శార్ధుల్ ఠాకుర్
హైదరాబాద్: భారత్‌తో ఉప్పల్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌తో భారత యువ బౌలర్ శార్దుల్ ఠాకుర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ ఆటనే పునరావృతం చేస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. మహ్మద్ షమీ స్థానంలో శార్ధుల్ ఠాకుర్ అరంగ్రేటం చేస్తున్నట్లు తెలిపాడు.
వెస్టిండీస్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కీమర్ రోచ్, షెమాన్ లూయిస్ స్థానాల్లో జట్టులోకి కీమోపాల్, జోమెల్ వారికాన్‌లు వచ్చారు. తొలి టెస్టులో దారుణంగా ఓడిన విండీస్ ఈ టెస్టును ఎలాగైన నెగ్గి పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక భారత్ మాత్రం తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
తుది జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా, ఉమేశ్, కుల్దీప్, శార్ధుల్.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షై హోప్, ఆంబ్రిస్, హెట్‌మెయర్, ఛేజ్, డౌరిచ్, బిషూ, వారికన్, గాబ్రియెల్.
Comments
Please login to add a commentAdd a comment