![Ravi Teja And Sreeleela New Movie Launched With Pooja Ceremony](/styles/webp/s3/article_images/2024/06/11/ravi_0_0.jpg.webp?itok=XtXeRuBy)
కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు,ఈగల్ వంటి చిత్రాలతో దూకుడు మీద ఉన్నాడు రవితేజ. హరీశ్ శంకర్ దర్వకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. అయితే తాజాగా రవితేజ తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు.
‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్ అయింది. తాజాగా నేడు ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది. తొలి సన్నివేశంలో రవితేజ, శ్రీలీల జంటగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలతో తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెరకెక్కనుంది.
ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment