రవితేజ 'మాస్‌ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా! | Tollywood Hero Ravi Teja Latest Movie First Look Poster Out Now | Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ 'మాస్‌ జాతర'.. ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్!

Published Wed, Oct 30 2024 4:27 PM | Last Updated on Wed, Oct 30 2024 4:46 PM

Tollywood Hero Ravi Teja Latest Movie First Look Poster Out Now

టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్‌ తర్వాత ఆర్‌టీ75 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. టైటిల్‌ రివీల్‌ చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్‌ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్‌ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్

కాగా.. సామజవరగమన వంటి హిట్‌ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement