
భాను, శరత్, కారుణ్య, హరిణి, అనుషా, జై ముఖ్య తారలుగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరీష్ కుమార్ గజ్జల నిర్మించిన సినిమా ‘ద్యావుడా’. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రజల్ క్రిష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను షకీలా విడుదల చేశారు.
ఆమె మాట్లాడుతూ–‘‘ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్‌తో వస్తున్నా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘ఈ నెల 13న విడుదల సినిమాను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్.
Comments
Please login to add a commentAdd a comment