bhanu
-
క్యూట్ అందాలతో కవ్విస్తున్న భాను శ్రీ (ఫొటోలు)
-
రవితేజ, శ్రీలీల జోడీ రిపీట్.. సంక్రాంతికి విడుదల
కొన్నేళ్లుగా టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు,ఈగల్ వంటి చిత్రాలతో దూకుడు మీద ఉన్నాడు రవితేజ. హరీశ్ శంకర్ దర్వకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. అయితే తాజాగా రవితేజ తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు.‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్ అయింది. తాజాగా నేడు ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది. తొలి సన్నివేశంలో రవితేజ, శ్రీలీల జంటగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలతో తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
అస్తిత్వాన్ని వెలికి తీద్దాం
మనం పై పైన చూసే ఎన్నో విషయాలు మూలాల్లో ఉన్న అస్తిత్వానికి గొడ్డలిపెట్టుగా ఉండవచ్చు. అది మొక్కలకు సంబంధించినవైనా సరే...ప్రపంచంలో తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన వృక్ష జాతుల శాస్త్రీయనామాల మూలాలను శోధించి తిరిగి వాటికి పూర్వపు పేర్లు ఉండేలా కృషి చేస్తోంది భాను సుబ్రమణ్యం. అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రోఫెసర్‌గా ఉన్న భారతీయురాలు.తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన 126 వృక్ష జాతుల మూలాలను శోధించి, తిరిగి వాటి పూర్వపు పేర్లతోనే పిలిచేలా కృషి చేశారు.దీంతో ఆ వృక్షజాతుల పేర్ల గురించి ఎవరు చర్చించినా భాను సుబ్రమణ్యాన్ని గుర్తుంచు కుంటారు. ‘దీనిని అత్యంత క్లిష్టమైన సమస్యగా ఎవరూ గుర్తించరు. అధికారంలో ఉన్నవారు దీనికి అనేక కారణాలు చూపుతారు’ అంటారామె.మొక్కల పేర్ల నుండి స్థానిక జాతుల వరకు ప్రంచంలోని అనేక అంశాలు వలస సామ్రాజ్యాల ద్వారా రూపొందించబడ్డాయి. మనం ఈ వలసరాజ్యాల ఆధిపత్యాన్ని తొలగించాలి’ అంటారు వృక్షశాస్త్రంలో ఎంపరర్‌గా పేరొందిన భాను సుబ్రమణ్యం. తన కొత్త పుస్తకమైన ‘బోటనీ ఆఫ్ ఎంపైర్’లో వలసవాదం సృష్టించే సమస్యలు ఎప్పటికీ అంతం కావని, దాని వెనక తీవ్రమైన ప్రయత్నం ఎలా ఉండాలో తను రాసిన పుస్తకం ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చింది. జాతుల వర్గీకరణ, మొక్కల పునరుత్పత్తి, దండయాత్రల ద్వారా ప్రవేశపెట్టబడిన జాతుల వ్యాప్తికి సంబంధించిన శాస్త్రంగా ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ‘నేను పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, మొక్కల శాస్త్రవేత్తగా పేరొందాను. స్త్రీవాద, సాంకేతిక రంగాలలో మానవీయ, సామాజిక శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాను. జెండర్, జాతి, కులానికి సంబంధించిన శాస్త్రాలు, వైద్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతులను అన్వేషిస్తాను. నా ఇటీవల పరిశోధన వలసవాదం, జీనోఫోబియా చరిత్రలకు సంబంధించిన వృక్షశాస్త్రం వీటన్నింటినీ పునరాలోచింపజేస్తుంది. వలస, ఆక్రమణ జాతులకు సంబంధించి శాస్త్రీయ సిద్ధాంతాలు, ఆలోచనలు, విస్తృత ప్రయాణాలను అన్వేషిస్తుంది.భారతదేశంలో సైన్స్, హిందూ జాతీయవాదం సంబంధంపై కూడా పని చేస్తున్నాను. ఇప్పటివరకు మూడు పుస్తకాలను తీసుకువచ్చాను. వీటిలో ΄్లాంట్ వరల్డ్స్ అండ్ ది సైంటిఫిక్ లెగసీస్ ఆఫ్ కలోనియలిజం ఈ యేడాది తీసుకువచ్చాను. ది బయోపాలిటిక్స్ ఆఫ్ హిందూ నేషనలిజం సొసైటీ ఫర్ లిటరేచర్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ పుస్తకం భారతదేశంలో పుట్టుకువస్తున్న జాతీయవాద రాజకీయాలు, ఆధునికత, సైన్స్, మతం ఒకదానికి ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది’ అని వివరిస్తుంది. భాను సుబ్రమణ్యం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో పెరిగారు. దీంతో బ్రిటిషర్లు దేశంలో మూలాంశాలను ఎలా మార్చేశారో తెలుసుకున్నారు. ఫెమినిస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనాల కోసం అమెరికాలో పరిణామాత్మక జీవశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. తన రచనల ద్వారా జీవశాస్త్ర పండితురాలిగా పేరొందారు. ఈ ఏడాది జూలైలో జరిగే అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్‌లో పాల్గొని, అనేక సవరణలపై చర్చించబోతున్నారు.మొక్కల శాస్త్రీయ నామకరణాన్ని నియంత్రించే అంతర్జాతీయ కోడ్‌కు బాధ్యత వహించే నామకరణ విభాగం, వర్గీకరణ, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అనేక సవరణలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రోఫెసర్ సమావేశంలో ΄ాల్గొన బోతున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన సమావేశంలో తీసుకున్న కోడ్ మెకానిజంలో అనుచితమైనవిగా పరిగణించబడే మరెన్నో మొక్కల పేర్లను ఈ సమావేశం తిరస్కరించవచ్చు. దీని వెనకాల ఈ సీనియర్ ప్రోఫెసర్ చేస్తున్న కృషి మనల్ని ఆలోచింపజేస్తుంది. వలసవాదం సుసంపన్నమైన వృక్ష ప్రపంచాలను జీవశాస్త్ర జ్ఞానంగా ఎలా మార్చింది అనే క్లిష్టమైన చరిత్రను అన్వేషించడానికి బాను సుబ్రమణ్యం దేశీయ అధ్యయనాలను శోధించారు. లాటిన్-ఆధారిత నామకరణ వ్యవస్థ, మొక్కల లైంగికతను వివరించడానికి యూరోపియన్ ఉన్నత వర్గాల ఊహాజనిత విధానాలను ‘బాటనీ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ద్వారా వివరించారు. వలసవాదులు మొక్కల కాలపు లోతైన చరిత్రను ఎలా నిర్మూలించారో మనం ఇందులో చూస్తాం. జాత్యాహంకారం, బానిసత్వం, వలసవాద చరిత్రలలోని దాని మూలల నుండి కేంద్రీకృతమైన వృక్షశాస్త్రానికి సంబంధించిన మరింత సమగ్రమైన, సామర్థ్యం గల రంగాన్ని ఊహించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. -
రవన్న దావత్‌కి రెడీ అయిపోండ్రి
హీరో రవితేజ ల్యాండ్ మార్క్ మూవీ ‘ఆర్టీ 75’ (వర్కింగ్ టైటిల్) ప్రకటన వెలువడింది. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రకటించిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద ‘రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’ అని ఉంది. ఈ సినిమాలో లక్ష్మణ భేరి అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఈ పాత్ర తీరు ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. ‘ఆదాయం: చెప్పను తియ్, ఖర్చు: లెక్క జెయ్యన్, రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్, అవమానం: జీరో’ అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. -
RT75: రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను రిలీజ్ చేశాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్వకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు మాస్ మహారాజా. ఉగాది పర్వదినం సందర్భంగా తన 75వ సినిమా అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా 'దావత్'లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది. అలాగే పోస్టర్ మీద "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి", "హ్యాపీ ఉగాది రా భయ్" అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. "ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో" అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది. అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎 We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥 వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు... రెడీ అయిపొండ్రి 🥳 We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO — Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024 . -
ద్వి భాషా చిత్రంగా వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్స్ అర్జున్‌దాస్, కాళిదాస్ జయరామ్ నటించిన తాజా చిత్రం పోర్. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో డీజే భాను, సంజనా నటరాజన్, మెర్విన్ రోజారియో ప్రధాన పాత్రలు పోషించారు. టీ సిరీస్, రూక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో సైతాన్, డేవిడ్, వాజీర్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పోర్ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌దాస్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు ఒక హోటల్లో చెప్పారన్నారు. అంతకుముందే కాళిదాస్ జయరామ్ ఎంపికయ్యారని చెప్పారు. ఇది కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కొంచెం స్నేహం సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ చిత్రంలో నటించిన దర్శకుడు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. సాధారణంగా రెండు భాషల్లో రూపొందించే చిత్రాల షూటింగ్లో ఒక భాషలో నటించే నటులకు మరో భాషా సన్నివేశాలను చూపించరన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు హిందీ వెర్షన్ సన్నివేశాలను చూసే అవకాశం కల్పించడంతో తాను మరింత పర్ఫెక్ట్గా నటించినట్లు చెప్పారు. కాళిదాస్ జయరామ్‌తో మళ్లీ కలిసి నటిస్తానా అనేది సందేహామే అన్నారు. ఆయన కెమెరా ముందుకు వచ్చేవరకు అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని అంత జోవియల్ వ్యక్తి అని చెప్పారు. మంచి స్నేహశీలి అని కూడా అర్జున్ దాస్ పేర్కొన్నారు. -
మ్యూజిక్ వరల్డ్‌లో.. తను ఒక సుమధుర 'ధ్వని'
స్కూలు, కాలేజి రోజుల నుంచి రోజుల తరబడి పాటలు వినేది ధ్వని భానుశాలి. అందరూ తనను సరదాగా ‘సాంగ్ ఈటర్’ అని పిలిచేవారు. రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ ‘వాస్తే’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ధ్వని సింగర్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. మంత్రముగ్ధులను చేసే అందమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిత్రపరిశ్రమలో గొప్ప సంగీతదర్శకులతో కలిసి పనిచేసే అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ధ్వని పాడిన ‘దిల్బార్’ పాట బిల్బోర్డ్ యూట్యూబ్‌లో మ్యూజిక్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిన తొలి భారతీయ సింగిల్‌గా చరిత్ర సృష్టించింది. ‘ఒక ఆర్టిస్ట్ నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు. కానీ వారి శైలిని కాపీ కొట్టకూడదు’ అంటున్న ధ్వని సంగీతప్రపంచంలో తనదైన అందమైన సంతకాన్ని సృష్టించుకుంది. ధ్వని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ప్రోత్సాహకంగా మాట్లాడిన వారు తక్కువే. దీని గురించి ఇలా స్పందిస్తుంది ధ్వని... ‘ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు వినడం వల్ల మనం ఎంచుకున్న దారి సరిౖయెనదేనా అనే డౌటు వచ్చి అయోమయంలోకి వెళతాం. ఇలాంటి సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నా ప్రయాణంలో నేను అది కోల్పోలేదు’ అంటుంది ధ్వని భానుశాలి. ఇవి కూడా చదవండి: 'దీపెన్' దారి దీపం.. -
Anchors Sankranti Celebrations Pics: బుల్లితెర యాంకర్లు సంబరాలు..ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారు ఒక్క లుక్ వేయండి
-
ఎందరు ఏమన్నా.. ఎస్ఐ కాబోతున్న భాను!
కరుడు కట్టిన ‘ఖాకీవనం’లోకి అడుగుపెట్టడానికి చాలా మంది యువకులు వెనకడుగు వేస్తారు. కేసులు, కోర్టులు, నేరస్తులతో బెంబేలెత్తిపోతారు. అయితే, ఆత్మవిశ్వాసమే వెన్నుదన్నుగా, అకుంఠిత దీక్షతో భానుప్రసన్న ధైర్యంగా అడుగుపెడుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ర్యాంకు సాధించి పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలన్న చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. మార్టూరు: ‘ఆడపిల్లవు నీవు ఎస్ఐ అవుతావా ? ఎందుకమ్మా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోక ! ’ అంటూ అయిన వారి హేళన మాటల్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుంది. అనుకున్నది సాధించింది. విజయానికి అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవని నిరూపించింది. అకుంఠిత దీక్ష, పట్టుదలలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి భాను ప్రసన్న. స్థానిక బీసీ కాలనీకి చెందిన శివరాత్రి శ్రీనివాసరావు, గంగమ్మ దంపతులు తమకున్న ఒకటిన్నర ఎకరా వ్యవసాయ భూమి సాగు చేసుకుంటూ చిన్నపాటి బడ్డీ కొట్టును నడుపుకుంటున్నారు. ఇద్దరు కుమార్తెలను చదివించుకున్నారు. పెద్ద కుమార్తె భాను ప్రసన్న జొన్నతాళి గ్రామంలోని ప్రభుత్వ యూపీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, మార్టూరు కాకతీయ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత నర్సరావుపేట కృష్ణవేణి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నిమిత్తం చేరింది. పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాలనే చిన్ననాటి కల సాకారం కోసం ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్ పూర్తి చేశాక లక్ష్యాన్ని మరింత విస్తృత పరచుకుంది. ఎస్ఐ కావాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది. పెళ్లి తన కెరీర్‌కు అడ్డంకిగా మారకూడదని భావించి తల్లిదండ్రులను ఒప్పించింది. చెల్లెలు కోమలికి ముందుగా వివాహం జరిపించింది భాను ప్రసన్న. మగరాయుడులా ప్యాంటు, టీషర్టు వేసుకుని పోలీసు అవుతుందంటా అనే ఇరుగు పొరుగు వారి మాటల్ని ఆమె పట్టించుకోలేదు. కూతురుకు బాసటగా శ్రీనివాసరావు నిలిచాడు. ఆయన నమ్మకం, పట్టుదలను సాకారం చేస్తూ భానుప్రసన్న మొక్కవోని దీక్షతో ఎస్ఐ పోటీ పరీక్షలో విజయం సాధించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఉద్యోగం సాధించి తానేమిటో నిరూపించుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ యువతి ఎస్ఐగా ఎంపిక కావడంపై గ్రామస్తులంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుడడం విశేషం. ఎస్ఐతో సరిపెట్టుకోను ఓ పల్లెటూరుకు చెందిన నేను ఎస్ఐగా ఎంపికయ్యే దాకా జరిగిన ప్రయాణంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఈ తరం ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండబోదని ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నా. నిజాయతీ కలిగిన పోలీసు అధికారిగా పని చేస్తూ మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి వారికి అండగా ఉంటా. వృత్తిపరంగా మరింతగా ఎదగడం కోసం ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. నా వెనుక సూటిపోటి మాటలు అన్నవారే నేడు అభినందిస్తుంటే ప్రస్తుతం నాకు ఎంతో అనందంగా ఉంది. నా గ్రామానికీ, నా కుటుంబానికీ మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా. – భాను ప్రసన్న -
Anchor Udaya Bhanu : అమెరికాలో వెకేషన్లో ఉదయభాను.. ఇద్దరు కవల పిల్లలతో కలిసి! (ఫొటోలు)
-
సైనిక లాంఛనాలతో లెఫ్టినెంట్ కల్నల్ అంత్యక్రియలు
సాక్షి, యాదాద్రి/మల్కాజిగిరి/సాక్షి, హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డి (వీవీబీరెడ్డి) అంత్యక్రియలు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. భానురెడ్డి తల్లిదండ్రులు, భార్య, కూతుళ్లు, బంధువులు, గ్రామస్తులు, ఆర్మీ అధికారులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వినయ్‌భానురెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, కూతు రు హనిక.. చితికి నిప్పంటించారు. సైనికులు గాల్లోకి మూ డు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆరీ్మకి చెందిన కల్నల్ మనీశ్ దేవగణ్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ భార్య స్పందనారెడ్డి భారత సైన్యంలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని వినయ్‌భానురెడ్డి ఇంటి నుంచి ఆయన పార్థివ దేహాన్ని శనివారం ఉదయం సైనిక వాహనంలో స్వగ్రామం బొమ్మలరామారానికి తీసుకువచ్చారు. ప్రముఖుల నివాళి: వినయ్‌భానురెడ్డి పార్థివదేహాన్ని బొమ్మలరామారంలోని ఆయన ఇంటికి తీసుకువచ్చి గంటపాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అంతకు ముందు మల్కాజిగిరి నివాసంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, సదరన్ కమాండ్ జనరల్ ఆఫీస్ కమాండింగ్ చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ ఎ.కె.సింగ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయనకు నివాళులర్పిం చారు. బొమ్మలరామారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్చంద్ర తదితరులు వినయ్‌భానురెడ్డికి నివాళులర్పిం చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అండగా నిలవాలి: ఎంపీ కోమటిరెడ్డి దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షల ఎగ్స్‌గ్రేషియా ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
తెల్లవారితే పెళ్లి చూపులు అంతలోనే..
జగిత్యాల, వెల్గటూరు/ధర్మపురి: తెల్లవారితే పెళ్లిచూపులు అంతలోనే రోడ్డు ప్రమాదంలో వచ్చిన మృత్యువు యువకుడిని కబలించిన సంఘటన విషాదం నింపింది. వెల్గటూరు మండలం కొత్తపెల్లి వద్ద స్టేట్ హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తాపడగా కారు డ్రైవరు పొడేటి భాను (32) మృతిచెందాడు. పెట్టెం సంతోశ్, చిలుక ముక్కు అశ్విన్‌కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా ధర్మపురి ఆలయ ఉద్యోగులు. ముగ్గురు కలిసి ఆదివారం సినిమా కోసమని కరీంనగర్ వెళ్లి ధర్మపురికి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి వాటర్‌ట్యాంకు వద్ద ఉన్న నీటిసంపును ఢీకొట్టి సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా ఢీకొని బోల్తాపడింది. దీంతో కారులోని ముగ్గురు ఎగిరి బయటపడ్డారు. కారు నడుపుతున్న భాను తలకు తీవ్రంగా గాయంకావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పెట్టెం సంతోశ్ ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నాడు. మరోవ్యక్తి చిలుక ముక్కు అశ్విన్ పూజారిగా పని చేస్తున్నారు. ప్రమాదంధాటికి విద్యుత్‌పోల్ విరిగిపోయి లెవన్ కేవీ వైర్లు తెగిపడ్డాయి. కరెంట్‌నిలిచిపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్నేహితులు, బంధువులు,పూజారులు, ఆలయ ఉద్యోగులు ధర్మపురి నుంచి పెద్దసంఖ్యలో , ఘటనాస్థలానికి తరలివచ్చారు. భాను మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భాను తమ్ముడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..
సాక్షి, చిత్తూరు : రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత శవమై తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆ మహిళను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన జిల్లాలోని రామచంద్రపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పీవీ పురంకు చెందిన భానును పది సంవత్సరాల క్రితం.. రాయలచెరువుకు చెందని ముని శేఖర్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. శేఖర్ కొంత అమాయకుడు కావడంతో భాను రెండేళ్లుగా పుట్టింటిలోనే ఉంటున్నారు. శేఖర్ మాత్రం తరచూ భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. అయితే ఇంటి వద్దే ఉంటున్న భానుకు అదే మండలంలోని రామాపురంకు చెందిన హరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే భాను కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో భాను తల్లిదండ్రులు రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించారు. హరి మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భానును హరి నమ్మించి హతమార్చినట్టు నిర్ధారించారు. రామచంద్రపురం వద్ద పాతిపెట్టిన భాను మృతదేహాన్ని వెలికి తీశారు. హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన బిడ్డ శవంగా తేలడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. భాను కన్పించకుండా పోయినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని వారు చెబుతున్నారు. -
‘అనంత’ ఫ్యాక్షన్ ముగిసినట్లేనా..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ ఫ్యాక్షన్‌తో రెండు తరాలు అంతమైనా ‘రక్తచరిత్ర’ మాత్రం ఆగలేదు. పరిటాల శ్రీరాములు హత్యతో ఆరంభమైన ఈ ఫ్యాక్షన్ 2011 జనవరి 3న జరిగిన మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి(సూరీ) హత్యతోముగిసిందని ‘అనంత’ వాసులు భావించారు. కానీ సూరి హత్య జరిగిన రెండునెలల లోపే సూరి అనుచరుడు తగరకుంట కొండారెడ్డి హత్య జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ ‘అనంత’ ఫ్యాక్షన్ జడలు విప్పుకున్నట్లయింది. దీంతో పరిటాల ప్రత్యర్థులంతా అప్పట్లో వణికిపోయారు. ఆపై ‘అనంత’లో అక్కడక్కడా రాజకీయ హత్యలు జరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో సూరి హత్య కేసుకు సంబంధించి మంగళవారం తీర్పు వెలువడటంతో ఇక్కడి ఫ్యాక్షన్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. అసలు ఈ ఫ్యాక్షన్ ఎలా మొదలైంది? ఇప్పటికైనా ముగిసినట్లేనా? లేదంటే భవిష్యత్తులో మరిన్ని హత్యలు జరుగుతాయా? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ‘అనంత’ ఫ్యాక్షన్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆరంభం ఇలా... కొన్నేళ్ల కిందటి నుండి 1968 దాకా పరిటాల శ్రీరాములు, మద్దెలచెర్వు నారాయణరెడ్డి ఇద్దరూ స్నేహితులు. అయితే 1968లో జరిగిన ఓ సంఘటన ఇరు కుటుంబాల మధ్య చిచ్చును రేపింది. శుత్రుత్వాన్ని రగిల్చింది. అప్పట్లో పరిటాల శ్రీరాములు పీపుల్స్‌వార్‌లో చేరారు. దీంతో నారాయణ రెడ్డికి, పరిటాల కుటుంబానికి అభిప్రాయ భేదాలతో పాటు ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఈక్రమంలో 1975లో పరిటాల శ్రీరాములును ప్రత్యర్థులు నరికి చంపారు. ఇదే ‘అనంత’ ఫ్యాక్షన్‌లో తొలి హత్య. ఈ హత్యతో వారి రెండు కుటుంబాల ఆధిపత్యపోరు జిల్లా అంతటికి సోకింది. శ్రీరాములు హత్య తర్వాత నాలుగేళ్ల పాటు అంతర్గత విభేదాలు అణిగిఉన్నాయి. ఆ తర్వాత 1979లో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల హరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా 1983లో మాజీ ఎమ్మెల్యే మద్దెలచెర్వు నారాయణరెడ్డిని అనంతపురంలోని అన్నపూర్ణ లాడ్జి వద్ద పరిటాల శ్రీరాములు వర్గీయులు చంపేశారు. నారాయణరెడ్డిని వెంటాడి, వేటాడి కిరాతకంగా నరికి చంపిన సంఘటన నేటికీ జిల్లా వాసులు మరవలేదు. ఒక తరం అంతం... మలి తరం ఆరంభం పరిటాల శ్రీరాములు, పరిటాల హరి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి హత్యలతో ఒక తరం పెద్దలు బలయ్యారు. అప్పటికి నారాయణరెడ్డి కుమారులు సూర్యనారాయణరెడ్డి, రఘునాథరెడ్డిలు చిన్నపిల్లలు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి సమీప బంధువైన సానే చెన్నారెడ్డి అండగా నిలిచారు. 1989లో పెనుకొండ నియోజకవర్గం నుంచి సానే చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పరిటాల రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటల్లో కొండపల్లి సీతారామయ్య వర్గంలో దళసభ్యులుగా ఉన్న పోతుల సురేష్‌కు రవి పరిచయమయ్యారు. వీరితో చమన్ కలిశారు. పరిటాల రవి, పోతలు సురేశ్, చమన్ల త్రయం వీరి వైరీ వర్గీయులను హతమార్చేందుకు పథకం రచన చేశారు. దీంతో జిల్లాలో తిరిగి ఫ్యాక్షన్ జడలు విప్పుకుంది. ఈ క్రమంలో పెనుగొండ ఎమ్మెల్యే సానె చెన్నారెడ్డిని 1991 మే 7న ఆయన స్వగృహంలోనే కాల్చి చంపారు. దీంతో నరమేథం ఆరంభమైంది. చెన్నారెడ్డి వర్గీయులను వారు తుదముట్టించారు. ఈ క్రమంలోనే పరిటాల రవి వర్గం టీవీ బాంబు కుట్రపన్నింది. 1993 అక్టోబరు 24న, మద్దెలచెర్వు సూరి ఇంట్లో టీవీ బాంబును పెట్టి పేల్చివేసింది. ఈ ఘటనలో మద్దెలచెర్వు సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, చంద్రశేఖర్(7), నారాయణప్పలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సానె చెన్నారెడ్డి కుమారులు ఓబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కూడా శత్రువుల చేతిలో హతమయ్యారు. ఆర్వోసీతో ఊచకోత పీపుల్స్‌వార్ నుండి బయటకు వచ్చిన పోతుల సురేష్ రీఆర్గనైజింగ్ కమిటీ(ఆర్వోసీ)ను ప్రారంభించారు. ఆర్వోసీ అండతో పరిటాల రవి తన శత్రువర్గాన్ని ఊచకోత కోశారు. క్రమంలో సూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై 1997 నవంబర్ 19న హైదరాబాదులో పరిటాల రవిని హత మార్చేందుకు కారు బాంబు ప్రయోగించారు. ఈ ఘటనలో పరిటాల రవి తృటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మద్దెలచెర్వు సూరి 13 ఏళ్లు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత 2005 జనవరి 24న జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట పరిటాల రవిని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఆ తర్వాత రవి సతీమణి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005 నుండి ఎలాంటి గొడవలు లేకుండా జిల్లా ప్రశాంతంగా ఉంది. 2009 డిసెంబరు 29న జైలు నుండి విడుదలైన సూరీ కూడా తాను ఫ్యాక్షన్ చేసే స్థితిలో లేనని, ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నానని పదేపదే వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్వోసీ నేత పోతుల సురేశ్ 2010 అక్టోబరు 17న కోర్టుకు లొంగిపోయారు. 2011 జనవరి 3న మద్దెల చెర్వు సూరీని హైదరాబాద్‌లో కాల్చి చంపారు. పరిటాల రవి, సూరి హత్యలతో రెండో తరం అంతమైంది. ఇలా పరిటాల శ్రీరాములు నుంచి మద్దెల చెరువు సూరీ హత్య వరకూ ఈ రెండు కుటుంబాల మధ్య రేగిన ఫ్యాక్షన్ చిచ్చులో 973మంది బలైన ట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలా రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వందలమంది ప్రాణాలు కోల్పోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమేమో!! సూత్రధారులతో పాటుపాత్ర ధారులనూశిక్షించాలంటున్న భానుమతి సూరి హత్య తర్వాత భాను కిరణ్ కొన్ని నెలలు కన్పించకుండా వెళ్లిపోయారు. భానునే సూరిని హత్య చేశారని అప్పట్లో పోలీసులు, సూరి అనుచరులు భావించారు. అయితే పరిటాల రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్, విజయవాడకు చెందిన టీడీపీ నేత వల్లభనేని వంశీలే తన భర్త హత్యకు కారకులని సూరీ సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. ఆపై మంగళవారం తన భర్త హత్య కేసు తుదితీర్పు అనంతరం కూడా పరిటాల కుటుంబంపై భానుమతి ఆరోపణలు చేశారు. భానుకు యావజ్జీవశిక్ష విధించడంపై తాను అసంతృప్తిగా ఉన్నానని, ఉరిశిక్ష విధించాలని అన్నారు. అలాగే పాత్ర దారులతో పాటు కుట్రదారులకు కూడా శిక్ష పడాలన్నారు. అంటే పరిటాల కుటుంబీకుల పాత్ర కూడా ఉందని, వారికి శిక్షపడాలని చెప్పకనే చెప్పారు. దీంతో సూరీ హత్యతో పరిటాల కుటుంబీకుల పాత్ర ఉందనే భానుమతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికైనా ‘అనంత’ ఫ్యాక్షన్‌కు ముగింపు పలకాలని, ఇప్పటి వరకూ సాగిన దారుణకాండ చాలని, అంతా ప్రశాంత జీవితాన్ని కోరుకోవాలని జిల్లా వాసులు కాంక్షిస్తున్నారు. -
వినోదమే వినోదం
‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు. -
13 రోజుల్లో పూర్తి
1983లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘మర్లపులి’. డి.నరసింహా సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో, అర్చన ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్ర గీతాలను మరో హీరోయిన్ భాను చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, సంగీత దర్శకుడు బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మా చిత్రదర్శకుడు రామకృష్ణ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా చిత్రం రూపొందింది. నా సంగీతంలో విడుదలవుతున్న ఈ చిత్రం పాటలు మంచి ప్రజాదరణ పొందుతాయని ఆశిస్తున్నా’’ అన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. తక్కువ సమయంలో అయినా మంచి క్వాలిటీతో తీశాం’’ అన్నారు.‘‘వరుణ్‌సందేశ్ పక్కన లీడు రోల్లో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు భాను. పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: యం.మురళీకృష్ణ. నిర్మాతలు: భీరం సుధాకర్ రెడ్డి, బి.భవానీ శంకర్, ఖమ్మం శ్రీను. -
పట్టుదలతో సాధించారు!
ఆళ్లగడ్డ: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షంషాద్‌బాను. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో బీసీ– మహిళ కోటాలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించారు. తద్వారా ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. షంషుద్దీన్, ఫాతిమాబీ దంపతుల కుమార్తె షంషాద్‌బాను. తల్లిదండ్రులు వంట మనుషులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పేదరికం కారణంగా షంషాద్‌బాను చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక ఎంపీపీ మెయిన్ స్కూల్, 6 నుంచి 10 వ తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థానిక రాఘవేంద్ర ఎయిడెడ్ కళాశాలలో చదివారు. అనంతరం కర్నూలులో డీఎడ్ పూర్తి చేశారు. 2000 నవంబర్‌లో నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. 2002లో వివాహమైంది. పెద్ద చదువులు చదివి ప్రజలకు సేవచేయాలన్న తలంపుతో ఉన్న షంషాద్‌బానుకు టీచర్ ఉద్యోగం పెద్దగా తృప్తినివ్వలేదు. దీంతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. భర్త మహమ్మద్‌రఫీ కూడా ఆమెను ప్రోత్సహించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే విరామ సమయంలో గ్రూప్స్‌నకు సిద్ధమయ్యారు. 2010 గ్రూప్–1లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అంతటితో నిరుత్సాహ పడకుండా మళ్లీ 2011 గ్రూప్–1లో పోటీపడ్డారు. ఇందులో 363 మార్కులు సాధించారు. బీసీ మహిళ కోటాలో స్టేట్ రెండో ర్యాంకు సాధించి..ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ పోస్టుపైనా పెద్దగా ఆసక్తి లేదని, ఎలాగైనా ఆర్డీవో పోస్టు సాధించడమే తన లక్ష్యమని, అందుకు ఇప్పటి నుంచే మళ్లీ ప్రిపేర్ అవుతున్నానని షంషాద్‌బాను చెప్పారు. -
సిటీసెంటర్ మాల్లో యువతి వీరంగం
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శి సురేష్ (50), ఆయన భార్య భాను (44)లపై హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్ మాల్లో ఎంపీ కూతురినంటూ ఓ యువతి దాడికి పాల్పడింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సిటీసెంటర్ మాల్లో సీసీ పుటేజీలు పరిశీలించి యువతి కోసం గాలింపు చేపట్టారు. సురేష్, భాను దంపతులు ఆదివారం సిటీసెంటర్ మాల్‌కు రాగా, ఓ యువతి వీరిని ఢీకొట్టి వడివడిగా లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. అంతటితో ఊరుకోకుండా కళ్లు కనిపించట్లేదా అంటూ.. సురేష్ దంపతులనే బెదిరించింది. సెక్యూరిటీ గార్డులతో పాటు షాపింగ్‌కు వచ్చిన వారు వారిస్తున్నా వినకుండా నేను ఎంపీ కూతురిని అంటూ గన్మెన్లను పిలుస్తున్నానని, కాల్చేస్తానంటూ వారిపై దాడికి దిగింది. బాధితులు వారి కారు దగ్గరకు వెళ్లబోతుండగా అడ్డగించి మరీ దాడికి యత్నించింది. సెక్యూరిటీ గార్డుల భద్రత నడుమ వారిద్దరు అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. కోటి విలువ చేసే ఆమె కారు నంబర్‌ను బాధితులు గుర్తించి పోలీసులకు అందజేశారు. -
ఎవరికీ వ్యతిరేకం కాదు
భాను, శరత్, కారుణ్య, హరిణి, అనుషా, జై ముఖ్య తారలుగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరీష్ కుమార్ గజ్జల నిర్మించిన సినిమా ‘ద్యావుడా’. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రజల్ క్రిష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను షకీలా విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ–‘‘ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్‌తో వస్తున్నా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘ఈ నెల 13న విడుదల సినిమాను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్. -
నిత్య పెళ్లికొడుకు అరెస్టు
కేకేనగర్: మదురై, చెన్నై సహా పలు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువతులను పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేశారు. మదురై పుదూర్ ఈబీ కాలనీకి చెందిన సలామియా భాను (28) కొన్ని రోజుల క్రితం మదురై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. అందులో మదురై ఎల్లీస్ నగర్‌కు చెందిన తస్లిమా తనకూ ఖాదర్‌బాషా అనే వ్యక్తికి పెళ్లి చేసిందని పేర్కొంది. పెళ్లి చేసేముందు ఖాదర్‌బాషా తమ ధువేనని, బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పిందన్నారు. కాగా ఈ నెల రెండవ తేదీన ఇంట్లో ఉంచిన రూ. 3 లక్షలు, ఎనిమిది సవర్ల బంగారు నగలు, ఏటీఎం కార్డును తన భర్త తీసుకెళ్లాడని చెప్పింది. కొన్న రోజుల అనంతరం అతని ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో అనుమానించిన తాను భ ర్త వివరాలు సేకరించగా అప్పటికే ఖాదర్‌బాషా చెన్నైకు చెందిన నిర్మల, దిండుగల్ జమునారాణి, వత్సలగుండు మహాలక్ష్మి, ఇలా తనతో కలిపి ఎనిమిది మందిని వివాహం చేసుకుని మోసం చేసినట్లు తెలిపింది. ఈమె ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తూత్తుకుడిలో తలదాచుకున్న నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. చోరీయత్నం: ముగ్గురి అరెస్టు: చోరీ యత్నం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తురైపాక్కం పెరుంగుడికి చెందిన సరళ ఇనుప దుకాణం యజమాని. ఇక్కడ వాచ్‌మెన్‌గా ఆనందన్ (54) పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా నవీన్ (25), ఆల్బర్ట్ (22), రామమూర్తి (20)లు ముగ్గురూ ఆదివారం రాత్రి దుకాణంలోని ఇనుప సామాన్లను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. వాచ్మెన్ ఆనందన్ అడ్డుకోవడంతో ఆనందన్‌ను కత్తితో పొడిచి పారిపోయారు. పోలీసులు తీవ్ర విచారణ జరిపి ముగ్గురిని అరెస్టు చేశారు. -
ఆ ఇద్దరి ప్రేమ!
అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా ఓ చిత్రం రూపొందనుంది. కార్తీక్, భాను జంటగా నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించనున్న చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరా బాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘నాని చెప్పిన కథ కొత్తగా ఉంది. యువతరానికి మెచ్చే సందేశాత్మక చిత్రమిది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎమ్. క్రిష్, సంగీతం: ఘంటాడి కృష్ణ. -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం రేకుర్తిలో చోటు చేసుకుంది. మండలంలోని ఆల్పోర్స్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న గంటా భాను(16) సోమవారం అస్వస్థతకు గురికావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్షం వల్లే తమ కూతురు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి స్వస్థలం జగిత్యాల మండలం నర్సింగాపూర్. -
పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య..
జైలు నుంచి భర్త విడుదల కాలేదని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు.. కన్నబిడ్డలను చంపి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నార్పల మండలం బండ్ల పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్ జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది. భర్త జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపం చెందిన మాధవి.. బుధవారం ఉదయం తన ఇద్దరు పిల్లలకు ఉరేసి..తాను ఉరేసుకుంది. ఈ ఘటనలో కూతురు భాను (5)ప్రాణాలతో బయట పడగా.. కుమారుడు లోకేశ్వర్ రెడ్డి (3) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం బాను ను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
అనంతపురం: అనంతపురంలో దారుణం జరిగింది. జీవితాంతం వెంట ఉండాల్సిన భర్త కాలయముడిగా మారాడు. కిరాతకంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. వివరాలు.. సునిత (25) అనే మహిళను తన భర్త సంతోశ్ కుమార్ గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భాను మృతి చెందింది. భాను ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. గత కొద్ది కాలంగా భార్య సునీతను సంతోశ్ అనుమానించేవాడు. పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న సంతోశ్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే భార్యను హత్య చేసి ఉంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సంతానంకు జోడిగా భాను
తామరభర్ణి చిత్రంలో విశాల్‌కు జంటగా పరిచయమైన మలయాళీ కుట్టి భాను. ఆ చిత్రం హిట్ అయినా, ఈ అమ్మడుకు కష్టాలు వెంటాడుతూ వస్తున్నాయి. ఇందుకు కుటుంబ సమస్య కూడా కారణం. ఆ మధ్య వసంత్ దర్శకత్వంలో మూన్డ్రు పేరు మూన్డ్రు కాదల్‌లో ముగ్గురు నాయకిల్లో ఒకరుగా నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు రాజేష్ మరో అవకాశం కల్పించారు. తాను దర్శకత్వం వహిస్తున్న వాసువుం...శరవణను ఎన్న పడి చవ్వంగ చిత్రంలో ఆర్య, తమన్న నాయకా నాయకీలుగా నటిస్తున్నారు. ఇందులో హాస్య పాత్రలో సంతానం నటిస్తుండగా, అతడికి జంటగా భాను ఎంపిక అయ్యారు. ఇది ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న ఇతివృత్తాంతంతో నిర్మిస్తున్న చిత్రం. ఇది పూర్తిగా వినోద భరిత చిత్రం. ఇందులో భాను పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. సంతానంతో డ్యూయెట్స్ కూడా పాడుతుందట.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో తమన్న, ఆర్యలపై పాట చిత్రీకరణ సాగుతోంది. తదుపరి సంతానం భానుల యుగళ గీతం చిత్రీకరించనున్నట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.