విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్‌ ఇదే! | Amid Divorce Rumours, Barack Obama Shares Special Birthday Wishes Post, See How Michelle Obama Reaction Inside | Sakshi
Sakshi News home page

Obama Divorce Rumours: విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్‌ ఇదే!

Published Sat, Jan 18 2025 10:15 AM | Last Updated on Sat, Jan 18 2025 11:20 AM

Amid Divorce Rumours Barack Michelle Obama Reacts Like This

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. 

గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్‌హౌజ్‌(White House)లో జరగబోయే డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్‌కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.

 

వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్‌ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్‌కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్‌ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.

నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్‌ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్‌ చేసి లవ్‌ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్‌గా లవ్‌ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్‌కు ఒకేసారి ఇద్దరూ చెక్‌ పెట్టారన్నమాట.

చికాగోలో ఓ పంప్‌ ఆపరేటర్‌-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్‌ జంటల్లో.. వన్‌ ఆఫ్‌ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. 

అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే  ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. 

ఇదీ చదవండి: ట్రంప్‌ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement