సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్‌డ్ ఫోర్స్, ఎస్‌బీ, సీసీఎస్, ఎస్‌ఓటీ, ఐటీ సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1,500 పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు బుధవారం రాచకొండ కమిషనర్ జి.సుధీర్‌బాబు వెల్లడించారు.
మైదానం చుట్టూ, 360 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గేట్ నంబరు–1 కేవలం ఆటగాళ్ల కోసమే కేటాయించాం. మ్యాచ్‌కు 3 గంటల ముందు మాత్రమే వీక్షకులకు మైదానంలోకి అనుమతిస్తారు. మ్యాచ్ సమయంలో రహదారులు, కూడళ్లలో సాధారణ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రద్దీని క్రమబదీ్ధకరించేందుకు 250 మంది పోలీసులు విధుల్లో ఉంటారు.
టీఎస్ ఐలా, జెన్‌ప్యాక్ట్, ఎన్‌జీఆర్‌ఐ ప్రాంతాలలో 15 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశాం. మ్యాచ్ సమయంలో ఎల్బీనగర్, వరంగల్ మార్గం నుంచి హబ్సిగూడ మీదుగా భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ఈ నెల 29 వరకు ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని సీపీ సు«దీర్‌బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment