
రాణించిన విజయ్, పుజారా
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా రాణిస్తున్నారు. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2) తొలి ఓవర్లోనే అవుట్ కాగా.. మరో ఓపెనర్ విజయ్, పుజారాతో కలసి జట్టును ఆదుకున్నాడు.
గురువారం ఉప్పల్ స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. విజయ్ (45), పుజారా (39) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ తొలి సెషన్‌లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.