కోల్‌కతా: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప‍్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా ఆశాకిరణం కుల్దీప్ అంటూ కొనియాడాడు. భవిష్యత్తులో అతను నంబర్ వన్ స్పిన్నర్‌గా అవతరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదని భజ్జీ ప్రశించాడు. ‘ భారత జట్టులో కుల్దీప్ యాదవ్ ఒక ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు. టీమిండియాలో నంబర్ వన్ స్పిన్నర్‌గా అయ్యే సత్తా కుల్దీప్‌లో ఉంది. భవిష్యత్తులో భారత జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించడం ఖాయం.
బంతిని రెండు వైపులా స్పిన్ చేయగల నైపుణ్యం కుల్దీప్‌లో ఉంది. బంతిని గాల్లోనే నెమ్మదిగా స్పిన్ చేస్తూ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపెట్టడంలో ఇప్పటికే కుల్దీప్ తనదైన మార్కును చూపడెతున్నాడు. భవిష్యత్తు అతనిదే. టీమిండియా జట్టులో నంబర్ వన్‌గా స్పిన్నర్‌గా కుల్దీప్ నిలవడానికి ఎంతో సమయం పట్టదు. సాధారణంగా మొదటిరోజు నుంచే బంతిని స్పిన్ చేయడం అంత సులభం కాదు. కుల్దీప్ మాత్రం మొదటి రోజు నుంచే వైవిధ్యమైన సంధిస్తూ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో పడేస్తున్నాడు. రాబోవు సిరీస్‌ల్లో స్పిన్ విభాగంలో కుల్దీప్‌పైనే టీమిండియా ఆధారపడటాన్ని కూడా చూస్తాం’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment