Steven Smith
-
కోహ్లి కాదు!.. వరల్డ్ నంబర్ వన్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ప్రపంచంలోని ప్రస్తుత టాప్ బ్యాటర్లలో బాబర్ ఆజం టెక్నిక్ గొప్పగా ఉంటుందని పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ జాహిద్ అన్నాడు. అయితే, ఆస్ట్రేలియా వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ టెస్టు సెంచరీల ధీరుడు జో రూట్ మాత్రం.. బాబర్ కంటే తెలివిగా బ్యాటింగ్ చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా స్టార్లలో విరాట్ కోహ్లి కంటే కూడా రోహిత్ శర్మకే తాను ఎక్కువ రేటింగ్ ఇస్తానని జాహిద్ స్పష్టం చేశాడు.టెక్నిక్ పరంగా బాబర్ వరల్డ్ నంబర్ వన్ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్ నైపుణ్యాల పరంగా చూస్తే.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బాబర్ ఆజం బెస్ట్ అని చెబుతాను. అందరికంటే అతడి బ్యాటింగ్ టెక్నిక్ అత్యుత్తమంగా ఉంటుంది. అయితే, బ్యాటింగ్ నాలెడ్జ్ విషయంలో మాత్రం.. జో రూట్, స్టీవ్ స్మిత్.. వేరే లెవల్ అంతే!బాబర్ ఈ విషయంలో వాళ్లంత క్లెవర్ కాదు. మ్యాచ్‌ను అంచనా వేయడంలో వారిద్దరు సూపర్. అయితే, ఈ ఇద్దరిలోనూ స్మిత్‌కు నంబర్ వన్, రూట్‌కు రెండో ర్యాంకు ఇస్తాను. వారి తర్వాత బాబర్ ఆజం’’ అని మహ్మద్ జాహిద్ పేర్కొన్నాడు.కోహ్లి కంటే రోహిత్ బెటర్ఇక విరాట్ కోహ్లి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ పేరును ఎవరు తిరస్కరించగలరు. అయితే, నా వరకు కోహ్లి కంటే రోహిత్ శర్మ బెటర్. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ రోహిత్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో అతడికి ఎవరూ సాటిరారు. తనొక గిఫ్టెడ్ ప్లేయర్. ఇంజమామ్ ఉల్ హక్ మాదిరి తొందరగా బంతిని అంచనా వేసి.. ఏ షాట్ ఆడాలో నిర్ణయించుకుంటాడు’’ అని మహ్మద్ జాహిద్ చెప్పుకొచ్చాడు.సెంచరీల వీరుడిని కాదనికాగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్‌గా పేరొందిన కోహ్లి.. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో సాధించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు చేరువగా వచ్చాడు ఈ రన్‌మెషీన్. ఇప్పటి వరకు 80 సెంచరీలు బాది.. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఇప్పటికే షోయబ్ అక్తర్ వంటి పలువురు పాక్ మాజీ క్రికెటర్లు వరల్డ్ నంబర్ వన్‌గా కోహ్లి పేరు చెప్పగా.. జాహిద్ మాత్రం కోహ్లిని కాదని.. బాబర్ ఆజం, రోహిత్ శర్మ, స్మిత్, రూట్లకు ఓటు వేశాడు. వీరంతా సెంచరీల విషయంలో కోహ్లి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.లంక సిరీస్‌తో బిజీకాగా రోహిత్, కోహ్లి ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆడిన రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో ఫామ్ కొనసాగిస్తుండగా.. కోహ్లి మాత్రం 38 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మరోవైపు.. పాకిస్తాన్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం కఠినపరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడి సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పాక్ దారుణ వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్సీపై మరోసారి వేటుపడే అవకాశం ఉంది. -
Joe Root: రూట్ సరికొత్త చరిత్ర! ఇప్పటికి ఒకే ఒక్కడు..
‘‘రూట్ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌పై వచ్చిన విమర్శలు. అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు రూట్. రాంచి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్.. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో 139 టెస్టు ఆడుతున్న రూట్.. 31వ శతకం నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రూట్‌కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్‌పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు ►10- జో రూట్(ఇంగ్లండ్- 52 ఇన్నింగ్స్*) ►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37) ►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్- 30) ►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్- 41) ►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51) -
ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ! ఇక అంతే మరి
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాల కారణంగా ప్రోటీస్ టూర్‌కు దూరమయ్యారు. స్మిత్ ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. యాషెస్ సిరీస్ సందర్భంగా గాయపడిన స్మిత్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరో రెండు నెలలో వన్డే ప్రపంచకప్ ఉండడటంతో అతడిని ఆడించి రిస్క్ చేయకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. ఈ క్రమంలో స్మిత్ నాలుగు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు మిచిల్ స్టార్క్ గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా మరో నాలుగు నుంచి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి స్మిత్, స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారినపడడం ఆస్ట్రేలియా మెన్జ్మెంట్ను కలవరపెట్టే ఆంశమనే చెప్పుకోవాలి. ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు స్మిత్ స్ధానాన్ని ఆస్టన్ టర్నర్‌తో భర్తీ చేయగా.. వన్డేల్లో మార్నస్ లాబుషేన్‌కు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా స్టార్క్ స్ధానాన్ని యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. కంగూరు జట్టు ప్రోటిస్ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 30న డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20తో ఆసీస్ పర్యటన ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా చదవండి: #Virat Kohli: అరంగేట్రంలో విఫలం.. కట్ చేస్తే.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! ఏకంగా సచిన్‌తో పోటీ -
ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం!
యాషెస్ సిరీస్ 2023లో మరో వివాదం తలెత్తింది. లండన్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ చాకచాక్యంగా వ్యవహరించడంతో.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో రనౌటయ్యే అవకాశాన్ని తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 78 ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మూడో బంతికి స్మిత్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. దీంతో స్మిత్ సింగిల్ పూర్తి చేసుకుని రెండో రన్ కోసం వికెట్ కీపర్ ఎండ్‌కు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హామ్ మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వైపు త్రోచేశాడు. బంతిని అందుకున్న బెయిర్ స్టో వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. స్మిత్ కూడా తన వికెట్‌ను కాపాడుకోవడానికి అద్భుతంగా డైవ్ చేశాడు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఔట్ అని సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ విల్సన్ థర్డ్ అంపైర్‌కు రీఫర్ చేశాడు. అయితే తొలుత రీప్లేలో బంతి వికెట్లకు తాకే సమయానికి స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ రనౌటని భావించారు. స్మిత్ కూడా తను ఔటని భావించి పెవిలియన్ వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చేటు చేసుకుంది. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం పలుకోణాల్లో చాలాసేపు పరిశీలించి.. బెయిర్ స్టో బంతిని అందుకోక ముందే తన గ్లోవ్తో ఒక బెయిల్‌ను పడగొట్టినట్లు తేల్చాడు. అయితే మరో రెండు బెయిల్స్ కింద పడినప్పటికీ స్మిత్ క్రీజులోకి వచ్చేశాడు. దీంతో నితిన్ మీనన్ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. అది చూసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంగ్లండ్ అభిమానులు మాత్రం అది ఔటే అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ 75 పరుగులతో రాణించాడు. చదవండి: Zim Afro T10: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్ George Ealham 🤝 Gary Pratt An incredible piece of fielding but not to be... 😔 #EnglandCricket | #Ashes pic.twitter.com/yWcdV6ZAdH — England Cricket (@englandcricket) July 28, 2023 -
‘ఈతరం బ్రాడ్‌మన్’ స్టీవ్ స్మిత్.. అరుదైన మైలురాయిని చేరుకోనున్న ఆసీస్ బ్యాటర్
2010 జూలై... లార్డ్స్ మైదానంలో ఆ్రస్టేలియా, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్. దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ రిటైరై అప్పటికి మూడేళ్లవుతోంది. అతని స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ల వేట కొనసాగిస్తున్న ఆ్రస్టేలియా వేర్వేరు కొత్త ఆటగాళ్లతో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ స్టీవెన్ స్మిత్‌కు అవకాశం కల్పించింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన అతను... బ్యాటింగ్ 8వ, 9వ స్థానాల్లో బరిలోకి దిగి 1, 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తర్వాతి రోజుల్లో అతను బౌలింగ్‌ను పక్కన పెట్టి అద్భుతమైన బ్యాటర్‌గా ఎదుగుతాడని ఎవరూ ఊహించలేకపోయారు. టెస్టు క్రికెట్లో ఘనమైన రికార్డులతో ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిన స్మిత్ నేడు కెరీర్లో 100వ టెస్టు బరిలోకి దిగనుండటం విశేషం. కెరీర్లో తొలి ఐదు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించినా... ఆ్రస్టేలియా టీమ్ మేనేజ్మెంట్ స్మిత్‌ను బ్యాటర్‌గా గుర్తించలేదు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లే తీయడంతో సహజంగానే జట్టులో స్థానం పోయింది. మళ్లీ టీమ్‌లోకి రావడానికి అతనికి రెండేళ్లు పట్టింది. ‘హోంవర్క్గేట్’ కారణంగా సీనియర్లపై వేటు పడటంతో అదృష్టవశాత్తూ మొహాలిలో భారత్‌తో జరిగిన టెస్టులో అతనికి అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన స్మిత్ బ్యాటింగ్ విలువేమిటో అందరికీ అర్థమైంది. కెరీర్లో తొలి మూడు సెంచరీలు ఇంగ్లండ్‌పైనే నమోదు చేసిన స్మిత్... స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్‌ల పదునైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సాధించిన శతకం అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు అత్యుత్తమ ప్రదర్శనలతో దూసుకుపోయి స్మిత్ టెస్టుల్లో శిఖరానికి చేరుకున్నాడు. కెరీర్లో ఒకదశలో అత్యుత్తమంగా 64.81 సగటును అందుకున్న స్మిత్... డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ‘ఆధునిక బ్రాడ్‌మన్’ అనిపించుకున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే అన్ని వేదికల్లోనూ పరుగులు సాధించగలడం స్మిత్ సాధించిన ఘనత. ఎదురులేని ప్రదర్శనలతో... 2014–2018 మధ్య కాలం స్మిత్ కెరీర్లో అత్యుత్తమం. ఈ సమయంలో ఎన్నో అసాధారణ రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. 79 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 75.81 సగటుతో 5004 పరుగులు నమోదు చేశాడు. 2015 యాషెస్ సిరీస్‌లో 508 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను ఈ సిరీస్ ముగియగానే పూర్తి స్థాయి కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత గడ్డపై జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో 3 సెంచరీలు సహా 499 పరుగులతో అతనే అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో కఠినమైన పుణే పిచ్‌పై ప్రతికూల పరిస్థితులను అధిగమించి రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన శతకం టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి. కొద్ది రోజులకే కెప్టెన్‌గా సొంతగడ్డపై 4–0తో యాషెస్ సిరీస్‌ను గెలిపించడంతోపాటు 687 పరుగులతో టాపర్‌గా నిలిచాడు. వరుసగా నాలుగేళ్లు వేయికి పైగా పరుగులు చేసి తన స్థాయి ఏమిటో అతను చూపించాడు. 2014లో తొలిసారి 50 బ్యాటింగ్ సగటును స్మిత్ అందుకోగా, ఇప్పటి వరకూ అది అంతకంటే తగ్గకపోవడం అతని నిలకడను చూపిస్తోంది. టాంపరింగ్ వివాదాన్ని దాటి... తెలివితేటలు, వ్యూహ చతురత, సాంకేతికాంశాలపై పట్టు స్మిత్‌ను విజయవంతమైన కెపె్టన్‌గా నిలిపాయి. అయితే ఇదే తెలివి కాస్త ‘అతి’గా మారడంతో 2018 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏడాది పాటు నిషేధం కూడా పడింది. అయితే సంవత్సరం తర్వాత తిరిగొచ్చాక అతను తనలోని పాత స్మిత్‌ను మళ్లీ చూపించాడు. 2019 యాషెస్‌లో 4 టెస్టుల్లోనే ఏకంగా 774 పరుగులతో సత్తా చాటాడు. తర్వాత కొన్నాళ్లపాటు తడబాటు కనిపించినా... గత ఏడాది గాలే టెస్టులో 145 పరుగులతో ఫామ్‌లోకి వచ్చిన అతను ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో, లార్డ్స్ టెస్టులోనూ శతకాలు బాది మరిన్ని రికార్డులపై స్మిత్ గురి పెట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 టెస్టులు ముగిసేసరికి అత్యుత్తమ సగటు (59.56)తో నిలిచిన ఆటగాడైన స్మిత్ 32 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 9113 పరుగులు సాధించాడు. నేటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో ‘యాషెస్’ టెస్టు లీడ్స్‌లో జరగనుంది. హెడింగ్లీ మైదానంలో జరిగే ఈ పోరు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. గత మ్యాచ్ ఆడిన పోప్, అండర్సన్, టంగ్ స్థానాల్లో వోక్స్, అలీ, వుడ్‌లను ఎంపిక చేశారు. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆ్రస్టేలియా 2–0తో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను ‘సోనీ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. - సాక్షి క్రీడా విభాగం -
సిరాజ్‌కు కోపం తెప్పించిన స్మిత్ చర్య
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన స్టీవ్ స్మిత్ తన చర్యతో సిరాజ్‌కు కోపం తెప్పించాడు. రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఇది జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 86వ ఓవర్లో మూడో బంతి వేయడానికి సిరాజ్ సిద్దమయ్యాడు. రనప్ తీసుకొని బంతి విడవడానికి ముందు స్మిత్ క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇది సిరాజ్‌కు చిరాకు తెప్పించింది. వెంటనే బంతిని స్మిత్ వైపు కోపంగా విసిరాడు. స్మిత్ చర్యకు కెప్టెన్ రోహిత్ కూడా షాక్ తిన్నాడు.అయితే గ్రౌండ్‌లోని స్పైడర్ కెమెరా అడ్డు రావడంతోనే అలా చేసినట్లు స్మిత్ వివరణ ఇచ్చినప్పటికి సిరాజ్ పట్టించుకోలేదు. నేను రనప్ తీసుకోకముందే ఆపి ఉంటే బాగుండేది కదా అంటూ కోపంతో పేర్కొన్నాడు. అయితే ఇద్దరు సైలెంట్ కావడంతో ఎలాంటి మాటల యుద్దం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో రోజు మొదలైన కాసేపటికే సిరాజ్ బౌలింగ్‌లోనే రెండు వరుస బౌండరీలు బాది టెస్టుల్లో 31వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా స్మిత్‌కు టీమిండియాపై టెస్టుల్లో ఇది తొమ్మిదో సెంచరీ. ఇక 121 పరుగులు చేసిన అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో స్మిత్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. Siraj is the most dislikeable Cricketer i've ever seen.pic.twitter.com/3aGCxXDEyF — ` (@rahulmsd_91) June 8, 2023 చదవండి: #SteveSmith: టీమిండియాకు కొరకరాని కొయ్య.. ఔట్ చేయడం చాలా కష్టం -
జడేజా దెబ్బకు స్మిత్ మైండ్ బ్లాంక్.. వీడియో చూసి తీరాల్సిందే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఘనమైన పునరాగమనం చేశాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో జడేజా అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు వేసిన జడ్డూ 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను జడేజా ఔట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటికే క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్న స్మిత్‌ను అద్భుతమైన బంతితో స్మిత్ బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 42 ఓవర్లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్మిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో స్మిత్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. కాసేపు క్రీజులోనే అలా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 177 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ ఇక భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్ 37, అలెక్స్ కేరీ 36 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో కంగరూల పతనాన్ని శాసించగా.. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. సిరాజ్, షమీ చెరొక వికెట్ తీశారు. చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith's defence! 👌👌 Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3 — BCCI (@BCCI) February 9, 2023 -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. ఆ ఐదుగురు యమ డేంజర్.. ఏమరపాటుగా ఉంటే!
India Vs Australia - BGT 2023: భారత్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత్ సన్నద్దం అవుతుండగా.. మరోవైపు భారత్‌లో టెస్టు సిరీస్ సాధించి 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. చివరసారిగా భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2004లో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి భారత్‌లో టెస్టు సిరీస్ విజయం ఆస్ట్రేలియాకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు 1969, 2004లో మాత్రమే ఆస్ట్రేలియా భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టెస్టుల్లో భారత్ కంటే ఆసీస్ కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పుకోవాలి. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారి నుంచి భారత జట్టుకు భారీ ముప్పు పొంచి ఉంది. టీమిండియాను భయపెట్టే ఆ ఆసీస్ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం. ఉస్మాన్ ఖవాజా ఉస్మాన్ ఖవాజా టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఉస్మాన్.. గతేడాది సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ నాలుగో టెస్టుతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే పునరాగమనం చేసిన తొలి టెస్టులోనే రెండు సెంచరీలు సాధించి సత్తాచాటాడు. అదే విధంగా ఈ ఏడాది జనవరిలో దక్షణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఖవాజా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 195 పరుగులు చేసిన ఖవాజా తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా ఈ వెటరన్ ఓపెనర్ దుమ్మురేపాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 65.33 సగటుతో 496 పరుగులు చేశాడు. అయితే ఖవాజా ఇప్పటివరకు భారత్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ స్పిన్‌ను అతడు అద్భుతంగా ఆడగలడు ఈ లెఫ్ట్ండర్. కాబట్టి రవి అశ్విన్, రవీంద్ర జడేజా వంటి స్టార్ స్పినర్లు ఎంతవరకు ఖవాజాను అడ్డుకుంటారో వేచి చూడాలి. మార్నస్ లాబుషేన్ ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లలో మార్నస్ లాబుషేన్ ఒకడు. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో మార్నస్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పరంగా రాణించాలంటే లాబుషేన్ బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. అయితే ఇప్పటివరకు లాబుషేన్ కూడా భారత్ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ భారత ఉపఖండంలో ఏడు టెస్టులు ఆడాడు. 7 మ్యాచ్‌ల్లో 34.64 సగటుతో 700 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 33 టెస్టులు ఆడిన అతడు 59.4తో 3150 పరుగులు చేశాడు. అయితే గతంలో రెండు సార్లు టెస్టుల్లో అశ్విన్‌కు లాబుషేన్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.ఇక తాజా సిరీస్‌లో లాబుషేన్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడో లేదో తెలియాలంటే నాగ్‌పూర్ టెస్టు వరకు వేచిచూడాలి. స్టీవ్ స్మిత్ ప్రస్తుత ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ ఒకడిగా ఉన్నాడు. దాదాపు 18 నెలలగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ స్టీవ్ స్మిత్.. గతేడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత సెంచరీ సాధించి మళ్లీ తన పూర్వవైభవాన్ని పొందాడు. అనంతరం వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీతో పాటు, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో పరుగులు వరద పారించాడు. స్మిత్ ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ పిచ్‌లపై స్మిత్‌కు మంచి రికార్డు ఉంది. అదే విధంగా స్పిన్‌కు కూడా అద్భుతంగా ఆడగలడు. కాగా భారత్‌పై టెస్టుల్లో స్మిత్‌కు ఎనిమిది సెంచరీలు ఉండడం గమానార్హం. అందులో మూడు భారత గడ్డపై సాధించినివే. అతడు టీమిండియాపై ఇప్పటివరకు 72.58 సగటుతో 1742 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు 92 టెస్టులు ఆడిన స్మిత్ 8647 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ గత ఏడాది నుంచి రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఓటమి అంచులనుంచి గట్టెక్కించే సత్తా హెడ్‌కు ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 96 బంతుల్లో 92 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. స్పిన్‌కు సహాయపడే పిచ్‌ల్లో ఎదురుదాడికి దిగడం హెడ్ ప్రత్యేకత. ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తారుమారు చేయగలడు. కాబట్టి ఇటువంటి విధ్వంసకర ఆటగాడితో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే భారత్‌పై మాత్రం హెడ్‌కు అంత మెరుగైన రికార్డు ఏమి లేదు. భారత్‌పై ఐదు టెస్టులు ఆడిన అతడు కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఓవరాల్‌గా 33 టెస్టులు ఆడిన హెడ్ 2126 పరుగులు చేశాడు. నాథన్ లియాన్ నాథన్ లియాన్.. ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. భారత్‌పై కూడా అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లియాన్ స్వదేశంలోనే భారత బ్యాటర్లు చుక్కలు చూపించాడు. 2017లో బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టెస్టులో 50 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. కాగా లియాన్‌కు ఇవే తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు కూడా. భారత్‌పై ఇప్పటివరకు 34 వికెట్లు సాధించాడు. గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని లియాన్ చాలా సార్లు బోల్తా కొట్టించాడు. చదవండి: Ravindra Jadeja: అసలు మళ్లీ ఆడతానా లేదోనన్న సందేహాలు.. నాకోసం వాళ్లు చాలా కష్టపడ్డారు.. ఆదివారాలు కూడా! IND vs AUS: భారత్ టెస్టు సిరీస్ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు! -
సెంచరీతో చెలరేగిన లాబుషేన్.. తొలి రోజు ఆస్ట్రేలియాదే!
ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. తొలి రోజు ఆటలో విండీస్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 293 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నెస్ లాబుషేన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 270 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 154 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు స్టీవన్ స్మిత్ కూడా 59 పరుగలతో ఆజేయంగా నిలిచాడు. ఇక ఓపెనర్ డేవిడ్ వార్నర్(5) వికెట్‌ను అదిలోనే కోల్పోయినప్పటికీ.. ఉస్మాన్ ఖవాజా, లూబుషేన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఖవాజా 65 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లూబుషేన్ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆటను ముగించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, మైర్స్ తలా వికెట్ సాధించారు. Smashed through point to bring up the ton! 💪 Labuschagne celebrates his eighth Test century #PlayOfTheDay@nrmainsurance | #AUSvWI pic.twitter.com/KWsatgIzNZ — cricket.com.au (@cricketcomau) November 30, 2022 చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
Ashes 2021-22: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్.. 275 పరుగుల తేడాతో విజయం
Australia Win 2nd Test Beat England: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అడిలైడ్ మ్యాచ్‌లో 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. సెంచరీ వీరుడు మార్నస్ లబుషేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా అతడు 154 పరుగులు సాధించాడు. కాగా మొదటి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అడిలైడ్ టెస్టుకు దూరం కాగా... మాజీ సారథి స్టీవ్ స్మిత్ జట్టును ముందుండి నడిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన కంగారూలు... ఎట్టకేలకు విజయం సాధించి ఇంగ్లండ్‌కు చేదు అనుభవం మిగిల్చారు. పర్యాటక జట్టులో డేవిడ్ మలన్, కెప్టెన్ జో రూట్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జోస్ బట్లర్ 207 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. రెండో టెస్టు- స్కోర్లు: ►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్ ►రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్ ►రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్ చదవండి: Ashes 2021-22: తదుపరి 3 టెస్టులకు కూడా.. ఇక: ఆస్ట్రేలియా What a way to end an epic innings! 😲 That's the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashes pic.twitter.com/nRP09djjay — cricket.com.au (@cricketcomau) December 20, 2021 No, this clip is not in slow motion 😅#Ashes pic.twitter.com/Df3Xchcfuq — cricket.com.au (@cricketcomau) December 20, 2021 -
'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'
అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను 236 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల ఆధిక్యం ఆసీస్‌కు లభించింది. ఇక ఆసీస్ 473 పరుగుల భారీస్కోర్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్(93)కీలక పాత్ర పోషించాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి, 290 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్ధితి నిలవడంతో మిగితా ఆటగాళ్లు అందరూ ప్రశాంతంగా నిద్రపోయినా, స్టాండింగ్ కెప్టెన్ స్మిత్ మాత్రం నిద్ర పోలేదు. అర్ధరాత్రి స్మిత్ నిద్రపోకుండా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి భార్య డాని విల్లిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోకు "స్టీవ్ స్మిత్ తన కొత్త బ్యాట్‌ని చూస్తున్నారు" అని ఆమె క్యాప్షన్ పెట్టింది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "అర్ధ రాత్రి పడుకోకుండా అది ఏం పని" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ ఈ టెస్ట్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: Kohli-Ganguly: 'కోహ్లి యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం' Steve Smith’s wife catches him shadow batting at 1am in their hotel room. 📸 Instagram/dani_willis #Ashes pic.twitter.com/5COJlUWiJt — Nic Savage (@nic_savage1) December 18, 2021 -
సెకెండ్ ఫేజ్‌లో తొలి మ్యాచ్.. నొప్పితో విలవిల్లాడిన స్మిత్
Steven Smith: ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పృద్వీ షా స్ధానంలో జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్ 34 బంతుల్లో 4 ఫోర్లుతో 39 పరుగులు సాధించాడు. అయితే ఐపీఎల్ రెండో దశలో స్మిత్‌కు ఇదే తొలి మ్యాచ్. కాగా ఇన్నింగ్ 13 ఓవర్ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు ప్రయత్నించిన స్మిత్.. మిస్ కావడంతో బంతి తొడ పై భాగాన తగిలింది. దీంతో స్మిత్ కింద పడిపోయి కొద్ది సేపు నొప్పితో విలవిల్లాడు. కాగా తర్వాత బంతికే స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు pic.twitter.com/hfNsPyy4P5 — Simran (@CowCorner9) September 28, 2021 -
ఫించ్ సెంచరీ చేస్తే.. స్మిత్ ఓడించాడు!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ఆడే క్రమంలో అరోన్ ఫించ్‌లు, స్టీవ్ స్మిత్‌లు జట్టుకు విజయాలు సాధించి పెట్టిన సందర్భాలు ఎన్నో. అయితే ఇద్దరూ ప్రత్యర్థులుగా మారితే.. ఒకర్ని ఒకరు ఓడించుకుంటే అది అత్యంత ఆసక్తిగా ఉంటుంది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెనిగేడ్స్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఉంటే, సిడ్నీ సిక్సర్స్ సభ్యుడిగా ఉన్న స్మిత్ ఉన్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ జట్టులో ఫించ్ శతకంతో చెలరేగిపోయాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. కాగా, మిగతా వారు పెద్దగా రాణించకపోవడంతో రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ సునాయాసంగా ఛేదించింది. 18.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. ఈ విజయంలో స్టీవ్ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. కడవరకూ అజేయంగా క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 66 పరుగులు సాధించాడు. సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ జోష్ ఫిలిఫ్ 61 పరుగులు సాధించగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన స్మిత్ బ్యాట్ ఝుళిపించాడు. బౌండరీలతో అలరిస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. -
287 కొడతారా? లేక సిరీస్ సమర్పిస్తారా?
బెంగళూరు: మూడు వన్డేల సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (131; 132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో అదరగొట్టాడు. స్మిత్‌కు తోడు లబుషేన్(54) అర్థసెంచరీతో మెరవగా.. అలెక్స్ క్యారీ(30) పర్వాలేదనిపించాడు. ఓ క్రమంలో పర్యాటక ఆసీస్ జట్టు 300కి పైగా పరుగులు సాధిస్తుందనుకున్నారు. కానీ చివర్లో భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ను కట్టడి చేశారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో రాణించగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్ల పడగొట్టాడు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడ్డాడు. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు చేతికి కట్టు కట్టుకొని ఉండటం చూస్తుంటే.. ధావన్ బ్యాటింగ్‌కు దిగడం కష్టమేనని తెలుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. డేవిడ్ వార్నర్(3)ను షమీ ఔట్ చేయగా.. ఆరోన్ ఫించ్ (19)ను రనౌట్ అయ్యాడు. దీంతో 46 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో లబుషేన్‌తో కలిసి స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆరంభంలో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. అనంతరం వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తిచేశారు. అయితే అర్ధసెంచరీ అనంతరం జడేజా బౌలింగ్‌లో కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌కు లబుషేన్ వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లబుషేన్ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్(0) భారీ షాట్‌కు యత్నించి జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అదరగొట్టిన భారత బౌలర్లు.. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో స్టీవ్ స్మిత్ గేర్ మార్చాడు. అలెక్స్ క్యారీతో కలిసి దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అలెక్స్ వచ్చీ రాగానే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. దీంతో ఓ క్రమంలో ఆసీస్ మూడు వందలకు పైగా పరుగులు సాధిస్తుందనుకున్నారు. కానీ చివర్లో భారత బౌలర్లు రాణించారు. ముఖ్యంగా మహ్మద్ షమీ వరుసగా వికెట్లు పడగొడుతూ పర్యాటక జట్టుపై ఒత్తిడి పెంచాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం క్రీజులో పాతుకపోయాడు. ఈ క్రమంలోనే కెరీర్లో 9వ శతకం సాధించాడు. సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన స్మిత్‌ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. స్మిత్‌ను వెనక్కిపంపింన షమీ ఆ వెంటనే కమిన్స్(0), జంపా(0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది. చదవండి: ధావన్‌కు గాయం.. బ్యాటింగ్‌కు రాడా? కోహ్లి క్యాచ్.. లబుషేన్ షాక్! ఎంత పనిచేశావ్ స్మిత్.. -
స్మిత్ సెంచరీ.. మరో ఘనత
బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ శతకం సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్ లబుషేన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు స్మిత్. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈక్రమంలో స్మిత్, లబుషేన్‌లు అర్దసెంచరీలు పూర్తిచేసుకున్నారు. అయితే మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించి ప్రమాకరంగా మారుతున్న ఈ జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు. లబుషేన్(54)ను ఔట్ చేశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మిత్ మాత్రం క్రీజులో పాతుకపోయాడు. నవదీప్ సైనీ వేసిన 39 ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టి వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 121 వన్డేల్లోనే స్మిత్ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇక అలెక్య్ క్యారీతో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు స్మిత్. ఈ క్రమంలో 117 బంతుల్లో 11 ఫోర్లు సహాయంతో స్మిత్ సెంచరీ సాధించాడు. ఇది స్మిత్‌కు వన్డేల్లో 9వ సెంచరీ కావడం విశేషం. అయితే స్మిత్ తన 8వ శతకం జనవరి 19, 2017 తేదీన చేయగా.. 9వ శతకం నేడు అదే తేదీన(జనవరి 19) చేయడం మరో విశేషం. -
మైదానంలో మరోసారి రచ్చచేసిన స్మిత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్ డే టెస్టు’తొలి రోజు చిన్నపాటి వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ సీనియర్ అంపైర్ నిగెల్ లాంగ్ తీరుపై ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్ వార్న్ సైతం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని ఎద్దేవాచేశాడు. అయితే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే స్మిత్ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆసీస్ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ అనే విషయం ఈ ఒక్క సంఘటన నిరూపితమైందని మరి కొంత మంది పేర్కొంటున్నారు. ‘టెస్టు క్రికెట్లో ఒక్క పరుగు కోసం అది కూడా న్యాయబద్దం కాని దాని కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్‌మన్ స్మిత్’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ పరుగుల వేట ప్రారంభించింది. అయితే ఆరంభంలేనే ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ తగిలింది 61 పరుగులకే వార్నర్, బర్స్న్ వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్మిత్, లబుషేన్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ 26వ ఓవర్(బ్రేక్‌కు ముందు ఓవర్) సందర్భంగా కివీస్ బౌలర్ వాగ్నర్ వేసిని షార్ట్ పిచ్ బాల్ స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో సింగిల్ తీసే ప్రయత్నం చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ సింగిల్ తీసే ప్రయత్నాన్ని అంపైర్ నిగేల్ లాంగ్ అడ్డుకున్నాడు. ఎందుకంటే అ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్‌ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్ అవుతుందని.. ఇదే విషయాన్ని స్మిత్‌కు అంపైర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అంతకుముందు ఓవర్లో కూడా జరగడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్ వార్న్ అంపైర్ తీరును తప్పుపట్టారు. అంపైర్‌ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. షార్ట్ పిచ్ బంతికి బ్యాట్స్‌మన్ శరీరంలో ఎక్కడ తగిలినా పరుగు తీయవచ్చనే నిబందన ఉందని పేర్కొన్నాడు. ‘నాకు తెలిసి అంపైర్‌కు ఐసీసీ నిబంధనల బుక్ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్ సమయంలో ఎవరైనా ఇవ్వండి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఈ వివాదంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. You make the call - should this be a dead ball? #AUSvNZ pic.twitter.com/CMp4Q9AHvW — #7Cricket (@7Cricket) December 26, 2019 Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1 — Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019 -
110 దగ్గర మొదలెట్టాడు.. 8కి చేరాడు
మార్నస్ లబుషేన్ క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లబుషేన్ గురించి రెండు మాటల్లో చెప్పాలంటే స్టీవ్ స్మిత్ వంటి బ్యాటింగ్ స్టైల్.. విరాట్ కోహ్లిలా పరుగుల ప్రవాహం. గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు... ఈ ఏడాది చివర్లో అదే పాక్ సిరీస్ ముగిసే సరికి టాప్-10లో ఉన్నాడు. ఏడాది ముగిసే సరికే ఈ ఆసీస్ క్రికెటర్ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇప్పటివరకు ఆడింది కేవలం 11 టెస్టులే. కానీ 53.53 సగటుతో 910 పరుగుల సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో డేవిడ్ వార్నర్‌తో పోటీ పడి మరీ పరుగుల సాధించాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో 110వ స్థానంతో ఈ ఏడాది ఆటను ఆరంభించిన లబుషేన్.. ఏడాది ముగిసే సరికి టాప్ టెన్‌లో నిలిచాడు. ఈ విషయాన్ని ఐసీసీ ముఖ్యంగా ప్రస్తావిస్తూ ప్రత్యేక ట్వీట్ చేసింది. బాల్ ట్యాంపరింగ్ చేయడంతో డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. అప్పుడు జట్టులోకి అడుగుపెట్టాడు లబుషేన్. స్వతహాగా లెగ్ స్పిన్నరైన అతడు బ్యాటింగ్‌లోనూ సమర్థుడు. ఐతే 8 ఇన్నింగ్సుల్లో 26.25 సగటుతో 210 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. నిషేధం తర్వాత యాషెస్ సిరీస్‌లో స్మిత్ పునరాగమనంతో లబుషేన్ తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అయితే లార్డ్స్ టెస్టులో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్ సత్తా చాటాడు. దీంతో అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సిరీస్‌లో మూడు అర్దశతకాలు సాధించిన లబుషేన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో బ్రిస్బేన్ టెస్టులో 185, అడిలైడ్‌లో 162 పరుగులు చేసి ఆసీస్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. లబుషేన్ ట్యాలెంట్‌ను పసిగట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతోంది. ఇక ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న లబుషేన్ తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పటికే 910 పరుగులు సాధించిన లబుషేన్ 2019 క్యాలెండర్ ఇయర్ 1000 పరుగుల మైలురాయిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 12 నుంచి న్యూజిలాండ్‌తో ఆసీస్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌లో రాణించి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని స్టీవ్ స్మిత్ ఆరాటపడుతుండగా.. ఈ ఇయర్ క్యాలెండర్లో అత్యధిక పరుగుల సాధించాలని లబుషేన్ తెగ ఉత్సాహంగా ఉన్నాడు. Marnus Labuschagne's rankings in the @MRFWorldwide ICC Test Batting charts 👇 🔸 Start of 2019: 1⃣1⃣0⃣ 🔸 December 2019: 8⃣ pic.twitter.com/FiYrK5EqYt — ICC (@ICC) December 4, 2019 -
కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్..
దుబాయ్ : ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా వెలుగుతున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఖాతాలో మరో మణిహారం వచ్చి చేరింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఘోరంగా విపలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో దక్షిణాప్రికాపై డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్.. ఆ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 774 పరుగులు రాబట్టి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అంతేకాకుండా అప్పటివరకు నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న కోహ్లిని పక్కకు నెట్టి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా పాక్ సిరీస్‌లో (4, 36) విఫలమైన స్మిత్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అయితే డిసెంబర్ 12 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో స్మిత్ రాణించినట్లయితే కొత్త సంవత్సరంలో ఆగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక పాక్ టెస్టులో స్మిత్ విఫలమైనా డేవిడ్ వార్నర్, లబుషేన్‌లు రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ట్రిపుల్ సెంచరీ సాధించిన వార్నర్ 12 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. వార్నర్‌కు పోటీ పడి పరుగులు సాధించిన మరో ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ కూడా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో 110వ స్థానంలో ఉన్న లబుషేన్.. ఏడాది చివరికి టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. వార్నర్ ఐదో స్థానానికి చేరుకోవడంతో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆరో స్థానానికి పడిపోయాడు. ఇక కోహ్లి, రహానేలతో పాటు మరో టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా(4) టాప్ 10లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 900 పాయింట్లతో ఆగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా 839 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వరుసగా రెండు టెస్టు సిరీస్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 9వ స్థానాన్ని కపాడుకోగా.. మహ్మద్ షమీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఆల్‌రౌండర్ల జాబితాలో జాసన్ హోల్డర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. పాక్ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తో మెరిసిని మిచెల స్టార్క్ ఆరో స్థానానికి ఎగబాకాడు. ఇక వరుస టెస్టు సిరీస్ విజయాలతో టీమిండియా 120 పాయింట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. Virat Kohli back to No.1! David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting. Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL — ICC (@ICC) December 4, 2019 -
పాక్‌ను చెడుగుడాడుకున్న స్మిత్
కాన్బెర్రా : కెప్టెన్ మారినా.. ప్రదర్శనలో మార్పురాలేదు. స్వదేశంలో శ్రీలంక చేతిలో ఘోర పరాభావం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారీ ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సారథిని మార్చి ఆస్ట్రేలియా పర్యటనకు పాక్‌ను జట్టును పంపింది. అయితే ఆసీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడంతో మార్పులు పనిచేశాయని పాక్ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. తొలి టీ20కి వరణుడు అడ్డుపడటంతో ఆ మ్యాచ్ రద్దయింది. అయితే మంగళవారం జరిగిన రెండో టీ20లో పాక్ చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్ దెబ్బకు విలవిల్లాడింది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ పాక్ బౌలర్లను చెడుగుడాడుకున్నాడు. దీంతో రెండో టీ20లో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమన్(2), హారిస్ సోహైల్(6), రిజ్వాన్(14), ఆసిఫ్ అలీ(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సారథి బాబర్ అజమ్(50; 38 బంతుల్లో 6 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో ఇఫ్తికర్ అహ్మద్ (62 నాటౌట్, 34 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పాక్ కనీసం గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఆసీస్ బౌలర్లలో ఆస్టన్ ఆగర్ రెండు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్, రిచర్డ్‌సన్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (80 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) ఆసీస్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. వార్నర్(20), ఫించ్(17), బెన్ మెక్‌డెర్మాట్(21)లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినప్పటికీ స్మిత్‌కు తోడుగా నిలుచున్నారు. దీంతో ఆసీస్ విజయం సలుభతరమైంది. ఇక పాక్ బౌలర్లలో ఇర్ఫాన్, వసీమ్, ఆమిర్‌లో తలో వికెట దక్కించుకున్నారు. ఇక ఈ సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో టీ20 శుక్రవారం పెర్త్ వేదికగా జరగనుంది. -
ఇంగ్లండ్‌కు మరో పరీక్ష
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో సొంతగడ్డపై తొలి టెస్టులో భారీ తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో పరీక్ష. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి ఆ జట్టు ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడనుంది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో యాషెస్ బరిలో దిగిన ఆతిథ్య జట్టుకు మొదటి టెస్టులో తలబొప్పి కట్టింది. తమతో పోలిస్తే బలహీనంగా ఉన్న ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చేలా కనిపించిన ఇంగ్లండ్ తర్వాత స్టీవ్ స్మిత్‌ను అడ్డుకోలేక చేతులెత్తేసి ఏకంగా 251 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు అసలు ముప్పు స్మిత్‌తోనే. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ గాయంతో దూరమైనందున యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రం ఖాయమైంది. దీనికిముందే ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై వేటు వేసిన ఇంగ్లండ్... 12 మంది సభ్యుల జట్టులో స్పిన్నర్ జాక్ లీచ్‌కు చోటిచ్చింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ జో రూట్ పైనే భారం వేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్, రోరీ బర్న్స్లతో పాటు బట్లర్, బెయిర్‌స్టో రాణిస్తేనే ప్రత్యర్థికి సవాల్ విసరగలుతుంది. పునరాగమనంలో స్మిత్ రెండు శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా లయ అందుకుంటే కంగారూలకు తిరుగుండదు. ఉస్మాన్ ఖాజా, ట్రావిస్ హెడ్, మాధ్యూ వేడ్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కమిన్స్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తుండగా, స్పిన్నర్ లయన్ తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. పేసర్ ప్యాటిన్సన్కు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా... మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్‌లతో 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టెస్టులోనూ ఓడితే సిరీస్‌లో ఇంగ్లండ్ పుంజుకోవడం కష్టమే. యాషెస్ చరిత్రలో తొలి టెస్టు ఓడినా ఆ జట్టు సిరీస్ నెగ్గిన సందర్భాలు (1981, 2005) రెండే ఉండటం గమనార్హం. -
బట్లర్ బుల్లెట్ త్రో.. స్మిత్ షాక్!
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో జోస్ బట్లర్ తన సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(85)ను బట్లర్ తన బుల్లెట్ త్రోతో అవుట్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కీపర్ వైపు వెళ్లడంతో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న స్టార్క్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆలస్యంగా స్పందించిన స్మిత్ అవతలి ఎండ్‌లోకి చేరోలోపే బట్లర్ బంతిని డైరెక్ట్‌గా వికెట్లపైకి విసిరాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా బట్లర్ సూపర్ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక స్టార్క్ తప్పిదానికి స్మిత్ బలయ్యాడంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఇంగ్లండ్ బౌలర్లు వణుకుపుట్టించారు. అయితే స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీలు రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. -
బట్లర్ బుల్లెట్ త్రో..
-
టీమిండియా ఫ్యాన్స్‌పై పాక్ సారథి సెటైర్
టాంటాన్ : పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. వీలుచిక్కినప్పుడల్లా తన నోటికి పనిచెబుతూ వార్తల్లో నిలుస్తాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘పాక్ ఫ్యాన్స్ క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లను గౌరవిస్తారు. స్మిత్‌ను గత మ్యాచ్‌లో కొందరు ఎగతాళి చేసినట్లు తెలిసింది. కానీ పాక్ ఫ్యాన్స్ అలా ఎప్పటికీ చేయరు. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను కించపరిచేలా మా వాళ్లు ప్రవర్తించరు’అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ అభిమానులు కొందరు స్మిత్ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అయితే ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే సర్ఫరాజ్ అలా మాట్లాడాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాను గేలి చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని సర్ఫరాజ్ ఎదురుచూస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. చదవండి: బెయిల్స్ పడకపోవడం ఏంట్రా బాబు! మావాళ్ల తరఫున సారీ స్మిత్ : కోహ్లి -
ఈ క్యాచ్ చూస్తే.. ‘సెల్యూట్’ చేయాల్సిందే
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కరేబియన్ బౌలర్ థామస్ వేసిన 45 ఓవర్ రెండో బంతిని స్టీవ్ స్మిత్ ఫైన్ లెగ్ వైపు భారీ షాట్ ఆడతాడు. అక్కడ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఐతే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో స్మిత్‌తో సహా ఆసీస్ ప్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఇక వృత్తిరీత్యా సోల్జర్ అయిన కాట్రెల్.. ఈ సూపర్ క్యాచ్ అందుకోవడంతో కామెంటేటర్ల్ అతడికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాట్రెల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘వికెట్ తీసిన వెంటనే సెల్యూట్ చేసే కాట్రెల్‌కు.. ఈ క్యాచ్‌తో మనం అతడికి సెల్యూట్ చేయాల్సిందే’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లలో వికెట్ తీసిన వెంటనే సెల్యూట్ చేస్తూ అతడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్‌లో కాట్రెల్ సెల్యూటే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. -
కాట్రెల్ బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్
-
తడబడి నిలబడిన ఆసీస్
నాటింగ్‌హామ్ : ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ బ్యాటింగ్‌లో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ ఆటగాళ్లలో కౌల్టర్ నైల్(92; 60 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(73; 103 బంతుల్లో 7ఫోర్లు), కేరీ(45) మినహా అందరూ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కరేబియన్ బౌలర్లలో బ్రాత్‌వైట్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. థామస్, కాట్రెల్, రసెల్‌లు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. స్థానిక ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని చాటుతూ.. ఆరంభం నుంచి ఆ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. పదునైన విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి ఫించ్(6)తో సహా వార్నర్(3), ఖవాజా(13), మ్యాక్స్‌వెల్(0), స్టొయినిస్(19)లు పూర్తిగా విఫలమవ్వడంతో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్మిత్ రాణించగా.. కౌల్టర్ నైల్ రెచ్చిపోగా ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్టీవ్ స్మిత్. ఆరో వికెట్‌కు అలెక్స్ కేరీ(45)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. కేరీ ఔటైన అనంతరం కౌల్టర్ నైల్ క్రీజులోకి రావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కౌల్టర్ నైల్.. విండీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కౌల్టర్ నైల్ ఊపు చూసి గేర్ మార్చిన స్మిత్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంరతం స్మిత్‌ను ఔట్ చేసి ఈ జోడిని థామస్ విడదీస్తాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న కౌల్టర్ నైల్ పయనం 92 పరుగుల వద్దే ముగుస్తుంది. -
ప్రపంచకప్: అందరి దృష్టి వారిపైనే
బ్రిస్టల్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో సంచలనాల అఫ్గానిస్తాన్ తలపడుతోంది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధం అనంతరం స్టీవ్ స్మిత్, వార్నర్‌లకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది. స్థానిక కౌంటీ గ్రౌండ్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, టాస్ గెలిచిన అఫ్గాన్ సారథి గుల్బదిన్ నైబ్ ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. అరంగేట్రం చేసిన గత ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్... స్కాట్లాండ్ను ఓడించి ఖాతా తెరిచింది. ఆరు మ్యాచ్‌లాడి మిగతా ఐదింటా ఓడింది. ఇప్పుడు మాత్రం తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు తహతహలాడుతున్న ఈ జట్టు... వీలైనన్ని మ్యాచ్‌లు గెలవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ అఫ్గాన్ సంచలనాలు నమోదు చేస్తుందని జోస్యం చెప్పాడు. దీంతో అఫ్గాన్ ఏ ఆగ్రశ్రేణి జట్టుకు షాకిస్తుందో వేచిచూడాలి. అఫ్గాన్ ప్రధాన బలం బౌలింగే. రషీద్, ముజీబ్, నబీలతో బౌలింగ్ దుర్బేద్యంగా ఉంది. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్ గెలిచే లక్ష్యంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. వార్నర్, ఫించ్ రూపంలో ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు జట్టులో ఉన్నారు. వీరు ఆరంభంలో చెలరేగితే ఆసీస్‌కు మంచి పునాది లభిస్తుంది. మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ ఇదే ఊపును చివర్లో కొనసాగించగల సమర్థులు. వీరందరి మధ్య వారధిగా అసలైన వన్డే ఆటను ప్రదర్శించగల నైపుణ్యం స్టీవ్ స్మిత్ సొంతం. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ ఎలాంటి ప్రత్యర్థులనైనా కుప్పకూల్చగలరు. దీంతో నేటి మ్యాచ్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. తుదిజట్లు ఆఫ్గానిస్తాన్: గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజద్, దౌలత్ జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్ హష్మతుల్లా షాహిది, హమీద్ హసన్, రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్, మొహమ్మద్ నబీ. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ, కౌల్టర్‌నైల్, కమిన్స్, స్టార్క్, ఆడమ్ జంపా -
కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ట మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తోంది. వరుణుడు తెరపినివ్వడంతో టాస్కు వేశారు. అయితే మళ్లీ జల్లులు కురుస్తుండటంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు. ప్రస్తుతం ఎక్కువ సేపు వర్షం కురిస్తే మ్యాచ్‌ను కుదించే అవకాశం ఉంది. 9.15 గంటల తర్వాత ఓవర్లు కుదిస్తారు. అయితే ఈ మ్యాచ్ రాజస్తాన్‌కు ఎంతో కీలకం. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రాజస్తాన్ ప్లేఆఫ్ నుంచి తప్పుకోవడం ఖాయం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉండటంతో ఛేజింగ్‌కే స్మిత్ మొగ్గు చూపాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. టర్నర్ స్థానంలో స్పిన్నర్ మహిపాల్ లామ్రోర్‌కు తుదిజట్టులోకి తీసుకుంది. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్‌నుంచి తప్పుకోవడంతో ఈ మ్యాచ్‌లో పలు ప్రయోగాలు చేసింది. పవన్ నేగిని తుది జట్టులోకి తీసుకోగా.. శివం దుబెను పక్కకు పెట్టి కుల్వంత్ ఖేజ్రోలియా అవకాశం కల్పించింది.. ఆర్సీబీకి ఇంకా అవకాశం ఉన్నట్టేనా.. 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు దాదాపుగా నిష్క్రమించినట్లే. కాకపోతే సాంకేతికంగా ఆ జట్టు ఇంకా రేసులోనే ఉంది. ఆరు విజయాలతో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. కాకపోతే.. పంజాబ్.. కోల్‌కతా చేతిలో ఓడి చెన్నైపై గెలవాలి.. కోల్‌కతా, సన్‌రైజర్స్‌లపై ముంబయి నెగ్గాలి.. రాజస్థాన్.. బెంగళూరు చేతిలో ఓడి, దిల్లీపై విజయం సాధించాలి.. బెంగళూరు తన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించాలి. అద్భుతాలు జరిగి ఈ సమీకరణాలన్నీ సాధ్యమైతే.. పంజాబ్, కోల్‌కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు ఆరు విజయాలతో సమానంగా నిలుస్తాయి. వీటిలో మెరుగైన రన్‌రేట్ ఉన్న ఒక జట్టు నాలుగో బెర్తును సొంతం చేసుకుంటుంది. రాజస్తాన్‌కు చావోరేవో.. రాజస్తాన్ రాయల్స్‌ది చాలా కఠినమైన స్థితి. నెట్ రన్‌రేట్‌లో వెనకబడ్డ రాజస్థాన్ రెండు మ్యాచ్‌లను ఇంటి బయట ఆడనుంది. బెంగళూరు, దిల్లీలపై విజయం సాధిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఇక స్టీవ్ స్మిత్‌కు ఈ సీజన్‌కు చివరి మ్యాచ్ ఇదే కానుంది. ప్రపంచకప్ సన్నద్దత కోసం స్మిత్ ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడు. విదేశీ ఆటగాళ్లు జట్టును వీడిన నేపథ్యంలో రాజస్థాన్ మిగతా మ్యాచ్‌ల్లో అద్భుతం చేయాల్సిందే. తుదిజట్లు రాజస్తాన్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, సంజూ శాంసన్, లివింగ్ స్టోన్, రియాన్ పరాగ్, స్టువార్టు బిన్ని, మహిపాల్ లామ్రోర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, వరుణ్ ఆరోన్, థామస్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థీవ్ పటేల్, ఏబీ డివిలియర్స్, క్లాసన్, గుర్కీరత్ సింగ్, స్టొయినిస్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్వంత్ ఖేజ్రోలియా, చహల్. -
ఢిల్లీ జోరుకు రాజస్తాన్ నిలిచేనా?
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో రసవత్తర పోరుకు స్థానిక సవాయ్ మాన్సింగ్ మైదానం వేదికయింది. జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయాస్ అయ్యర్ రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు రాజస్తాన్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. కాగా ఢిల్లీ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. స్పిన్నర్ లామ్చెన్ను తప్పించి క్రిస్ మోరిస్‌కు అవకాశం కల్పించింది. జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌పై సంచలన విజయం నమోదు చేసిన రాజస్తాన్ ఆదే ఊపును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. స్మిత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లో సమష్టి విజయం అందుకున్న రాజస్తాన్.. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనూ రాణించాలని కోరుకుంటోంది. అంతేకాకుండా ఇప్పటినుంచి రాజస్తాన్‌కు ప్రతీ మ్యాచ్ చావోరేవో వంటిదే. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన స్మిత్ సేనకు ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టమవుతాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని ఢిల్లీ భావిస్తోంది. దీంతో జైపూర్‌లో నేడు ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. తుదిజట్లు ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కోలిన్ ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, రుథర్ఫర్డ్, అక్షర్‌పటేల్, కగిసో రబడ, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ రాజస్తాన్ రాయల్స్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, టర్నర్, స్టువార్టు బిన్ని, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కత్, కులకర్ణి -
రాజస్తాన్ చిత్తు చిత్తుగా..
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్థానిక సవాయ్ మాన్ సింగ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆధిపత్యమే నడిచింది. మొదట బౌలింగ్‌లో రాజస్తాన్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయగా.. అనంతరం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. సమిష్టి కృషితో ఆకట్టుకున్న కేకేఆర్ ఆతిథ్య రాజస్తాన్‌పై అతిసునాయసంగా గెలిచింది. రాజస్తాన్ నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. మరో 37 బంతులు మిగిలుండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఛేదనలో సునీల్ నరైన్(47), క్రిస్ లిన్(50) బ్యాట్ ఝుళిపించారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే ఔటైనప్పటికీ ఊతప్ప(26), గిల్(6)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి జట్టుకు విజయాన్నందించారు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ అజింక్యా రహానే(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం జోస్ బట్లర్‌తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత బట్లర్(37) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. అయితే స్మిత్ మాత్రం నిలకడగా ఆడాడు. రాహుల్ త్రిపాఠీతో కలిసిన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. రాజస్తాన్ స్కోరు 105 పరుగుల వద్ద త్రిపాఠి(6) ఔట్ అయ్యాడు. కాగా, స్మిత్(73 నాటౌట్; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చివర వరకూ క్రీజ్‌లో ఉండటంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో గర్నీ రెండు వికెట్లు సాధించగా, ప్రసిద్ద్ క్రిష్ణకు వికెట్ దక్కింది. -
డుప్లెసిస్‌ను కలవర పెట్టిన రింగ్‌టోన్!
జొహెన్నెస్‌బర్గ్: ట్యాంపరింగ్ వివాదంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. ఆసీస్ క్రికెటర్లకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తమతో మూడో టెస్టు సందర్భంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం గురైన తరుణంలో వారికి డుప్లెసిస్ అండగా నిలిచాడు. గురువారం జొహెన్నెస్‌బర్గ్‌లో మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్ స్మిత్‌ను మంచి వ్యక్తిగా అభివర్ణించాడు. 'నా మనసు అంతరాల్లో స్మిత్ గురించి తీవ్ర వేదనకు గురయ్యాను. రానున్న రోజులు స్మిత్‌కు చాలా కష్టంగా ఉంటాయి, అతడు ధైర్యంగా ఉండాలి. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నత విలువల కోసం స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించింది. కానీ ఆ ముగ్గురిపై తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయి' అని వారికి డుప్లెసిస్ బాసటగా నిలిచాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సమయంలో ఒక రింగ్‌టోన్ డు ప్లెసిస్‌ను కలవర పెట్టింది. వాయిస్ రికార్డు చేసే క్రమంలో టేబుల్‌పై ఉన్న జర్నలిస్టు మొబైల్‌కు ఒక కాల్ వచ్చింది. అయితే ఆ ఫోన్ రింగ్‌టోన్ కాస్త వెరైటీగా ఉండటంతో డుప్లెసిస్‌కు కాసేపు అర్ధం కాలేదు. ఆ తర్వాత అది ఫోన్ రింగ్‌టోన్ అని తెలుసుకున్న డుప్లెసిస్ నవ్వుకున్నాడు. కాసేపు ఆ మూడ్‌లోనే ఉండిపోయిన డుప్లెసిస్ దానికి ‘షాకింగ్ రింగ్ టోన్’గా నామకరణం చేశాడు. ఆపై డు ప్లెసిస్ తిరిగి మీడియా సభ్యులతో సమావేశం కొనసాగించాడు. -
వార్నర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి?
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఘటనలో తాను ఎంతగానో చింతిస్తున్నానని, అందుకు క్షమించాలని ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రపంచానికి విజ్ఞప్తి చేశాడు. తాను ఎంతో ప్రేమించే క్రికెట్‌పై తన చర్య మాయని మచ్చగా అభివర్ణించాడు. తామ చేసిన తప్పిదాలు క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీశాయని వార్నర్ అంగీకరించాడు. అయితే ప్రస్తుతం వార్నర్ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఏడాది నిషేధం విధించడంతో పాటు శాశ్వతంగా ఆసీస్ పగ్గాలు చేపట్టకుండా సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. స్మిత్‌పై ఏడాది నిషేధం మాత్రమే విధించిన సీఏ.. వార్నర్‌పై మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఒకే వ్యవహారంలో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లపై వేర్వేరుగా ఆ దేశ క్రికెట్ బోర్డు ఎందుకిలా నిర్ణయం తీసుకుందో సగటు అభిమానికి ఓ పజిల్లా మారిపోయింది. ఈ ఘటనలో తన పాత్ర ఉందంటూ కెప్టెన్ స్మిత్ అంగీకరించినప్పటికీ, వైస్ కెప్టెన్ వార్నర్‌నే టార్గెట్ చేసినట్లు కనబడింది. స్మిత్‌కు ఏడాది పాటు కెప్టెన్సీకి దూరం పెడతామని చెప్పిన సీఏ.. వార్నర్‌ను శాశ్వతంగా సారథ్య బాధ్యతలకు చేపట్టుకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో ఆసీస్ క్రికెటర్ల కాంట్రాక్ట్‌లో భాగంగా జీతాల విషయంలో సీఏతో తీవ్రంగా పోరాడటమే వార్నర్‌కు శాపంగా మారినట్లు కనబడుతోంది. ఆటగాళ్లందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సీఏను దిగివచ్చేలా చేశాడు వార్నర్. ఆసీస్ పగ్గాలను భవిష్యత్తులో వార్నర్ చేపట్టకుండా సీఏ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణమనేది క్రికెట్ ప్రేమికుల భావన. వార్నర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? మరి త్వరలోనే ఒక న్యూస్ చెబుతానంటూ సఫారీ పర్యటన నుంచి సిడ్నీకి పయనమయ్యే క్రమంలో వార్నర్ వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి. తనపై నిషేధం తగ్గుతుందని వార్నర్ భావిస్తున్నాడా?, లేక భవిష్యత్తులో ఆసీస్ పగ్గాలు చేపట్టకుండా సీఏ తీసుకున్న ముందస్తు నిర్ణయాన్ని తిరిగి సమీక్షిస్తారని నమ్ముతున్నాడా?, మొత్తం క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అదే వార్తగా చెప్పాలనుకుంటున్నాడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మద్దతు లభిస్తుందా..? ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్, కోచ్ లీమన్ వ్యాఖ్యల కంటే కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేసిన వ్యాఖ్యలే అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించడంతో పాటు బాన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. మరొకవైపు వారికి వారం రోజుల్లో అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దీనిలో భాగంగా అభిమానులు, ప్రజలు, క్రికెటర్ల మద్దతును కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఏ స్పష్టం చేసింది. ఒకవేళ వీరికి మద్దతు లభిస్తే నిషేధం తగ్గించే ఆలోచన చేస్తుందా..? అదే సమయంలో స్మిత్, వార్నర్‌ల 'కెప్టెన్సీ'పై తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమీక్షిస్తుందా? అనేది త్వరలో తేలనుంది. -
తొలిసారి పెదవి విప్పిన వార్నర్
సిడ్నీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ స్పందించాడు. ట్యాంపరింగ్‌కు సహకరించి గేమ్‌కు మాయని మచ్చ తెచ్చిన విషయాన్ని అంగీకరించిన వార్నర్.. ఇందులో తన భాగస్వామ్యం ఉన్నందుకు క్షమాపణలు చెప్పాడు. 'ఆస్ట్రేలియాలో ఉన్న క్రికెట్ అభిమానులకు, ప్రపంచంలోని అభిమానుల్ని క్షమించమని కోరుతున్నా. నేను సిడ్నీకి తిరిగి వస్తున్నా. తప్పిదాలు అనేవి క్రికెట్ అనే ఆటకు మచ్చ తెస్తూనే ఉన్నాయి. ట్యాంపరింగ్‌కు సహకరించడంలో నా భాగస్వామ్యం కూడా ఉన్నందుకు క్షమించండి. మా జట్టు ట్యాంపరింగ్ ఉదంతం కచ్చితంగా అభిమానుల్ని వేదనకు గురి చేసి ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలను. ప్రస్తుతం క్షమాపణలు మాత్రమే నేను చెప్పలగలను' అని ఉదంతం తర్వాత వార్నర్ తొలిసారి పెదవి విప్పాడు. -
డబుల్ సెంచరీతో ఇరగదీశాడు..
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 301 బంతుల్లో ద్విశతాకాన్ని సాధించి మరొకసారి సత్తా చాటాడు. 92 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన స్మిత్ విజృంభించి ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అత్యంత పరీక్షగా నిలిచి మూడో సెషన్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా యాషెస్ సిరీస్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన దిగ్గజ ఆటగాడు బాబ్ సింప్పన్ సరసన నిలిచాడు. యాషెస్‌లో ఇది స్మిత్‌కు రెండో డబుల్ సెంచరీ కాగా, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్(8) తొలిస్థానంలో, వాల్టర్ హామ్మొండ్(4) రెండో స్థానంలో ఉన్నారు. గతంలో బాబ్ సింప్సన్ కూడా యాషెస్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. కాగా, స్వదేశంలో జరిగిన యాషెస్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో నాన్ ఓపెనర్‌గా స్మిత్ గుర్తింపు పొందాడు. ఈ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్. అంతకుముందు స్మిత్ 121 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఉండగా ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగుల్ని తన ఖాతాలో వేసుకన్నాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది కూడా స్మిత్ వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించినట్లయ్యింది. 2014-17 నుంచి చూస్తే స్మిత్ ప్రతీ ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని నమోదు చేశాడు. ఇక్కడ వరుస క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యు హేడెన్(5 వరుస సంవత్సరాలు) ముందు వరుసలో ఉన్నాడు. 2001 నుంచి 2005 వరుస సంవత్సరాల్లో హేడెన్ వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించాడు. ఆ తర్వాత స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై బ్రియాన్ లారా(వెస్టిండీస్), కెవిన్ పీటర్సన్(ఇంగ్లండ్), ట్రెస్కోథిక్(ఇంగ్లండ్)లు ఉన్నారు. ఈ ముగ్గురూ మూడు వరుస సంవత్సరాల్లో మాత్రమే వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించారు. కాగా, ఈ ఏడాది వెయ్యి అంతకంటే టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో చతేశ్వర పుజారా(1140) తొలి స్థానంలో ఉండగా, డీన్ ఎల్గర్(1097) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి(1059) మూడో స్థానంలో, కరుణరత్నే(1031) నాల్గో స్థానంలో ఉన్నారు. ఆపై చండిమాల్(1003), స్టీవ్ స్మిత్(1001)లు ఉన్నారు. మరొకవైపు స్మిత్ తాజా సెంచరీతో అతను 22వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అయితే ఇక్కడ హాఫ్ సెంచరీల కంటే స్మిత్ చేసిన టెస్టు సెంచరీలే ఎక్కువగా ఉండటం విశేషం. స్మిత్ తన కెరీర్లో 21 హాఫ్ సెంచరీలు సాధించగా, 22 సార్లు హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుచుకున్నాడు. యాషెస్ మూడో టెస్టులో స్మిత్ చేసిన సెంచరీ అతనికి ఫాస్టెస్ సెంచరీగా నిలిచింది. ఈ టెస్టులో స్మిత్ సెంచరీ సాధించడానికి 138 బంతులు మాత్రమే తీసుకుని, 2015లో పెర్త్‌లో న్యూజిలాండ్‌పై 140 బంతుల్లో చేసిన సెంచరీని సవరించాడు. 92 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తన ఇన్నింగ్స్ కొనసాగించిన స్మిత్ సెంచరీ చేశాడు. -
వరుసగా నాలుగో ఏడాది కూడా..
పెర్త్:ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన రికార్డను సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న స్మిత్.. జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో సమయోచిత సెంచరీతో ఆదుకున్నాడు. మరొకవైపు స్మిత్ 121 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఉండగా ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగుల్ని తన ఖాతాలో వేసుకన్నాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది కూడా స్మిత్ వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించినట్లయ్యింది. 2014-17 నుంచి చూస్తే స్మిత్ ప్రతీ ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని నమోదు చేశాడు. ఇక్కడ వరుస క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్య హేడెన్(5 వరుస సంవత్సరాలు) ముందు వరుసలో ఉన్నాడు. 2001 నుంచి 2005 వరుస సంవత్సరాల్లో హేడెన్ వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించాడు. ఆ తర్వాత స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై బ్రియాన్ లారా(వెస్టిండీస్), కెవిన్ పీటర్సన్(ఇంగ్లండ్),ట్రెస్కోథిక్(ఇంగ్లండ్)లు ఉన్నారు. ఈ ముగ్గురూ మూడు వరుస సంవత్సరాల్లో మాత్రమే వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించారు. కాగా, ఈ ఏడాది వెయ్యి అంతకంటే టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో చతేశ్వర పుజారా(1140) తొలి స్థానంలో ఉండగా, డీన్ ఎల్గర్(1097) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి(1059) మూడో స్థానంలో, కరుణరత్నే(1031) నాల్గో స్థానంలో ఉన్నారు. ఆపై చండిమాల్(1003), స్టీవ్ స్మిత్(1001)లు ఉన్నారు. హాఫ్ సెంచరీల కంటే సెంచరీలే ఎక్కువ.. ఇక స్మిత్ తాజా సెంచరీతో అతను 22వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అయితే ఇక్కడ హాఫ్ సెంచరీల కంటే స్మిత్ చేసిన టెస్టు సెంచరీలే ఎక్కువగా ఉండటం విశేషం. స్మిత్ తన కెరీర్లో 21 హాఫ్ సెంచరీలు సాధించగా, 22 సార్లు హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుచుకున్నాడు. యాషెస్ మూడో టెస్టులో స్మిత్ చేసిన సెంచరీ అతనికి ఫాస్టెస్ సెంచరీగా నిలిచింది. ఈ టెస్టులో స్మిత్ సెంచరీ సాధించడానికి 138 బంతులు మాత్రమే తీసుకుని, 2015లో పెర్త్‌లో న్యూజిలాండ్‌పై 140 బంతుల్లో చేసిన సెంచరీని సవరించాడు. 92 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తన ఇన్నింగ్స్ కొనసాగించిన స్మిత్ సెంచరీ చేశాడు. -
యాషెస్ సిరీస్: రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం
అడిలైడ్ : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్‌లో 2-0తో స్మిత్ సేన ఆధిక్యం సాధించింది. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌నే వరించింది. 442/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227 ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆసీస్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 138 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు కేవలం 354 పరుగుల లక్ష్యమే ఏర్పడింది. కానీ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో ఆసీస్ విజయం సులువైంది. -
క్రికెట్ చరిత్రలోనే తొలి సారి..!
అడిలైడ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్ సేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం మూడు బంతుల తేడాలోనే రెండు రివ్యూలను కోల్పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న తొలి జట్టుగా నిలిచింది. కమిన్స్ వేసిన 42 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విషయంలో తొలి రివ్యూను కోల్పోయిన ఆసీస్, డేవిడ్ మాలన్ విషయంలో రెండోసారి తప్పులో కాలేసి రివ్యూను కోల్పోయింది. ఒకటి క్యాచ్ అవుట్ కోసం.. మరొకటి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరగా అంపైర్ అలీమ్‌దార్ నౌటౌట్‌గా ప్రకటించడంతో రెండు రివ్యూల అవకాశం కోల్పోయింది. గతంలో ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలును అదనంగా ఇచ్చేలా నిబంధనలు ఉండగా, ప్రస్తుతం ఇన్నింగ్స్ మొత్తం రెండే రివ్యూలు ఉండడం ఆసీస్‌ను దెబ్బతీసింది. కేవలం మూడు బంతుల్లోనూ రెండింటినీ కోల్పోయింది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. -
ఫెదరర్‌కు ఆ క్రికెటర్‌తో పోలికా?
సాక్షి, స్పోర్ట్స్ : టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్‌కు ఓ క్రికెటర్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయంట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఆస్ట్రేలియా టీం కెప్టెన్ స్టీవెన్ స్మిత్. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మార్క్ వా-రోజర్ ఫెదరర్... ఇద్దరూ తనకు ఆదర్శమని స్మిత్ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్మిత్... ‘‘ వారిద్దరి కెరీర్లో చాలా పోలికలను నేను గమనించాను. క్లిష్టమైన లక్ష్యాలను సులువుగా మార్చుకోవటంలో వారికి ఎవరూ సాటి రారు. తద్వారా వాళ్ల వాళ్ల కెరీర్లో విజయవంతమై ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు‘‘ అని స్మిత్ తెలిపాడు. టెన్నిస్ అంటే తనకు చాలా ఇష్టమన్న స్మిత్ ఫెదరర్‌కు తాను వీరాభిమానని చెప్పాడు. ఒకరకంగా తాను క్రికెట్లో రాటుదేలటానికి కూడా టెన్నిస్ సహకరించిందన్నాడు స్మిత్. ఇక స్టీవాను తన గురువుగా భావిస్తానని స్మిత్ పేర్కొన్నాడు. ఇక ఈ మధ్య సెలక్షన్ కమిటీలో స్మిత్ జోక్యం ఎక్కువైపోయిందని.. జాతీయ జట్టులో తనకి సన్నిహితంగా ఉన్న వారినే తీసుకోవాలంటూ స్మిత్, బోర్డుపై ఒత్తిడి తెస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మీడియా సమావేశంలోనే స్మిత్ వాటిని చెత్త ఆరోపణలుగా ఖండించాడు. -
'మూడు'లో ముగించాలని!
-
'మూడు'లో ముగించాలని!
సిరీస్ ప్రారంభానికి ముందు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్‌కు గట్టి పోటీయే ఎదురవుతుందని అంతా భావించారు. కానీ తాము ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నామో టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో పటిష్ట ప్రత్యర్థిని దిమ్మ తిరిగేలా చేస్తూ దెబ్బతీశారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్రత్యర్థి ఛేదించకుండా భారత బౌలర్లు కట్టడి చేస్తున్న తీరు అమోఘం. ఇదే ఊపుతో సిరీస్‌లో కీలక మ్యాచ్ అయిన మూడో వన్డేలోనూ గెలిచి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. మూడో వన్డేలోనే సిరీస్ ఖాయమైతే మిగిలిన వన్డేల్లో ప్రయోగాలకు వెళ్లాలని టీమిండియా ఆలోచిస్తోంది. ఇక విదేశాల్లో వరుసగా పది మ్యాచ్‌లు ఓడిన నిరాశలో ఉన్న స్మిత్ సేన ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గితేనే సిరీస్‌పై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో ఓపెనర్ ఆరోన్ ఫించ్ గాయం నుంచి కోలుకోవడం వారికి ఊరటనిచ్చే విషయం. ఇండోర్‌లాంటి చిన్న మైదానంలోనైనా తమ బ్యాట్స్‌మెన్ నుంచి పరుగులు రావాలని ఆ జట్టు కోరుకుంటోంది. ఇండోర్: అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత క్రికెట్ జట్టు మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా ముగించిన ఉత్సాహంతో ఉన్న కోహ్లి బృందం నేడు కీలకమైన మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. గెలిస్తే సిరీస్ దక్కుతుంది కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకూడదనే భావనలో ఉంది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించింది బౌలర్లే అని చెప్పవచ్చు. పేస్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా ముప్పేట దాడి చేస్తుండటంతో ఆసీస్ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. తొలి మ్యాచ్‌లో 164 (21 ఓవర్లలో), కోల్‌కతా పిచ్‌పై 252 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఆస్ట్రేలియాను ఛేదించకుండా భారత బౌలర్లు కంగారెత్తించారు. భారత బౌలర్ల ధాటికి ఎలా పరుగులు చేయాలో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌కు అర్థం కావడం లేదు. తొలి వన్డేలో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇక కోల్‌కతా వన్డేలో నలుగురు మాత్రమే పదేసి పరుగులు దాటగలిగారు. దీంతో అన్ని విభాగాల్లో విఫలమవుతున్న ఆసీస్‌కు ఈ మ్యాచ్ అతి కీలకంగా మారింది. చేజారితే సిరీసే పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ నెగ్గి తీరాలనే కసితో ఉంది. నంబర్ ఫోర్ ఎవరు? రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్ల నుంచి వంద శాతం అద్భుత ప్రదర్శన వచ్చినా భారత మిడిలార్డర్లో కాస్త నిలకడలేమి కనిపిస్తోంది. చెన్నై వన్డేలో ఈ విభాగం అనూహ్యంగా కుప్పకూలింది. పాండ్యా, ధోనిల నుంచి సూపర్ బ్యాటింగ్ రావడంతో గట్టెక్కింది. నాలుగో నంబర్లో బరిలోకి దిగుతున్న మనీష్ పాండే, కేదార్ జాదవ్‌ల నుంచి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆశించిన ఆటతీరు రాలేదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని నాలుగు, ఐదో స్థానాలను పటిష్టపర్చాలనే ఆలోచనలో టీమ్ మేనేజిమెంట్ ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించని పాండేను తొలగించి కేఎల్ రాహుల్‌కు అవకాశమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా రోహిత్, రహానే ఫర్వాలేదనిపిస్తుండగా కోహ్లి, ధోని ఫామ్ కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా కీలక సమయాల్లో అటు బ్యాట్‌తోనూ... ఇటు బంతితోనూ రాణించి అసలైన ఆల్‌రౌండర్‌గా నిలుస్తున్నాడు. ఇక చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆసీస్‌కు అర్థం కావడం లేదు. భారత్ నుంచి వన్డేల్లో హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్‌గా నిలిచిన కుల్దీప్ ఈ మ్యాచ్‌లోనూ కీలకమే. భువనేశ్వర్, బుమ్రా ఆరంభంలో... చివర్లో తమ బౌలింగ్‌తో ఇబ్బంది పెడుతున్నారు. భారత్‌ను ఎదుర్కోవడమెలా? ఇప్పుడు ఇదే ఆసీస్‌ను వెంటాడుతున్న సమస్య. బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడలేమి జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వార్నర్, స్మిత్‌పైనే అధికంగా ఆధారపడడం కూడా దెబ్బతీస్తోంది. అయితే స్మిత్ ఫామ్‌లోనే ఉన్నా వార్నర్, మ్యాక్స్‌వెల్‌ల నుంచి మెరుపు ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ ఫించ్ గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో 20 నిమిషాలసేపు ప్రాక్టీస్ చేయగలిగాడు. దీంతో అతను కూడా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే వారి బ్యాటింగ్ లైనప్ పటిష్టమవుతుంది. అలాగే హ్యాండ్స్కోంబ్ కూడా కీపింగ్ ప్రాక్టీస్ చేయడంతో వేడ్‌కు స్థానం కష్టమే. పేసర్లు కూల్టర్ నీల్, కమిన్స్ మెరుగ్గానే రాణిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా రెండు వికెట్లు మాత్రమే తీసిన లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆసీస్‌ను నిరాశ పరుస్తున్నాడు. అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ ఆస్టన్ ఏగర్ను ఆడించే అవకాశాలున్నాయి. ► 4 భారత్ ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించింది. ► 9 ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే వరుసగా తొమ్మిది మ్యాచ్‌లను రెండోసారి గెలిచినట్టవుతుంది. ► 41 మరో 41 పరుగులు చేస్తే అత్యంత వేగంగా (35ఇన్నింగ్స్) రెండు వేల పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)ను కోహ్లి అధిగమిస్తాడు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రహానే, పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, వార్నర్, హెడ్, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కమిన్స్, కూల్టర్ నిల్, రిచర్డ్సన్, జంపా/ఏగర్. పిచ్, వాతావరణం తక్కువ దూరంలోనే బౌండరీ ఉండటంతోపాటు ఫ్లాట్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం కానుంది. సిరీస్‌లో తొలిసారిగా 300 పరుగులకు పైగా పరుగులు వచ్చే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించే పరిస్థితి లేదు. -
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్.. స్టీవ్ స్మిత్ రియాక్షన్
సాక్షి, కోల్‌కతా: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసికట్టుగా రాణించిన టీమిండియా సిరీస్‌లో మళ్లీ పైచేయి సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఉంది. టీమిండియా మరో సారి సత్తా చాటినా.. భారత యువ సంచలనం కుల్దీప్ యాదవ్ పైనే అందరిదృష్టి ఉంది. కుల్దీప్ అద్బుత హ్యాట్రిక్ ఫీట్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ స్పందించారు. 'కుల్దీప్ చాలా మంచి బంతులు వేశాడు. అతడి సగం ఓవర్ల కోటా ముగిసేవరకూ మేమే అతడిపై ఆధిపత్యం చెలాయించాం. కానీ బంతి గమనాన్ని ఎక్కువగా అంచనా వేయాలన్న తమ బ్యాట్స్మెన్ల తప్పిదం వల్ల కుల్దీప్ చేతికి చిక్కారు. హ్యాట్రిక్ వీరుడు కుల్దీప్ బౌలింగ్‌లో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. టర్న్‌ను గమనించి స్వేచ్ఛగా పరుగులు సాధించాను. మా ఆటగాళ్లు బంతి చాలా దగ్గరగా వచ్చేవరకూ ఎదురుచూసి షాట్లు ఆడాలనుకోవడం మా కొంపముంచింది. ఒకవేళ బంతి గమనాన్ని అంచానా వేశాక ఎలా ఆడాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోయాం. ముఖ్యంగా టాపార్డర్ నలుగురిలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితే ఏ జట్టయినా విజయాలు సాధిస్తుంది. కానీ, రెండో వన్డేలో కూడా అలా జరగలేదు. స్టోయినిస్ రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది. ఇతర బ్యాట్స్మెన్లు స్టోయినిస్లా కూల్‌గా ఆడితే సిరీస్‌లో ఈ మ్యాచ్‌తోనైనా బోణీకొట్టేవాళ్లమంటూ' ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివరించారు. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేసి హ్యాట్రిక్ వికెట్ల ఫీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు అదృష్టం కలిసిరావడం లేదు. వరుణుడు మరోసారి కంగారులను దెబ్బతీశాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కుండపోతగా కురిసిన వర్షంతో ఈ మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గెలిచే మ్యాచ్‌లోనూ చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వరుణుడు విరుచుకుపడటంతో ఆ మ్యాచ్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అప్పుడు కూడా ఒక పాయింట్‌తో ఆసీస్ సరిపెట్టుకుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండుపాయింట్లతో ఉన్న కంగారులు.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే ఇంగ్లండ్‌తో జరగనున్న తమ చివరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు వర్షం బంగ్లాదేశ్‌కు కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కనుక ఓడి ఉంటే ఆ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకునేది. వర్షం మింగేసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 182 పరుగులకే కుప్పకూలింది. పేసర్ మిషెల్ స్టార్క్ (4/29) డెత్ ఓవర్లలో చేసిన మాయాజాలానికి ఆ జట్టు కుదేలైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలింది. షకీబ్ (48 బంతుల్లో 29; 2 ఫోర్లు), మిరాజ్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జంపాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన అనంతరం వర్షం ఆటంకంతో మ్యాచ్ ఆగింది. క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు. మరో నాలుగు ఓవర్లు మ్యాచ్ కొనసాగి ఉంటే ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌ను వరించేది. కనీసం 20 ఓవర్లు ఆడితే.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అప్పటికే దూకుడు మీద ఉన్న ఆస్ట్రేలియాకు విజయం లభించేది. కానీ వరుణుడు ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఎంపైర్లు ఇక మ్యాచ్ జరగడం వీలుకాదని తేల్చేసి..చేరో పాయింట్ పంచారు. -
ఇండియా బౌలింగ్
పుణే: భారత్ తో గురువారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్ కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని స్మిత్ తెలిపాడు. టీ20 మ్యాచ్ లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ సిరీస్ కు బాగా ప్రాక్టీస్ చేశామన్నాడు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. ఎటువంటి అంచనాలు లేకుండానే టాస్ కు వచ్చానని టీమిండియా కెప్టెన్ కోహ్లి తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో జయంత్ యాదవ్ ను తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జయంత్, అశ్విన్, జడేశాలతో తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందన్నాడు. -
స్మిత్ అజేయ శతకం
మూడో వన్డేలో ఆసీస్ విజయం పెర్త్: కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (104 బంతుల్లో 108 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సహాయంతో పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే కెరీర్లో తొలి వన్డే ఆడిన పీటర్ హ్యాండ్స్ కోంబ్ (84 బంతుల్లో 82; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆసీస్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 22న నాలుగో వన్డే సిడ్నీలో జరుగుతుంది. తొలుత పాక్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 263 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (100 బంతుల్లో 84; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజెల్‌వుడ్‌కు మూడు, హెడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్ 45 ఓవర్లలో మూడు వికెట్లకు 265 పరుగులు చేసి నెగ్గింది. 45 పరుగులకు రెండు వికెట్లు పడిన దశలో స్మిత్, హ్యాండ్స్ కోంబ్ జోడి అదరగొట్టింది. మూడో వికెట్‌కు ఏకంగా 183 పరుగులు జోడించారు. ఆమిర్, జునైద్, హసన్ లకు ఒక్కో వికెట్ దక్కింది. -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు వేల పరుగుల్ని వేగంగా సాధించిన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో స్మిత్ మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆ ఘనతను వేగవంతంగా సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ ఆటగాళ్లు మైకేల్ బెవాన్, బెయిలీలను స్మిత్ అధిగమించాడు. మూడు వేల వన్డే పరుగుల్ని చేయడానికి బెవాన్, బెయిలీలకు 80 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, స్మిత్ తన 79 వ ఇన్నింగ్స్ లో ఆ మార్కును చేరాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్(108 నాటౌట్;104 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పాక్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో స్మిత్ ఆదుకున్నాడు. హ్యాండ్ స్కాంబ్(82;84 బంతుల్లో 6 ఫోర్లు) తో కలిసి మూడో వికెట్ కు 183 పరుగుల భాగస్వామ్యాన్నిసాధించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. వీరిద్దరూ రాణించడంతో ఆసీస్ 45. 0 ఓవర్లలో నే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆసీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో ఆసీస్ గెలవగా, రెండో వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఐదు వన్డేల సిరీస్ లో నాల్గో మ్యాచ్ ఆదివారం జరుగనుంది. -
స్మిత్ సూపర్ సెంచరీ
ఆస్ట్రేలియా చేతిలో కివీస్ చిత్తు సిడ్నీ: చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 68 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా చేతిలో 0-5 తేడాతో చిత్తుగా వన్డే సిరీస్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియాకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (157 బంతుల్లో 164; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్లో ఇది ఏడో సెంచరీ. స్మిత్‌కు ట్రెవిస్ హెడ్ (60 బంతుల్లో 52; 5 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 44.2 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. మార్టిన్ గప్టిల్ (102 బంతుల్లో 114; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) కెరీర్లో 11వ సెంచరీ సాధించినా, జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. చివర్లో మున్రో (49) ఫర్వాలేదనిపించాడు. హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో మూడో వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే మంగళవారం కాన్బెర్రాలో జరుగుతుంది. -
ఇక్కడ కూర్చోవాలంటేనే చిరాకుగా ఉంది:క్రికెట్ కెప్టెన్
హోబార్ట్:కోపం, చిరాకు, అసహనం, అసంతృప్తి, మనోవేదన.. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు ఆసీస్ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లో తారాస్థాయికి చేరాయి. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తో కోల్పోయిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్రమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నానో తెలియడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ విశ్లేషణలో భాగంగా ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో స్మిత్ తన అసంతృప్తిని బహిర్గతం చేశాడు. ' క్రికెట్ మ్యాచ్‌ను గెలవాలనే కసి మాలో లోపించింది. అది ఏ రకమైన క్రికెట్ మ్యాచ్ అయినా కావొచ్చు. మాలో పూర్తిగా నిలకడ లేదు. తొలి ఇన్నింగ్స్ లో 85కు ఆలౌట్ కావడం ఒకటైతే, ఈరోజు ఆటలో సుమారు 30 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కోల్పోయాం. నిజాయితీగా చెబుతున్నా. ఇక్కడ కూర్చుని మాట్లాడాలంటేనే చాలా చిరాకుగా ఉంది. ప్రస్తుతం మా జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని కఠినమైన సవాళ్లను ఎలా అధిగమించాలో తెలియన అయోమయ స్థితిలో మా క్రికెటర్లు ఉన్నారు.గెలుపు కోసం ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసి బరిలోకి దిగినా, వాటిని ఫీల్డ్ లో సక్రమంగా అమలు చేయడం లేదు. కనీసం క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయడం లేదు. ఏవో కొన్ని భాగస్వామ్యాలు నమోదైనా అవి సరిపోవు. మేము మెరుగైన క్రికెట్ ఆడటం లేదు' అని స్మిత్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తమ ఓటముల్లో కోచ్ డారెన్ లీమన్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్మిత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. గత కొంతకాలంగా తమ జట్టు సాధించిన అనేక ఘన విజయాల్లో లీమన్ పాత్ర వెలకట్టలేనిదన్నాడు. -
స్మిత్, మార్ష్ సెంచరీలు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ షాన్ మార్ష్ సెంచరీలు సాధించారు. ఆట మూడో రోజు డ్రింక్స్ విరామ సమయానికి ఆసీస్ 3 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. మార్ష్ 281 బంతుల్లో 19 ఫోర్లతో 130 పరుగుల చేయగా, స్మిత్ 218 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 119 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 246 పరుగులు జత చేసి లంకపై ఏ వికెట్ కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని సాధించారు. మార్ష్ కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై రెండోది. స్మిత్ 15వ టెస్టు సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. మొదటి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన ఆస్టేలియా ఈ మ్యాచ్ లో గెలిచి వైట్ వాష్ తప్పించుకోవాలన్న పట్టుదలతో ఆడుతోంది. -
'చెత్త బ్యాటింగే మా కొంపముంచింది'
పల్లెకెలె: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చాలా అసహనంతో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగుల ఆధిక్యంలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులకే ఆలౌటవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాట్స్ మన్ చెత్త ఆట ఆటడం వల్లే ఆసీస్ కు ఓటమి తప్పలేదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో క్రమశిక్షణ లోపించడం వల్లే 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోయామని ఆసీస్ కెప్టెన్ వెల్లడించాడు. ఉపఖండంలో ఆట చాలా జాగ్రత్తగా ఆడాలని జట్టును హెచ్చరించాడు. బౌలర్లు శక్తివంచన లేకుండా పోరాటం చేశారని ప్రశంసించాడు. ఓ వైపు 17 ఏళ్ల తర్వాత తమ జట్టుపై లంకేయులు విజయం సాధించామని సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు తన కెప్టెన్సీలో తొలి ఓటమి కావడంతో ఆందోళన చెందుతున్నాడు. హెరాత్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడంపై స్పందిస్తూ.. ఉపఖండం పిచ్ అంటేనే స్పిన్నర్లకు స్వర్గధామమని పేర్కొన్నాడు. చివర్లో నెవిల్, కీఫ్ తొమ్మిదో వికెట్‌కు 178 బంతులు ఎదుర్కొని పోరాటం సాగించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి నమోదయిన ఏకైక హాఫ్ సెంచరీ స్టీవ్ స్మిత్ చేశాడు. -
ధోని సేనకు దెబ్బమీద దెబ్బ
పుణే: ఐపీఎల్ లో ఎంఎస్ ధోని సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కు దెబ్బమీద తగులుతోంది. గాయాలతో విదేశీ స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగారు. వీరి సరసన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. మణికట్టు గాయంతో స్మిత్ ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధ పడుతున్న అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. వరుసగా స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో పుణే విజయావకాశాలపై ఆ ప్రభావం పడుతోంది. ఆరంభ మ్యాచుల్లో ఆకట్టుకోని స్మిత్ తర్వాత పుంచుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాడు. ఇలాంటి సమయంలో అతడు టీమ్ కు దూరం కావడంతో పుణేకు ప్రతికూలంగా మారే అవకాశముంది. -
ఖాజా జట్టులో లేకపోవడంపై స్మిత్ విచారం
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కు ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖాజాను ఎంపిక చేయకపోవడంపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ విచారం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు ఆరోన్ ఫించ్ గాయం కారణంగా దూరం కావడంతో ఖాజాకు పిలుపు అందినా తొలి మ్యాచ్ లో అతని చోటు దక్కకపోవడం తనను విస్మయానికి గురి చేసిందన్నాడు. ఖాజా ఒక మంచి ఆటగాడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడని స్మిత్ కొనియాడాడు. ఇది కేవలం పొరపాటు వల్ల జరిగింది మాత్రమేనని సంజాయిషీ ఇచ్చుకునే యత్నం చేశాడు. మిగతా రెండు వన్డేలలో అతనికి కనీసం ఒక మ్యాచ్‌లోనైనా అవకాశం ఇస్తామని స్మిత్ భరోసా ఇచ్చాడు. అతను బంతిని హిట్ చేసే విధానం చాలా ముచ్చటగా ఉంటుందని ఈ సందర్భంగా స్మిత్ పేర్కొన్నాడు. అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్ల ఎంపిక చాలా క్లిష్టతరంగా మారిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇటీవల కాలంలో న్యూజిలాండ్, విండీస్ జట్లతో ఆడిన నాలుగు టెస్టుల్లో ఖాజా మూడు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో పాటు బిగ్ బాష్ లీగ్ లో రెండు సెంచరీలు చేసి సిడ్నీ థండర్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. -
కోహ్లి.. నువ్వు చేసిందేం బాలేదు!
మెల్బోర్న్: అడిలైడ్‌లో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లితో తనకు జరిగిన మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ తాజాగా స్పందించాడు. మ్యాచ్‌లో తన పట్ల కోహ్లి తీరు ఏం బాలేదని పేర్కొన్నాడు. మ్యాచ్ కొనసాగుతుండగా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కాసేపు టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా ముచ్చటించాడు. ఆ వెంటనే అతను కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ దిశగా వెళ్తున్న స్మిత్‌తో కోహ్లికి సంవాదం జరిగింది. 'కోహ్లి చాలా అల్పంగా భావోద్వేగాలను ప్రదర్శించాడు. ఎవరైనా ఔటైనా సందర్భంలో అలా స్పందించాల్సిన అవసరం లేదేమో. ఎవరైనా ఔటైతే కొంతవరకు ఎగతాళి చేయవచ్చేమో కానీ ఇలా ప్రవర్తించడం సరికాదు' అంటూ స్మిత్ కోహ్లిపై మండిపడ్డాడు. టీవీ కామెంటేటర్లతో లైవ్‌గా మాట్లాడటం వల్లే స్మిత్ ఔటైనట్టు ఆయన అభిమానులు భావిస్తుండగా స్మిత్ మాత్రం దానిని కొట్టిపారేశాడు. షాట్ సెలెక్షన్లో పొరపాటు వల్లే తాను ఔటయ్యానని చెప్పాడు. నిజానికి మైదానంలో టీవీ కామెంటేటర్లతో స్మిత్ లైవ్ ముచ్చటించడంతో చిరాకుపడ్డటు కనిపించిన కోహ్లి అతనికి సెండాఫ్ ఇచ్చినట్టు వ్యవహరించాడు. అయితే భారత యువబౌలర్ల పట్ల స్మిత్ దురుసు వ్యాఖ్యలు చేయడంతోనే అతనితో సంవాదం పెట్టుకున్నానని, అతని వద్ద లైవ్ మైక్ ఉన్న విషయం కూడా తనకు తెలియదని కోహ్లి వివరణ ఇచ్చాడు. కాగా, స్మిత్ ఔటయ్యేందుకు కారణమైన ఈ లెటెస్ట్ టెక్నాలజీపై క్రికెట్ దిగ్గజాలు మండిపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో టీవీ కామెంటేటర్లతో మాట్లాడే ఈ పద్ధతి క్రికెట్‌ను ధంస్వం చేస్తోందని అన్నారు. -
'అదే మాకు అసలైన సవాల్'
సిడ్నీ: స్వదేశంలో మంచి రికార్డు కలిగి ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విదేశాల్లో మాత్రం ఇంకా చాలా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో కాకుండా బయట ఆడేటప్పుడే తమకు అసలైన సవాల్ ఎదురవుతూ ఉంటుందన్నాడు. ఈ నెల్లో స్వదేశంలో భారత్ తో జరిగే వన్డే, ట్వంటీ 20 సిరీస్ అనంతరం తాము న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న విషయాన్ని స్మిత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. 'స్వదేశంలో జరిగే మ్యాచ్ ల్లో ఆసీస్ కు మంచి రికార్డు. విదేశాల్లో ఇంకా పరిణతి చెందాలి. ఆసీస్ కు బయట ఆడినప్పుడలా.. అది మాకు ఛాలెంజ్‌గానే ఉంటుంది. కివీస్ లో పరిస్థితులకు, ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ మా జట్టులోని ఆటగాళ్లపై నమ్మకం ఉంది. న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగిస్తాం' అని స్మిత్ పేర్కొన్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. -
రెండో రోజూ దుమ్ము రేపారు
♦ స్మిత్, వోజెస్ సెంచరీలు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 551/3 డిక్లేర్డ్ విండీస్ 91/6 మెల్బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పూర్తి పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో రెండు శతకాలు నమోదు కాగా రెండో రోజు ఆదివారం కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (134 నాటౌట్; 8 ఫోర్లు), ఆడమ్ వోజెస్ (106 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ 135 ఓవర్లలో మూడు వికెట్లకు 551 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్మిత్, వోజెస్ నాలుగో వికెట్‌కు అజేయంగా 223 పరుగులు జోడించారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. రోజు ముగిసే సమయానికి 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులో డారెన్ బ్రేవో (13 బ్యాటింగ్), కార్లస్ బ్రాత్‌వైట్ (3 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 460 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్యాటిన్సన్, లియోన్, సిడిల్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు (1,404) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. తన అరంగేట్ర ఏడాదిలోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా వోజెస్ నిలిచాడు. ఆసీస్ గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో నలుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో ఆసీస్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి 1,134 పరుగులు చేసింది. బ్యాటింగ్ సగటు 162. ఓ సిరీస్‌లో ఇదే అత్యధిక సగటు. -
ముగ్గురు మొనగాళ్లు!
లండన్: టెస్టులో క్రికెట్ ఈ ఏడాది ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ సత్తా చాటారు. 2015లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లు వెయ్యి పరుగులు పూర్తి చేయగా అందులో ఇద్దరు బ్రిటీష్ టీమ్ బ్యాట్స్ మెన్ ఉన్నారు. ఈ జాబితాలో ఆండీ కుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 24 ఇన్నింగ్స్ ఆడిన కుక్ 60.72 సగటుతో 1336 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 263. ఇక రెండో స్థానంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ 61.33 సగటుతో 1288 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 182. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి మూడో ఆటగాడు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మన్ స్టీవెన్ స్మిత్. 9 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ ఆడి 77.61 సగటుతో 1009 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 215. పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ 782 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కోహ్లి(441) ఒక్కడే ముందున్నాడు. -
రోజర్స్, స్మిత్ సెంచరీలు
ఆస్ట్రేలియా 337/1 యాషెస్ రెండో టెస్టు లార్డ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అద్భుత ఆరంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (282 బంతుల్లో 158 బ్యాటింగ్; 25 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (217 బంతుల్లో 129 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు వీరిద్దరు అభేద్యంగా 259 పరుగులు జోడించారు. లార్డ్స్‌లో ఆ జట్టుకు రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. రోజర్స్ కెరీర్లో ఇది ఐదో సెంచరీ కాగా, స్మిత్‌కు పదోది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా... తొలి వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జత చేసిన అనంతరం మొయిన్ అలీ బౌలింగ్‌లో వార్నర్ (42 బంతుల్లో 38; 7 ఫోర్లు) వెనుదిరిగాడు. ఆ తర్వాత రోజర్స్, స్మిత్ జోడి ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆసీస్ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. -
స్టీవెన్ స్మిత్ సెంచరీ
కింగ్స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (336 బంతుల్లో 175 బ్యాటింగ్; 19 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాణించాడు. దీంతో శుక్రవారం రెండో రోజు కడపటి వార్తలందేసరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 117 ఓవర్లలో 8 వికెట్లకు 350 పరుగులు చేసింది. క్రీజులో తనతో పాటు హాజెల్‌వుడ్ (25 బంతుల్లో 5 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 258/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌ను విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. అయితే వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం ఓపిగ్గా ఆడుతూ జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. టేలర్‌కు ఐదు, హోల్డర్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
స్టీవెన్ స్మిత్ సెంచరీ
జమైకా: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ సాధించాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్మిత్ అజేయ సెంచరీతో కోలుకుంది. క్లార్క్ తో కలిసి మూడో వికెట్ కు 118 జోడించాడు. స్మిత్ 278 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. మైఖేల్ క్లార్క్ 47, వోగ్స్ 37, మార్ష్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ వార్నర్ డకౌట్ అయ్యాడు. స్మిత్(135), వాట్సన్(20) క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ ఒక వికెట్ పడగొట్టాడు. -
'విరాట్ బ్యాటింగ్ అద్భుతం'
ముంబై: భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ భీకరమైన బ్యాట్స్‌మన్ అని, అతని బ్యాటింగ్ చూడటాన్ని ఇష్టపడతానని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవెన్ స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన గత టెస్టు సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించాడని స్మిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐపీఎల్లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ ఆటతీరు సంతృప్తికరంగా ఉందని స్మిత్ అన్నాడు. రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రావిడ్ తమకు ఆదర్శమని చెప్పాడు. ద్రావిడ్ అనుభవాలు జట్టుకు ఉపయోగపడుతున్నాయని, అతన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. -
స్మిత్ హీరో... కోహ్లి జీరో!
సిడ్నీ: ఛేజింగ్ స్టార్ చతికిలపడ్డాడు. అభిమానుల ఆశలను వమ్ము చేశాడు. కీలక పోరులో భారత భావి కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమవగా, ఆసీస్ భావి నాయకుడు స్టీవెన్ స్మిత్ సత్తా చాటాడు. 15 పరుగులకే వికెట్ కోల్పోయిన దశలో బ్యాటింగ్ దిగిన స్మిత్ సంయమనంతో బ్యాటింగ్ చేసిన జట్టుకు భారీ అందించాడు. రెండో వికెట్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. అంతేకాదు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. డైరైక్ట్ త్రోతో జడేజాను రనౌట్ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్లు శుభారంభం అందించినా ఒత్తిడికి లోనయి కోహ్లి వికెట్ సమర్పించుకున్నాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడతాడని అభిమానులు పెట్టుకున్న అంచనాలను తల్లకిందులు చేశాడు. కనీస పోరాట పటిమ కనబరచకుండా ఈ స్టార్ బ్యాట్స్ మెన్ వికెట్ పారేసుకోవడం అభిమానులను నిరాశపరిచింది. టీమిండియా ఓటమికి కోహ్లి ఒక్కడినే బాధ్యుడిని చేయడం కరెక్టు కాకపోయినా... అతడు నిలదొక్కుకునివుంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహం ఏమాత్రం లేదు. ధోని వారసుడిగా చెలామణి అవుతున్న కోహ్లి కీలక మ్యాచుల్లో సత్తా చాటితేనే భారత్ కు చిరస్మరణీయ విజయాలు అందించగలుగుతాడు. -
స్మిత్ సెంచరీ
సిడ్నీ: భారత్ తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ సెంచరీ సాధించాడు. 89 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 4వ సెంచరీ. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్మిత్ శతకం బాదాడు. ఫించ్ తో కలిసి రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
స్మిత్ అర్ధసెంచరీ
సిడ్నీ: భారత్ తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 6వ అర్ధ సెంచరీ. స్మిత్ ఖాతాలో 3 సెంచరీలు ఉన్నాయి. -
నాయకులొచ్చారు..!
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఫలితాలు, రికార్డుల సంగతి పక్కన పెడితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన అంశం ఇరు జట్ల కెప్టెన్లు, వారి వ్యూహ ప్రతివ్యూహాలు. ఇద్దరి వయసు, వారు నాయకత్వం అందుకున్న పరిస్థితులు, ముందుండి జట్టును నడిపించిన తీరు... ఇలా అన్ని అంశాల్లో వారి మధ్య పోలికలు కనిపిస్తాయి. ఆరేళ్ల క్రితమే అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిపించి కోహ్లి తన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తే, అదే టోర్నీ లో ఆల్‌రౌండర్‌గా స్టీవెన్ స్మిత్ తనకంటూ తొలిసారి గుర్తింపు దక్కించుకున్నాడు. భారత్‌కు టెస్టు కెప్టెన్‌గా తన స్థానం పదిలపర్చుకున్న కోహ్లి... ధోని వైదొలగిన తర్వాత ఇతర ఫార్మాట్లలోనూ ‘సహజ నాయకుడు’గా ముందుకు రావడం ఖాయం. అదే విధంగా గాయంతో క్లార్క్ కెరీర్ సందిగ్ధంలో పడిన నేపథ్యంలో మూడు ఫార్మాట్లలోనూ సభ్యుడైన స్టీవెన్ స్మిత్ కూడా ఇకపై జట్టును పూర్తి స్థాయిలో నడిపించవచ్చు. రాబోయే కొన్నేళ్లు వీరిద్దరు కెప్టెన్లుగా తమ జట్లను శాసించడం ఖాయం. కెరీర్ తొలి వన్డే మ్యాచ్‌లోనే ఒక 20 ఏళ్ల కుర్రాడు పాంటింగ్‌లాంటి దిగ్గజ కెప్టెన్‌కు వ్యూహాల విషయంలో సలహాలివ్వగలడా... ఇచ్చినా తాను చెప్పినట్లుగా ఫీల్డింగ్ పెట్టేలా ఒప్పించగలడా... కానీ స్టీవెన్ స్మిత్ మాత్రం అదే చేశాడు. అప్పుడే అతనిలోని నాయకత్వ లక్షణాలు ఆస్ట్రేలియన్లకు ఆకట్టుకున్నాయి. సాధారణ లెగ్‌స్పిన్నర్, అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన స్మిత్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా, ఇప్పుడు కెప్టెన్‌గా తనను తాను మలచుకున్న తీరు అసాధారణం. కోహ్లిలాగా స్మిత్ అంతర్జాతీయ ప్రస్థానం సాఫీగా సాగలేదు. ఎన్నో సార్లు జట్టులోకి వచ్చాడు, పోయాడు. ముందు టి20 స్పెషలిస్ట్‌గా, ఆ తర్వాత వన్డే ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న స్మిత్, టెస్టు బ్యాట్స్‌మన్‌గా అద్భుతమైన ఆటతీరు కనబర్చడం విశేషం. ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని రీతిలో వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు, మొత్తం 769 పరుగులు చేసిన అతను... కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా (రోహిత్ శర్మ క్యాచ్) గతంలోని ఆసీస్ కెప్టెన్లకంటే ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బ్రిస్బేన్ టెస్టులో అతని నాయకత్వ పటిమతోనే ఆసీస్‌కు అనూహ్య విజయం దక్కింది. మెల్బోర్న్ టెస్టులో డిక్లరేషన్ ఆలస్యం చేశాడని విమర్శలు వచ్చినా, అడిలైడ్‌లో ఆ తప్పు సరిదిద్దుకున్నాడు. ఇక చాలా మంది వ్యక్తిగత రికార్డులు అంటే పడి చచ్చే చోట జట్టు ముఖ్యమంటూ 192 పరుగుల వద్ద ర్యాంప్ షాట్ ఆడి అవుట్ కావడం అతని ధైర్యానికి మెచ్చుతునక. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఉండే సహజమైన దూకుడు స్మిత్‌లో ఉన్నా, సిరీస్ ఆసాంతం నోటి మాటలతో ఎక్కడా వివాదాస్పదం కాకపోవడం కోహ్లికంటే అతడిని ఒక మెట్టు ముందుంచుతుంది. ఏ సిరీస్‌లో ఫలితం ఎలా ఉన్నా... కంగారూలకు యాషెస్ అంటేనే ప్రాణం లేచొస్తుంది. ఈ ఏడాది యాషెస్ రూపంలో అతనికి పెను సవాల్ ముందుంది. యువ కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించగల, గెలిపించగల సత్తా స్మిత్‌లో ఉందని ఆసీస్ అభిమానులు నమ్ముతున్నారు. అదే జరిగితే ఆసీస్ దిగ్గజాలలో అతని పేరు తప్పకుండా చేరుతుంది. ‘కెప్టెన్‌గా మీరు సాధించిన విజయాల తర్వాతే మీకు అమిత గౌరవం దక్కింది. నేనూ ప్రత్యర్థి జట్లనుంచి అదే కోరుకుంటున్నాను. మీలాగే నేనూ అలాంటి విజయాలు సాధిస్తాను’... సిడ్నీ టెస్టు తర్వాత సౌరవ్ గంగూలీతో కోహ్లి చెప్పిన మాట ఇది. ఈ సిరీస్ రెండు టెస్టులలో అతని ఆలోచనలు, కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు చూస్తే కోహ్లి ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యం కలిగించదు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై భారత దిగ్గజ ఆటగాళ్లంతా ప్రతీ పరుగు కోసం శ్రమిస్తున్న చోట సిరీస్‌లో ఏకైన సెంచరీ చేసిన తర్వాత కూడా టెస్టు బ్యాట్స్‌మన్‌గా కోహ్లి సామర్థ్యంపై సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఘోర వైఫల్యం మరోసారి కోహ్లిని ఇబ్బందుల్లో పడేసింది. అయితే అదే ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా మాత్రం అతను ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. అడిలైడ్ టెస్టులో చేసిన రెండు సెంచరీలు, ఆ మ్యాచ్ చివరి రోజు ‘డ్రా’ కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నించడం, అశ్విన్‌ను కాదని కరణ్ శర్మకు అవకాశం ఇవ్వడం కోహ్లిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. చివరి టెస్టులోనైతే మరో ద్రవిడ్‌లాంటి పుజారాను కూడా పక్కనపెట్టి అతను రైనాతో రిస్క్ చేశాడు. ఆఖరి రోజు కూడా అడిలైడ్లాగే ఊరిస్తున్నా... వాస్తవ పరిస్థితిని అంచనా వేసి వ్యూహం మార్చడంలో అతని పరిణతి కనిపించింది. ఇక బ్రిస్బేన్‌లో కెప్టెన్ కాకపోయినా, జాన్సన్ సహా ఇతర ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ ఎదురు నిలబడటం కోహ్లిని ఆస్ట్రేలియాలో కూడా స్టార్‌గా మార్చేసింది. ఆటతోపాటు మాటల్లో కూడా దూకుడు కనిపించింది. నాలుగు సెంచరీలు సహా 692 పరుగులతో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన అతను నాయకుడిగా కూడా జట్టును సమర్థంగా నడిపించగలిగాడు. బలహీనమైన బౌలింగ్ కీలక సమయాల్లో అండగా నిలవకపోయినా... విభిన్న వ్యూహాలతో చాలా సందర్భాల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విరాట్ కోహ్లి సఫలమయ్యాడు. సెంచరీ పూర్తయ్యాక అతను లోకేశ్ రాహుల్‌ను ప్రేమగా కౌగిలించుకొని అభినందించిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. సిరీస్ గెలవకపోయినా, కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ, వారిని తగిన విధంగా మలచుకున్న తీరు, నేనున్నానంటూ అతను కల్పించిన భరోసా భారత క్రికెట్ భవిష్యత్తు భద్రమని చెప్పకనే చెబుతోంది. -
వాట్సన్ ఫిట్ గా ఉన్నాడు:స్మిత్
సిడ్నీ: ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చివరి టెస్టులో ఆడటానికి ఫిట్ గానే ఉన్నాడని కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. టీమిండియాతో మంగళవారం నుంచి జరుగనున్న నాల్గో టెస్టులో వాట్సన్ పాల్గొంటాడని స్మిత్ తెలిపాడు. 'ఆవేశితపూరిత' విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తొలి టెస్టులో అతని నాయకత్వ ప్రతిభ ఆకట్టుకుందని స్మిత్ అన్నాడు. ఇదిలా ఉండగా గాయపడ్డ మిచెల్ జాన్సన్ స్థానంలో స్టార్క్ తుదిజట్టులోకి రానున్నాడు. టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ టెస్టుల నుంచి వైదొలగడంతో విరాట్ కోహ్లీ రేపటి మ్యాచ్ కు బాధ్యతలు తీసుకోనున్నాడు. -
ఆధిక్యం అడ్డం తిరిగింది!
ఆస్ట్రేలియా 505 ఆలౌట్ స్మిత్ సెంచరీ, చెలరేగిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 71/1 బ్రిస్బేన్ టెస్టు బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికర స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (27) పెవిలియన్ చేరగా... ధావన్ (26 బ్యాటింగ్), పుజారా (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 26 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆ జట్టు లోయర్ ఆర్డర్ అనూహ్య రీతిలో రాణించడంతో ఆసీస్ 109.4 ఓవర్లలో 505 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్మిత్ (191 బంతుల్లో 133; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో తన జోరు కొనసాగించాడు. స్మిత్‌కు తోడు జాన్సన్ (93 బంతుల్లో 88; 13 ఫోర్లు, 1 సిక్స్), స్టార్క్ (59 బంతుల్లో 52; 6 ఫోర్లు)ల మెరుపు అర్ధ సెంచరీలు భారత్‌ను వెనకడుగు వేసేలా చేశాయి. అంపైర్‌కు ‘వాచిపోయింది’ మూడో రోజు ఆటలో బ్యాట్స్‌మన్ షాట్ ఈసారి అంపైర్‌ను దెబ్బ కొట్టింది. ఆసీస్ ఇన్నింగ్స్ 91వ ఓవర్‌ను ఉమేశ్ బౌల్ చేశాడు. స్టార్క్ దానిని నేరుగా బలంగా కొట్టాడు. కష్టసాధ్యమైన ఆ క్యాచ్‌ను అందుకునే క్రమంలో ఉమేశ్ తన చేతిని అడ్డం పెట్టడంతో దానికి తగిలి బంతి దిశ మార్చుకుంది. అయినా ఏమాత్రం వేగం తగ్గకుండా అంపైర్ ఎరాస్మస్ చేతికి బలంగా తాకింది. అప్పుడు సర్దుకున్నట్లు అనిపించినా... ఎరాస్మస్కు గట్టి దెబ్బే తగిలింది. దాంతో ఆ ఓవర్ ముగిసిన తర్వాత అతను చికిత్స తీసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఫిజియో పరుగెత్తుకు వచ్చి ఐస్ప్యాక్తో నొప్పి తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత ఎరాస్మస్ మోచేయి ఒక్కసారిగా వాచిపోయి కనిపించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 408, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 55; వార్నర్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 29; వాట్సన్ (సి) ధావన్ (బి) అశ్విన్ 25; స్మిత్ (బి) ఇషాంత్ 133; షాన్ మార్ష్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 32; మిషెల్ మార్ష్ (బి) ఇషాంత్ 11; హాడిన్ (సి) పుజారా (బి) ఆరోన్ 6; జాన్సన్ (సి) ధోని (బి) ఇషాంత్ 88; స్టార్క్ (బి) అశ్విన్ 52; లయోన్ (సి) రోహిత్ (సి) ఆరోన్ 23; హాజల్‌వుడ్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (109.4 ఓవర్లలో ఆలౌట్) 505 వికెట్ల పతనం: 1-47; 2-98; 3-121; 4-208; 5-232; 6-247; 7-395; 8-398; 9-454; 10-505. బౌలింగ్: ఇషాంత్ 23-2-117-3; ఆరోన్ 26-1-145-2; ఉమేశ్ 25-4-101-3; అశ్విన్ 33.4-4-128-2; రోహిత్ 2-0-10-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (బి) స్టార్క్ 27; ధావన్ (బ్యాటింగ్) 26; పుజారా (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టానికి) 71 వికెట్ల పతనం: 1-41. బౌలింగ్: జాన్సన్ 8-3-29-0; హాజల్‌వుడ్ 6-0-24-0; స్టార్క్ 4-1-10-1; వాట్సన్ 5-3-6-0. ‘భారత్ ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. కనీసం వంద పరుగుల ఆధిక్యం దక్కించుకుంటే మ్యాచ్‌పై ధోని సేనకు పట్టు దొరికినట్లే...’ మూడో రోజు ఆటకు ముందు విశ్లేషకుల అంచనా. నిజంగానే దాదాపు 100 పరుగుల ఆధిక్యం దక్కింది... అయితే అది భారత్‌కు కాదు ఆస్ట్రేలియాకు! ఒక దశలో ఆసీస్ స్కోరు 247/6... టీమిండియాకు ఆధిక్యం ఖాయంగా అనిపించింది. అయితే స్మిత్, జాన్సన్ ఆ అంచనాలను తలకిందులు చేశారు. వీరిద్దరు 26 ఓవర్లలోనే 148 పరుగులు జత చేయడం మ్యాచ్ దిశను మార్చేసింది. గతి తప్పిన బంతులతో మన నలుగురు బౌలర్లు ‘సెంచరీ’ నమోదు చేస్తే... కంగారూలు పండగ చేసుకున్నారు. ప్రత్యర్థి ‘తోక’ను కత్తిరించలేని బలహీనతను, రికార్డును కొనసాగిస్తూ భారత జట్టు ఆసీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది. ఆతిథ్య జట్టు తొలి 6 వికెట్లకు 61.1 ఓవర్లలో 247 పరుగులు చేస్తే... ఆ జట్టు బౌలర్లు ‘బ్యాట్స్‌మెన్’గా మారి చివరి 4 వికెట్లకు 48.3 ఓవర్లలోనే 258 పరుగులు జోడించగలిగారంటే లోయర్ ఆర్డర్ జోరు ఎలా సాగిందో అర్థమవుతోంది. అయినా... మ్యాచ్ చేజారలేదు. ఇంకా 9 వికెట్లున్నాయి... 26 పరుగుల లోటు సమస్య కాదు. రెండో రోజు ఉదయం తరహాలో వరుస కట్టకుండా భారత్ నిలబడి ఆడి ఎన్ని పరుగులు చేస్తుంది... ప్రత్యర్థికి ఎంతటి భారీ లక్ష్యం నిర్దేశిస్తుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరం. చెప్పుకోదగ్గ స్కోరు సాధిస్తే చివరి రోజు ‘గాబా’ మన వైపూ తిరుగుతుందేమో! జాన్సన్ ఆటకు భారత్ వద్ద సమాధానం లేకుండా పోయింది. మొదటి బంతి నుంచే అతను అద్భుతంగా ఆడాడు. టెయిలెండర్ల వల్లే 90కి పైగా ఆధిక్యం లభించింది. మూడో రోజు మాదేనని చెప్పగలను. మ్యాచ్‌కు ముందు కూడా నేను బాగా ఆడి ముందుండి నడిపిస్తానని చెప్పాను. అది నిజం కావడం సంతోషకరం. తీవ్రమైన ఎండ, వేడిలో మా లోయర్ ఆర్డర్ ఆటతో భారత్‌లో అసహనం పెరిగి ఉండవచ్చు. ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ పై నాలుగో రోజు మేం చాలా సహనంతో, బాగా బౌలింగ్ చేయాల్సి ఉంది.’ - స్టీవెన్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ మేం అనుకున్నదానికంటే కనీసం 50 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. ఆట ఆరంభంలో ఉదయం లైన్‌కే కట్టుబడ్డాం. ఆ తర్వాతే టెయిలెండర్లు బౌన్సర్లు ఆడలేరని భావించే షార్ట్ బంతులు సంధించాం. ఒక దశలో ఎక్కువ బౌన్సర్లే వేశాం. అదేమీ తప్పు కాదు. మా వ్యూహంలో భాగంగానే అలా చేశాం. అయితే జాన్సన్‌పై మాత్రం అది పని చేయలేదు. దూకుడుగా ఆడినప్పుడు కొన్ని సార్లు వ్యతిరేక ఫలితం కూడా రావచ్చు. బౌలర్లకు ఇంకా సహకారం లభిస్తోంది. నాలుగో రోజంతా మేం బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత పిచ్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. - ఉమేశ్ యాదవ్, భారత బౌలర్ ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన పదో ఆటగాడు స్మిత్. 1978లో గ్రాహం యాలాప్ తర్వాత ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. 2014లో భారత్‌పై ప్రత్యర్థి జట్ల టెయిలెండర్లు 44.84 సగటు భాగస్వామ్యంతో పరుగులు చేశా రు. ఇతర ఏ జట్టుపైనా ఇంత సగటుతో పరుగులు రాలేదు. సెషన్-1 మెరుపు భాగస్వామ్యం మూడో రోజు ఉదయం భారత బౌలర్లు చక్కటి నియంత్రణతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. తొలి గంట పాటు ఒక్క బౌండరీ ఇవ్వలేదు. పేసర్లు 140 కి.మీ వేగానికి తగ్గకుండా, షార్ట్, వైడ్ బంతులు కూడా విసరకుండా చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేస్తూ ఇచ్చినవి 39 పరుగులే! దీంతో పాటు 15 పరుగుల వ్యవధిలో మిషెల్ మార్ష్ (11), హాడిన్ (6) వికెట్లు కూడా తీశారు. అయితే తర్వాతి గంటలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్మిత్, జాన్సన్ షాట్లతో చెలరేగిపోయారు. ఫలితమే 14 బౌండరీలు... వికెట్ కోల్పోకుండా 91 పరుగులు. ముఖ్యంగా జాన్సన్‌కు షార్ట్ బంతులు వేయాలన్న వ్యూహం వికటించింది. వాటిని సమర్థంగా ఎదుర్కొన్న జాన్సన్... ఉమేశ్ ఒకే ఓవర్లో మూడు, ఆరోన్ ఓవర్లో మూడు, ఇషాంత్ ఓవర్లో రెండు చొప్పున వరుసగా ఫోర్లు బాదాడు. ఈ జోరులో జాన్సన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ, స్మిత్ 147 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవర్లు: 23, పరుగులు: 130, వికెట్లు: 2 సెషన్-2 ఆసీస్ అదే దూకుడు లంచ్ తర్వాత కొద్ది సేపటికే ఇషాంత్ ఒకే ఓవర్లో జాన్సన్, స్మిత్‌లను అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఇక ప్రత్యర్థి ఇన్నింగ్స్ ముగించడం లాంఛనమే అనుకున్నా... ఆ తర్వాత కూడా ఆసీస్ తమ ధాటిని కొనసాగించింది. బౌలింగ్‌లో రాణించలేకపోయిన స్టార్క్ తన బ్యాటింగ్ ప్రతిభతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇషాంత్, ఉమేశ్‌ల వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. గతంలో ఎప్పుడూ పెద్దగా బ్యాటింగ్‌లో ఆకట్టుకోని లయోన్ (23 బంతుల్లో 23; 3 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడుతున్న హాజల్‌వుడ్ (50 బంతుల్లో 32 నాటౌట్; 7 ఫోర్లు) కూడా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించి స్టార్క్‌కు అండగా నిలిచారు. లయోన్‌తో 9వ వికెట్‌కు 56, హాజల్‌వుడ్‌తో చివరి వికెట్‌కు 51 పరుగులు జోడించిన స్టార్క్ జట్టు స్కోరును 500 పరుగులు దాటించిన అనంతరం చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఓవర్లు: 34.4, పరుగులు: 154, వికెట్లు: 4 సెషన్-3 విజయ్ అవుట్ విరామం తర్వాత భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ధావన్ సంయమనం పాటించగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో విజయ్ మరోసారి వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే స్టార్క్ బంతిని సరిగ్గా అంచనా వేయలేక వదిలేయడంతో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ధావన్, పుజారా ప్రమాదం లేకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. మధ్యలో కొన్ని సార్లు ఆసీస్ బౌలర్లు చక్కటి బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలిగినా... వికెట్ మాత్రం పడగొట్టలేకపోయారు. ఓవర్లు: 23, పరుగులు: 71, వికెట్లు: 1 -
ఇక పేస్ పరీక్ష
సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు ఎవరు తమ దేశానికి వచ్చినా తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేస్తుంది. కారణం... సంప్రదాయబద్ధంగా గాబా పిచ్ మీద విపరీతమైన వేగం ఉంటుంది. బౌన్సర్లతో సీమర్లు చుక్కలు చూపిస్తుంటారు. దీనిని తట్టుకోలేక ప్రత్యర్థులు మ్యాచ్‌ను అప్పగిస్తారు. సిరీస్‌ను ఆసీస్ ఘనంగా ప్రారంభిస్తుంది. ఈసారి భారత్‌కు తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేశారు. కానీ హ్యూస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో వేదిక అడిలైడ్‌కు మారింది. అక్కడి పిచ్ సంప్రదాయ బద్దంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. ఈసారీ అదే జరిగింది. అయితే ఆస్ట్రేలియా ఆఖరి రోజు అనూహ్యంగా గెలిచింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఇక భారత్‌కు అసలైన పరీక్ష రేపటి నుంచి మొదలు కానుంది. రెండో టెస్టు బుధవారం నుంచి గాబా మైదానంలో జరగనుంది. జాన్సన్, హారిస్, సిడిల్‌లు బౌన్సర్ల వర్షం కురిపించడం ఖాయం. మన బ్యాట్స్‌మెన్ ఎలా స్పందిస్తారు? పిచ్‌ను మన పేసర్లు ఎలా వినియోగించుకుంటారు? అనే అంశాలపై భారత భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటి నుంచి రెండో టెస్టు * ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్ * బరిలోకి దిగనున్న ధోని! బ్రిస్బేన్: టెస్టు మ్యాచ్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు భారత్, ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్‌లో అద్భుతమైన వినోదాన్ని అందించాయి. ఆ మ్యాచ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండగానే మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి గాబా మైదానంలో జరుగుతుంది. ఈ టెస్టుకు ఇద్దరు కెప్టెన్లు మారబోతున్నారు. గాయంతో సిరీస్‌కు దూరమైన క్లార్క్ స్థానంలో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు సారథ్యం వహిస్తుంటే... భారత్ తరఫున రెగ్యులర్ కెప్టెన్ ధోని బరిలోకి దిగబోతున్నాడు. క్లార్క్ స్థానంలో హాడిన్ కెప్టెన్ అవుతాడని భావించినా... దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా స్మిత్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇటీవల భిన్నమైన షాట్లతో అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న స్మిత్... ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరం. మరోవైపు తొలి టెస్టులో ఆకట్టుకున్న కోహ్లి స్థానంలో... సారథిగా ధోని రాబోతున్నాడు. ఒకవేళ ధోని మరింత విశ్రాంతి అవసరమని భావిస్తే మాత్రం కోహ్లి కొనసాగుతాడు. ఓడితే కోలుకోవడం కష్టం నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు నెగ్గితే 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళుతుంది. అప్పుడు ఇక సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండదు. కాబట్టి చివరి రెండు టెస్టుల్లో మరింత దూకుడుగా ఆడుతుంది. అలా కాకుండా సిరీస్‌లో ఆసక్తి బాగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలి. కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. మార్పులు ఎన్ని? తొలి టెస్టు ఆడిన భారత జట్టు రెండో మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ధోని తిరిగి వస్తే సాహా బెంచ్ మీదకు వెళ్లాలి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కరణ్ శర్మ స్థానంలో అశ్విన్ రావచ్చు. ఒకవేళ నలుగురు పేసర్లతో ఆడాలనుకుంటే కరణ్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు లేకపోవచ్చు. తొలి టెస్టులో ఆకట్టుకున్న విజయ్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా కొత్త బంతిని మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. రహానే, రోహిత్, పుజారా ముగ్గురూ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాణించినా... రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరు నిలబడి ఉంటే ఈ పాటికి భారత్ సిరీస్‌లో ఆధిక్యంలో ఉండేది. గాబా పిచ్ మీద భారత పేస్ త్రయం ఇషాంత్, షమీ, ఆరోన్ రాణించడంపైనే భారత అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొత్త సారథి నేతృత్వంలో... కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్ది ఆస్ట్రేలియా జట్టుపై తిరుగులేని ముద్ర. మ్యాచ్‌లో ప్రత్యర్థులకు సవాళ్లను నిర్దేశించడంలో తను దిట్ట. మరి స్మిత్ ఆ బాధ్యతలో ఏ మేరకు విజయం సాధిస్తాడో చూడాలి. క్లార్క్ స్థానంలో షాన్ మార్ష్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తమను ఊరిస్తున్న పిచ్‌పై కచ్చితంగా ఆస్ట్రేలియా సీమర్లు జాన్సన్, సిడిల్, హారిస్ చెలరేగుతారు. ముఖ్యంగా జాన్సన్ గత యాషెస్‌లో ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లకు తన బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. దీనికి భారత బ్యాట్స్‌మెన్ సన్నద్ధం కావాలి. సిడిల్ అనారోగ్యం నుంచి కోలుకోకుంటే అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ మిషెల్ స్టార్క్ వస్తాడు. ఏమైనా పేస్ పరీక్షగా నిలవబోతున్న ఈ టెస్టు ఆసక్తికరంగా సాగడం ఖాయం. రేపు ఉదయం గం. 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో -
45వ కెప్టెన్‌గా స్మిత్
బ్రిస్బేన్: మైకేల్ క్లార్క్ గాయం కారణంగా దూరం కావడంతో మిగిలిన టెస్టులకు స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కెరీర్ ఆరంభంలో కేవలం లెగ్‌స్పిన్నర్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్లో చోటు దక్కించుకుంటూ వస్తున్న స్మిత్ ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్థాయికి ఎదగడం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లలో అతని ఆటతీరు చాలా మెరుగైంది. అద్భుతమైన ప్రదర్శనతో స్మిత్ టెస్టుజట్టులోనూ ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. క్రెయిగ్, కిమ్ హ్యూస్ తర్వాత పిన్న వయసులో ఆసీస్ కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా 25 ఏళ్ల స్మిత్ గుర్తింపు పొందాడు. ‘ప్రస్తుతానికి ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. గత 18 నెలలు నా కెరీర్లో గొ ప్ప క్షణాలుగా నిలిచాయి. కెప్టెన్ కావడం ఉద్వేగంగా ఉంది. ఇప్పటి వరకు ఆసీస్ ఎలా ఆడిందో అదే తరహాలో ముందుకు వెళతాం తప్ప నేను ఒక్కసారిగా ప్రణాళికలు మార్చేయను. ఒక్కసారి ఆట మొదలైతే గెలవడంపైనే దృష్టి ఉంటుంది తప్ప ప్రత్యర్థితో స్నే హం చేయలేం. నేను కూడా బాగా ఆడి ముందుండి జట్టును నడిపిస్తాను’ అని స్మిత్ చెప్పాడు. -
ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా స్మిత్!
బ్రిస్బేన్:టీమిండియాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్టీవ్ స్మిత్(25) బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ గా మైకేల్ క్లార్క్ కు గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్మిత్ రెండో టెస్ట్ కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒకవేళ టీమిండియాతో మిగతా మ్యాచ్ లకు కూడా క్లార్క్ అందుబాటులోకి రాకపోతే స్మిత్ కెప్టెన్ గా కొనసాగుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఆసీస్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్.. అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 162 పరుగులు చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా నియమితులైన స్మిత్ 45వ ఆసీస్ కెప్టెన్. -
దుమ్మురేపిన బ్యాట్స్‌మెన్: ఆస్ట్రేలియా 517/7
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. ఒకరిని చూసి మరొకరు సెంచరీలు బాదేశారు. భారత బౌలర్ల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని చెలరేగిపోయారు. వెలుతురు లేక ఆట నిలిచిపోవడంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల భారీ స్కోరు చేశారు. తొలిరోజు ఆటలో వార్నర్ 145 పరుగులతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగా.. రెండోరోజు వర్షం అడ్డం పడినా కూడా ఏమాత్రం లెక్కచేయకుండా కెప్టెన్ మైఖేల్ క్లార్క్, మరో స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్ భారీగా పరుగుల వర్షం కురిపించారు. క్లార్క్ 128 పరుగులు చేసి కేవీ శర్మ బౌలింగులో పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్మిత్ మాత్రం తన పరుగుల దాహం ఇంకా తీరలేదన్నట్లు 162 పరుగులు చేసి ఇంకా నాటౌట్‌గానే మిగిలాడు. మిగిలిన వాళ్లలో ఒక్క మార్ష్ మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో షమీ, వరుణ్ ఆరోన్, కేవీ శర్మ రెండేసి వికెట్లు పంచుకోగా లంబూ ఇషాంత్ శర్మకు మాత్రం ఒక్క వికెట్టే దక్కింది. రెండోరోజు వర్షం అడ్డం పడటంతో కేవలం 31 ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. ఆట ముగిసే సమయానికి స్మిత్ 162 పరుగులతోను, జాన్సన్ 0 పరుగులతోను క్రీజులో ఉన్నారు. -
స్మిత్‌కు కెప్టెన్సీ!
ఆస్ట్రేలియా మాజీల మద్దతు సిడ్నీ: భారత్‌తో తొలి టెస్టులో మైకేల్ క్లార్క్ ఆడేది అనుమానంగా మారడటంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. క్లార్క్ గైర్హాజరీలో సహజంగానే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే హాడిన్కంటే భవిష్యత్తు కోసం కొత్త తరం ఆటగాడిని ఎంపిక చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అందుకు గాను స్టీవెన్ స్మిత్ సరైన వ్యక్తిగా ఎక్కువ మంది భావిస్తున్నారు. స్మిత్‌కు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలంటూ ఆసీస్ మాజీ ఆటగాడు కిమ్ హ్యూస్, మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డారు. -
స్టీవెన్ స్మిత్ కు ఆస్టేలియా క్రికెట్ పగ్గాలు?
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ మొదటి టెస్టులో మైఖేల్ క్లార్క్ ఆడడం అనుమానంగా మారడంతో ఆస్ట్రేలియా జట్టుకు యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ క్లార్క్ ఆడకపోతే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ ఛాన్సు దక్కుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా స్మిత్ పేరు తెరపైకి వచ్చింది. క్లార్క్ వారసుడిగా స్మిత్ పనికొస్తాడో, లేదో తేల్చడానికి ఇదే సరైన సమయమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత్ తో జరగనున్న మొదటి టెస్టుకు క్లార్క్ దూరమైతే స్మిత్ కు జట్టు పగ్గాలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు మాజీ కెప్టెన్ కిమ్ హగీస్ సూచించారు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం మెక్ గ్రాత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టెస్టు డిసెంబర్ 4న బ్రిస్బేన్ లో ప్రారంభంకానుంది. -
స్మిత్ వర్సెస్ పీటర్సన్
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో ప్లేఆప్ ఆశలు వదులుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ గురువారమిక్కడ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా రాజస్థాన్ జట్టుకు యువ క్రికెటర్ స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వాట్సన్ ఈ మ్యాచ్‌కు దూరంగా కావడంతో స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించారు. రాజస్థాన్ జట్టులో శామ్సన్, ధావన్ కులకర్ణి, బెన్ కటింగ్ వచ్చారు. ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. మనోజ్ తివారి, రాస్ టేలర్, నదీమ్ జట్టులోకి వచ్చారు. ప్లేఆప్ రేసు నుంచి దాదాపుగా వైదొలగిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లేఆప్ కు మరింత దగ్గర కావాలన్న పట్టుదలతో ఉంది. -
ఆస్ట్రేలియా భారీ స్కోరు
ఓవల్: యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. స్టీవెన్ స్మిత్ (241 బంతుల్లో 138 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా తలా ఒక చేయి వేయడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 492 పరుగుల భారీస్కోరు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం జాగ్రత్తగా ఆడిన ఇంగ్లండ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సరికి 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. కుక్ (17), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా ఒక సెషన్ పూర్తిగా రద్దు కావడంతో గురువారం 56.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అండర్సన్‌కు 4 వికెట్లు... వర్షం కారణంగా కెన్నింగ్టన్ ఓవల్ మైదానమంతా తడిసి ముద్దయింది. దాంతో లంచ్ వరకు కూడా ఒక్క బంతి పడలేదు. లంచ్ విరామం తర్వాత ఆసీస్ 307/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించింది. యువ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. నైట్ వాచ్‌మన్ సిడిల్ (27 బంతుల్లో 23; 2 ఫోర్లు)ను ఆరంభంలోనే అండర్సన్ అవుట్ చేసినా...హాడిన్ (57 బంతుల్లో 30; 5 ఫోర్లు)తో కలిసి స్మిత్ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మిత్ 198 బంతుల్లో టెస్టుల్లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 94 పరుగుల స్కోరు వద్ద ట్రాట్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్‌తో అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు. జట్టుకు వేగంగా స్కోరు అందించే ప్రయత్నంలో ఫాల్క్‌నర్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), స్టార్క్ (8 బంతుల్లో 13; 1 ఫోర్), హారిస్ (27 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. -
స్టీవెన్ స్మిత్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా!
యాషెస్ సిరీస్ లో భాగంగా ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ, చివరి టెస్ట్ రెండవ రోజు ఆట లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండవ రోజు ఆటలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు స్మిత్ రాణించి సెంచరీ సాధించాడు. స్మిత్ 105 పరుగులతోనూ ఆటను కొనసాగిస్తున్నాడు. తొలి రోజు ఆటలో షేన్ వాట్సన్ 176 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. కడపటి వార్తలు అందేసరికి ఆస్టేలియా జట్టు ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అండర్సన్ మూడు వికెట్లు, బ్రాడ్, స్వాన్, ట్రాట్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది.