బ్రిటన్‌లో భారతీయ వ్యాపారవేత్త అరెస్టు
Published Mon, Feb 17 2014 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
లండన్: బ్రిటన్‌లో ఆర్థికనేరాల కుంభకోణంలో అరోపణలు ఎదుర్కొంటున్న భారత వ్యాపారవేత్త సుధీర్ చౌధురి, ఆయన కుమారు భానును అరెస్టు చేశారు. గత బుధవారం వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించి బెయిల్‌పై విడుదల చేశారు. వీరిద్దరూ బ్రిటన్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపప్రధాని నిక్ క్లెగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న లిబరల్ డెమోక్రాట్ పార్టీకి అత్యంత సన్నిహితులు కావడంతో ఈ సంఘటన అక్కడి రాజకీయవర్గాలను కుదిపేసింది.
2002లో సుధీర్ చౌధురి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. సీఅండ్‌సీ ఆల్ఫా గ్రూప్ పేరుతో వీరు వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్‌తోపాటు పలు ఇతర వ్యాపారాలు వీరికి ఉన్నాయి. 2004-10 మధ్య వీరు లక్షలాది పౌండ్లను లిబరల్ డెమోక్రాట్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. రక్షణరంగంలో కాంట్రాక్టులు సంపాదించడంకోసం రోల్స్‌రాయిస్‌తోపాటు మరికొన్ని కంపెనీలకు లంచాలు ఇచ్చారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement