ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అతిధి | Ind vs Eng: Team India Super Fan Sudhir Gautam Choudhary Going To Be Special Attraction - Sakshi
Sakshi News home page

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అతిధి

Published Thu, Jan 25 2024 7:16 AM | Last Updated on Thu, Jan 25 2024 8:41 AM

Team India Super Fan Sudhir Gautam Choudhary Going To Be Special Attraction In India Vs England Hyderabad Test Match - Sakshi

టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినా వాలిపోయే వీరాభిమాని సుదీర్‌ గౌతమ్‌ చౌధరీ హైదరాబాద్‌కూ వచ్చేశాడు. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో అతను తనదైన శైలిలో భారత్‌–ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ కోసం సమర శంఖం పూరించాడు. సచిన్‌కు అతిపెద్ద ఫ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ... సచిన్‌ రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆటపై తన ప్రేమను కొనసాగిస్తూ ప్రతీ మైదానంలో కనిపిస్తూ వస్తున్నాడు. మొత్తానికి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లో సుదీర్‌ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు.

కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో గెలుపు లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌లో చాలాకాలం తర్వాత జరుగనున్న టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో స్థానిక అభిమానులు మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్‌ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement