బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు పరుగులు చేసింది. ఈ క్రమంలో సెంచరీ వీరుడు కోహ్లీ ఓ అరుదైన ఫీట్ సాధించాడు. కోహ్లీ టెస్టుల్లో తానాడిన ప్రతి ప్రత్యర్థి జట్లపై సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ ఆరు టెస్ట్ హోదా జట్లపై సెంచరీ బాదిన కోహ్లీ, తాజాగా గురువారం బంగ్లాపై సెంచరీతో తాను ఆడిన ఏడు టెస్ట్ హోదా దేశాలపై సెంచరీ చేసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో రికార్డుకు 31 పరుగుల దూరంలోనూ నిలిచాడు.