Hyderabad test
-
IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఆ జట్టు తొలిసారి ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఏకైక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగింది. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడినే బరిలోకి దించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మ్యాచ్‌లో వుడ్‌ను బరిలోకి దించినా, తొలి రోజు ఆటలో అతనిచే కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించింది. తొలి రోజు ఇంగ్లండ్ మొత్తంగా 23 ఓవర్లు వేయగా.. అందులో 21 ఓవర్లు స్పిన్నర్లు టామ్ హార్ట్లీ (9), జాక్ లీచ్ (9), రెహాన్ అహ్మద్‌లే (3) షేర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇలా ముగ్గురు స్పిన్నర్లతో టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగడం కూడా చాలా అరుదు. హైదరాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఆటను బట్టి చూస్తే ఇంగ్లండ్ అంచనా కరెక్టే అయినప్పటికీ.. భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన స్టోక్స్ వికెట్ సహా రెండు వికెట్లు తీయడం విశేషం. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న (జనవరి 25) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టోక్స్ (70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 20, బెన్ డకెట్ 35, ఓలీ పోప్ 1, జో రూట్ 29, బెయిర్‌స్టో 37, ఫోక్స్ 4, రెహాన్ అహ్మద్ 13, టామ్ హార్ట్లీ 23, మార్క్ వుడ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిధి
టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా వాలిపోయే వీరాభిమాని సుదీర్ గౌతమ్ చౌధరీ హైదరాబాద్‌కూ వచ్చేశాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో అతను తనదైన శైలిలో భారత్–ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం సమర శంఖం పూరించాడు. సచిన్‌కు అతిపెద్ద ఫ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ... సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆటపై తన ప్రేమను కొనసాగిస్తూ ప్రతీ మైదానంలో కనిపిస్తూ వస్తున్నాడు. మొత్తానికి భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లో సుదీర్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలుపు లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌లో చాలాకాలం తర్వాత జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో స్థానిక అభిమానులు మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. -
నేటి నుంచి ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్డ్ ఫోర్స్, ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, ఐటీ సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1,500 పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు బుధవారం రాచకొండ కమిషనర్ జి.సుధీర్‌బాబు వెల్లడించారు. మైదానం చుట్టూ, 360 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గేట్ నంబరు–1 కేవలం ఆటగాళ్ల కోసమే కేటాయించాం. మ్యాచ్‌కు 3 గంటల ముందు మాత్రమే వీక్షకులకు మైదానంలోకి అనుమతిస్తారు. మ్యాచ్ సమయంలో రహదారులు, కూడళ్లలో సాధారణ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రద్దీని క్రమబదీ్ధకరించేందుకు 250 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. టీఎస్ ఐలా, జెన్‌ప్యాక్ట్, ఎన్జీఆర్ఐ ప్రాంతాలలో 15 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశాం. మ్యాచ్ సమయంలో ఎల్బీనగర్, వరంగల్ మార్గం నుంచి హబ్సిగూడ మీదుగా భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ఈ నెల 29 వరకు ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని సీపీ సు«దీర్‌బాబు పేర్కొన్నారు. -
ఉమేశ్ ఉప్పెన...
సాక్షి, హైదరాబాద్: ‘నేనెప్పుడైనా పొదుపుగా బౌలింగ్ చేసి బయట పడిపోవాలని ప్రయత్నించను... నా చేతిలో బంతి ఉందంటే వికెట్లు తీయడంపైనే దృష్టి పెడతా’... ఇటీవల తన బౌలింగ్ గురించి ఉమేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బౌలింగ్ పదును ఏమిటో తాజాగా హైదరాబాద్ టెస్టులో కనిపించింది. జీవం లేని భారత పిచ్‌లపై ఒక ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం అంత సులువు కాదు. విదేశాల్లో మన పేసర్లు చెలరేగిపోవడం కూడా కొత్త కాదు. కానీ సత్తా ఉంటే భారత్‌లో కూడా పేసర్లు సత్తా చాటగలరని ఉమేశ్ నిరూపించాడు. బౌన్స్‌కు అనుకూలించిన ఉప్పల్ పిచ్‌పై అతను చక్కటి ఫలితం రాబట్టాడు. భారత్‌లో 5 వికెట్లు, 10 వికెట్లు తీసిన బౌలర్ అంటే ఏ అశ్వినో, జడేజానో అని అలవాటుగా మారిపోయిన అందరికీ నేనున్నానని ఉమేశ్ గుర్తు చేశాడు. స్వదేశంలో 19 ఏళ్ల తర్వాత 10 వికెట్ల ఘనత సాధించిన పేసర్‌గా కపిల్, శ్రీనాథ్‌ల సరసన నిలిచాడు. సొంతగడ్డపై వచ్చేసరికి భారత ప్రధాన పేసర్‌గా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కాయి. ఆగస్టు 2016 నుంచి భారత్ ఇక్కడ 18 టెస్టులు ఆడితే అతను 17 ఆడాడు. సొంతగడ్డపై తన ఎంపికకు ప్రతీసారి న్యాయం చేశాడు. మొత్తంగా భారత్‌లో 24 టెస్టుల్లో ఉమేశ్ పడగొట్టిన 73 వికెట్లలో 38 బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూలే ఉన్నాయి. ఇది అతని బౌలింగ్ సత్తాను చూపించింది. హైదరాబాద్ టెస్టులో ఉమేశ్ ప్రదర్శన అతని కఠోర శ్రమకు, పట్టుదలకు నిదర్శనం. భారత్‌లో గత రెండేళ్లుగా అద్భుతమైన రికార్డు ఉన్నా విదేశాలకు వెళ్లేసరికి అతనికి తుది జట్టులో స్థానం లభించడమే గగనంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కలిపి ఎనిమిది టెస్టుల్లో అతనికి రెండు మ్యాచ్‌లు మాత్రమే లభించాయి. సుదీర్ఘ కాలంగా జట్టుతో ఉన్నా ఇషాంత్, షమీ, భువనేశ్వర్‌ల తర్వాతే అతనికి అవకాశం దక్కేది. ఇప్పుడు పైజాబితాలో బుమ్రా కూడా చేరడంతో ఉమేశ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే దీనికి అతను కుంగిపోలేదు. ఏ దశలోనూ సహనం కోల్పోని ఉమేశ్... ‘వారంతా బాగా ఆడుతుంటే నేను చోటు ఆశించడం తప్పు. నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం చెలరేగాల్సిందే’ అంటూ నిజాయితీగా వ్యాఖ్యానించాడు. వరుసగా అవకాశాలు దక్కకపోయినా... ఎప్పుడో ఒకసారి మ్యాచ్ అవకాశం దక్కినా 100 శాతానికి పైగా శ్రమిస్తూ పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేయడం ఉమేశ్‌కు బాగా తెలుసు. రెండో టెస్టులో శార్దుల్ గాయంతో సింగిల్ హ్యాండ్ పేసర్‌గా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఒక రోజులో భారత గడ్డపై ఒక పేసర్ ఏకంగా 23 ఓవర్లు బౌలింగ్ చేయడం అసాధారణం. కానీ ఉమేశ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇది అతని ఫిట్నెస్ సామర్థ్యానికి సూచిక. అతని 118 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్లో ఇదే మొదటి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కావడం విశేషం. వేగానికి స్వింగ్ జోడిస్తే ఆ బౌలింగ్‌కు ఏ ఫార్మాట్లోనైనా తిరుగుండదని నమ్మే ఉమేశ్ ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై అత్యంత కీలకంగా మారతాడనడంలో సందేహం లేదు. 2012లో పెర్త్ వికెట్‌పై ఐదు వికెట్లు తీసిన అతను ఈసారి మరింత జోష్‌తో అక్కడికి వెళ్లడం ఖాయం. పదో వికెట్ కోసం... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ ఉమేశ్ వేశాడు. అప్పటికే విండీస్ 6 వికెట్లు కోల్పోతే అతను 3 వికెట్లు తీశాడు. అయితే తర్వాతి 13 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. విండీస్ 9 వికెట్లు కోల్పోయిన దశలో 47వ ఓవర్ జడేజా వేయడానికి సిద్ధమయ్యాడు. బంతిని తీసుకొని ఇక ఓవర్ మొదలు పెట్టడమే ఆలస్యం. అయితే అప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టని కోహ్లికి ఒక్కసారిగా ఉమేశ్ పదో వికెట్ ఘనత గుర్తుకొచ్చినట్లుంది. దాంతో జడేజా నుంచి బంతి తీసుకొని లాంగాన్‌లో ఉన్న ఉమేశ్‌ను పిలిచాడు. జడేజా కూడా నవ్వుతూ అతని భుజం చరిచి బెస్టాఫ్ లక్ చెప్పాడు. ఒకే ఒక్క బంతి... అంతే గాబ్రియెల్ క్లీన్ బౌల్డ్, ఉమేశ్ కెరీర్లో తొలిసారి 10 వికెట్ల ఘనత.. సహచరులంతా గట్టిగా అభినందిస్తూ అతని జుట్టు ముడి తీసి సరదాగా నవ్వుతుండగా ఉమేశ్ సగర్వంగా పెవిలియన్ వైపు చేరాడు. -
ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత
హైదరాబాద్: టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు సాధించిన ఎనిమిదో భారత పేసర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ భారత్ తరఫున ఏడుగురు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఆ తర్వాత స్థానాన్ని ఉమేశ్ ఆక్రమించాడు. హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిపోయిన ఉమేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా తొలిసారి 10 వికెట్లను సాధించాడు. అంతకముముందు కపిల్‌దేవ్, చేతన్ శర్మ, వెంకటేశ్ ప్రసాద్, జవగళ్ ప్రసాద్, ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు మాత్రమే టీమిండియా తరఫున ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన పేసర్లు. కాగా, కపిల్‌దేవ్, ఇర్ఫాన్ పఠాన్లు రెండేసి సార్లు ఆ ఘనత సాధించారు. రెండో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. కేఎల్ రాహుల్(33 నాటౌట్), పృథ్వీ షా(33 నాటౌట్) వికెట్ పడకుండా భారత్‌కు విజయాన్ని అందించారు. దాంతో విరాట్ గ్యాంగ్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ను టీమిండియా బెంబేలెత్తించింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్ అంబ్రిస్(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్ హోప్(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. టీమిండియాదే సిరీస్ -
టీమిండియాదే సిరీస్
హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. విండీస్ నిర్దేశించిన 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్( 33 నాటౌట్), పృథ్వీ షా(33 నాటౌట్)లు వికెట్ పడకుండా ఆడి టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన విరాట్ గ్యాంగ్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ను టీమిండియా బెంబేలెత్తించింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్ అంబ్రిస్(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్ హోప్(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం చెలరేగి బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకుని తన టెస్టు కెరీర్లో తొలిసారి ఆ ఘనతను లిఖించుకున్నాడు. అతనికి జతగా రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. కుల్డీప్‌కు వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 311 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 127 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 367 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 72/0 విండీస్‌ను కూల్చేశారు.. -
విండీస్‌ను కూల్చేశారు..
హైదరాబాద్: టీమిండియా బౌలర్ల విజృంభణతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 127 పరుగులకే చాపచుట్టేసింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ను టీమిండియా బెంబేలెత్తించింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్ అంబ్రిస్(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్ హోప్(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఫలితంగా భారత్‌కు 72 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం చెలరేగి బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకుని తన టెస్టు కెరీర్లో తొలిసారి ఆ ఘనతను లిఖించుకున్నాడు. అతనికి జతగా రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. కుల్డీప్‌కు వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 5 వికెట్లతో భారత్ జోరుకు బ్రేక్ వేశాడు. 308/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. మరొకొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్(92: 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను గాబ్రియల్ దెబ్బతీశాడు. దీంతో పంత్ మరోసారి శతకాన్ని చేజార్చుకుని పెవిలియన్ చేరాడు. గత రాజ్‌కోట్ టెస్ట్‌లో సైతం పంత్ 92 పరుగులకే వెనుదిరగడం గమనార్హం. చివర్లో అశ్విన్ టెయిలండర్లు కుల్దీప్(6), ఉమేశ్ యాదవ్(2), ఠాకుర్ (4) సాయంతో 45 పరుగులు జోడించాడు. చివర్లో అశ్విన్ (35) ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయ్యో పంత్! మళ్లీనా? చెలరేగిన హోల్డర్.. భారత్ 367 ఆలౌట్ -
ఉప్పల్ టెస్ట్: 45కే నాలుగు వికెట్లు
సాక్షి, హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 367 పరుగులకు ముగించగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్లు డకౌట్ కావడం విశేషం. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్, హెట్‌మైర్ లు ఆచితూచి ఆడేప్రయత్నం చేశారు. కుల్దీప్ హెట్‌మైర్(17)ను ఔట్ చేయగా..జడేజా హోప్(28)ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో విండీస్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
చెలరేగిన హోల్డర్.. భారత్ 367 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 5 వికెట్లతో భారత్ జోరుకు బ్రేక్ వేశాడు. 308/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. మరొకొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్(92: 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను గాబ్రియల్ దెబ్బతీశాడు. దీంతో పంత్ మరోసారి శతకాన్ని చేజార్చుకుని పెవిలియన్ చేరాడు. గత రాజ్‌కోట్ టెస్ట్‌లో సైతం పంత్ 92 పరుగులకే వెనుదిరగడం గమనార్హం. చివర్లో అశ్విన్ టెయిలండర్లు కుల్దీప్(6), ఉమేశ్ యాదవ్(2), ఠాకుర్ (4) సాయంతో 45 పరుగులు జోడించాడు. చివర్లో అశ్విన్ (35) ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి సేనకు 56 పరుగుల ఆధిక్యం లభించింది. -
కోహ్లిపై అభిమానంతో మైదానంలోకి దూసుకొచ్చి..
-
అభిమాని చర్యతో అవాక్కైన కోహ్లి
సాక్షి, హైదరాబాద్ : భారత్-వెస్టిండీస్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసిక్తకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ మైదానంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వద్దకు పరుగెత్తాడు. అతని కౌగిలించుకోని తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా కోహ్లి చెంపలపై ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ అభిమాని చర్యతో కోహ్లితో పాటు మైదానంలోని ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఇక తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకున్ని అదుపులోకి తీసుకోని బయటకు పంపించారు. ఈ ఘటన 15 ఓవర్లో చోటుచేసుకుంది. మిడ్‌వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు ఆకస్మాత్తుగా ఆ అభిమాని పరుగెత్తుకొచ్చాడు. ఈ ఘటనతో ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు డ్రింక్స్ విరామం ప్రకటించారు. ఇక కోహ్లికి ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇదే తొలిసారేం కాదు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సైతం ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చి అతని కాళ్లు మొక్కాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పోలీసుల అదుపులో ఉన్న ఆ అభిమాని కడపకు చెందిన మహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. -
మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్
హైదరాబాద్: భారత్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంచ్ విరామ సమయానికి వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్లు ఇద్దరి ఓపెనర్లను పెవిలియన్ చేర్చారు. పోవెల్ (22)ను అశ్విన్ క్యాచ్ ఔట్ చేయగా.. బ్రాత్‌వైట్ (14)ను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్, హెట్మెయిర్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఉమేశ్ యాదవ్ హోప్(36) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ 86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన శార్థుల్ ఠాకుర్‌ను దురదృష్టం వెంటాడింది. 10 బంతులు వేయగానే అతను గాయంతో మైదానాన్ని వీడాడు. -
సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో..అంతలోనే!
-
అరంగేట్రం అంతలోనే గాయం!
సాక్షి, హైదరాబాద్ : ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు’ టీమిండియా యువబౌలర్ శార్థుల్ ఠాకుర్‌కు రాకరాక అవకాశం వస్తే అంతలోనే దురదృష్టం వెంటాడింది. ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో ఈ యువబౌలర్ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన విండీస్.. బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ ఫీల్డింగ్‌కు దిగింది. తొలి టెస్ట్ ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఈ నొప్పితో అతను విలవిలలాడాడు. చివరకు, కెప్టెన్ కోహ్లి, ఫిజియో సూచన మేరకు మైదానం వీడాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు అయ్యో ఠాకుర్ అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. శార్థుల్ 3.4 బంతులే వేయగా అశ్విన్ మిగిలిన రెండు బంతులను పూర్తి చేశాడు. -
హైదరాబాద్ టెస్ట్: శార్ధుల్ ఠాకుర్ అరంగేట్రం
హైదరాబాద్: భారత్‌తో ఉప్పల్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌తో భారత యువ బౌలర్ శార్దుల్ ఠాకుర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ ఆటనే పునరావృతం చేస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. మహ్మద్ షమీ స్థానంలో శార్ధుల్ ఠాకుర్ అరంగ్రేటం చేస్తున్నట్లు తెలిపాడు. వెస్టిండీస్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కీమర్ రోచ్, షెమాన్ లూయిస్ స్థానాల్లో జట్టులోకి కీమోపాల్, జోమెల్ వారికాన్లు వచ్చారు. తొలి టెస్టులో దారుణంగా ఓడిన విండీస్ ఈ టెస్టును ఎలాగైన నెగ్గి పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక భారత్ మాత్రం తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా, ఉమేశ్, కుల్దీప్, శార్ధుల్. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షై హోప్, ఆంబ్రిస్, హెట్మెయర్, ఛేజ్, డౌరిచ్, బిషూ, వారికన్, గాబ్రియెల్. -
మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే
సాక్షి, హైదరాబాద్ : వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న ఈ హైదరాబాద్ బౌలర్‌కు మరోసారి జట్టు మేనేజ్మెంట్ మొండి చెయ్యి చూపించింది. సిరాజ్‌తో పాటు మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి సైతం రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కలేదు. మ్యాచ్‌కు ముందు ఒకరోజే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ ఓ కొత్త సంప్రదాయానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్, విహారిల పేర్లు లేవు. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్ట్‌కు సైతం బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఈ తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం లభిస్తోందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ అందరి అంచనాలను పటాపంచల్ చేస్తూ వీరికి అవకాశం కల్పించకుండా జట్టును ప్రకటించింది. ఇక మయాంక్ అగర్వాల్‌కు కూడా నిరాశే ఎదురైంది. తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ విఫలమైనా జట్టు మేనేజ్మెంట్ అతనికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనే రాహుల్‌కు మరో అవకాశం ఇచ్చి ఉంటారని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశవాళీ, భారత్-ఏ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌కు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేసిన విహారికి విండీస్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశం దక్కకపోవడం గమనార్హం. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ప్రకటించిన జట్టులో ముగ్గుర్లు స్పిన్నర్లు అవసరమైతే.. శార్థుల్ ఠాకుర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఒకవేళ ఇద్దరి స్పిన్నర్లతో బరిలో దిగితే మాత్రం కుల్దీప్పై వేటు పడే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రకటించిన తుది జట్టు విరాట్ కోహ్లి (కెప్టెన్), పృథ్వీషా, కేఎల్ రాహుల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దుల్ ఠాకుర్. Team India for the 2nd Test against Windies at Hyderabad 🇮🇳 #INDvWI pic.twitter.com/QMgNm6jf4Q — BCCI (@BCCI) October 11, 2018 -
విరాట్ కోహ్లీ.. ఓ ఆసక్తికర సీన్!
-
విరాట్ కోహ్లీ.. ఓ ఆసక్తికర సీన్!
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిరోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్, కీపర్ ముష్ఫికర్ రహీమ్ చేసిన ఓ పనికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాసేపు నవ్వు ఆగలేదు. నాన్ స్ట్రైకర్ విజయ్ కి విషయాన్ని చెప్పి మరీ నవ్వుకున్నాడు. స్డేడియంలో కాసేపు అందరికీ ఈ సీన్ వినోదాన్ని పంచింది. అసలే ఏమైందంటే.. సెంచరీ వీరుడు మురళీ విజయ్ 101 పరుగులు, విరాట్ కోహ్లీ 31 పరుగుల వద్ద ఉన్నారు. ఆ సమయంలో ఇండియా స్కోరు 223/2. బంగ్లా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 62వ ఓవర్లో ఓ బంతిని కోహ్లీ డిఫెన్స్ చేశాడు. సరిగ్గా ఆ బంతి కోహ్లీ బ్యాట్ కు మిడిల్ లో తగిలింది. అయితే దీన్ని కెప్టన్ కమ్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అంచనా వేయడంలో పొరపాటు చేశాడు. బంతి కోహ్లీ ప్యాడ్ కు తగిలిందా అని షార్ట్ లెగ్ ఫీల్డర్ తో చర్చించిన ముష్ఫికర్ వెంటనే అంపైర్ ను ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరాడు. దీంతో కోహ్లీకి పట్టరాని సంతోషం వేసింది. బంగ్లా ఓ రివ్యూను ఇంత సులువుగా కోల్పోతుందన్న విషయం తెలిసిన కోహ్లీ, నాన్ స్ట్రైకర్ విజయ్ తో కలిసి బంతి, బ్యాట్ కు ఎక్కడ తగిలిందో చెప్పి రివ్యూ నిర్ణయం వెలువడే వరకు నవ్వుతూ కనిపించాడు. అనంతరం విజయ్ (108) ఔట్ కాగా, కోహ్లీ మాత్రం తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి అజేయ శతకం(111, 141 బంతుల్లో 12 ఫోర్లు)తో, రహానే 45 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. తొలిరోజు భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. -
కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత!
-
కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత!
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు పరుగులు చేసింది. ఈ క్రమంలో సెంచరీ వీరుడు కోహ్లీ ఓ అరుదైన ఫీట్ సాధించాడు. కోహ్లీ టెస్టుల్లో తానాడిన ప్రతి ప్రత్యర్థి జట్లపై సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ ఆరు టెస్ట్ హోదా జట్లపై సెంచరీ బాదిన కోహ్లీ, తాజాగా గురువారం బంగ్లాపై సెంచరీతో తాను ఆడిన ఏడు టెస్ట్ హోదా దేశాలపై సెంచరీ చేసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో రికార్డుకు 31 పరుగుల దూరంలోనూ నిలిచాడు. సెహ్వాగ్ రికార్డుకు 30 పరుగుల దూరంలో కోహ్లీ ఉప్పల్ స్డేడియంలో 130 బంతుల్లో కోహ్లీ సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్లో ఇది 16వ టెస్ట్ సెంచరీ. కాగా, టెస్టు హోదా ఉన్న పాకిస్తాన్, జింబాబ్వే జట్లపై కోహ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. ఓ సీజన్లో భారత గడ్డపై అత్యధిక స్కోరు చేసిన జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు. 2016-17 సీజన్లో 15 టెస్టులాడిన కోహ్లీ 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 1075 పరుగులు చేసి సెహ్వాగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. మరో 31 పరుగులు చేస్తే కోహ్లీ అగ్రస్థానంలో నిలుస్తాడు. 2004-05 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ 17 మ్యాచ్ లాడి 4 సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 1105 పరుగులు చేసిన విషయం తెలిసిందే. -
శతకాలతో చెలరేగిన కోహ్లీ, విజయ్
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. తొలి రోజు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ రాహుల్(2)ను బంగ్లా బౌలర్ టస్కీన్ అహ్మద్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకొచ్చిన చతేశ్వర్ పుజారా(83)తో కలిసి మరో ఓపెనర్ మురళీ విజయ్ ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. రెండో వికెట్ కు భారీ సెంచరీ భాగస్వామ్యాన్ని (178 పరుగులు) అందించిన తర్వాత పుజారాను హసన్ మిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ సాధించిన విజయ్(108, 160 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్) ఆ కొద్దిసేపటికే తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కోహ్లీ సేన టీ విరామానికి 2 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టీ బ్రేక్ తర్వాత కోహ్లీ హవా! టీ సమయానికి 17 పరుగులతో ఉన్న కోహ్లీ బ్రేక్ అనంతరం వేగాన్ని పెంచాడు. 96 పరుగుల వద్ద కోహ్లీ ఫోర్ కొట్టి టెస్టు కెరీర్లో 16వ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. 130 బంతుల్లో కోహ్లీ సెంచరీ సాధించాడు. విజయ్ ఔటయ్యాక రహానే(45 నాటౌట్)తో కలిసి కోహ్లీ (111 నాటౌట్, 141 బంతుల్లో 12 ఫోర్లు) పరుగుల వేగాన్ని పెంచేశాడు. కోహ్లీ-రహానే జోడీ కేవలం 26.2 ఓవర్లలో 4.63 రన్ రేట్‌తో నాలుగో వికెట్‌కు సెంచరీ (122 పరుగులు) భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో తొలి రోజు నిర్ణీత ఓవర్లలో ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో టస్కీన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్, హసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు. -
68 ఏళ్ల రికార్డు బద్దలైంది!
హైదరాబాద్: ఉప్పల్ స్డేడియంలో టీమిండియా ఆటగాళ్లు మురళీ విజయ్(108), చతేశ్వర్ పుజారా(83 పరుగులు) అరుదైన రికార్డు నెలకొల్పారు. భారత గడ్డపై ఓ సీజన్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత జోడీగా అరుదైన ఫీట్ ను ఈ క్రికెటర్లు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో దాదాపు 68 ఏళ్ల టెస్టు క్రికెట్ రికార్డు బద్దలైంది. 1948-49 సీజన్లో భారత ఆటగాళ్లు విజయ్ హజారే- రుసి మోడీ నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్డేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి రోజున విజయ్-చతేశ్వర్ పుజారా సెంచరీ భాగస్వామ్యాన్ని (178 పరుగులు) అందించారు. 2016-2017 సీజన్లో ఇది వీరికి ఐదో సెంచరీ భాగస్వామ్యం. దీంతో 1948-49 సీజన్లో విజయ్ హజారే-రుసి మోడీ సాధించిన నాలుగు సెంచరీ భాగస్వామ్యాల రికార్డును విజయ్-పుజారా సవరించినట్లయింది. ఈ క్రమంలో పుజారా మరో అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 1964-65లో చందు బోర్డే సాధించిన అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు (1604) రికార్డును పుజారా (1605 పరుగులు) అదిగమించాడు. -
భారీ స్కోరు దిశగా టీమిండియా
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ చెలరేగాడు. సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. విరాట్ కోహ్లీ సేన టీ విరామానికి 2 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మురళీ విజయ్‌తో పాటు చటేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. కాగా పుజారా (83) సెంచరీ చేజార్చుకున్నాడు. విజయ్ (98)కు తోడు కోహ్లీ (17) బ్యాటింగ్ చేస్తున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ విజయ్, పుజారాతో కలసి జట్టును ఆదుకున్నాడు. టీమిండియా లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా 86 పరుగులు చేసింది. విజయ్, పుజారా తొలి సెషన్లో అజేయంగా 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. -
రాణించిన విజయ్, పుజారా
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా రాణిస్తున్నారు. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2) తొలి ఓవర్లోనే అవుట్ కాగా.. మరో ఓపెనర్ విజయ్, పుజారాతో కలసి జట్టును ఆదుకున్నాడు. గురువారం ఉప్పల్ స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. విజయ్ (45), పుజారా (39) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ తొలి సెషన్లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. -
టాస్ గెలిచిన విరాట్
-
టాస్ గెలిచిన విరాట్
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. కేఎల్ రాహుల్, మురళీ విజయ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇరు జట్లు: భారత్: మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానే, అశ్విన్, సాహా (కీపర్), జడేజా, భువనేశ్వర్, ఇషాంత్, ఉమేష్ బంగ్లాదేశ్: తమీమ్, సర్కార్, మొమినుల్, మహ్మదుల్లా, షకీబల్, రహీం (కెప్టన్/కీపర్), సబ్బీర్, మెహిది హసన్, తైజుల్, తస్కిన్, కమ్రుల్ -
టీమిండియాలో కొత్త కుర్రాడు అరంగేట్రం!
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆడటం లేదు. టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న మిశ్రాను మోకాలి గాయం బాధిస్తోంది. ఇంగ్లండ్ తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మిశ్రా ఇంకా కోలుకోలేదు. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న ఏకైక టెస్టు నుంచి అతడికి విశ్రాంతి ఇచ్చారు. జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజాలు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నందున గాయపడ్డ మిశ్రా స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ తుది జట్టులో అవకాశం లభించనుంది. కుల్దీప్ యాదవ్ టెస్టు అరంగేట్రం సీనియర్ స్పిన్నర్ మిశ్రా గాయం కారణంగా యువ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో యువ బౌలర్ కుల్దీప్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుల్దీప్ 1/32, 2/2 ప్రదర్శన చేశాడు. 22 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన కుల్దీప్ 33.11 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ ల్లో 5వికెట్ల ప్రదర్శనతో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని సహచరులు సన్నాహాలు మొదలుపెట్టారు. మ్యాచ్ వేదికైన ఉప్పల్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. -
భారత్‌లో ఎప్పుడైనా కష్టమే: షకీబ్
న్యూఢిల్లీ: టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో వారి దేశంలోనే టెస్టు మ్యాచులు చాలా కష్టమని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ అసన్ అన్నాడు. భారత్, బంగ్లా జట్లు ఫిబ్రవరి 9-13 తేదీల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఎన్నో ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడిన అనుభవం ఉన్నా.. తొలిసారిగా వారిగడ్డపై భారత్‌తో టెస్ట్ ఆడనుండటం చాలా ఎగ్జైజ్మెంట్గా ఉందన్నాడు షకీబ్. యువ ఆటగాళ్లతో బంగ్లా టీమ్ భారత్‌కు వచ్చిందన్నాడు. 'ర్యాంకులు, ఆటపరంగా ఏ విధంగా చూసిన భారత్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే తలపడినప్పుడూ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాం. సమష్టి కృషితో భారత్‌కు పోటీ ఇవ్వాలని భావిస్తున్నాం. ఇక్కడి వికెట్ నా బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. కానీ, టీమిండియా బ్యాటింగ్, స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది' అని భారత్-ఏతో జరుగుతున్న రెండు రోజుల వార్మప్ మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఈ వివరాలు వెల్లడించాడు.