మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్‌ వచ్చేసింది | Ravi Teja Latest Movie Mass Jathara Glimpse Out Now | Sakshi
Sakshi News home page

Mass Jathara Glimpse: మాస్ మహారాజా బర్త్‌ డే స్పెషల్.. 'మాస్ జాతర'.. గ్లింప్స్‌ చూశారా?

Published Sun, Jan 26 2025 11:08 AM | Last Updated on Sun, Jan 26 2025 11:20 AM

Ravi Teja Latest Movie Mass Jathara Glimpse Out Now

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీ రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన చిత్రానికి రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా నటించిన ధమాకా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇవాళ మాస్‌ మహారాజా బర్త్‌ డే కావడంతో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. తాజాగా  మాస్ జాతర మూవీ గ్లింప్స్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. దాదాపు 61 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మూవీగానే మాస్ జాతరను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మే 09న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement