లండన్: భారత ప్రభుత్వాన్ని, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సైటర్లతో మాల్యాపై విరుచుకుపడుతున్న సామాన్య జనం నేరుగా ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఊహించని పరిణామంలో మాల్యా ఒక్కసారిగా బిత్తరపోయారు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవర్ మైదానానికి వచ్చారు. నీలం రంగు సూటులో మెరిసిపోతూ స్టేడియం లోపలికి వెళుతున్న మాల్యాను చూసి టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా ‘దొంగ, దొంగ’ అంటూ కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టారు. ఊహించని పరిణామంలో షాక్ తిన్న మాల్యా వడివడిగా స్టేడియం లోపలకు వెళ్లిపోయారు.
భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి లండన్ పారిపోయిన మాల్యా అక్కడ దర్జాగా తిరుగుతున్నారు. గత ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను కూడా స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా తిలకించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్వహించిన ‘చారిటీ డిన్నర్’ హాజరై టీమిండియా క్రికెటర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
గొల్లుమన్న జనం.. బిత్తరపోయిన మాల్యా
Published Sun, Jun 11 2017 7:09 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM
Advertisement
Advertisement