
టాంటాన్ : పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. వీలుచిక్కినప్పుడల్లా తన నోటికి పనిచెబుతూ వార్తల్లో నిలుస్తాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘పాక్ ఫ్యాన్స్ క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లను గౌరవిస్తారు. స్మిత్‌ను గత మ్యాచ్‌లో కొందరు ఎగతాళి చేసినట్లు తెలిసింది. కానీ పాక్ ఫ్యాన్స్ అలా ఎప్పటికీ చేయరు. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను కించపరిచేలా మా వాళ్లు ప్రవర్తించరు’అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ అభిమానులు కొందరు స్మిత్ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అయితే ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే సర్ఫరాజ్ అలా మాట్లాడాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాను గేలి చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని సర్ఫరాజ్ ఎదురుచూస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.
చదవండి:
బెయిల్స్ పడకపోవడం ఏంట్రా బాబు!
మావాళ్ల తరఫున సారీ స్మిత్ : కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment