
భారీ స్కోరు దిశగా టీమిండియా
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ చెలరేగాడు. సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. విరాట్ కోహ్లీ సేన టీ విరామానికి 2 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మురళీ విజయ్తో పాటు చటేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 178 పరుగులు జోడించారు. కాగా పుజారా (83) సెంచరీ చేజార్చుకున్నాడు. విజయ్ (98)కు తోడు కోహ్లీ (17) బ్యాటింగ్ చేస్తున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ విజయ్, పుజారాతో కలసి జట్టును ఆదుకున్నాడు. టీమిండియా లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా 86 పరుగులు చేసింది. విజయ్, పుజారా తొలి సెషన్‌లో అజేయంగా 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.