సాక్షి, హైదరాబాద్ : ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు’ టీమిండియా యువబౌలర్ శార్థుల్ ఠాకుర్‌కు రాకరాక అవకాశం వస్తే అంతలోనే దురదృష్టం వెంటాడింది. ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో ఈ యువబౌలర్ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన విండీస్.. బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ ఫీల్డింగ్‌కు దిగింది.
తొలి టెస్ట్ ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఈ నొప్పితో అతను విలవిలలాడాడు. చివరకు, కెప్టెన్ కోహ్లి, ఫిజియో సూచన మేరకు మైదానం వీడాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు అయ్యో ఠాకుర్ అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. శార్థుల్ 3.4 బంతులే వేయగా అశ్విన్ మిగిలిన రెండు బంతులను పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment