వ శతకం నమోదు చేశాడు.
ఇక ఓవరాల్‌గా రూట్‌కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్‌పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు.
టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు
►10- జో రూట్(ఇంగ్లండ్- 52 ఇన్నింగ్స్*)
►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37)
►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్- 30)
►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్- 41)
►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51)
Comments
Please login to add a commentAdd a comment