
సాక్షి, హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 367 పరుగులకు ముగించగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్లు డకౌట్ కావడం విశేషం.
అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్, హెట్‌మైర్ లు ఆచితూచి ఆడేప్రయత్నం చేశారు. కుల్‌దీప్ హెట్‌మైర్(17)ను ఔట్ చేయగా..జడేజా హోప్(28)ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో విండీస్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Comments
Please login to add a commentAdd a comment