Team India fans
-
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిధి
టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా వాలిపోయే వీరాభిమాని సుదీర్ గౌతమ్ చౌధరీ హైదరాబాద్‌కూ వచ్చేశాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో అతను తనదైన శైలిలో భారత్–ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం సమర శంఖం పూరించాడు. సచిన్‌కు అతిపెద్ద ఫ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ... సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆటపై తన ప్రేమను కొనసాగిస్తూ ప్రతీ మైదానంలో కనిపిస్తూ వస్తున్నాడు. మొత్తానికి భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లో సుదీర్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలుపు లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌లో చాలాకాలం తర్వాత జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో స్థానిక అభిమానులు మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. -
'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం
వచ్చే టి20 వరల్డ్‌కప్ వరకు యువ జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ రోహిత్, కోహ్లి లాంటి సీనియర్లను రెస్ట్ పేరుతో పక్కనబెడుతూ వస్తుంది. గతేడాది టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పింది. లంకతో సిరీస్ సందర్భంగా పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టి20లో టీమిండియా ఓటమితో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా పూర్తిగా విఫలమైంది. పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, హార్ధిక్ పాండ్యాలు విఫలమయ్యారు. బ్యాటర్లలో ఇషాన్ కిషన్, గిల్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు వెళ్లారు. వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్‌లు మాత్రమే పర్వాలేదనిపించారు. ఈ ఓటమికి అనుభవలేమీ ప్రధాన కారణమని.. ప్రయోగాలకు స్వస్తి పలికి రోహిత్, కోహ్లిలను టి20లకు ఎంపికచేయాలని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''రోహిత్, కోహ్లీలను పక్కనపెట్టి.. టీమిండియా మూల్యం చెల్లించుకుంటుంది. బీసీసీఐ ప్రయోగాలు పక్కనబెట్టి.. ఇద్దరిని టి20లకు ఆడించాలి.'' అని కొందరు పేర్కొన్నారు. ''కివీస్‌తో తొలి టి20లో మన ఓపెనర్ల ఆటను చూశాక రోహిత్, కోహ్లీలు టీమ్ లోకి రావడమే మంచిదని.. ఈ ఇద్దరిని 2024 టి20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తే మంచిదని'' మరికొందరు డిమాండ్ చేశారు. ''రోహిత్, కోహ్లీ లేని టీమిండియాను ఊహించుకోలేకపోతున్నాం. ఈ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి అర్థమై ఉండాలి. ఇగోలను పక్కనబెట్టి ఆ ఇద్దరినీ ఆడించండి.'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: WC 2023: అలా అయితే వరల్డ్‌కప్-2024 వరకు కెప్టెన్‌గా రోహిత్: డీకే 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా' -
అభిమానులనుద్దేశించి సూర్యకుమార్ ఎమోషనల్ పోస్టు
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బుధవారం ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అత్యద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగానూ సూర్యకు ఈ అవార్డు లభించింది. 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే తనకు అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యకుమార్ తన ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ''ఇది నమ్మశక్యంగా లేదు. నేను ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికవుతానని ఊహించలేదు. కానీ నా ప్రదర్శనతోనే అవార్డు రావడం సంతోషం కలిగించింది. ఇన్నాళ్లు మీరిచ్చిన ప్రోత్సాహం, మద్దతుకు మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నా జర్నీలో భాగమైన ప్రతీ ఒక్కరికి ఈ అవార్డు అంకితం. నా కోచ్, ఫ్యామిలీ, స్నేహితులు, జట్టు సభ్యులు.. ప్రియమైన అభిమానులు మీరంతా నన్ను నడిపిస్తున్న డ్రైవింగ్ ఫోర్స్. గతేడాది మీ నుంచి ఆశీర్వాదాలు అందుకోవడంతో పాటు కొన్ని మరిచిపోలేని అనుభూతులు సంపాదించాను. అందులో టి20 క్రికెట్లో దేశం తరపున తొలి శతకం బాదడం మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఏడాది చివర్లో కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నా. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. కష్టపడేతత్వం, నిజాయితీ. 2022 ఏడాది ఇచ్చిన ఆనందాన్ని నెమరువేసుకుంటూ మరో ఏడాదిలోకి అడుగుపెట్టా. ఈ ఏడాది కూడా నా ఆటతీరుతో మరింత సాధించాలనుకుంటున్నా. అందుకు మీ మద్దతు అవసరం. సరే మరి ఇక మైదానంలో కలుద్దాం'' అంటూ పేర్కొన్నాడు. 𝙏𝙝𝙖𝙣𝙠𝙛𝙪𝙡. 𝙂𝙧𝙖𝙩𝙚𝙛𝙪𝙡. 𝘽𝙡𝙚𝙨𝙨𝙚𝙙. ♥️ pic.twitter.com/eV4n2r5pyG — Surya Kumar Yadav (@surya_14kumar) January 25, 2023 చదవండి: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా స్టార్ -
దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..!
ఆసియా కప్ 2022లో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్-4 దశలో తొలుత పాక్ చేతిలో, తాజాగా శ్రీలంక చేతిలో ఎదురైన ఘోర పరాభవాలను జీర్ణించుకోలేని అభిమానులు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం ఐపీఎలేనని విరుచుకుపడుతున్నారు. దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలన్న కసి టీమిండియాలో కొరడిందని, జాతికి ప్రాతినిధ్యం వహించేప్పుడు భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలాగేనా ఆడేదని ఏకి పారేస్తున్నారు. #boycottipl This is what happens when u have too many expectations on nations match just play ipl and generate money pic.twitter.com/83Ti8JYrmo — NihaL Vaishya 🇮🇳 (@VaishyaNihal) September 6, 2022 వెళ్లి ఐపీఎల్ ఆడి డబ్బు కూడబెట్టుకోండి.. భారత్ గెలిచినా, ఓడినా మీకు పట్టదు అంటూ ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి టీమిండియా ఓటముల్లో కీలక పాత్రధారిగా మారిన రిషబ్ పంత్‌ను ఎగాదిగా వాయించేస్తున్నారు. పంత్‌కు సీరియస్‌నెస్ అనేదే లేదని, దేశం కోసం ఆడుతున్నాడన్న ధ్యాసే లేదని, ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ క్రికెట్‌పై లేదని మండిపడుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లు ఇలా తయారవ్వడానికి ఐపీఎలే కారణమని, బీసీసీఐ ఇకనైనా మేల్కొని ఐపీఎల్‌కు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటమే మానేస్తారని హెచ్చరిస్తున్నారు. #boycottipl the Indian team has lost the will to win matches for the country. Lousy body language. pic.twitter.com/qvpm25592a — स्वतंत्र मैं 🇮🇳 (@anshukumarmish4) September 6, 2022 ఏడాదికి ఓసారి ఐపీఎల్ నిర్వహిస్తుంటేనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేప్పుడు భారత ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఏడాదికి రెండు ఐపీఎల్‌లు నిర్వహిస్తే అంతే సంగతులని కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఐపీఎల్ చూడటం మానేసినప్పుడే.. భారత ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేసి, క్యాష్ రిచ్ లీగ్ మాయలో కెరీర్లు నాశనం చేసుకుంటారని బల్ల గుద్ది చెబుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ఆటగాళ్ల తీరు మారకుంటే జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసి, ఐపీఎల్ ఆడని ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. The day from which Indian Public Stop watching IPL the day from. That this Useless team start playing for the country & pride not running for the money Same happens in the T20 WC #boycottipl pic.twitter.com/oOIGpX6XsN — 💫 ͡K͎ ͜ᴀ ʀ ͡ ͜ᴛ ʜ 𝚒 ͡💫🇮🇳 (@its_karthikoff) September 7, 2022 చదవండి: అర్షదీప్‌పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్ -
'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు!
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల కామెంట్లు తారాస్థాయిలో ఉంటాయి. మా జట్టు ఫెవరెట్ అని గొప్పలు చెప్పుకున్నప్పటికి.. ఆరోజు మ్యాచ్‌లో ఎవరు మంచి ప్రదర్శన చేస్తే వారికే విజయం దక్కుతుంది. తాజాగా మరికొద్ది గంటల్లో ఆసియాకప్ 2022లో భాగంగా భారత్, పాకిస్తాన్‌లు సూపర్-4లో మరోసారి తలపడనున్నాయి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్న సంగతి పక్కనబెడితే.. ఈ ఆదివారం హోరాహోరి పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించి ఆధితప్యం చెలాయించాలని చూస్తుంటే.. పాక్ మాత్రం ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక పాక్ అభిమాని తన ట్విటర్లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలుతుంది.. పాక్‌కు భారీ విజయం ఖాయం అంటూ పోస్ట్ చేశాడు. '' హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38 పరుగులకే ఆలౌటైంది. అదే ప్రదర్శనను పాక్ బౌలర్లు భారత్‌పై చేస్తారని ఊహించుకోండి.. ఫలితం మీకే కనిపిస్తుంది.. టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాజయం మూటగట్టుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు. పాక్ అభిమాని పోస్ట్ చూసిన భారత్ ఫ్యాన్స్ ఊరుకుంటారా. వెంటనే సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకసారి జరిగిందని ప్రతీసారి జరగాల్సిన అవసరం లేదు..'' కలల కనొచ్చు తప్పులేదు.. కానీ మీకు అంత సీన్ లేదు..''.. అదే 36 పరుగుల విషయంలో సీన్ రివర్స్ అయితే.. ఎలా ఉంటుంది'' అంటూ విమర్శలు వర్షం కురిపించారు. ఇక మరొక భారత అభిమాని మాత్రం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ''అవును టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కావొచ్చు.. కానీ చేధనలో మీ జట్టు(పాకిస్తాన్) 33 పరుగులకే కుప్పకూలనుంది. మా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్లోనే బెస్ట్ స్పెల్(3-1-6-9) నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోనున్నాడని ఊహించుకున్నాం.. ఇప్పుడేం చేస్తావు'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. Imagine Pakistan repeating the same bowling performance as of yesterday tomorrow as well and get India all out on 36 😭😭 — Fakhruu :^) 🏏 (@BajwaKehtaHaii) September 3, 2022 And there comes pakistan's batsmen to chase 37. 💥 . . . . . . . Ruko jara sabar Karo!!!🤚 . . . . Surprise surprise.... . Pak all out on 33/10. Bhuvi adjudged M.O.M for his best T20i performance of 3-1-6-9.💥 — Srinath Somani (@srinathsomani06) September 3, 2022 Once more today 😭😂 pic.twitter.com/bm4yY2OaZP — Nameisdarshan (@lingraddi) September 4, 2022 Than Imagine Pakistan lost by 6 runs — Naresh Malvi (@Naresh_Malvi1) September 3, 2022 చదవండి: 'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది' Mushfiqur Rahim: టీ20లకు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్ -
పాక్ విజయం: స్టెప్పులేసిన భారత ఫ్యాన్స్
బర్మింగ్‌హామ్: అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకపోతున్న కివీస్ జోరుకు పాక్ బ్రేక్ వేసింది. ప్రపంచకప్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్ఫరాజ్ సేన విజయం సాధించింది. దీంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. కివీస్‌పై విజయంతో పాక్ ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. మైదానం బయట పాక్ ఫ్యాన్స్‌తో కలిసి మనవాళ్లు భాంగ్రా నృత్యం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. మరోసారి టీమిండియా ఫ్యాన్స్ క్రీడాస్పూర్తిని చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే పాక్ ఓడిపోవాలని కోరుకునే భారత అభిమానులు.. ఆ దేశం గెలిచినందుకు సంబరాలు చేసుకోవడం ఆకట్టుకుందని పేర్కొంటున్నారు. కివీస్-పాక్ మ్యాచ్‌లో ఇదే హైలెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పాక్ జట్టుకు మద్దతుగా మైదానంలో సందడి చేశారు. ‘కమాన్ పాకిస్తాన్’అంటూ ఎంకరేజ్ చేశారు. ఒకరినొకరు కత్తులు దూసుకునే ఇరుజట్ల ఫ్యాన్స్ ఇలా కలిసి సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. -
క్రీడాస్పూర్తిని చాటుకున్నా భారత ఫ్యాన్స్
-
సర్ఫరాజ్‌కు టీమిండియా ఫ్యాన్స్ మద్దతు
లండన్: పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్‌కు టీమిండియా అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంగ్లండ్‌లో షాపింగ్ చేస్తున్న సర్ఫరాజ్‌ను ఓ అభిమాని తీవ్రంగా అవమానానికి గురిచేశాడు. షాపింగ్ చేస్తున్న సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడగగా అతడు అంగీకరించాడు. అంతలోనే సర్ఫరాజ్ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు జరిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ అభిమాని.. ‘సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా’ అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేయడంతో సర్ఫరాజ్‌కు మద్దతుగా టీమిండియా అభిమానులతో సహా యావత్ క్రికెట్ ప్రపంచం అండగా నిలిచింది. అభ్యంతరకర పదజాలంతో నోరుపారేసుకున్న సదరు వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. సర్ఫరాజ్‌తో అభిమాని ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. విజయం సాధించినప్పుడు భుజానికి ఎత్తుకోవడం, ఓడిపోయినప్పుడు కాళ్లతో తొక్కేయడం సబబు కాదని పేర్కొన్నారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక ఆటగాడిపై వ్యక్తిగతంగా మాటలదాడి చేయడం, అతని శరీర ఆకృతిని ప్రస్తావిస్తూ తిట్టడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్‌మీడియా ప్రభావంతో తన తప్పును తెలుసుకొని ఆ అభిమాని సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పాక్ కెప్టెన్ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్లోడ్ చేయలేదు. అది ఎలా వైరల్ అయ్యిందో నాకు తెలియదు. కానీ నేను చేసింది చాలా తప్పు. సర్ఫరాజ్‌తో ఉన్న చిన్నారి తన కొడుకని నాకు తెలియదు.’ అంటూ క్షమాపణలు కోరాడు. చదవండి: సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు! ‘గెలుపైనా, ఓటమైనా అందరిదీ’ -
టీమిండియా ఫ్యాన్స్‌పై పాక్ సారథి సెటైర్
టాంటాన్ : పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. వీలుచిక్కినప్పుడల్లా తన నోటికి పనిచెబుతూ వార్తల్లో నిలుస్తాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘పాక్ ఫ్యాన్స్ క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లను గౌరవిస్తారు. స్మిత్‌ను గత మ్యాచ్‌లో కొందరు ఎగతాళి చేసినట్లు తెలిసింది. కానీ పాక్ ఫ్యాన్స్ అలా ఎప్పటికీ చేయరు. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను కించపరిచేలా మా వాళ్లు ప్రవర్తించరు’అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ అభిమానులు కొందరు స్మిత్ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అయితే ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే సర్ఫరాజ్ అలా మాట్లాడాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాను గేలి చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని సర్ఫరాజ్ ఎదురుచూస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. చదవండి: బెయిల్స్ పడకపోవడం ఏంట్రా బాబు! మావాళ్ల తరఫున సారీ స్మిత్ : కోహ్లి -
యువీ ఎక్కడ.. ఫ్యాన్స్ ఫైర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్‌కు వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టి20 మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో యువరాజ్ పేరు లేకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఇంకా యువీలో ఉందని, అతడిని ఎంపిక చేయకపోవడం సమంజసం కాదని ట్విటర్లో పలురకాల కామెంట్లు పోస్ట్ చేశారు. పొట్టి ఫార్మాట్లో అతడు సాధించిన ఘనతలు మర్చిపోయారా అంటూ చురకలు అంటించారు. క్రికెటర్ల ఫిట్ నెస్ కు సంబంధించి నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించే యో -యో టెస్టులో దినేశ్ కార్తీక్, ఆశిష్ నెహ్రాలు పాసయ్యారా?అంటూ మరొక అభిమాని ప్రశ్నించాడు. ఎటువంటి పరీక్ష లేకుండానే వారిని ఎంపిక చేశారనేది సదరు అభిమాని ప్రశ్న. మరి అటువంటప్పుడు యువీ, రైనాలను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు. ఇక్కడ యువీతో పాటు సురేశ్ రైనా, అశ్విన్, జడేజా, రహానే, మహ్మద్ షమిలకు కూడా టి20 జట్టులో స్థానం దక్కలేదు. 38 ఏళ్ల వెటరన్ పేసర్ అశిష్ నెహ్రాకు జట్టులో చోటు కల్పించారు. టి20 స్పెషలిస్ట్ అయిన సురేశ్ రైనాను ఎంపిక చేయకపోవడం పట్ల కూడా అభిమానులు కామెంట్లు పెట్టారు. sad to not see raina and yuvraj again https://t.co/JCuyexVyfJ — Anish (@Annikadyan) October 2, 2017 Now all eyes on Yuvraj Singh's dadhttps://t.co/pi5fCDvgau — Beingsandy (@sandylot14) October 2, 2017 You pick Dinesh Karthik and Nehra. DID THEY PASS THE YO-YO TEST? WHERE IS YUVI AND RAINA. — Bacca (@MrChocoBacca) October 1, 2017 I'm surprised why people want Raina and Yuvraj for T20Is despite being unfit and are questioning over Nehra's selection. #INDvAUS — Abhay Gupta (@IamAbGupta) October 2, 2017 Yuvi is now useless but he should be given farewell match by BCCI for his contributions,Yuvi at best can score once a while in 10 matches — Murari Lal (@SumitPrakash21) October 1, 2017 Yaa Raina is t20 king So why no take @ImRaina in #TeamIndia — Suresh Raina (@Jack_Parmar12) October 1, 2017 Once again no @ImRaina this is not good... U have to give him a chance — Sudharsan KN (@I_m_sudharsan) October 1, 2017 I am surprise to c nehra IN and NO raina & yuvraj — Rajneesh Kumar (@rajneesh_kumar_) October 2, 2017 -
గొల్లుమన్న జనం.. బిత్తరపోయిన మాల్యా
లండన్: భారత ప్రభుత్వాన్ని, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సైటర్లతో మాల్యాపై విరుచుకుపడుతున్న సామాన్య జనం నేరుగా ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఊహించని పరిణామంలో మాల్యా ఒక్కసారిగా బిత్తరపోయారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవర్ మైదానానికి వచ్చారు. నీలం రంగు సూటులో మెరిసిపోతూ స్టేడియం లోపలికి వెళుతున్న మాల్యాను చూసి టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా ‘దొంగ, దొంగ’ అంటూ కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టారు. ఊహించని పరిణామంలో షాక్ తిన్న మాల్యా వడివడిగా స్టేడియం లోపలకు వెళ్లిపోయారు. భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి లండన్ పారిపోయిన మాల్యా అక్కడ దర్జాగా తిరుగుతున్నారు. గత ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను కూడా స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా తిలకించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్వహించిన ‘చారిటీ డిన్నర్’ హాజరై టీమిండియా క్రికెటర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు.