ఏఈఈల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈ ఈ) నాణ్యతపై రాజీలేకుండా, ప్రమాణాలు పాటిస్తూ శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. తమ శాఖ పరిధిలో త్వరలోనే 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకా రం తెలిపారన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1, 375 కోట్లతో రోడ్లు వేయబోతున్నామని, ఏఈఈల ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభం కావడం అదృష్టమని తెలిపారు. ‘అభివృద్ధి పనుల్లో మీ మార్కును చూపాలి. నాణ్యత లేని పనులు చేస్తే సస్పెండ్ అవుతారు’అని హెచ్చరించారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు మంగళవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు మూతపడుతున్నాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందపడుతున్నారని, బీఆర్‌ఎస్ హయాంలోనే గురుకులాల అద్దె లు రూ. కోట్లలో పెండింగ్‌లో పెట్టారని చెప్పా రు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పార్టీ సమీక్ష అనంతరం ఆమె గాం«దీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment