Sudhir Chowdary
-
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిధి
టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా వాలిపోయే వీరాభిమాని సుదీర్ గౌతమ్ చౌధరీ హైదరాబాద్‌కూ వచ్చేశాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో అతను తనదైన శైలిలో భారత్–ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం సమర శంఖం పూరించాడు. సచిన్‌కు అతిపెద్ద ఫ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ... సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆటపై తన ప్రేమను కొనసాగిస్తూ ప్రతీ మైదానంలో కనిపిస్తూ వస్తున్నాడు. మొత్తానికి భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లో సుదీర్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలుపు లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌లో చాలాకాలం తర్వాత జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో స్థానిక అభిమానులు మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. -
బ్రిటన్‌లో భారతీయ వ్యాపారవేత్త అరెస్టు
లండన్: బ్రిటన్‌లో ఆర్థికనేరాల కుంభకోణంలో అరోపణలు ఎదుర్కొంటున్న భారత వ్యాపారవేత్త సుధీర్ చౌధురి, ఆయన కుమారు భానును అరెస్టు చేశారు. గత బుధవారం వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించి బెయిల్‌పై విడుదల చేశారు. వీరిద్దరూ బ్రిటన్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపప్రధాని నిక్ క్లెగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న లిబరల్ డెమోక్రాట్ పార్టీకి అత్యంత సన్నిహితులు కావడంతో ఈ సంఘటన అక్కడి రాజకీయవర్గాలను కుదిపేసింది. 2002లో సుధీర్ చౌధురి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. సీఅండ్‌సీ ఆల్ఫా గ్రూప్ పేరుతో వీరు వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్‌తోపాటు పలు ఇతర వ్యాపారాలు వీరికి ఉన్నాయి. 2004-10 మధ్య వీరు లక్షలాది పౌండ్లను లిబరల్ డెమోక్రాట్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. రక్షణరంగంలో కాంట్రాక్టులు సంపాదించడంకోసం రోల్స్రాయిస్తోపాటు మరికొన్ని కంపెనీలకు లంచాలు ఇచ్చారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.