
సాక్షి, హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 5 వికెట్లతో భారత్ జోరుకు బ్రేక్ వేశాడు. 308/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు.
గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. మరొకొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్(92: 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను గాబ్రియల్ దెబ్బతీశాడు. దీంతో పంత్ మరోసారి శతకాన్ని చేజార్చుకుని పెవిలియన్ చేరాడు. గత రాజ్‌కోట్ టెస్ట్‌లో సైతం పంత్ 92 పరుగులకే వెనుదిరగడం గమనార్హం. చివర్లో అశ్విన్ టెయిలండర్లు కుల్‌దీప్(6), ఉమేశ్ యాదవ్(2), ఠాకుర్ (4) సాయంతో 45 పరుగులు జోడించాడు. చివర్లో అశ్విన్ (35) ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి సేనకు 56 పరుగుల ఆధిక్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment