Watch: Ravi Teja Dhamaka Movie Whats Happening Song Lyrical Video Out - Sakshi
Sakshi News home page

Ravi Teja Dhamaka: 'ధమాకా' క్రేజీ అప్‌డేట్.. ఆకట్టుకుంటున్న లిరికల్ వీడియో సాంగ్

Published Fri, Nov 11 2022 7:05 PM | Last Updated on Fri, Nov 11 2022 7:46 PM

Raviteja Latest Movie Dhamaka Lyrical Video Song Out Now - Sakshi

మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ 'ధమాకా'. యాక్షన్‌ అండ్ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. 

(చదవండి: 'దీపావళికి మాస్ మహారాజా సర్‌ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్)

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని లిరికల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ సాగే సాంగ్‌ విడుదల చేయడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని మాస్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖేడేకర్‌, తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, ఆలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement