Indian businessman
-
లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు.ఎస్సార్ గ్రూప్‌కు సహ-యజమాని రవి రుయా ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ. 1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు) . 150 పార్క్ రోడ్‌లోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్‌ను ఇంటిలోని జిబ్రాల్టర్-ఇన్కార్పొరేటెడ్ హోల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం ఇటీవలి రెండేళ్ల క్రితం రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థ అనుబంధ సంస్థ గాజ్ప్రోమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోంచరెంకో యాజమాన్యంలో ఉంది. 2012లో కన్జర్వేటివ్ పార్టీ పీర్ రాజ్‌కుమార్ బగ్రీ లీజుకు తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ నిర్మాణంలో ఉందనీ, ఇది కుటుంబ కార్యాలయానికి ఆకర్షణీయమైన పెట్టుబడిగా చేసే ధరకు అందుబాటులోకి వచ్చింద ని రుయా ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి విలియం రెగో ఒక ప్రకటనలో తెలిపారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. గత ఏడాది లండన్‌లో విదేశీ సంస్థల రిజిస్టర్ విధానంలో పారదర్శకతను తీసుకు రావడానికి ప్రయత్నించిన తర్వాత కూడా లండన్ అల్ట్రా-ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్లో ఇప్పటికీ గోప్యంగానే ఉండటం విశేషం. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇప్పటిదాకా చాలా రహస్యంగా జరిగే విలాస వంత గృహాలు క్రయ విక్రయాల్లో కాస్త మార్పు వచ్చింది. బ్రోకర్ హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత ఏడాది చివరి మూడు నెలల్లో లండన్ ఇళ్ల విక్రయాలు భారీగానే నమోదైనాయి. -
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్‌కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్‌వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్‌కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
భారత వ్యాపారి మంచి మనసు
యూఏఈలో ఖైదీల విడుదలకు 6.71 కోట్లు సాయం దుబాయ్: యూఏఈ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించేందుకు 6.71 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన వ్యాపారి ఫిరోజ్ మర్చంట్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత అజ్మాన్ సెంట్రల్ జైలు నుంచి 132 మంది ఖైదీల విడుదలకు రూ.2.78 కోట్లు చెల్లించారు. రుణాలు చెల్లించలేని వారు, తమ శిక్షా కాలం ముగిసినా స్వదేశం తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేక అక్కడే ఉంటున్న వారికి సాయం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. విమాన ప్రయాణ టికెట్లతోపాటు, జైళ్ల నుంచి విడుదలైన వారు క్షేమంగా ఇంటికెళ్లేలా వాళ్ల స్థానిక కరెన్సీకి సమానమైన మొత్తాన్ని కూడా మర్చంట్ కార్యాలయం ఇస్తుంది. ‘ పరిస్థితుల వల్లే వారంతా బాధితులయ్యారు. నిజమైన నేరగాళ్లు కాదు. రుణ సంబంధ కారణాలతోనే చాలా మంది జైలు జీవితం గడుపుతున్నారు. అందుకే వారిని సొంతగడ్డకు పంపడానికి నాకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నా’ అని మర్చంట్ అన్నారు. -
వేల కోట్లను అప్పగించిన బడా వ్యాపారి?
సూరత్: నల్లధనం నిరోధం కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ మనీ లో మరో సంచలన ఘటన నమోదైంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులుపడుతుండగా.. గుజరాత్ కు చెందిన బడా వ్యాపారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ బడా వ్యాపారవేత్త మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. భారీ సంఖ్యలో వేలకోట్ల సొమ్మును ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బిల్డర్, వజ్రాల వ్యాపారి లాల్ జీ భాయ్ పటేల్ ఇపుడు వార్తల్లో నిలిచారు. రూ 500 నుంచి రూ 1000 నోట్లు రద్దు ప్రభావంతో దాదాపు రూ.6 వేల కోట్లను నగదును అధికారులకు అప్పగించారు. భూరి విరాళాలకు , స్వచ్ఛంద దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన పటేల్ ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు, ఇల్లు లాంటి విలువైన బహుమతులను అందించిన చరిత్ర కూడా పటేల్ కు ఉంది. (సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న హరే కృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ యజమాని వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకియా కాదు) అలాగే దాదాపు రూ.200 కోట్ల రూపాయలను బాలికా విద్యా కోసం ఆయన విరాళమిచ్చారు. కాగా కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్ తో చాలామంది నల్లధనం కుబేరులు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది కోట్లాది రూపాయలను గంగపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కారు నెంబర్ కోసం రూ. 60 కోట్లు వెచ్చించాడు!
లక్కీ నెంబర్లు, ఫ్యాన్సీ నెంబర్లంటే మనవాళ్లకు మహా మోజు. ఇక్కడే కాదు.. ఏ దేశంలో ఉన్నా కూడా అలాంటి నెంబర్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరన్న విషయం మరోసారి రుజువైపోయింది. దుబాయ్‌లో ఒక కారు నెంబర్ కోసం భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా రూ. 60 కోట్లు వెచ్చించాడు. బల్వీందర్ సహానీ అనే ఆయన ఆర్‌ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే వ్యాపార సంస్థకు యజమాని. భారతదేశంతో పాటు అమెరికా, యూఏఈ, కువైట్ లాంటి దేశాల్లో ఈ కంపెనీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ పనులు చేస్తుంటుంది. ఈ సహానీకి అబు సబా అనే మారుపేరు కూడా ఉంది. ఈయన 'డి5' అనే నెంబరు కోసం దుబాయ్ రోడ్డు రవాణా వ్యవస్థకు రూ. 60 కోట్లు చెల్లించాడు. అరుదైన నెంబరు ప్లేట్లు సేకరించడం తనకు ఇష్టమని.. ఈ నెంబరు రావడం చాలా గర్వంగా ఉందని సహానీ తెలిపారు. తనకు 9 అంకె అంటే ఇష్టమని, డి 5 కలిపితే మొత్తం 9 అవుతుందని.. అందుకే తాను ఈ నెంబరును కొన్నానని చెప్పారు. గత సంవత్సరం తాను 09 అనే నెంబరు ఉన్న ప్లేటును 45 కోట్లు పెట్టి కొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తాను 10 నెంబరు ప్లేట్లు కొన్నానని, త్వరలోనే మరిన్ని కూడా కొంటానని, అది తనకు సరదా అని అన్నారు. తాజాగా కొన్న ప్లేటును తనకున్న రోల్స్ రాయిస్ కార్లలో ఒకదానికి అమరుస్తానన్నారు. డి5 నెంబరు కోసం దాదాపు 300 మంది పోటీపడ్డారు. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ల కోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి లైవ్ వేలం జరుగుతుంది. మొత్తం 80 రకాల నెంబరు ప్లేట్లను ఈసారి వేలానికి పెట్టారు. 'క్యు77' అనే నెంబరు 8.20 కోట్ల రూపాయలు పలికింది. -
కారు నెంబర్ ప్లేట్ ఖరీదు రూ. 60 కోట్లు!
సెలెబ్రిటీలు, కుబేరులు కోట్లాది రూపాయలు పోసి కార్లు కొనడం మామూలే. అలాగే ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలంలో పోటీపడి లక్షలు చెల్లించి సొంతం చేసుకుంటుంటారు. అయితే దుబాయ్‌లో ఓ భారతీయ కుబేరుడు తన కారు లైసెన్స్ నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు చెల్లించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ప్రభుత్వం శనివారం 'డీ5' నెంబర్ ప్లేట్‌ను వేలం వేసింది. బల్వీందర్ సహాని అనే వ్యాపారవేత్త తన దగ్గర ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఒకదానికోసం భారీ మొత్తం చెల్లించి దీన్ని కొనుగోలు చేశారు. మరో నెంబర్ ప్లేట్‌ను 1.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. గతేడాది జరిగిన వేలంలో బల్వీందర్ దాదాపు 45 కోట్లు చెల్లించి 'ఓ9' అనే నెంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. తక్కువ అంకెలు ఉండే కారు లైసెన్స్ ప్లేట్‌ను కలిగివుండటం దుబాయ్‌లో స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఇలాంటి నెంబర్ ప్లేట్ల కోసం కుబేరులు కోట్లాది రుపాయలు చెల్లించేందుకు సిద్ధపడతారు. 2008లో అబుదాబిలో సయీద్ అల్ ఖోరీ అనే వ్యాపారవేత్త ఏకంగా 94 కోట్ల రూపాయలు చెల్లించి నెంబర్ 1 లైసెన్స్ ప్లేట్‌ను దక్కించుకున్నారు. యూఏఈలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. -
'ఇరాక్ నుంచి వచ్చిన నర్సులకు ఉద్యోగాలిస్తాం'
దుబాయ్: ఇరాక్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 46 మంది భారతీయ నర్సులు ఊహించని జాబ్ ఆఫర్ లభించింది. వీరికి ఉద్యోగాలిచ్చేందుకు దుబాయ్ కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త, ఎన్ఎంసీ హెల్త్‌కేర్ గ్రూపు సీఈవో డాక్టర్ బీఆర్ శెట్టి ముందుకు వచ్చారు. అలాగే దుబాయ్ వారు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఈ మేరకు ఎన్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఇరాక్ హింస కారణంగా భారతీయ నర్సులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి శనివారం స్వదేశానికి తిరిగొచ్చారు. వీరికి ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాందికి బీఆర్ శెట్టి తెలిపారు. దుబాయ్, ఈజిప్టు, భారత్ లో ఆయన ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. భారత్ కు తిరిగొచ్చిన నర్సులలో 45 మంది కేరళకు, ఒకరు తమిళనాడుకు చెందినవారున్నారు. -
మా ఆస్పత్రుల్లో ఉద్యోగాలిస్తా.. రండి!!
ఇరాక్ అల్లర్ల పుణ్యమాని ఉద్యోగాలు పోగొట్టుకుని, ఉగ్రవాదుల చెరలో చిక్కి, ఎట్టకేలకు మాతృభూమికి తిరిగివెళ్లిన 46 మంది నర్సులకు తన ఆస్పత్రులలో ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ఒకరు పిలిచారు. గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఆస్పత్రులున్న బీఆర్ శెట్లి వాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కేరళలోని వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి ఉంటే తన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. తిక్రిత్‌లో ఉన్న ఈ నర్సులను సున్నీ తీవ్రవాదులు మోసుల్కు తీసుకొచ్చి.. చివరకు శుక్రవారం నాడు కుర్దిష్ రాజధాని ఎర్బిల్‌లో విడిచిపెట్టారు. ప్రత్యేక విమానంలో వాళ్లంతా భారతదేశానికి చేరుకున్నారు. యూఏఈ సహా పలు దేశాల్లో శెట్టికి చెందిన ఎన్ఎంసీ గ్రూపునకు ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. -
బ్రిటన్‌లో భారతీయ వ్యాపారవేత్త అరెస్టు
లండన్: బ్రిటన్‌లో ఆర్థికనేరాల కుంభకోణంలో అరోపణలు ఎదుర్కొంటున్న భారత వ్యాపారవేత్త సుధీర్ చౌధురి, ఆయన కుమారు భానును అరెస్టు చేశారు. గత బుధవారం వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించి బెయిల్‌పై విడుదల చేశారు. వీరిద్దరూ బ్రిటన్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపప్రధాని నిక్ క్లెగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న లిబరల్ డెమోక్రాట్ పార్టీకి అత్యంత సన్నిహితులు కావడంతో ఈ సంఘటన అక్కడి రాజకీయవర్గాలను కుదిపేసింది. 2002లో సుధీర్ చౌధురి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. సీఅండ్‌సీ ఆల్ఫా గ్రూప్ పేరుతో వీరు వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్‌తోపాటు పలు ఇతర వ్యాపారాలు వీరికి ఉన్నాయి. 2004-10 మధ్య వీరు లక్షలాది పౌండ్లను లిబరల్ డెమోక్రాట్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. రక్షణరంగంలో కాంట్రాక్టులు సంపాదించడంకోసం రోల్స్రాయిస్తోపాటు మరికొన్ని కంపెనీలకు లంచాలు ఇచ్చారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.