title
-
పంకజ్... అదే జోరు
దోహా: భారత క్యూస్పోర్ట్స్ దిగ్గజం cమరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గురు వారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 4–1 (42–72, 93–17, 93–1, 89–21, 70–41) ఫ్రేమ్‌ల తేడాతో ఇరాన్‌కు చెందిన మాజీ ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్ అమిర్ సర్ఖోష్ పై గెలుపొందాడు. అతని ఖాతాలో ఇది 14వ ఆసియా టైటిల్ కావడం విశేషం. ఇదివరకే అతను స్నూకర్‌లో నాలుగు, cతొమ్మిది టైటిల్స్ గెలిచాడు. వీటితో పాటు 2006, 2020లలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచాడు. తాజా ఆసియా టైటిల్‌తో ఓ క్యాలెండర్ ఇయర్లో జాతీయ, ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లు గెలిచిన ఆటగాడిగా ఘనత వహించనున్నాడు. బిలియర్డ్స్‌లో ఇదివరకే ఈ రికార్డు లిఖించిన పంకజ్ స్నూకర్‌లో లిఖించాల్సి ఉంది. ఇదే జరిగితే క్యూస్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లోనే ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. ‘ఆసియా పతకం నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. చివరకు మరో బంగారు పతకాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. ఇదే నిలకడైన ప్రదర్శనతో భారత్ గర్వించే విజయాలు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నాను’ అని మ్యాచ్ విజయానంతరం పంకజ్ అద్వానీ అన్నాడు. -
ఒలివియా–జాన్ పీర్స్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ‘మిక్స్డ్ డబుల్స్’ ఫైనల్ కాస్తా ఆ్రస్టేలియన్ల సమరంగా మారింది. కోర్టులో ఇవతల... అవతల... నలుగురూ ఆ్రస్టేలియన్లే ట్రోఫీ కోసం ‘ఏస్’లు దూశారు. చివరకు ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిస్తే... సహచర ద్వయం కింబర్లీ బిరెల్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నరప్‌తో తృప్తి పడింది. ఇరు జోడీలు ‘వైల్డ్‌కార్డ్’ ఎంట్రీతోనే సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ ఆడటం గమనార్హం. మొత్తానికి 58 ఏళ్ల తర్వాత అంతా అ్రస్టేలియన్లే తలపడిన తుది పోరులో పీర్స్–ఒలివియా జోడీ 3–6, 6–4, 10–6తో స్మిత్–బిరెల్ జంటపై గెలిచింది.ఒలివియా–పీర్స్ జంటకు 1,75,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 95 లక్షల 36 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 22 ఏళ్ల ఒలివియాకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 36 ఏళ్ల పీర్స్ ఖాతాలో ఆ్రస్టేలియన్ ఓపెన్ (2017) పురుషుల డబుల్స్ టైటిల్, 2022లో యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఉన్నాయి. -
నా కల నిజమైంది: గుకేశ్
‘లిరెన్ 55వ ఎత్తు తర్వాత నేను ఏం వేయాలో అప్పటికే సిద్ధమైపోయా. ఇక ఎత్తు వేయడమే తరువాయి. అయితే ఒక్కసారిగా అతని అడుగు నన్ను ఆశ్చర్యపరిచింది. దానిని వెంటనే నమ్మలేకపోయా. కానీ నా జీవితంలో అత్యుత్తమ క్షణం వచ్చేసిందని అప్పుడే అర్థమైపోయింది. ఆరేళ్ల వయసులో చెస్ మొదలు పెట్టాను. గత పదేళ్లుగా ఇదే కల నన్ను నడిపించింది. ప్రతీ ఆటగాడు ఇలాంటి స్థాయిని అందుకోవాలని ఆశిస్తాడు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. 2013లో ఆనంద్, కార్ల్సన్ మధ్య పోరును చెన్నైలోని ఆడిటోరియంలో కూర్చొని చూసేందుకు చోటు దొరకలేదు. దాంతో గాజు తెర బయట నిలబడ్డా. ఇప్పుడు అలాంటి తరహాలో భారత జెండా పక్కన పెట్టుకొని పోటీ పడటం గర్వంగా అనిపించింది. కార్ల్సన్ టైటిల్ సాధించిన సమయంలో దానిని మళ్లీ భారత్‌కు అందించే ఆటగాడిని నేనే కావాలని కోరుకున్నా. అధికారికంగా నా టీమ్‌లో ఆనంద్ సర్ భాగస్వామి కాకపోయినా ఆయన అన్ని విధాలా నాకు సహకరించారు. నా శిక్షణ శిబిరానికి కూడా వచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. గత ఏడాది నేను క్యాండిడేట్స్‌కు అర్హత కూడా సాధించలేకపోయినా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. టైటిల్ గెలవగానే అమ్మకు ఫోన్ చేశాను. ఇద్దరమూ ఏడుస్తున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేకపోయాం. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చెస్‌ను ఆస్వాదిస్తుంటే చాలు ఏదో ఒక రోజు లక్ష్యం చేరవచ్చు. 12 గేమ్‌ల వరకు కూడా సరిగ్గా నిద్రపోలేదు. కానీ ప్యాడీ ఆప్టన్ సూచనలు నన్ను ప్రశాంతంగా మార్చాయి. హాయిగా పడుకోగలిగాను. అందుకే తర్వాతి రెండు గేమ్‌లలో ఉత్సాహంగా ఉన్నాను. ఇది గెలవగానే నేను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని అయిపోలేదు. కార్ల్సన్ ఎలాగూ ఉన్నాడు. అతనితో తలపడాలని నాకూ ఉంది. చెస్‌లో అదే అత్యంత పెద్ద సవాల్. అయితే అది అతని ఇష్టంపై ఆధారపడి ఉంది. అతడిని స్ఫూర్తిగా తీసుకొనే అతని స్థాయిని అందుకోవాలనుకుంటున్నా’ అని విజయనంతరం మీడియా సమావేశంలో గుకేశ్ పేర్కొన్నాడు -
తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు. -
టీపీఎల్ విజేత హైదరాబాద్ స్ట్రయికర్స్
ముంబై: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)లో హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. యశ్ ముంబై ఈగల్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ స్ట్రయికర్స్ 51–44 పాయింట్లతో గెలిచి మూడోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హరీట్ డార్ట్, బెంజమిన్ లాక్, ఒలింపియన్ విష్ణువర్ధన్‌లతో కూడిన హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టుకు గ్రాస్‌కోర్టు జాతీయ మాజీ చాంపియన్ సురేశ్ కృష్ణ కోచ్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో హరీట్ డార్ట్ 14–11తో జెనెప్ సోన్మెజ్పై గెలిచి హైదరాబాద్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కరణ్ సింగ్ (ముంబై) 14–11తో బెంజమిన్ లాక్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో విష్ణువర్ధన్–హరీట్ డార్ట్ ద్వయం 16–9తో జెనెప్ సోన్మెజ్–జీవన్ నెడుంజెళియన్ జోడీని ఓడించింది. జీవన్ నెడుంజెళియన్–కరణ్ (ముంబై)... విష్ణువర్ధన్–బెంజమిన్ లాక్ (హైదరాబాద్) జోడీల మధ్య నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ పోరు 10–10తో ‘టై’గా ముగియడంతో హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టుకు టైటిల్ ఖరారైంది. -
నేషనల్ అమెరికా మిస్ హన్సిక
బంజారాహిల్స్: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో నగరానికి చెందిన తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి సత్తాచాటి విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు. హన్సిక రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యా్రక్టెస్ పోటీల్లో సైతం విజేతగా నిలిచారు. అదేవిధంగా అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ నాలుగుసార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ.మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తాచాటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. -
ఆ లీక్ వీరులెవరో నాకు తెలుసు.. దసరా డైరెక్టర్ ఆగ్రహం!
దసరా మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నానితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించి టైటిల్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ మండిపడ్డారు.నా మూవీ టైటిల్ లీక్ చేసింది ఎవరో తనకు తెలుసని శ్రీకాంత్ ఓదెల అన్నారు. మా టీమ్‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నా సినిమాకు మాత్రమే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వాళ్లు సినిమా రంగంలో క్రియేటర్స్ అని కొనియాడారు. సినిమాలకు వారు అందించే నిస్వార్థమైన సేవలను గౌరవించాలని.. అంతేగానీ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు మోపడం సరికాదని శ్రీకాంత్ అన్నారు.కాగా.. శ్రీకాంత్.. నానితో తెరకెక్కిస్తోన్న చిత్రానికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ మూవీ యూనిట్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ విషయంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. To whomever it may concern,నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024 -
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024 -
ఫ్యాన్స్‌కు హీరో నిఖిల్ సర్ప్రైజ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్‌గా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దీపావళికి థియేటర్లలో అలరించేందుకు యంగ్ హీరో నిఖిల్ రానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.(ఇది చదవండి: స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్..)అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. Into the World of #AppudoIppudoEppudo ❤️This'll thrill you, tickle you & breeze you 🤗@actor_Nikhil @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/elyKT8ESJC— sudheer varma (@sudheerkvarma) October 6, 2024 -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సబలెంక (ఫోటోలు)
-
షమ్ము హీరోగా క్రేజీ మూవీ.. టైటిల్ రివీల్ చేసిన అశ్విన్ బాబు
షమ్ము హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'క్రేజీ రాంబో'. ఈ సినిమాకు హరీష్ మధురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. 'క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీగా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. హీరో షమ్ము మాట్లాడుతూ.. 'ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మధు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నా. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
విజేత తరుణ్ మన్నేపల్లి
కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తరుణ్ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్ జూ విన్‌పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ టైటిల్ సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాపై 21–15, 21–16తో అనుపమ గెలుపొందింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా రన్నరప్‌గా నిలిచింది. మనీషా – సంజయ్ శ్రీవత్స జోడి ఫైనల్లో 21–9, 7–21, 12–21తో వాంగ్ టిన్ సి – లిమ్ చూ సిన్ (మలేసియా) చేతిలో పరాజయంపాలైంది. టైటిల్ సాధించే క్రమంలో తరుణ్ సహచరుడు గగన్ బల్యాన్, 2022 వరల్డ్ జూనియర్ చాంపియన్íÙప్ రన్నరప్ శంకర్ ముత్తుసామి, దిమిత్రీ పనరియన్ (కజకిస్తాన్), ఏడో సీడ్ లీ డ్యూక్ (వియత్నాం)లను ఓడించాడు. -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి మయామి మాస్టర్స్ టైటిల్
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 26 డబుల్స్ టైటిల్‌కాగా... ‘మాస్టర్స్ సిరీస్’లో ఆరో టైటిల్ కావడం విశేషం. 44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్ సిరీస్’లో ఇండియన్ వెల్స్ (2023), మోంటెకార్లో ఓపెన్ (2017), మాడ్రిడ్ ఓపెన్ (2015), పారిస్ ఓపెన్ (2012), పారిస్ ఓపెన్ (2011) టైటిల్స్ సాధించాడు. లియాండర్ పేస్ (2012లో) తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. -
ఆ రోజే టైటిల్
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ టీజర్‌ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయన్నుట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ పోస్టర్‌ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కిచెన్‌లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/61WPNVbJ5R — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024 -
WPL 2024: కల నెరవేరిన వేళ.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్‌గా ఆర్సీబీ (ఫొటోలు)
-
French Open 2024 : సాత్వి క్–చిరాగ్ జోడీదే టైటిల్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో సాత్విక్–చిరాగ్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్వి క్–చిరాగ్ 21–11, 21–17తో లీ జె హుయ్–పో సువాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. టైటిల్ గెలిచే క్రమంలో భారత జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్కగేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సాత్వి క్–చిరాగ్ శెట్టిలకు 62,900 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 52 లక్షలు), 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 2022లోనూ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచారు. ఈ ఏడాది సాత్వి క్–చిరాగ్ మలేసియా మాస్టర్స్ టోర్నీ, ఇండియా ఓపెన్ టోరీ్నలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. మూడో టోర్నీలో మాత్రం ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా విజేతగా నిలిచారు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ కాంగ్ మిన్ హుక్–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా) జోడీని 21–13, 21–16తో చిత్తు చేసిన సాత్వి క్–చిరాగ్... ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. సుదీర్ఘ ర్యాలీలు సాగకుండా కళ్లు చెదిరే స్మాష్‌లతో పాయింట్లను తొందరగా ముగించారు. తొలి గేమ్‌లో తొలి ఏడు నిమిషాల్లోనే సాత్వి క్–చిరాగ్ 11–4తో ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మరో నాలుగు నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో చైనీస్ తైపీ జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో భారత ద్వయం పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. -
డబుల్ ట్రీట్
బర్త్ డేకి శ్రీ విష్ణు డబుల్ ట్రీట్ అందుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 29) శ్రీవిష్ణు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటించనున్న రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు ఆయా మేకర్స్. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రేమకథతో కూడిన ఫన్ రోలర్ కోస్టర్ మూవీ ఇది. మరోవైపు ‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు ‘శ్వాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరకర్త. -
అందుకే ఆ టైటిల్!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్‌ని తొలుత ప్రాజెక్ట్ కె’ అని నిర్ణయించారు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’గా మార్చారు. కొత్త టైటిల్‌పై ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ ఎందుకు పెట్టామనే విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను మహాభారతం గురించి వింటూ, స్టార్ వార్స్‌ని చూస్తూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ ఆలోచన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టాం. ఈ మూవీలో ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించాం. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. గతంలో హాలీవుడ్లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘బ్లేడ్ రన్నర్’ మూవీ పోలికలు ‘కల్కి 2898 ఏడీ’లో ఎక్కడా కనిపించవు. ఓ రకంగా ఇది నాకు సవాల్’’ అన్నారు. సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా మన బాస్మతి రైస్!
పలావ్ దగ్గర నుంచి బిర్యానీ వంటి వంటకాలకు కావాల్సింది బాస్మతి రైస్. పండుగలకు, వేడుకలకు వంటకాల్లో వాడే రైస్ ఇది. ఈ రైస్ అంటే ప్రతి ఒక్క భారతీయుడికి అత్యంతి ఇష్టం. పైగా ఖరీదు కూడా ఎక్కువే. అలాంటి సుగంధభరితమైన బాస్మతి ప్రపంచంలోనే అత్యత్తమ బియ్యంగా టైటిల్‌ని దక్కించుకని జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. ఆ బాస్మతి బియ్యం భారత్‌కి ఎలా వచ్చింది?. దానికి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర ఆసక్తికర విషయాల గురించి చూద్దామా!. ప్రముఖ ఫుడ్ గ్రేడ్ అయిన అట్లాస్ 2023-24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియంగా జాబితా విడుదల చేసింది. అందులో బాస్మతి బియ్యం అగ్ర స్థానంలో ఉంది. ఇటలీకి చెందిన ఆర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో ఉన్నాయి. బాస్మతి వాసన, రుచి, పెద్ద గింజరు ఉన్నప్పటికీ ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ నుంచి బిర్యానీ వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తి మొదటి ఎంపిక బాస్మతి బియ్యం. దీన్ని భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పండిస్తుంటారు. బాస్మతి బియ్యం అనేది భారత్‌కు పెట్టింది పేరు. ఒక్క భారత్‌లో 34 రకాల బాస్మతి బియ్యాన్ని పండిస్తారు. వీటిని విత్తనాల చట్టం కింద 1966లో నోటిఫై చేశారు. ఆ రకాల్లో బాస్మతి 217, బాస్మతి 370, టైప్ 3 (డెహ్రాడూని బాస్మతి) పంజాబ్, బాస్మతి 1 (బౌని బాస్మతి), పూసా బాస్మతి 1, కస్తూరి, హర్యానా బాస్మతి 1, మహి సుగంధ, తారావోరి బాస్మతి (HBC 19 / కర్నాల్ లోకల్), రణబీర్ బాస్మతి, బాస్మతి 386 తదితరలు ఉన్నాయి. అంతేగాదు సౌదీ అరబ్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, యెమెన్ రిపబ్లిక్ వంటి దేశాలకు భారతదేశం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రధాన సంస్థ అని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) పేర్కొంది. బాస్మతి చరిత్ర.. బాస్మతి రైస్‌ను హిమాలయాల దిగువ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. పురాతన కాలంలో కూడా బాస్మతిని పండించినట్లు చరిత్ర చెబుతోంది. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకంలో హరప్పా, మొహెంజోదారో తవ్వకాల్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని చెబుతుంది. పర్షియన్ వ్యాపారులు భారత దేశానికి వచ్చినప్పుడు తమ వెంట అనేకరకాల సుగంధ బియ్యం తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చారని చరిత్ర చెబుతుంది. ఈ రైస్‌ని సువాసనల రాణి అని కూడా.. సంస్కృత పదాలు వాస్, మయాప్ నుంచి బాస్మతి పేరు వచ్చింది. వాస్ అంటే సువాసన. మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణిగా పిలుస్తారు. ఎలా గుర్తిస్తారంటే.. బాస్మతి ఎక్స్‌పోర్టు డెవలప్మెంట్ ఫౌండేషన్ బాస్మతి బియ్యం అసలైందో కాదో నిర్ణయిస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీప్రకారం 6.61 మి.మీ పొడవు. 2 మి.మీ మందంగా ఉండే బియ్యాన్ని బాస్మతిగా గుర్తించింది. (చదవండి: భారత్‌లో 5% మేర పేదరికం తగ్గుతోంది!) -
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్‌తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024 -
పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా అనుష్క సినిమా
‘అరుంధతి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో తనదైన శైలిని చాటుకుని సక్సెస్ అయ్యారు అనుష్క. తాజాగా ఆమె కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో సినిమా అంగీకరించారు. క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క పాత్ర ఉంటుందట. ఇటీవల ఒడిస్సాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలిసింది. కాగా ఈ సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేస్తున్నారని, ఈ సినిమా ఈ ఏడాదే దక్షిణాది భాషల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ ఇండియా ప్రాబ్లం మూవీ!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. గతేడాది ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం లాంటి మాస్ సినిమాలతో అలరించిన నరేశ్.. మళ్లీ ట్రాక్ మార్చేశాడు. ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన కామెడీ ఓరియంటెడ్ చిత్రంతో అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిలక ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆ ఒక్కటీ అడక్కు అనే టైటిల్ ఖరారు చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దోడా బయట వాళ్లందరికీ ఏం చెబుతావురా అనే డైలాగ్‌లో గ్లింప్స్ మొదలైంది. అందరూ నీ పెళ్లి ఎప్పుడని అల్లరి నరేశ్‌ను అడగడం చూస్తే.. ఆ కాన్సెప్ట్‌తోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. గతంలో 'ఆ ఒక్కటీ అడక్కు’… అనే టైటిల్‌తో రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమా వచ్చింది. అప్పట్లో ఆ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. 1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన మూవీ సెటైరికల్ కామెడీగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు అదే టైటిల్‌తో అల్లరి నరేశ్ రాబోతున్నారు. -
సాకేత్–రామ్‌కుమార్ జోడీకి టైటిల్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ ప్లేయర్ సాకేత్ మైనేని ఖాతాలో 16వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ చేరింది. రామ్‌కుమార్ రామనాథన్‌తో జోడీ కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నమెంట్లో డబుల్స్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 3–6, 6–3, 10–5తో భారత్‌కే చెందిన రిత్విక్ చౌదరి– నిక్కీ పునాచా ద్వయంపై గెలుపొందింది. సాకేత్ జోడీ ఒక ఏస్ సంధించగా, 2 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఆఖరిదాకా పోరాడిన రిత్విక్–నిక్కీ జంట 2 ఏస్‌లు సంధించి ఒకసారి డబుల్ ఫాల్ట్ చేసింది. మరో వైపు ఇదే టోర్నీ సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో 26 ఏళ్ల నగాల్ 6–3, 6–4తో చెక్ రిపబ్లిక్కు చెందిన డలిబర్ విర్సినాపై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో సుమిత్... ఇటలీ ఆటగాడు లుకా నర్డితో తలపడతాడు. మరో సెమీస్‌లో లుకా నర్డి 6–4, 4–6, 7–6 (8/6)తో చున్ సిన్ సెంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గాడు. -
బిచ్చగాడు హీరో రొమాంటిక్ మూవీ.. తెలుగులో ఆసక్తికర టైటిల్!
సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ఆంటోని. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. గతేడాది పిచ్చైక్కారన్ –2 చిత్రంతో మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల నటించిన రక్తం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విజయ్ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం రోమియో. ఈ చిత్రంలో అతనికి జంటగా మృణాళిని రవి కనిపించనుంది. విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో కాదల్ డిస్టెన్సింగ్, ఐ హేట్యూ ఐ లవ్ యూ సిరీస్-3 యూట్యూబ్ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా శ్రీజ రవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్
-
'నా వాళ్లే అనుకుంటే కేసులు పెడుతున్నారు'.. ఆసక్తి పెంచుతోన్న గ్లింప్స్!
గతేడాది ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకించాడు నితిన్. ఈ చిత్రంలో అతనికి జోడీగా శ్రీలల నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నితిన్ ప్రస్తుతం మరో చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేశారు. గ్లింప్స్ చూస్తే ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాబిన్‌హుడ్ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥 Say hello to your new family member - #ROBINHOOD ❤️🔥 Title reveal glimpse out now! - https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD — Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024 -
ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #TheRajaSaab It is… 👑 Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️ 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by @Vishwaprasadtg A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 -
టైసన్ నాయుడి యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సాయి శ్రీనివాస్‌ను బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా. -
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ అనే టైటిల్ ఖరారైంది. విజయ్ కెరీర్లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. న్యూ ఇయర్ (2024) సందర్భంగా ఈసినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో లుక్ నేడు రానుందని కోలీవుడ్ సమాచారం. ఫస్ట్‌లుక్‌ని చూస్తే ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని స్పష్టమవుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, లైలా, స్నేహ, జయరాం, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
దళపతి కొత్త మూవీ.. టైటిల్ అదేనంటూ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లియో తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పాత్ర కోసం విజయ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూత్ ఫుల్‌గా తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా ఈ చిత్రానికి బాస్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు న్యూస్ తెగ వైరలవుతోంది. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబరు 31వ తేదీన విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అయ్యాయి. దీనిపై గురించి చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్చన తెలుపుతూ తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏదీ నిజం లేదన్నారు. ముఖ్యంగా చిత్ర టైటిల్ బాస్ అని జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వెంకట్ ప్రభు స్పెషల్‌గా ఆలోచించారని.. ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయ్ తన 69, 70వ చిత్రాలకు కూడా కమిట్ అయినట్లు తెలిసింది. తన 69వ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్, 70వ చిత్రానికి దర్శకుడు శంకర్ లేదా అట్లీ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. ఈ చిత్రంలో నటి స్నేహ, లైలా, రాఘవ లారెన్స్, ప్రశాంత్, మైక్ మోహన్, ప్రేమ్ జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
హిట్ అయితే పెద్ద సినిమానే
‘‘ప్రేక్షకుల సహకారంతో 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చిన్న, పెద్ద సినిమాలనేవి ఉండవు. హిట్ అయితే పెద్ద సినిమా.. ఫట్ అయితే చిన్న సినిమా. ‘విక్టర్ ది నెక్ట్స్ గాడ్’ సినిమాలో 200 మంది నటీనటులకు చాన్స్ ఉండటం హ్యాపీ. నూతన సాంకేతిక నిపుణులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’’ అని సుమన్ అన్నారు. నూతన నటీనటులతో ప్రీతమ్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘విక్టర్ ది నెక్ట్స్ గాడ్’. అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్‌పై రూపొందనున్న ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. ప్రీతమ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సందేశాత్మక చిత్రం. 4 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జాకీ–రవి, సంగీతం: రమేష్ ముక్కెర, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: బీఏ వర్మ. -
రవితేజ మిస్టర్ బచ్చన్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ఖరారైంది.‘నామ్ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్‌లు కలిసి కెమెరా స్విచ్చాన్ చేయగా, మంగత్ పాఠక్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు షాట్‌కు ‘‘మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్ చెప్పగా, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్ శంకర్‌కు ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
రజనీకాంత్ బర్త్‌డే.. రెండు సర్ప్రైజ్లు..
‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని అంటున్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘వేట్టయాన్ ’ (వేటగాడు అని అర్థం) టైటిల్‌ను ఖరారు చేసి, ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మంగళవారం రజనీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘వేట్టయాన్ ’ టైటిల్ వీడియోను విడుదల చేశారు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని రజనీకాంత్ చెప్పే డైలాగ్, విజువల్స్‌తో ఈ వీడియో సాగుతుంది. అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకాప్రోడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అలాగే లైకా ప్రోడక్షన్స్ సంస్థలో రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. రజనీ బర్త్ డే సందర్భంగా మొయిద్దీన్ భాయ్ పాత్రకు సంబంధించిన యాక్షన్ టీజర్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలే కాకుండా.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
బర్త్ డే కానుక?
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని, రజనీకాంత్– ఫాహద్ కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఈ సినిమా టీజర్ విడుదలకు వేళ అయిందట. ఈ నెల 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, ఫేక్ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లైకా ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అప్డేట్ కూడా ఈ నెల 12న రావొచ్చని టాక్. -
మ్యూజిక్ డైరెక్టర్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్!
సంగీతం,నటనతో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా ప్రస్తుతం 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కింగ్‌స్టర్ అనే టైటిల్‌ను మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్‌కుమార్‌కు చెందిన పార్లర్ యూనివర్శల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి కథ, దర్శకత్వం కమల్ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో జీవీకి జోడీగా నటి దివ్యభారతి నటిస్తున్నారు. ఇంతకుముందు ఈ జంట నటించిన బ్యాచిలర్ మంచి విజయాన్ని సాధించింది. కింగ్‌స్టర్ చిత్రం షూటింగ్‌ను నవంబర్ 10వ తేదీ నటుడు కమలహాసన్ చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో జీవీ ప్రకాష్‌కుమార్ మత్స్యకారుడిగా నటించడం మరో విశేషం. సముద్రంలోని రహస్యాలను కనుగొనే యువకుడిగా ఈయన నటిస్తున్నారు. ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందుతోంది. కథానాయకుడి గెటప్ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంది. దీంతో ఆయన అభిమానులు చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్‌స్టర్ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
కొత్త ప్రయాణం ఆరంభం
రైలు ప్రయాణం మొదలు పెట్టారు విజయ్ సేతుపతి. ఆయనతో జర్నీ షేర్ చేసుకుంటున్నారు డింపుల్ హయతి. విజయ్ సేతుపతి హీరోగా డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌కు ‘ట్రైన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్, లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారు మిస్కిన్. -
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
వారాహి ఆలయం నేపథ్యంలో..
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ గోసామి హీరోయిన్. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టైటిల్ లోగోను సుమంత్ రిలీజ్ చేశారు. ‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్. -
తెరచాప ఆడాలి
నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిజైనింగ్ బాగుంది. ఈ సినిమా కథ, కథనం, టేకింగ్, అన్నీ నాకు తెలుసు. ఈ సినిమా బాగా ఆడి, చిత్ర యూనిట్‌కి మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: అజీమ్–వెంకట్. -
ఇంట్రో రెడీ
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄పొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మేజర్ షూట్ పూర్తయింది. తాజాగా ‘ఇండియన్ 2’ సినిమాకు సంబంధించిన వీడియోను ‘ఇండియన్ 2 యాన్ ఇంట్రో’ టైటిల్‌తో నవంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
అధర్వ హీరోగా కొత్త మూవీ.. టైటిల్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి డీఎన్ఏ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు మనం కొత్తి పరవై, డాడా, కళువేత్తి మూర్కన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఒలింపియా మూవీస్ అధినేత అంబేత్‌కుమార్ తర్వాత చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా చిత్తా చిత్రంతో పాపులర్ అయిన మలయాళ నటి నిమీషా సజయన్ నటిస్తున్నారు. కాగా ఇంతకుముందు ఒరునాళ్ కూత్తు, మాన్స్టర్, పర్హానా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు) తాజాగా ఈ మూవీకి డీఎన్ఏ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకలో నిర్మాత ఆర్బీ.చౌదరి, దర్శకుడు పా.రంజిత్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని త్వరగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. కాగా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. (ఇది చదవండి: నువ్వు నీలా ఉండు అని చెప్పింది ) Twitter Glimpse from #DNA film launch auspicious Pooja Starring @atharvaaMurali #NimishaSajayan Directed by @nelsonvenkat@Olympiamovis Production@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir @Sanjay_cheqba @sharmaseenu11 @SriramRavi33@donechannel1 pic.twitter.com/SAZyHQsyPQ — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 Twitter Presenting the title look of @atharvaaMurali & #NimishaSajayan starring #DNAmovie 🧬 Directed by @nelsonvenkat The shooting has officially kicked off. Brace yourself for an crime action drama@Ambethkumarmla@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir pic.twitter.com/5T8io8BpkD — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 -
ఈసారి పండక్కి..నా సామి రంగ
సంక్రాంతికి ‘నా సామి రంగ’ అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘నా సామి రంగ’ టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా ‘నా సామి రంగ’ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఈసారి పండక్కి నా సామి రంగ’ అంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాతో ‘పలాస’ ఫేమ్ దర్శకుడు కరుణకుమార్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘సంక్రాంతి సీజన్లో నాగార్జునగారికి చాలా హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వినోదాత్మకంగా సాగే ‘నా సామి రంగ’ సినిమాను సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ చేయనున్నాం. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, డైలాగ్స్ అందిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి. పవర్ఫుల్ రోల్: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూ΄÷ందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో నాగార్జున ఓ పవర్ఫుల్ రోల్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
ఓ ప్రేమకథ
వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్, పోస్టర్‌ను చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ‘‘చదువుకునే టైమ్‌లోనే సినిమా తీయాలనే కల ఉండేది. మంచి టీమ్‌తో ‘నీతోనే నేను’ తీశాను’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘ఈ సినిమా కోసం టీమ్ ప్రాణం పెట్టి పని చేశారు’’ అన్నారు అంజిరామ్. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు వికాస్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ నవీన్, కెమెరామేన్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి. కడగండ్ల పాల్గొన్నారు. -
ఎదురులేని సాత్విక్–చిరాగ్ జోడీ
యోసు (కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ తమ ఖాతాలో నాలుగో టైటిల్‌ను జమ చేసుకుంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 21–13, 21–14తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ తొలి గేమ్‌లో తడబడినా వెంటనే తేరుకొని తర్వాతి రెండు గేమ్‌లను దక్కించుకున్నారు. తొలి గేమ్‌లో ఒకదశలో 2–10తో వెనుకబడ్డ భారత జోడీ ఆ తర్వాత అంతరాన్ని తగ్గించినా గేమ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అయితే రెండో గేమ్ నుంచి సాత్విక్, చిరాగ్ ఆట మారింది. ముఖ్యంగా సాత్విక్ తిరుగులేని స్మాష్‌లతో చెలరేగాడు. ఫలితంగా స్కోరు 15–11 వద్ద భారత జోడీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ ఆరంభంలోనే 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 33,180 డాలర్ల (రూ. 27 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘వరుసగా టైటిల్స్ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారం మాకెంతో అద్భుతంగా గడిచింది. ఈ టోర్నీ మొత్తం గొప్పగా ఆడాం. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మంగళవారం నుంచి జరిగే జపాన్ ఓపెన్‌లో మా జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాం’ అని సాత్విక్, చిరాగ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందన సాక్షి,అమరావతి: కొరియా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరూ విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. 4 ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ నెగ్గిన టైటిల్స్. స్విస్ ఓపెన్ సూపర్–300, ఆసియా చాంపియన్‌షిప్, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలలో టైటిల్స్ గెలిచారు. -
ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్,గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ భారీ బడ్జెట్ టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్ ఖరారు చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్థానికి మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. నా క్యారెక్టర్‌ను అలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్) Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023 pic.twitter.com/tAqpF1iOT6 — Deadline Hollywood (@DEADLINE) July 21, 2023 -
హాయ్ నాన్న
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ఖరారు చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ చిత్రానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘హాయ్ నాన్న’ అని, హిందీలో ‘హాయ్ పప్పా’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘తండ్రీ–కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యూనిక్ స్టోరీ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని భాషలవారికీ కనెక్ట్ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
తెలంగాణ నేపథ్యంలో...
నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుధీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొక్కిలి’. మహేష్ గంగిమళ్ల దర్శకత్వంలో వీఆర్‌జీఆర్ మూవీస్‌పై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్‌తో పాటు పోస్టర్ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ‘‘తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో, వాస్తవ ఘటనలతో రూ΄÷ందుతోన్న చిత్రం ‘΄÷క్కిలి’. క్లైమాక్స్, రెండు ΄ాటలు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయ΄ాల్ నిమ్మల. -
నేను దిగితే మిగిలేదుండదు!
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ది ఎటాకర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. సోమవారం ‘స్కంద’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘మీరు (సినిమాలో రౌడీలను ఉద్దేశిస్తూ..) దిగితే ఊడేదుండదు... నేను దిగితే మిగిలేదుండదు..’ అంటూ రామ్ చెప్పే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ విడుదలైంది. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్ , కెమెరా: సంతోష్ డిటాకే. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రేమించుకుందాం రా చైల్డ్ ఆర్టిస్ట్
‘ప్రేమించుకుందాం..రా’ , ‘సూర్యవంశం’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటించిన తొలి చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రోష్ని సాహోత, నవమి గయాక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో జి. వంశీకృష్ణ వర్మ, సామ్ జీ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ– ‘‘సినిమా నాప్రాణం. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయడానికి జీవితాంతం సినిమాల్లోనే ఉంటాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథలో హీరో ఆరు నెలలు కంటిన్యూస్‌గా నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఇది’’ అన్నారు ప్రసన్న కుమార్. నటీమణులు రోష్ని సాహోత, నవమి గయాక్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడారు. -
'గిప్పడి సంది ఖేల్ అలగ్' .. ఎన్బీకే108 టైటిల్ ఇదే!
నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్బీకే108'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!) అనిల్ రావిపూడి ట్వీట్లో రాస్తూ.. ఇప్పటి సంది ఖేల్ అలగ్ అంటూ 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో బాలయ్య మాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎 Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x — Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023 -
భారత్‌దే ఆసియా కప్.. ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం
సలాలా (ఒమన్): ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన ఫైనల్లో 2–1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు అలీ బషారత్ (38వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్ నెగ్గడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2004, 2008, 2015లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్‌తో ఆసియా కప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. ఆసియా కప్ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. తాజా టోర్నీలో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి... కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారం ప్రకటించారు. -
వ్యూహం..
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. ‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
నిఖిల్ స్వయంభూ
నిఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం (జూన్ 1) నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించనున్నారు. ‘‘నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస. ఇంకా.. నిఖిల్ బర్త్ డే సందర్భంగా వేరే చిత్రాల అప్డేట్స్ కూడా వచ్చాయి. నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమా కమిటయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన సూపర్‌కింగ్స్ (ఫొటోలు)
-
IPL 2023: చెన్నై ఫైవ్ స్టార్... ఐదోసారి చాంపియన్‌గా సూపర్‌కింగ్స్
IPL 2023 Winner CSK- అహ్మదాబాద్: ఐపీఎల్–2023లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ కోల్పోగా... వృద్ధిమాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్; 2 సిక్స్‌లు) రాణించారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... 42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81... తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్ భాగస్వామ్యాలివి. జట్టులోని టాప్–4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజన్లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీపక్ చహర్ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా... తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు. 21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా చహర్ వదిలేయడం టైటాన్స్‌కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్ వెనుదిరగ్గా, 36 బంతుల్లో సాహా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్ కాగా, సుదర్శన్ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతను పతిరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. తుషార్ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు. తొలి నాలుగు బంతుల్లో అతను 6, 4, 4, 4 కొట్టడం విశేషం. తుషార్ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్ 18 పరుగులు రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 96కు చేరిన సుదర్శన్ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) ధాటి గుజరాత్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది. శుభారంభం... వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు. అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే రుతురాజ్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. జడేజా ఆఖరి బంతికి ఫోర్ బాది చెన్నైని విజేతగా నిలిపాడు. 15 ఓవర్లకు కుదింపు... రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వాన మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు. వర్షం తగ్గినా, ప్రధాన పిచ్ పక్కన ఉన్న మరో పిచ్ ఆరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. పవర్‌ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకు అనుమతించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధోని (బి) చహర్ 54; గిల్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 39; సుదర్శన్ (ఎల్బీ) (బి) పతిరణ 96; పాండ్యా (నాటౌట్) 21; రషీద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–67, 2–131, 3–212, 4–214, బౌలింగ్: దీపక్ చహర్ 4–0–38–1, తుషార్ 4–0–56–0, తీక్షణ 4–0–36–0, జడేజా 4–0–38–1, పతిరణ 4–0–44–2. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రషీద్ (బి) నూర్ 26; కాన్వే (సి) మోహిత్ (బి) కాన్వే 47; దూబే (నాటౌట్) 32; రహానే (సి) విజయ్‌శంకర్ (బి) మోహిత్ 27; రాయుడు (సి) అండ్ (బి) మోహిత్ 19; ధోని (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; జడేజా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–117, 4–149, 5–149. బౌలింగ్: షమీ 3–0–29–0, పాండ్యా 1–0–14–0, రషీద్ 3–0–44–0, నూర్ 3–0–17–2, లిటిల్ 2–0–30–0, మోహిత్ శర్మ 3–0–36–3. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్‌ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్‌లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
అంచనాలు పెంచుతున్న SSMB28 టైటిల్
-
పవర్ఫుల్ రుద్ర
అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలోని శివాలయాన్ని కొందరు గూండాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని అడ్డుకోవడానికి రుద్ర రంగంలోకి దిగుతాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది? తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో హీరో వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో పవర్ఫుల్ రుద్రగా ఉగ్రరూపం చూపించారు వైష్ణవ్ తేజ్. చిత్ర పాత్రలో హీరోయిన్ శ్రీలీల, వజ్ర కాళేశ్వరి దేవిగా కీలక పాత్రలో అపర్ణా దాస్, విలన్‌గా జోజు జార్జ్ నటిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, కెమెరా: డడ్లీ. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా హీట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి జంటగా నటించిన చిత్రం 'హీట్'. ఈ చిత్రానికి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించిన ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే..ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పోస్టర్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది చిత్రబృందం. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. -
10 భాషల్లో సూర్య 42వ చిత్రం.. టైటిల్ అప్డేట్ ఇచ్చేశారు
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య42’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. సిరుత్తే శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు పది భాషల్లో, 2D అండ్ 3D ఫార్మాట్స్‌లో విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సూర్య 42 మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి మరియు అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. సూర్య చాల గంభీరంగా తెరపై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే, ప్రత్యేకమైనది. త్వరలోనే షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని మేకర్స్ తెలిపారు. 2024లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. Sheer joy working with Siva & Team on this mighty saga. Happy to share the title look of #Kanguvahttps://t.co/7TiAfM2fTE@directorsiva @ThisIsDSP @kegvraja @DishPatani @vetrivisuals @SupremeSundar_ @StudioGreen2 @UV_Creations @saregamasouth pic.twitter.com/pcdKo99wAj — Suriya Sivakumar (@Suriya_offl) April 16, 2023 -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
ఆసక్తికరంగా 'ఏందిరా ఈ పంచాయితీ' టైటిల్ పోస్టర్
భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇవ్వబోతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే.. 'పల్లెటూరి వాతావరణం, అక్కడ జరిగే గొడవలు, రకరకాల మనుషుల గురించే ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. అంటే ఒక ఊరిలో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా సతీశ్, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. -
Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...
కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 5: బోపన్న కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. 24: బోపన్న కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్లో ఎబ్డెన్తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్ వెల్స్ టోర్నీకి టెన్నిస్ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. –రోహన్ బోపన్న విన్నర్స్ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్ జోడీ -
అనుష్క, నవీన్ పొలిశెట్టి మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ అవుట్
హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’గా ఖరారు చేశారు. ఈ సందర్భంగా, అనుష్క, నవీన్ పొలిశెట్టిల లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా నవీన్, అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌గా అనుష్క నటించనున్నారు. కాగా ఈ సమ్మర్‌కు తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క, జాతిరత్నాలు తర్వాత నవీన్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩 Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz — UV Creations (@UV_Creations) March 1, 2023 -
మహిళల స్నూకర్ ప్రపంచకప్ విజేత భారత్
బ్యాంకాక్: మహిళల స్నూకర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టుకు టైటిల్ లభించింది. అమీ కమాని–అనుపమ రామచంద్రన్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో అమీ కమాని–అనుపమ జోడీ 56–26, 67–27, 41–61, 27–52, 68–11, 55–64, 78–39తో ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు చెందిన రీని ఇవాన్స్–రెబెకా కెన్నా ద్వయంపై విజయం సాధించింది. -
'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించినా ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మంగళవారం అనే సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇది పాన్ ఇండియాన్ సినిమా అంటే బజ్ క్రియేట్ చేశారు. స్వాతి - సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.హారర్ జానర్లో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఆర్ఎక్స్ 100తో క్రేజ్ సంపాదించుకున్న పాయల్ ఈ మూవీలో హీరోయిన్గా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋 It's a PAN-SOUTH INDIAN movie🔥 'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj — Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023 -
డైరెక్టర్‌కు ఆ కండిషన్ పెట్టిన అజిత్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన చిత్రం నుంచి తొలగించారు. ఆయన కథను పూర్తిగా సిద్ధం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కాగా ఇప్పుడు ఆయన స్థానంలోకి దర్శకుడు మగిళ్ తిరుమేణి వచ్చారు. నిజం చెప్పాలంటే ఈయన పేరును కూడా చిత్ర వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాగా అజిత్ నటించే నూతన చిత్రం షూటింగును మార్చి మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో అజిత్ జంటగా నటించే నటి ఎవరనేది కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో ప్రతి నాయకుడిగా అరుణ్ విజయ్, ముఖ్యపాత్రల్లో అధర్వ, బిగ్ బాస్ కవిన్, జాన్ కెక్కెన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా దీనికి అనిరుధ్ సంగీతాన్ని, నీరవ్ షా చాయాగ్రహణం అందించనున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లో పూర్తిచేయాలని దర్శకుడికి అజిత్ నిబంధన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు లేదా మూడు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తుణివు చిత్రంలో అజిత్ పాత్ర పేరు బ్లాక్ డెవిల్. దీంతో అందులోని డెవిల్ పేరును తన 62వ చిత్రానికి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సాయిధన్సిక 'అంతిమ తీర్పు' టైటిల్ లాంచ్
సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అంతిమ తీర్పు". ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ.. నిర్మాతగారిని కలిసినప్పుడు ఆయన లో ఒక ప్యాషన్ చూశాను. ఒక మంచి సినిమా తియ్యాలన్న తపన ఆయనలో కనిపించింది. డి.రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం' అన్నారు. సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో అందరూ మంచి కేరక్టర్స్ చేశారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరమనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు. డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ... ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య గారి చాలా సినిమాలకు నేను పనిచేశాను. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. కోటి గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. -
Satyadev: క్రైమ్ జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్కు ‘జీబ్రా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిచినెటో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న చిత్రం ఇది. గురువారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘‘తొలి షెడ్యూల్‌ను 50 రోజులపాటు జరిపాం. బ్యాలెన్స్ షూటింగ్‌ను హైదరాబాద్, కోల్‌కతా, ముంబై లొకేషన్స్‌లో ప్లాన్ చేశాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవిబస్రూర్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా–సహనిర్మాత: సుమన్ ప్రసార బాగే. -
వేసవిలో రామబాణం
‘లక్ష్యం’ (2007), ‘లౌక్యం’ (2014) చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రానికి ‘రామబాణం’ టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను శనివారం ప్రకటించారు. డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుçష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో గోపీచంద్‌కు అన్నా వదిన పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘‘బాలకృష్ణగారు మా సినిమా టైటిల్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉన్న బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళనీస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్. -
సెంటిమెంట్ ప్రకారమే సూర్య42కు ఆ టైటిల్ పెట్టారా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో వైవిధ్యం కోసం పరితపించే నటుల్లో సూర్య ఒకరని చెప్పవచ్చు. ఈయన ఇటీవల నటించిన సరరైపోట్రు, జైభీమ్ వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం సూర్య తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రీడీ ఫార్మెట్లో రూపొందుతున్న ఇందులో సూర్య 13 పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చరిత్ర కథతో మొదలై నేటి కాలం వరకు సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చిత్రాన్ని 10 భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఆ మధ్య విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే చిన్న వర్గాల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఇప్పటి వరకు సూర్య 42 చిత్రంగా ప్రచారంలో ఉన్న దీనికి వీర్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సావజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. దర్శకుడు శివకు సెంటిమెంట్ ఉందంటారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రాలకు వీరం, వివేకం, వలిమై అంటూ వ అక్షరంతో మొదలయ్యే పేర్లతోనే ప్రారంభం కావడం విశేషం. ఈ చిత్రాలు అన్ని మం విజయాన్ని సాధించాయి. అయితే ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా రపొందింన చిత్రానికి అన్నాత్తే అనే టైటిల్ పెట్టారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో దర్శకుడు శివ మళ్లీ సర్య చిత్రంలో తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సర్య నటిస్తున్న 42 చిత్ర టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సర్య దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేయాల్సి ఉంది. -
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
సాయితేజ్ SDT15 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో SDT15 అనే సినిమా చేస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ను అందించారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ గింప్స్‌ను ఈనెల 7న రిలీజ్ చేస్తున్నట్లు ఓ ఆసక్తికర పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఇందులో తేజ్ కాగడా పట్టుకొని ఉన్న పోస్టర్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. We have been upto creating something special for quite some time.Can’t wait to show u guys the results of our team’s passion & hardwork#SDT15TitleGlimpse on Dec 7th@karthikdandu86 @iamsamyuktha_ @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/EfbSh9CkHw — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2022 -
‘కథ వెనుక కథ’లో చాలా మంచి కథలు ఉన్నాయి
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘కథ వెనుక కథ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ– ‘‘కథ వెనుక కథ మంచి కథ. దండమూడి అవనింద్ర కుమార్గారిది గోల్డెన్ హ్యాండ్. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది’ అని అన్నారు. ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలున్నాయి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ సినిమాలో మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి’’ అన్నారు అవనింద్ర కుమార్. ‘‘నిర్మాత అవనింద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిగార్ల వల్లే ఈ సినిమాను లార్జ్ స్కేల్లో చేస్తున్నాం’’ అన్నారు కృష్ణచైతన్య. -
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్‌ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘హంట్’టైటిల్‌ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్‌ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
టైటిల్‌కి వేళాయె!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి ‘అన్నగారు’, ‘వీరసింహారెడ్డి’, ‘రెడ్డిగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 21న ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. మరి.. తెరపైకి వచ్చిన టైటిల్స్‌లో ఏదైనా ఒకటి ఫిక్స్ అవుతుందా? లేక కొత్త టైటిల్ ఖరారు చేస్తారా? అనే విషయం తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాలి. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి(స్పెషల్ నంబరు) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం:తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. -
Wimbledon Tennis tournament: ‘క్వీన్’ రిబాకినా
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా... తొలి సెట్ కోల్పోయినా ఆందోళన చెందకుండా... ఆద్యంతం పట్టుదలతో పోరాడిన కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్’కలను సాకారం చేసుకుంది. శనివారం జరిగిన వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్‌గా అవతరించింది. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ జబర్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తడబడి... నిలబడి ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జబర్ ఫైనల్లోనూ జోరు కొనసాగించింది. వైవిధ్యభరిత డ్రాప్ షాట్లు, పాసింగ్ షాట్లతో చెలరేగిన జబర్ మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. తొలి సెట్ కోల్పోయినా రిబాకినా పట్టుదల కోల్పోలేదు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా అదే జోరులో ఐదో గేమ్‌లోనూ బ్రేక్ సాధించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శక్తివంతమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో విజృంభించిన రిబాకినా 39 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లో మళ్లీ జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా... ఆ తర్వాత ఏడో గేమ్‌లో మరోసారి జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఎనిమిదో గేమ్‌లో రిబాకినా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నేడు జొకోవిచ్ (సెర్బియా), కిరియోస్ (ఆస్ట్రేలియా) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ గణాంకాలు రిబాకినా ఆన్స్ జబర్ 4 ఏస్‌లు 4 3 డబుల్‌ఫాల్ట్‌లు 1 17/36 నెట్ పాయింట్లు 7/14 4/6 బ్రేక్ పాయింట్లు 2/11 29 విన్నర్స్ 17 33 అనవసర తప్పిదాలు 24 86 మొత్తం పాయింట్లు 80 -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్‌గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్‌కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. టైటిల్ ఫిక్స్
Mohan Babu Manchu Lakshmi Agni Nakshatram Title Launch: డాడ్ అండ్ డాటర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ, విశ్వంత్ ప్రధాన తారాగణంగా ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం జరిగింది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'పోలీస్ స్టోరీగా రూపొందుతున్న చిత్రం ఇది. విశ్వంత్ కథానాయకుడిగా, సిద్ధిఖ్ విలన్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు కథ అందించారు' అని చిత్రయూనిట్ పేర్కొంది. మలయాళ నటుడు సిద్ధిఖ్, తమిళ నటుడు సముద్ర ఖని, చైత్రా శుక్లా, జబర్దస్త్ మహేశ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి లిజో కె. జెస్ సంగీతం అందించగా, గోకుల్ భారతి కెమెరా వర్క్ చేపట్టారు. ఈ సినిమాతో తొలిసారిగా తండ్రీ కూతుళ్లు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నటిస్తుండటం విశేషం. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ Today's the day! I am most excited to officially reveal the title of our movie: #Agninakshtram! Want all your blessings🙏🏻@themohanbabu #PrateekPrajosh @thondankani @mynameisViswant @Chitrashukla73 @VrenThambidorai @Gemini4Suresh @bhimajiyanideep @PoornimaRamasw1 pic.twitter.com/fYAGo5fImR — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 1, 2022 -
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ?
Is Jr NTR Prashanth Neel Movie Title As Asura Or Asurudu: ‘అసుర అసుర అసుర అసుర.. రావణాసుర..’ అంటూ ‘జై లవ కుశ’ చిత్రంలోని ఓ పాటలో ఎన్టీఆర్ తన వీరత్వాన్ని చూపిస్తారు. కాగా ఇప్పుడు ‘అసుర’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా రెండు భారీ సినిమాల ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి కొరటాల శివతో (ఎన్టీఆర్ 30వ చిత్రం) కాగా, మరొకటి ప్రశాంత్ నీల్‌తో. ముందుగా ఎన్టీఆర్–కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్–ప్రశాంత్ సినిమా సెట్స్‌కి వెళుతుందని టాక్. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. మరి.. ‘అసుర’ లేదా ‘అసురుడు’ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తారా? లేకుంటే మరో కొత్త టైటిల్ ఉంటుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. చదవండి: ఆ హీరోతో నాలుగోసారి సినిమా చేస్తున్న సమంత ! టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. -
టైటిల్ నిలబెట్టుకున్న సిట్సిపాస్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో గ్రీస్ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిట్సిపాస్ 6–3, 7–6 (7/3)తో అలెజాంద్రో ఫొకీనా (స్పెయిన్)పై గెలిచాడు. సిట్సిపాస్ కెరీర్లో ఇది ఎనిమిదో టైటిల్. విజేతగా నిలిచిన సిట్సిపాస్‌కు 8,36,335 యూరోల (రూ. 6 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ధైర్యం... ఆమె మనసు మాట విన్నది..
Miss Deaf Asia 2018 Winner Nishtha Dudeja: ఈ అమ్మాయికి చిన్ననాటి నుంచి వినికిడి లోపం ఉందని చెబితే ఎవ్వరైనా జాలిపడతారు. కానీ, ఈ అమ్మాయే మిస్ డెఫ్ ఆసియా 2018 టైటిల్ విజేత, మిస్ అండ్ మిస్టర్ డెఫ్ ఇండియా పోటీ లో ఢిల్లీ నుంచి ప్రాతినిథ్యం వహించింది. 18 సంవత్సరాల మిస్ అండ్ మిస్టర్ డెఫ్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి టైటిల్ గెలుచుకున్న మొదటి ప్రతినిధి అని చెబితే ఆమె ధైర్యానికి, పట్టుదలకు ఫిదా అవకుండా ఉండరు. గ్లామర్ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తూ, క్రీడల్లోనూ ఎదిగిన 26 ఏళ్ల నిష్ఠా దూదెజా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న తీరు గురించి తెలుసుకోవాల్సిందే అనిపించక మానదు. నిష్ఠా దూదెజాకు చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉంది. ఫలితంగా మనం అడిగిన దానికి సమాధానమివ్వలేదు. ఏదైనా చెప్పాల్సి వస్తే కాగితమ్మీద రాసిస్తుంది. లేదంటే ఫోన్లో టెక్స్›్ట మెసేజ్‌ల ద్వారా విషయం చెప్పేస్తుంది. మనం ఓ ప్రశ్న రాసిస్తే, ఆమె దానికి రాతపూర్వకంగానే సమాధానమిస్తుంది. కానీ, ఆమే గ్లామర్ ప్రపంచంలో విజయవంతమైన మోడల్‌గా రాణిస్తోంది. టెన్నిస్ క్రీడాకారిణి.. నిష్ఠా తన గురించి రాతపూర్వకంగా ఇచ్చిన తన మనసులోని మాటలు.. ‘12 ఏళ్ల వయసు నుంచి పదేళ్ల పాటు టెన్నిస్ క్రీడలో సాధన చేశాను. 2013, 2015, 2017 సంవత్సరాలలో బధిరుల ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నాను. తీవ్రమైన దవడ కండరాల నొప్పులు రావడంతో వైద్యుల సూచన మేరకు కొన్నాళ్లు ఆ క్రీడకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న తర్వాత టెన్నిస్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అందుకే, పోటీలలో పాల్గొనలేకపోయినా టెన్నిస్‌ను పూర్తిగా వదులుకోలేదు. ఐదేళ్ల వయసు నుంచి జూడో ఆడటంలో సాధన చేశాను. ఏడేళ్లపాటు ఈ గేమ్‌లో రాణించాను’ అని తన గెలుపుకు వేసుకున్న బాట గురించి వివరిస్తుంది. అందాల పోటీలో మేటి మరిన్ని వివరాలను తెలియజేస్తూ– ‘టెన్నిస్ పోటీలో పాల్గొనలేనని అర్థమయ్యాక అంతకుమించి ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు మిస్ ఇండియా బ్లైండ్ గురించి తెలిసింది. ఈ విభాగంలో డెఫ్ కూడా ఉంటారని తెలుసుకున్నాను. దానికి తగిన కృషి చేశాను. అలా మిస్ ఇండియా డెఫ్, మిస్ ఆసియా డెఫ్ టైటిట్స్ గెలుచుకున్నాను’ అని తెలిపిన నిష్ఠా దూదెజా జూడో, టెన్నిస్, బ్యూటీ విభాగాలలోనూ నంబర్ వన్ అనిపించుకుంది. వికలాంగుల సాధికారత భారత ఉపరాష్ట్రపతి నుంచి రోల్ మోడల్ కేటగిరీలో వికలాంగుల సాధికారత జాతీయ అవార్డును అందుకున్నది. ‘నా పై జాలి చూపే వారిని నేను ఇష్టపడను’ అని చెప్పే నిష్ఠా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ‘పాఠశాల స్థాయిలో తోటి పిల్లలే ఎగతాళి చేసేవారు. చిన్నప్పుడు అర్ధం కాలేదు. చాలా బాధనిపించేది. టీనేజ్ దాటాక నా పరిస్థితి పైన పూర్తి అవగాహన వచ్చింది. అప్పటి నుంచే జీవితంలోని సానుకూల కోణాన్ని చూశాను. అడ్డంకులను దాటుకుంటూ నా ప్రయణాన్ని కొనసాగించాను. విజయవంతమయ్యాను’ తెలిపే నిష్ఠా దూదెజా విజయం వినికిడి లోపం గల పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆశలు చివురించేలా చేస్తుంది. సరైన విధంగా దారి చూపిస్తే తమ పిల్లలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారనే ధైర్యాన్ని నింపుతుంది. -
PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్
Pawan Kalyans Bhavadeeyudu Bhagat Singh First Look: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. నిన్నటి నుంచే అప్డేట్ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్‌గా ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అంటూ క్యాప్షన్‌ను జోడించారు. పోస్ట్‌ర్ లుక్‌లో పవన్ బైక్‌పై కూర్చొని ఓ చేతిలో మైక్, మరో చేతిలో టీ గ్లాస్‌తో కనిపించారు. పవన్-హరీశ్ శంకర్ మూవీ కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. We all need your … Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9 — Harish Shankar .S (@harish2you) September 9, 2021 చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్ -
బర్త్‌డే స్పెషల్ : చిరు 153 మూవీ టైటిల్ వచ్చేసింది..
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే సోషల్‌మీడియాలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఆగస్ట్ 22న చిరంజీవి 66వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. అయితే బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే చిరు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. చిరంజీవి 153వ సినిమా టైటిల్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసిన చిరంజీవి ప్రస్తుతం మలయాళ సూపర్‌హిట్ ‘లూసిఫర్’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగానే గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బ్లాక్ క్యాప్ పెట్టుకొని స్టైల్‌గా నిల్చొని ఉన్న చిరు లుక్ ఆకట్టుకుంటుంది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Presenting the Supreme Reveal of Megastar @KChiruTweets in a never seen before avatar as #GodFather🔥@jayam_mohanraja @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ @MusicThaman @sureshsrajan#Chiru153 #HBDMegaStarChiranjeevi pic.twitter.com/e9BYCwQz7b — Konidela Pro Company (@KonidelaPro) August 21, 2021 చదవండి : చిరంజీవి బర్త్‌డే: రేపు రానున్న క్రేజీ ఆప్డేట్ బర్త్‌డే రోజు ఇలా చేయండి.. ఫ్యాన్స్‌కు చిరు పిలుపు -
మనిక–సత్యన్ జోడీకి టైటిల్
బుడాపెస్ట్ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై గెలుపొందింది. సింగిల్స్ సెమీస్‌లో అవుట్ మిక్స్డ్ డబుల్స్‌లో విజయవంతమైన మనిక సింగిల్స్‌లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్ అబ్రామియెన్ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్ చేతిలో అది కూడా ఒక్క గేమ్ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో సత్యన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
ఇంగ్లండ్ కల నెరవేరేనా?
నెల రోజులుగా ఫుట్‌బాల్ ప్రియులను అలరిస్తున్న యూరో కప్ టోర్నమెంట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక గం. 12:30 నుంచి జరిగే టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారి యూరోలో ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్ కప్ కొట్టేయాలనే కసి మీద ఉండగా... ఇప్పటికే ఒకసారి (1968లో) చాంపియన్‌గా నిలిచిన ఇటలీ రెండోసారి ఆ ఘనత వహించేందుకు ఉత్సాహంగా ఉంది. రెండు జట్లు కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇంగ్లండ్ కెప్టెన్, ఫార్వర్డ్ హ్యారీ కేన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... గత 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇటలీ ఓటమి లేకుండా దూసుకెళుతోంది. ఫైనల్ సోనీ సిక్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
‘అలవైకుంఠపురంలో' హిందీ రీమేక్ టైటిల్ ఇదే..
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అలవైకుంఠపురంలో'. గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతిసనన్లు హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “షెహజాదా అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో -
వీరోచితం... ‘జొకో’ విజయం
‘క్లే కోర్టు కింగ్’ రాఫెల్ నాదల్‌నే ఓడించినోడికి సిట్సిపాస్ ఓ లెక్కా! వన్డే మ్యాచ్ కాస్తా టి20లా ఆడేయడా ఏంటి! అని జొకోవిచ్ విజయం గురించే మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ మొదలయ్యాకే తెలిసింది... ఇది ఫైనల్ అని! టైటిల్ అంత ఈజీ కాదని!! కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సిట్సిపాస్ వరల్డ్ నంబర్‌వన్‌కు ఏమాత్రం తీసిపోని ఆట ఆడాడు. అయితే తొలి రెండు సెట్లు ఓడిపోయినా జొకోవిచ్ ఏదశలోనూ పట్టుదల కోల్పోకుండా ఆడాడు. చిరస్మరణీయ ప్రదర్శనతో తన కెరీర్లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలువడంతోపాటు 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. పారిస్: ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్’ గత అనుభవం అక్కరకొచ్చింది. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 4 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్ నెగ్గాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు సెట్లు ‘పాస్’అయ్యాడు కానీ... ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి దీటుగా సిట్సిపాస్ పోరాటం మొదలుపెట్టాడు. దీంతో సెర్బియన్‌కు ఫైనల్ అంత ఈజీ కాదని తెలిసిపోయింది. టైబ్రేక్‌కు దారితీసిన తొలి సెట్లో సిట్సిపాస్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. తొలి సెట్ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ తొలి గేమ్‌లో సెర్బియన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తర్వాత టాప్ సీడ్ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్ తన సర్వీస్‌ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్ కూడా సిట్సిపాస్ వశమైంది. ఇక సమరమే... దెబ్బకు స్కోరు సమమే! టైటిల్ సాధించాలంటే వరుసగా మూడు సెట్లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్ తన గేరు మార్చాడు. జోరు పెంచాడు. ఒత్తిడిని పక్కన బెట్టాడు. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్ ప్రత్యర్థికి ప్రతీ గేమ్‌లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్ మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించిన జొకోవిచ్ తన సర్వీస్‌లను కాపాడుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు ఇదేమాత్రం సరిపోలేదు. పురుషుల టెన్నిస్‌లో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమో దు చేసిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా–1969), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా–1967) మాత్రమే ఈ ఘనత సాధించారు. జొకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్–9; ఫ్రెంచ్ ఓపెన్–2; వింబుల్డన్–5; యూఎస్ ఓపెన్–3). ఫెడరర్, రాఫెల్ నాదల్ (20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచిన ఏడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో బెర్నార్డ్ (1946), రాడ్ లేవర్ (1962), బోర్గ్ (1974), లెండిల్ (1984), అగస్సీ (1999), గాడియో (2004) ఈ ఘనత సాధించారు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ సిట్సిపాస్ 5 ఏస్‌లు 14 3 డబుల్ ఫాల్ట్‌లు 4 19/30 నెట్ పాయింట్లు 19/31 5/16 బ్రేక్ పాయింట్లు 3/8 56 విన్నర్స్ 61 41 అనవసర తప్పిదాలు 44 164 మొత్తం పాయింట్లు 147 -
Azerbaijan Grand Prix: వెర్‌స్టాపెన్‌కు కలిసిరాని అదృష్టం
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో మూడో విజయం ఖాయమనుకుంటున్న దశలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసి రాలేదు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాల్సిన అతను ఒక్క పాయింట్ కూడా సంపాదించకుండా రేసు నుంచి వైదొలగాల్సి వచ్చింది. అజర్బైజాన్ రాజధాని బాకు నగర వీధుల్లో జరిగిన 51 ల్యాప్‌ల రేసులో వెర్స్టాపెన్ 46వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. సర్క్యూట్‌పై రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్న దశలో వెర్స్టాపెన్ కారు ఎడమ టైరు పంక్చర్ అయింది. దాంతో నియంత్రణ కోల్పోయిన వెర్స్టాపెన్ కారు కాంక్రీట్ గోడకు బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా వెర్స్టాపెన్ కారు నుంచి బయటకు వచ్చి రేసు నుంచి వైదొలిగాడు. వెర్స్టాపెన్ ఘటన తర్వాత రేసును అరగంటపాటు ఆపారు .ఆ తర్వాత సేఫ్టీ కార్ల నడుమ రేసును మళ్లీ కొనసాగించగా... రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్గియో పెరెజ్ విజేతగా అవతరించాడు. దాంతో వెర్స్టాపెన్ ఘటనతో నిరాశలో ఉన్న రెడ్‌బుల్ బృందంలో ఆనందం వెల్లివెరిసింది. ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పెరెజ్ అందరికంటే ముందుగా 2 గంటల 13 నిమిషాల 36.410 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో పెరెజ్‌కిది తొలి విజయం కాగా కెరీర్లో రెండోది. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్) రెండో స్థానంలో... పియరీ గ్యాస్లీ (ఆల్ఫా టారీ) మూడో స్థానంలో నిలిచారు. పోల్ పొజిషన్ నుంచి రేస్‌ను ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) 15వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. సీజన్లో ఐదు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్ షిప్ టైటిల్ పాయింట్ల పట్టికలో వెర్స్టాపెన్ (105 పాయింట్లు), హామిల్టన్ (101 పాయింట్లు), పెరెజ్ (69 పాయింట్లు), లాండో నోరిస్ (66 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. A message from the #AzerbaijanGP winner... sounds good right, @SChecoPerez? 😉🇲🇽 pic.twitter.com/fRiGgVZIdR — Red Bull Racing Honda (@redbullracing) June 6, 2021 -
Miss Universe 2020: విశ్వసుందరి ఆండ్రియా మెజా
ఫ్లోరిడా: 2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్ యూనివర్స్) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా (26) గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో(22) విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. ఫస్ట్ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్ యువతి జూలియా గామా(28), సెకండ్ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి జనిక్ మాసెటా(27) నిలిచారు. -
‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్‌గా తెలుగమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ‘పుట్టుకతో వచ్చినది కాదు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో అందం ప్రతిఫలిస్తుంది’ అని నిరూపిస్తోంది మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మానస విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో గెలిచి తన సత్తా చాటింది. ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ముంబయ్ హయ్యత్ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటం గెలుచుకోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మనికా షియోకండ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. 23 ఏళ్ల మానస హైదరాబాద్‌లోని గ్లోబల్ ఇండియన్ లో స్కూల్ చదువు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. నిత్య సాధనం... నిత్య వినూత్నం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్‌ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. ‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు. రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలి. మంచి ఫ్రెండ్‌గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు. అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కళల కసరత్తు ఇంజినీరింగ్ చదువు పూర్తి కాగానే మానస ఎఫ్‌బిబి–ఇండియా ఫ్యాషన్ హబ్ కలర్స్ టివి ఫెమినా మిస్ ఇండియా 2019 తెలంగాణ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలుపొందిన ఈ అందాల రాశి కసరత్తులు చేయడంతో పాటు రాయడం, చదవడం, సంగీతం, యోగా, భరతనాట్యంలోనూ రాణిస్తోంది. కొత్తవాటిని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎన్నింటినో నేర్పుతుంది. మనల్ని బలవంతుల్ని చేస్తుంది అని నమ్ముతుంది. ఎప్పుడూ ఓ కొత్త కళను సాధన చేయడంలో బిజీగా ఉండే మానస ‘నా చిన్నతనంలో చాలా సిగ్గుగా, నలుగురిలోకి వెళ్లాలన్నా భయంగా ఉండేదాన్ని. టీనేజ్‌లో ఏదో తెలియని ఒక ఆరాటం, ఎప్పుడూ నాకు సౌకర్యంగా అనిపించిన ప్లేస్లోనే ఉండిపోవడానికి ప్రయత్నించేదాన్ని. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కాస్త పెద్దయ్యాక ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మెరుగుపరుచుకోవడం మొదలయ్యింది. ఇప్పటికీ ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాను. దీనివల్ల ప్రతియేటా నన్ను మరింత శక్తిమంతురాలిగా ఈ లోకం ముందు నిలబెడుతుంది’ అంటూ తన ఆలోచనలు పంచుకుంటారు ఆమె. ఈ అందాల రాశి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి, పిల్లలకు విద్యాబోధన కూడా చేసింది. పిల్లలతో ఉండడం వల్ల, వారి చిరునవ్వుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఎంతో సంతోషాన్ని పంచుకోవచ్చని అంటుంది మానస. కళలపై ఉన్న అభిరుచి, సాధన ఈ రోజు ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. మానస వారణాసి మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని తెలుగువారి అభిలాష, అకాంక్ష. -
ప్రభాస్ ‘సలార్’ టైటిల్ అర్థం ఏంటంటే..
హీరో ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కతుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సలార్’ అనే టైటిల్‌ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్‌తో పాటు సినీ అభిమానుల్లోనూ అసలు సలార్ అంటే అర్థం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కేజీఎఫ్, ఉగ్రం సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్.. కన్నడ హీరోలను కూడా ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నాడు అన్న సందేహాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ వీటన్నింటికి వివరణ ఇచ్చాడు. (కేజీఎఫ్ కాంబినేషన్లో ప్రభాస్ ‘సలార్’) సలార్ అనేది ఉర్దూ పదం కాగా, దీని అర్థం సమర్థవంతుడైన నాయకుడని, రాజుకు కుడిభుజంగా ఉంటూ, అత్యంత నమ్మదగిన వ్యక్తి అని తెలిపాడు. ఈ పాత్రకి ప్రభాస్ సరిగ్గా సరిపోతారని పేర్కొన్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పటికే ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్' చిత్రల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు సలార్ సినిమా వరకు అన్ని ప్యాన్ఇండియా సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ (కేజీఎఫ్ మూవీ ప్రొడ్యూసర్) నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే సలార్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జవవరిలో ప్రారంభం కానుంది. (ప్రభాస్ లీడర్ ) SALAAR : The right hand man to a king, a general. https://t.co/f2vo74EehP — Prashanth Neel (@prashanth_neel) December 4, 2020 -
విందా? విధ్వంసమా?
రుచికరమైన భోజనం తయారు చేస్తున్నారు కమల్‌హాసన్. ఓ భారీ విందుని ఏర్పాటు చేసినట్టున్నారు. అతిథులందరూ వచ్చే లోపల విస్తళ్లు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు ఉన్న గిన్నెలు కూడా. వాటితో పాటు కొన్ని కత్తులు, తుపాకులు కూడా. ఇంతకీ ఇది విందు భోజనమా? విధ్వంసం సృష్టించే ముందు విందు పెడతారా? అనేది సినిమాలో చూడాలి. ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం కమల్‌హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘విక్రమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజర్లో కమల్ రుచికరమైన విందు వండుతూనే, విలన్స్‌ను వేసేయడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా కనబడుతోంది. -
రెవెన్యూ వ్యవస్థ: ‘టైటిల్’ గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ‘టైటిల్ గ్యారంటీ’ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యూపీఏ సర్కారు 2011లో రూపొందించిన భూ హక్కుల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త్త ముసాయిదాను రూపొందించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు నూతన ముసాయిదా చట్టం–2020, నియమాల(రూల్స్)ను తయారు చేసిన నీతి ఆయోగ్ వాటిని రాష్ట్ర ప్రభు త్వాలకు పంపింది. కేంద్రం రూపొందించిన టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంతో పాటు మహారాష్ట్ర చట్టాన్ని కూడా జతపరిచింది. ఈ రెండింటిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా టైటిల్ గ్యారంటీ చట్టాలను రూపొందించు కోవాలని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు (రెగ్యులేషన్లు) పంపింది. ఇప్పటికే హరియాణాలో ప్రయో గాత్మకంగా అమలు చేస్తున్న ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ 2024లోపు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. భూ వివాదాలకు అంతిమ పరిష్కారం టైటిల్ గ్యారంటీ చట్టంతోనే సాధ్యపడుతుం దని కేంద్ర సర్కారు భావిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీని 2020లోపు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా కూడా తయారు చేసింది. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావ డంతో ఈ చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త ముసాయిదాను రూపొం దించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు మోదీ ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే అగర్వాల్ నేతృత్వంలోని కమిటీ ముసాయిదాకు తుదిరూపు ఇచ్చింది. ఈ డ్రాఫ్టును తాజాగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు పంపింది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) స్థానే కంక్లూజివ్ టైటిల్‌ను తేవాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం రెండు రిజిస్టర్లే..! టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంలో పలు కీలకాంశా లను నీతి ఆయోగ్ పొందుపరిచింది. భూములకు సంబం ధించి పదుల సంఖ్యలో ఉన్న రిజిస్టర్ల స్థానంలో రెండు రిజిస్టర్లనే నిర్వహించాలని అభిప్రాయపడింది. అవి టైటిల్ రిజిష్టర్, దానికి అనుబంధంగా వివాదాల రిజిష్టర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. భూ సర్వే, ఇతరత్రా సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇదివరకే అంగీకరించింది. భూ భారతి, మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులను విడుదల చేసింది. దీంట్లో భాగంగానే టైటిల్ గ్యారంటీ చట్టం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను అందజేసేందుకు సుముఖంగా ఉంది. ముసాయిదా చట్టంలో ముఖ్యాంశాలు: – అన్ని రకాల భూములకు ఇక ఓకే ఒక రికార్డు. వివాదాలు ఉంటే తాత్కాలికంగా మరో రికార్డులో. – వివాద పరిస్కారాలకు ట్రిబ్యూనళ్ల ఏర్పాటు. – రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే పూచీకత్తు. యజమానికి నష్టం జరిగితే పరిహారం. – రికార్డుల్లోకి ఎక్కిన వివరాలను రెండేళ్ల తరువాత మార్చే వీలు ఉండదు – భూముల సర్వే చేసి ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఏపీలో ఇప్పటికే చట్టానికి ఆమోదం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ఒకడుగు ముందుంది. గతేడాది ఏపీ అసెంబ్లీ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ చట్టం అమలుకు ఆయువు పట్టయిన భూ సమగ్ర సర్వేను వచ్చేడాది జనవరి నుంచి శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. మన రాష్ట్రంలో ఇలా.. తెలంగాణలోనూ కంక్లూజివ్ టైటిల్‌ను తీసుకురావాలని గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆధారిత భూ రికార్డుగా ప్రకటించిన ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. పార్ట్–బీ, పెండింగ్ కేసులను కొలిక్కి తేవడానికి సమగ్ర భూ సర్వేను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మూడుచింతలపల్లిలో జరిగిన ధరణి ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. దీంతో మన రాష్ట్రం కూడా టైటిల్ గ్యారంటీ చట్టం వైపు అడుగులేస్తుందని చెప్పవచ్చు. -
లేకర్స్ అదరహో...
ఫ్లోరిడా: విఖ్యాత ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్‌ను లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు దక్కించుకుంది. ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో లేకర్స్ జట్టు 4–2తో మయామి హీట్ జట్టును ఓడించింది. తద్వారా ఈ టైటిల్‌ను 17వసారి సాధించింది. బోస్టన్ సెల్టిక్స్ పేరిట ఉన్న అత్యధిక ఎన్బీఏ టైటిల్స్ (17) రికార్డును సమం చేసింది. ఆరో ఫైనల్లో లేకర్స్ 106–93 పాయింట్ల తేడాతో మయామి హీట్ జట్టును ఓడించింది. మరో ఫైనల్ మిగిలి ఉండగానే టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. లేకర్స్ స్టార్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ 28 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దివంగత కోబీ బ్రయాంట్ సభ్యుడిగా 2010లో చివరిసారిగా ఎన్బీఏ విజేతగా నిలిచిన లేకర్స్... పదేళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. -
చెక్ ఎవరికి?
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను, ప్రీ లుక్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్ పెడతారన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. -
చాంపియన్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన చెస్960 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయంగా ముఖాముఖి పద్ధతిలో జరుగుతున్న తొలి చెస్ టోర్నీ ఇదే కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ అజేయంగా నిలిచాడు. హరికృష్ణ మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), విన్సెంట్ కీమెర్ (జర్మనీ), వొజ్తాసెక్ (పోలాండ్)లతో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... అలెగ్జాండర్ డోన్‌చెంకో (రష్యా), నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్), రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్), డేవిడ్ గుజారో (స్పెయిన్)లపై విజయం సాధించాడు. జర్మనీకి చెందిన 15 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ ఐదు పాయింట్లతో రన్నరప్‌గా నిలువగా... 4.5 పాయింట్లతో వొజ్తాసెక్ మూడో స్థానాన్ని పొందాడు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ముఖాముఖి టోర్నీని నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు ఎత్తులు వేసే బోర్డు మధ్యలో ప్రత్యేకంగా అద్దాన్ని అమర్చారు. గేమ్‌లు కాగానే వేదికను, గేమ్ బోర్డులను శానిటైజ్ చేస్తున్నారు. బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో మరో రెండు టోర్నీలు జరగనున్నాయి. -
డిఫరెంట్ టైటిల్‌తో మహేశ్ చిత్రం?
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘గీతాగోవిందం’ ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందని అందరూ భావించినా అది ఎందుకో కుదర్లేదు. ఇదే క్రమంలో పరుశురామ్ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేయమని డైరెక్టర్‌కు మహేశ్ సూచించాడు. ఇక లాక్డౌన్ సమయంలో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన పరుశురామ్ లాక్డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మహేశ్-పరుశురామ్‌ల కాంబోలో వచ్చే చిత్ర టైటిల్ ఫిక్సయిందని సమాచారం. ‘సర్కార్ వారి పాట’ అనే డిఫరెంట్ టైటిల్‌ను చిత్రబృందం ఫైనల్ చేసినట్లు, సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే (మే31) సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తన సినిమాలకు సంబంధించి టైటిల్స్‌పై మహేశ్‌కు కొన్ని నమ్మకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అప్పట్లో మూడు అక్షరాలతోనే తన సినిమా టైటిల్ ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఆ తర్వాత ఆ నమ్మకం నుంచి బయటపడి డిఫరెంట్ టైటిల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కథకు ‘సర్కార్ వారి పాట’ టైటిల్ ఆప్ట్ అవుతుందని చిత్రబృందం చెప్పడం, మహేశ్‌కు కూడా ఈ టైటిల్ విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారని లీకువీరులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమా గురించి అధికారిక సమాచారం రావాలంటే మే 31 వరకు ఆగాల్సిందేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టైటిల్ తెగ వైరల్ అవుతోంది. చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్ టైటిల్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: రాకేష్ మాస్టర్‌పై మాధవీలత ఫైర్ మరో రికార్డు క్రియేట్ చేసిన ‘అఆ’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..
హైదరాబాద్ : మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్దేశకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ అంటే రఘుపతి రాఘవ రాజారాం అని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రల్లో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కనిపించనున్న ఈ మూవీకి ఈ టైటిల్ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజం అజయ్ దేవ్గన్, దేశీ బ్యూటీ అలియా భట్లు కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక అలియా భట్ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటారని, ఆమె పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణతో దాదాపు మూవీ షూటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇక వీఎఫ్ఎక్స్కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. మరోవైపు చరణ్, తారక్‌ల ఫస్ట్ లుక్‌లను మార్చి 27, మే 20 తేదీల్లో వారి బర్త్‌డే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చదవండి : ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మరో మల్టీస్టారర్..! -
నాదల్ కెరియర్లో 85 విజయం
అకాపుల్కో: ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన మెక్సికో ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నాదల్ 6–3, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. టైటిల్ గెలిచే క్రమంలో నాదల్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. మెక్సికో ఓపెన్‌ను నాదల్ నెగ్గడం ఇది మూడోసారి. గతంలో నాదల్ 2013, 2015లలో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 85వ సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్‌తో నాదల్ వరుసగా 17వ ఏడాది కనీసం ఒక టైటిల్‌ను సాధించినట్లయింది. విజేతగా నిలిచిన నాదల్కు 3,72,785 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 69 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రజనీ కొత్త సినిమా టైటిల్ ఇదే
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా షూటింగ్ ప్రాంరంభమైంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తలైవార్కి ఇది 168 చిత్రం కావడం విశేషం. ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా చిత్ర బృందం రజనీ 168 సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు టైటిల్ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి మీనా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక రజనీ- మీనా కాంబినేషన్లో తెరకెక్కిన ‘ముత్తు’ సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. #Thalaivar168 is #Annaatthe#அண்ணாத்த@rajinikanth @directorsiva @KeerthyOfficial @immancomposer@prakashraaj @khushsundar @sooriofficial @actorsathish pic.twitter.com/GtaYEoKf6N — Sun Pictures (@sunpictures) February 24, 2020 ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకతంలో రజనీ నటించిన ‘దర్బార్’ సంక్రాంతి బరితో దిగి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించారు. నివేదా థామస్, సునీల్ శెట్టి, మోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. దర్బార్ లైకా ప్రొడక్షన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. దర్బార్‌లో రజనీ శక్తివంతమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించిన సంగతి విదితమే. -
వెల్డన్ వెర్స్టాపెన్
సావోపాలో: ఐదేళ్ల క్రితం ఫార్ములావన్‌లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాక మెర్సిడెస్ ఆధిపత్యాన్ని చూసి చూసి బోర్‌గా ఫీలవుతున్న ఫార్ములావన్ అభిమానులకు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసు అసలైన మజా ఇచ్చింది. రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచినా... ఊహకందని విధంగా టొరో రోసో (ఎస్టీఆర్) డ్రైవర్ పియర్ గ్యాస్లీ, మెక్లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్లను పోడియంపై నిలిపి అభిమానులకు కోరుకున్న వినోదాన్ని పంచింది. ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ప్రధాన రేసులో పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 14.678 సెకన్లలో రేసును ముగించి సీజన్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఆరు సెకన్ల తేడాతో రేసును ముగించిన గ్యాస్లీ రెండో స్థానంలో నిలువగా... చివరి నుంచి మొదలు పెట్టిన సెయింజ్‌కు మెర్సిడెస్ డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ పెనాల్టీతో పాటు అదృష్టం కలిసిరావడంతో మూడో స్థానంలో నిలిచాడు. గ్యాస్లీ, కార్లోస్ సెయింజ్లకు ఫార్ములావన్‌లో ఇదే తొలి పోడియం కావడం విశేషం. 2014 ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో పోడియం సాధించిన మెక్‌లారెన్‌కు మళ్లీ ఆ భాగ్యం ఇప్పుడు దక్కింది. 70వ ల్యాప్‌లో ఆల్బన్ (రెడ్‌బుల్)ను ఢీకొట్టిన హామిల్టన్‌కు రేసు స్టీవర్డ్స్ 5 సెకన్ల పెనాల్టీని విధించారు. దీంతో అతడు రేసును మూడో స్థానంలో ముగించినా... పెనాల్టీ కారణంగా ఏడో స్థానానికి పడిపోయాడు. అల్ఫా రొమెయో డ్రైవర్లు రైకోనెన్, అంటోనియో జివనాంజీలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 66వ ల్యాప్‌లో ఫెరారీ కార్లు ఒకదానితో మరొకటి ఢీకొని రేసు నుంచి వైదొలిగాయి. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ కూడా ఇంజిన్ సమస్యతో రేసు మధ్యలోనే నిష్క్రమించాడు. ఇప్పటికే 387 పాయింట్లతో హామిల్టన్ ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం చేసుకోగా... సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1న జరుగుతుంది. -
‛స్వర్ణ’ సుందర్
దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జర్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఎఫ్–46 కేటగిరిలో తలపడిన అతను బంగారు పతకం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అజిత్ సింగ్, రింకూలకూ టోక్యో బెర్త్‌లు లభించాయి. సోమవారం జరిగిన ఈ పోటీలో సుందర్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈటెను 61.22 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. అజిత్ 59.46 మీటర్లతో మూడో స్థానంలో నిలువగా... రింకూకు నాలుగో స్థానం దక్కింది. 23 ఏళ్ల సుందర్ గుర్జర్ తాజా స్వర్ణంతో వరుస ప్రపంచ ఈవెంట్లలో టైటిల్ నెగ్గిన రెండో పారా అథ్లెట్‌గా ఘనతకెక్కాడు. అతను లండన్ (2017) ఈవెంట్లోనూ బంగారం గెలిచాడు. గతంలో దేవేంద్ర జజారియా లియోన్–2013, దోహా–2015 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఎఫ్–56 డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా రజతం గెలిచాడు. అతను డిస్క్‌ను 42.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. -
చాంపియన్ యాష్లే బార్టీ
షెన్జెన్ (చైనా): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో యాష్లే బార్టీ 6–4, 6–3తో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. గతంలో స్వితోలినాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన బార్టీ మెగా ఫైనల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విజేతగా నిలిచిన యాష్లే బార్టీకి 44 లక్షల 20 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 17 లక్షలు).... రన్నరప్ స్వితోలినాకు 24 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతకు ఇంత భారీ మొత్తం ప్రైజ్‌మనీ ఇవ్వడం ఇదే తొలిసారి. గతేడాది సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత స్వితోలినా ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ టోర్నీలో స్వితోలినా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడంతోపాటు సెమీఫైనల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. ఒకవేళ స్వితోలినా ఫైనల్లో గెలిచుంటే టోర్నీ నిబంధనల ప్రకారం అజేయంగా నిలిచినందుకు ఆమెకు 47 లక్షల 25 వేల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించేవి. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బార్టీ తొలి సెట్ పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా... ఎనిమిదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని బార్టీ విజేతగా నిలిచింది. ఈ ఏడాది బార్టీ మొత్తం నాలుగు టైటిల్స్ సాధించింది. సీజన్‌ను 15వ ర్యాంక్‌తో ప్రారంభించిన బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత మయామి ఓపెన్‌లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్హమ్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధించి కెరీర్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఈ ఏడాదిని ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. 2 ఇవాన్ గూలాగాంగ్ (1976లో) తర్వాత డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే బార్టీ నిలిచింది. 5 సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా అవతరించిన ఐదో క్రీడాకారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. గతంలో సెరెనా విలియమ్స్ (అమెరికా–2001లో), మరియా షరపోవా (రష్యా–2004లో), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్–2011లో), సిబుల్కోవా (స్లొవేకియా–2016లో) ఈ ఘనత సాధించారు. బాబోస్–మ్లాడెనోవిచ్ జంటకు డబుల్స్ టైటిల్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ డబుల్స్ విభాగంలో తిమియా బాబోస్ (హంగేరి)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జంట 6–1, 6–3తో సు వె సెయి (చైనీస్ తైపీ)– బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచినందుకు తిమియా–క్రిస్టినా జంటకు 10 లక్షల డాలర్ల (రూ. 7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. -
సాత్విక్–చిరాగ్ జంట చిరస్మరణీయ విజయం
నిరీక్షణ ముగిసింది. లోటు తీరింది. ఆందోళనకు తెర పడింది. అంతర్జాతీయస్థాయి డబుల్స్ విభాగంలో మనకు అత్యున్నత విజయాలు లభించట్లేదని విమర్శిస్తున్న వారందరికీ భారత యువతారలు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ అద్వితీయ ఆటతో సమాధానం ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించి ఔరా అనిపించారు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్ పోరుకు చేరిన సాత్విక్–చిరాగ్ అంతిమ సమరంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీని బోల్తా కొట్టించి అద్భుతమే చేశారు. బ్యాంకాక్: ఈ ఏడాది సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతున్న దశలో... ఎవరూ ఊహించని విధంగా డబుల్స్ విభాగంలో భారత్‌కు గొప్ప టైటిల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో చిరస్మరణీయ విజయం సాధించారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 21–19, 18–21, 21–18తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ ద్వయం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. సూపర్–500 స్థాయి టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 27,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 27 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జంటకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గత మేలో ఈ జోడీ బ్రెజిల్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో విజేతగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన 18 ఏళ్ల సాత్విక్ 2012 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ముంబైకి చెందిన 22 ఏళ్ల చిరాగ్ శెట్టి మూడేళ్లుగా సాత్విక్‌తో కలిసి డబుల్స్‌లో ఆడుతున్నాడు. ఓవరాల్‌గా ఈ జోడీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది టైటిల్స్ సొంతం చేసుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం దక్కించుకుంది. హోరాహోరీ... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లి జున్ హుయ్– లియు యు చెన్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయిన సాత్విక్–చిరాగ్ జంట ఈసారి మాత్రం ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. 62 నిమిషాలపాటు సాగిన పోరులో ప్రతి పాయింట్ కోసం రెండు జోడీలు తీవ్రంగా పోరాడాయి. మూడు గేముల్లోనూ అంతరం మూడు పాయింట్లలోపే ఉండటం మ్యాచ్ తీవ్రతను చాటి చెబుతోంది. గతంలో కీలకదశలో తడబాటుకు లోనై పాయింట్లు కోల్పోయి గొప్ప విజయాలు చేజార్చుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి సంయమనంతో ఆడి పైచేయి సాధించింది. సుదీర్ఘ ర్యాలీలకు అవకాశం ఇవ్వకుండా తక్కువ షాట్లలోనే పాయింట్లను ముగించిన సాత్విక్–చిరాగ్ జోడీ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 1–4తో, 3–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని చేజిక్కించుకుంది. నాకు భుజం నొప్పిగా ఉండటంతో ఫైనల్లో నేను ముందుండి ఆడాలని, చిరాగ్ వెనుకుండి ఆడాలని నిర్ణయించాం. నేను ఎక్కువగా సర్వీస్, నెట్ వద్ద దృష్టి పెట్టాను. షటిల్‌ను తక్కువ ఎత్తులో ఉంచాలని, పాయింట్లను ముగించేందుకు తొందరపడకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాం. మా వ్యూహం ఫలించింది. టోర్నీ మొత్తం ప్రతి మ్యాచ్‌లోనూ మేము ఆశావహ దృక్పథంతో ఆడాం. వెనుకబడిన దశల్లోనూ నిగ్రహం కోల్పోకుండా సంయమనం ప్రదర్శించాం. మా జీవితంలోనే ఇది అతి పెద్ద విజయం. –సాత్విక్ సాయిరాజ్ ఈ విజయం సాత్విక్–చిరాగ్ కెరీర్లో ఎంతో గొప్పది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో మేటి జోడీలు బరిలోకి దిగాయి. ఈ గెలుపు భవిష్యత్‌లో వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక నుంచి డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలకు సాత్విక్–చిరాగ్ జంట నుంచి మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. –పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
భళా...బార్టీ
పారిస్: ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బార్టీ 6–1, 6–3తో అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై ఘనవిజయం సాధించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ వొండ్రుసోవా నుంచి 23 ఏళ్ల బార్టీకి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని 19 ఏళ్ల వొండ్రుసోవా కీలక పోరులో నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోగలిగింది. ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి 1973లో మార్గరెట్ కోర్ట్ ఈ వేదికపై ఆస్ట్రేలియాకు సింగిల్స్ టైటిల్‌ను అందించింది. తాజా గెలుపుతో బార్టీ సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది. 2011లో సమంత స్టోసుర్ (యూఎస్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆసీస్ ప్లేయర్‌గా బార్టీ నిలిచింది. ‘నమ్మశక్యంగా లేదు. నాకైతే మాటలు రావడంలేదు. ఫైనల్లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచాను. నా ఆటపట్ల నాకెంతో గర్వంగా ఉంది. గత రెండు వారాలు అద్భుతంగా గడిచాయి’ అని బార్టీ వ్యాఖ్యానిం చింది. విజేత బార్టీకి ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ వొండ్రుసోవాకు 11 లక్షల 80 వేల యూరోలు (రూ.9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్‌తో థీమ్ ‘ఢీ’ నేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తలపడనున్నాడు. రెండో సెమీఫైనల్లో థీమ్ 6–2, 3–6, 7–5, 5–7, 7–5తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. గతేడాది కూడా నాదల్, థీమ్ మధ్యే ఫైనల్ జరగ్గా... నాదల్‌ను విజయం వరించింది. నేటి ఫైనల్లో నాదల్ గెలిస్తే రికార్డుస్థాయిలో 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు. థీమ్ గెలిస్తే ఈ టోర్నీ ఫైనల్లో నాదల్‌ను ఓడించిన తొలి క్రీడాకారిడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాకుండా 1995లో థామస్ ముస్టర్ (ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఆస్ట్రియా ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు. యాష్లే బార్టీ -
స్ట్రీట్ ఫైటర్
‘శరణం గచ్ఛామి’ ఫేమ్ నవీన్ సంజయ్, హీన అచ్చర జంటగా ఓ సినిమా రూపొందుతోంది. మాల్యాద్రి మామిడి (ప్రదీప్) దర్శకత్వం వహిస్తున్నారు. సహస్ర మూవీ మేకర్స్ పతాకంపై శ్రీహరి పల్లపు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘స్టార్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నవీన్ సంజయ్ మాట్లాడుతూ–‘ఇందులో నేనొక స్ట్రీట్ ఫైటర్‌గా చేస్తున్నాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన శ్రీహరి, మాల్యాద్రిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. మాల్యాద్రి మామిడి మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. హీరో హీరోయిన్లపై కొన్ని మెయిన్ టాకీ పార్ట్ హైదరాబాద్‌లో చిత్రీకరించాం. దీంతో షూటింగ్ 30శాతం పూర్తి అయింది. ఈ నెలాఖరులో ప్రారంభించే సెకండ్ షెడ్యూల్‌తో 70శాతం చిత్రీకరణ పూర్తి అవుతుంది’’ అన్నారు. ‘‘మాల్యాద్రి చెప్పిన కథ నచ్చిన వెంటనే సినిమాని సెట్స్ పైకి తీసువెళ్లి, మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తోంది’’ అన్నారు శ్రీహరి పల్లపు. హీన అచ్చర, నటి అపూర్వ శర్మ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.యమ్. స్వామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి కుమార్. -
జయలలిత బయోపిక్ టైటిల్ ఇదే..
చెన్నై : తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్ మూవీ టైటిల్‌ను చిత్ర దర్శకుడు విజయ్ ఆదివారం ప్రకటించారు. తలైవి పేరిట ఈ బయోపిక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తామని చెప్పారు. జయలలిత బయోపిక్కు తలైవి టైటిల్ చక్కగా సరిపోతుందన్నారు. జయలలిత పేరు ప్రఖ్యాతులు, ఆమె సాధించిన అనూహ్య విజయాలు తనకు ఈ సినిమా రూపొందించే బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అవకాశాన్ని అంగీకరించేలా స్ఫూర్తిని రగిల్చాయని చెప్పుకొచ్చారు. నిజాయితీగా ఈ బయోపిక్‌ను తెరకెక్కించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నానని దర్శకుడు వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించి బాహుబలి కథారచయిత విజయేంద్ర ప్రసాద్ సహకారం తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
క్వీన్ సైనా
జకార్తా: ఇండోనేసియా గడ్డపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అనుబంధం కొనసాగుతోంది. గతంలో ఇక్కడ పలు చిరస్మరణీయ విజయాలు సాధించిన సైనా... ఇప్పుడు మరో మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అర్ధాంతరంగా ముగిసిన ఫైనల్లో విజేతగా నిలిచి ఇండోసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో సైనా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్) తొలి గేమ్‌లోనే కాలి గాయంతో తప్పుకుంది. ఆ సమయంలో సైనా 4–10తో వెనుకబడి ఉంది. విజేత సైనాకు 26, 250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 61 వేలు) లభించింది. 2018లో ఇదే టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన సైనా... ఇప్పుడు విజయం అందుకుంది. గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. 2017 జనవరిలో ఆమె మలేసియా మాస్టర్స్ టైటిల్ గెలిచింది. గత వారమే మలేసియా మాస్టర్స్ టోర్నీలో సైనాపై ఘన విజయం సాధించిన మారిన్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. వేగంగా కదులుతూ తొలి రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న మారిన్ అదే జోరును కొనసాగించింది. సైనా తప్పిదాలతో ఆమె 6–2తో ముందంజ వేసింది. దూకుడు పెంచిన మారిన్ 9–2తో దూసుకుపోయిన దశలో కోర్టులో అనూహ్యంగా పడిపోవడంతో కాలికి గాయమైంది. చికిత్స అనంతరం ఆమె ఆట కొనసాగించినా...మరో మూడు పాయింట్ల తర్వాత ఇక తన వల్ల కాదంటూ కుప్పకూలింది. కన్నీళ్లతో మారిన్ కోర్టు వీడగా...సైనా విజేతగా ఆవిర్భవించింది. ‘నేను టైటిల్ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను. కఠినమైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ వరకు వెళ్లడం సంతోషకరం. ఫైనల్లో నేను వెనుకబడ్డాననేది వాస్తవం. అయితే గట్టిగా పోరాడేదాన్ని. దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కోర్టులో ఈ తరహాలో గాయపడటం చాలా బాధాకరం. నాకు కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది కాబట్టి ఆ వేదన ఎలాంటిదో బాగా తెలుసు’ అని మ్యాచ్ అనంతరం సైనా వ్యాఖ్యానించింది. -
ప్రపంచ సుందరిగా ‘మిస్ మెక్సికో’
బీజింగ్: 2018 సంవత్సరానికి గానూ ప్రపంచసుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డి లియోన్(26) గెలుచుకున్నారు. చైనాలోని సన్యా పట్టణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచసుందరి, భారత్‌కు చెందిన మానుషీ ఛిల్లర్.. వెనెస్సాకు ప్రపంచసుందరి కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. మారియా వసిల్విచ్(బెలారస్), కదీజా రాబిన్సన్(జమైకా), క్విన్ అబేనక్యో(ఉగాండా)లు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా, భారత్ నుంచి ఈసారి పోటీపడ్డ అనుకృతి వాస్(19) టాప్–30లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచసుందరి టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం వెనెస్సా మాట్లాడుతూ..‘దీన్ని నమ్మలేకపోతున్నా. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి , మెక్సికో ప్రజలందరికీ ఈ గెలుపు అంకితం. నేను వాళ్లను గర్వపడేలా చేశాననే భావిస్తున్నా’ అని తెలిపారు. ఈ పోటీల్లో 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. -
స్టైలిష్ యాక్షన్
అటు కమర్షియల్ సినిమాలు.. ఇటు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు హీరో కల్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘118’. కథ, కథనంతో పాటు యాక్షన్ పార్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కల్యాణ్ రామ్‌గారు ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. కె.వి.గుహన్‌గారు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి డైరెక్టర్‌గా పరిచయం కావడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. -
మెరిసిన హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి క్రీడాకారులు పాల్గొన్న చైనా చెస్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ చెస్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ అదరగొట్టాడు. చైనాలోని షెన్జెన్ నగరంలో ముగిసిన ఈ లీగ్‌లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్న షాంఘై చెస్ క్లబ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. హరికృష్ణకు ఓవరాల్‌గా ఉత్తమ ప్లేయర్ పురస్కారంతోపాటు ఉత్తమ విదేశీ ప్లేయర్ అవార్డు కూడా లభించాయి. 12 జట్ల మధ్య 22 రౌండ్లపాటు జరిగిన ఈ లీగ్‌లో షాంఘై క్లబ్ 38 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 17 మ్యాచ్‌ల్లో గెలిచిన షాంఘై జట్టు నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ లీగ్‌లో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ కేటాయించారు. హరికృష్ణ మొత్తం 19 గేమ్‌లు ఆడి 16.5 పాయింట్లు సాధించాడు. 14 గేముల్లో గెలిచిన అతను, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. షాంఘై జట్టులో హరికృష్ణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మత్లకోవ్ మాక్సిమ్ (రష్యా), వాంగ్ పిన్, ని షికిన్, జు వెన్జున్, లూ యిపింగ్, జు యి, ని హువా (చైనా) సభ్యులుగా ఉన్నారు. -
కండలు తిరిగిన కెరీర్
ఇంజనీరో, డాక్టరో అంతకీ కాదంటే ఇంకేదైనా గ్లామర్ రంగాన్నో అమ్మాయిలు ఎంచుకుంటే ముచ్చటపడేవారే. అదే కనుక అమ్మాయి క్రీడల్లో, మరీ ముఖ్యంగా బాడీ బిల్డింగ్ లాంటి కఠినమైన ఏ రంగాన్నో ఎంచుకుంటే ముఖం చిట్లించుకుంటారు. అందుకేనేమో తెలుగు రాష్ట్రాల్లో మహిళా బాడీ బిల్డర్లు దాదాపుగా కనిపించరు. ఈ నేపథ్యంలో వడ్డించిన విస్తరిలాంటి జీవితం ఉన్నా.. వ్యయప్రయాసలను భరిస్తూ బాడీ బిల్డింగ్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి చెన్నా (25) ఇటీవలే ‘మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ టైటిల్’ని గెల్చుకున్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ మన దగ్గర మహిళా బాడీ బిల్డింగ్‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.... మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్. అమ్మ గృహిణి. నా సోదరి సహా ఫ్యామిలీలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను కాస్మొటాలజీ కోర్సు చేశాను. అయితే ఎవరూ ఎంచుకోని రంగాన్ని ఎంచుకోవాలని దృఢంగా అనిపించింది. అదే సమయంలో జస్ట్ హెల్త్ కోసం జిమ్‌లో చేరాలనుకున్నా. కాని ఏ జిమ్‌లో చూసినా మహిళా ట్రైనర్లు కనిపించలేదు. అంటే.. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ అనేవి పురుషులకు సంబంధించినవిగా మాత్రమే పరిగణన పొందుతున్నాయని అర్థమైంది. అప్పుడే అనుకున్నాను.. నేనెందుకు బాడీ బిల్డర్‌ని కాకూడదని. అలా రెండేళ్ల క్రితం నా ఫిజిక్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంట్లో ఒప్పించడం కష్టమే! నా శరీరాన్ని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునేందుకు బాడీ బిల్డింగ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అయితే అమ్మానాన్నకు నేను బాడీ బిల్డింగ్‌లోకి వెళ్లడం అంత ఇష్టం లేదు. ఈ రంగంలోకి అమ్మాయిలు వెళ్లడాన్ని కుటుంబం ఇష్టపడటం అనేది అంత సులభ సాధ్యం కాదు. అబ్బాయిల్లా మజిల్ బిల్డ్ అవడం చూసి కంగారు పడటం సహజమే. ఇద్దరం కూతుళ్లమే కాబట్టి నన్ను అబ్బాయిగా అనుకోండి అని చెప్పా. తర్వాత నా పట్టుదల, కొన్ని చాంపియన్‌షిప్స్‌లో గెలవడం... వీటితో ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. దీన్నేదో నేను ఆషామాషీగా తీసుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో నన్ను ప్రూవ్ చేసుకుని మా కుటుంబాన్ని మెప్పించాలనుకుంటున్నా. కఠిన శ్రమ...కాస్ట్లీ రొటీన్ అబ్బాయిలకు కాస్త వెయిట్ లిఫ్ట్ చేస్తే మజిల్ వచ్చేస్తుంది. ఈజీగా షేప్ అప్ అవుతుంది. కాని మహిళలకు అలా కాదు. మరోవైపు బాడీ బిల్డింగ్ అంటే వ్యయ ప్రయాసలు ఎక్కువే. మంచి జిమ్‌లో రెండు పూటలా వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కలిపి రెండు గంటల చొప్పున చేస్తున్నాను. అయితే పోటీల సమయంలో ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. ఉదయం 45 నిమిషాలపాటు కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను. జంక్ ఫుడ్ అసలు తినకూడదు. కూరగాయలు, స్టీమ్ ఫుడ్, బాయిల్డ్ చికెన్, సాల్మన్డ్ ఫిష్, ఎగ్‌వైట్స్ తీసుకుంటాను. అమ్మాయిగానే ఉండాలి ఒక అమ్మాయి మాత్రమే మరో అమ్మాయి శారీరక తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలదు. నాకైతే మహిళల కోసం మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి జిమ్ ప్రారంభించాలని ఉంది. బాడీ బిల్డింగ్ రంగంలోకి రావాలనుకునే, మంచి ఫిట్నెస్ సాధించాలనుకునే మహిళలకు స్ఫూర్తి కావాలని ఉంది. అమ్మాయిగా మెలితిరిగిన మజిల్‌తో ఉండటం నాకో ప్యాషన్. అదే సమయంలో అమ్మాయికి మాత్రమే స్వంతమైన రూపం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎమ్‌టివి విజె జాకీ నాకు స్ఫూర్తి. కాంపిటీషన్ టైమ్‌లో ఒకలా, మిగిలిన సమయంలో ఒకలా ఫిజిక్‌ని మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్లొచ్చు. ఏదేమైనా... నా విజయాలకు మంచి స్పందన వస్తోంది. మంచి గౌరవం కూడా లభిస్తోంది. ఇటీవలే నాకు స్పాన్సర్ కూడా దొరికారు. ప్రత్యర్థులు అవసరం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం మహిళా బాడీ బిల్డర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. అదే ఉత్తరాది రాష్ట్రాలు, బెంగళూర్ నుంచి బాగా ఉన్నారు. మహారాష్ట్రలో అయితే ఇంటింటికీ ఫిమేల్ అథ్లెట్ అన్నట్టు ఉన్నారు. రీజనల్గా నాకు సరైన ప్రత్యర్థులు లేకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న పోటీల్లో పార్టిసిపేట్ చేయనున్నాను మరిన్ని అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాను’’ అంటూ వివరించారు కీర్తి. – ఎస్.సత్యబాబు -
సూపర్ స్వితోలినా
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా సొంతం చేసుకుంది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ స్వితోలినా 3–6, 6–2, 6–2తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. ఈ క్రమంలో 2013లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గ్రూప్ దశలో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వొజ్నియాకి (డెన్మార్క్), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)లపై నెగ్గిన స్వితోలినా... సెమీఫైనల్లో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. విజేతగా నిలిచిన స్వితోలినాకు 23 లక్షల 60 వేల డాలర్లు (రూ. 17 కోట్ల 25 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్కు 12 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
చరణ్, బోయపాటి సినిమాకు క్లాస్ టైటిల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు స్టేట్‌రౌడీ, తమ్ముడు లాంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యం తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక టైటిల్ తరహాలోనే ఈ సినిమాకు కూడా క్లాస్ టైటిల్‌ను నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే రోజు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. -
విజేత వరంగల్ వారియర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–2లో ఆరంభం నుంచి అదరగొట్టిన వరంగల్ వారియర్స్ జట్టు చివరకు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో వరంగల్ వారియర్స్ 37–28తో పాలమూరు పాంథర్స్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. రైడింగ్, ట్యాకిల్‌లో సత్తా చాటిన వరంగల్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. విజేత జట్టులో విక్రాంత్ ‘బెస్ట్ రైడర్’, చౌగులే ‘బెస్ట్ డిఫెండర్’ పుర స్కారాలను గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కరీంనగర్ కింగ్స్ 31–26తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. టోర్నీలో రాణించిన కరీంనగర్ ప్లేయర్లు మునీశ్ బెస్ట్ రైడర్, కె.శ్రీనివాస్ బెస్ట్ డిఫెండర్ అవార్డును గెలుచుకున్నారు. హైదరాబాద్ ఆటగాడు హనుమంతు మోస్ట్ టాలెంట్ ప్లేయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. -
ఐరన్ లేడీ!
ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్ అనౌన్స్ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్‌లేడీ’ అంటూ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ టైటిల్ రోల్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. -
మొమోటా మెరిసె...
టోక్యో: రెండేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతూ పట్టుబడి... నిషేధం ఎదుర్కొని... గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పునరాగమనం చేసిన జపాన్ యువ కెరటం కెంటో మొమోటా జోరు మీదున్నాడు. గత నెలలో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన 24 ఏళ్ల మొమోటా... తాజాగా స్వదేశంలోనూ సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21–14, 21–11తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో జపాన్ క్రీడాకారుడికి టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–19, 17–21, 21–11తో మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్)పై గెలిచి టైటిల్ దక్కించుకుంది. -
డబుల్స్‌లోనూ నిరాశే
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
కలైజ్ఞర్‌పై గౌరవంతో...
హన్సిక బర్త్ డే గురువారం. బర్త్ డేకి గిఫ్ట్‌ను ఆశించకుండా తన ఫ్యాన్స్‌కే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశారామె. హీరోయిన్గా తాను చేస్తున్న 50వ సినిమా టైటిల్‌ను పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ప్రకటించాలనుకున్నారు. అయితే తమిళనాడు మాజీ సీయం కలైజ్ఞర్ కరుణానిధి మృతి చెందడంతో ఆయన మీద గౌరవంతో టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు హన్సిక. లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపొందబోయే ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. ఈ సినిమాను ఏడు దేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. -
మహేష్ టైటిల్‌పై రచ్చ.. వైరల్!
మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ లాంటి భారీ హిట్ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే మహేష్ బాబుపై కాలేజ్ సీన్స్‌ను తెరకెక్కించారు. అయితే ఆగస్టు 9న ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. అసలే మహేష్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ టాలీవుడ్ ప్రిన్స్ పుట్టిన రోజున అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆ వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఈ చిత్రబృందం.. గత రెండు రోజులుగా కొన్ని అక్షరాలను ( R I S ) సోషల్‌మీడియాలో రిలీజ్ చేస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకున్ని ఫ్యాన్స్... సినిమా టైటిల్‌ను ఊహించేసుకున్నారు. ఇప్పుడు వారు ఊహించిన పేరు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘రిషి’ అని టైటిల్ ఉంటుందని కొందరు.. మహేష్ చేయబోయే పాత్ర పేరు రిషి కావొచ్చని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా.. ఆగస్టు 9న వీటన్నింటికి ఓ సమాధానం దొరకనుంది. -
ఆయనకు ఎక్కడో మచ్చ ఉంది
తమిళసినిమా: నటుడు విమల్‌కు ఎక్కడో మచ్చ ఉంది. ఏమిటీ అర్థం కావడం లేదా. విమల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు (ఇతనికి ఎక్కడో మచ్చ ఉంది) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆయనకు జంటగా ఆషా జవేరి నటిస్తోంది. ఏఆర్.ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి ప్రొడక్షన్స్ పతాకంపై నటి చార్మిళ మాన్రే, ఆర్.సావంత్ కలిసి నిర్మిస్తున్నారు. వీరిలో నటి చార్మిళ మాన్రే కన్నడంలో ప్రముఖ కథానాయకిగా రాణించారన్నది గమనార్హం. ఈమె అక్కడ ప్రముఖ హీరోలందరితోనూ సుమారు 40 చిత్రాలకు పైగా నటించారు. ఈమె నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు. చార్మిళ మాన్రేను కన్నడంలో కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఆర్.ముఖేశ్నే ఆమె తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈయన తమిళంలో ఇండ్రు ముదల్, ఆయుదం చిత్రాలతో పాటు కన్నడంలో గజనీ, జోకర్ అనే హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు. తాజా చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం గురించి తెలుపుతూ ఇది గ్లామర్‌తో కూడిన హ్యూమర్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. దీని షూటింగ్ తొలి షెడ్యూల్ 10 రోజుల పాటు లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు. రెండవ షెడ్యూల్‌ను చెన్నైలో జరుపుతున్నట్లు చెప్పారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు జాలీగా ఎంజాయ్ చేసే పూర్తి ఎంటర్టెయినర్గా ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఉంటుందని, అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు అని దర్శకుడు తెలిపారు. దీనికి సంగీతాన్ని నటరాజ్ శం కరన్, ఛాయాగ్రహణం గోపి అందిస్తున్నారు. -
సినిమాటోగ్రాఫర్ అత్యుత్సాహం
సినిమాటోగ్రఫర్ అత్యుత్సాహం కొంప ముంచింది. హాలీవుడ్లో మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అవెంజర్స్ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అవెంజర్స్ సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిటీ వార్ రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీని సీక్వెల్ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర సినిమాటోగ్రఫర్ ‘ట్రెంట్ ఓపలోచ్’ అత్యుత్సహంతో టైటిల్‌ను రివీల్ చేసేశాడు. సోషల్ మీడియాలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ అంటూ అవెంజర్స్ లిస్ట్‌తో కూడిన మొత్తం జాబితాను ఉంచాడు. దీంతో ఇంటర్నెట్లో టైటిల్‌పై చర్చ మొదలైంది. అయితే కాసేటికే ఆ పేరును తొలగించి.. దాని స్థానంలో అవెంజర్స్-4 అనే టైటిల్‌ను చేర్చటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదని దర్శకులు రుస్సో బ్రదర్స్ గతంలో ప్రకటించారు. కాగా, ఇన్ఫినిటీ స్టోన్స్ చేజిక్కించుకున్న థానోస్ చేతిలో అవెంజర్ హీరోలతోసహా సగం విశ్వం అంతం కావటంతో ఇన్ఫినిటీ వార్ చిత్రం ముగుస్తుంది. సీక్వెల్ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
ఫెడరర్ జోరు కొనసాగేనా?
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)తో నేడు జరిగే తొలి రౌండ్లో ఆడనున్న ఫెడరర్‌కు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా మాజీ చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో పార్శ్వంలో ఉండటం ఫెడరర్‌కు కలిసొచ్చే అంశం. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, విష్ణువర్ధన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా)తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్), వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. సా.గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
100 ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: 100 అనేది సంఖ్య మాత్రమే కాదు. అది అత్యవసర పోలీస్‌స్టేషన్ నంబర్ కూడా. అలాంటి నంబరునే టైటిల్‌గా సినిమా తెరకెక్కుతోందంటే అది కచ్చితంగా పోలీస్ ఇతి వృత్తంతో కూడిన చిత్రం అని అర్థం అయిపోతుంది. ఇప్పటి వరకూ తమిళ తెరపై చాలా మంది ప్రముఖ హీరోలు పోలీస్అధికారిగా నటించి అలరించారు. తాజాగా పోలీస్అధికారిగా మెప్పించడానికి నేనూ రెడీ అంటున్నారు యువ నటుడు అధర్వ. చిత్రాల ఎంపికలో ఆచితుచి అడుగేస్తున్న ఈయన ఇటీవల నిర్మాతగా కూడా మారి సెమ బోద ఆగాద అనే చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 4వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీనితో పాటు అధర్వ బూమరాంగ్, 100 అనే చిత్రాల్లోనూ నటిస్తున్నారు. 100 చిత్రంలో ఆయకు జంటగా నటి హన్సిక నటిస్తోంది. ఈ కేజ్రీ కాంబినేషన్ చిత్రాన్ని ఆరా సినిమా పతాకంపై కావ్య వేణుగోపాలన్ నిర్మిస్తున్నారు. దీనికి డార్లింగ్ చిత్రం ఫేమ్ శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహిస్తున్నారు. 100 చిత్రంలో అధర్వ పోలీస్అధికారిగా తొలిసారిగా చాలా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, క్రిష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శ్రువారం విడుదల చేశారు.ఈ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్టీఆర్ 28 టైటిల్ ఇదేనా..?
జై లవ కుశ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అరవింద సమేత రాఘవ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తెరమీదకు వచ్చిన అరవింద సమేత రాఘవ టైటిల్‌పై అభిమానుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చిత్రయూనిట్ ఈ టైటిల్స్‌లోనే ఒకదాన్ని ప్రకటించనుందా..? లేక వేరే టైటిలా..? తెలియాలంటే ఈ రోజు సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే. -
ముచ్చటగా మూడోసారి...
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో క్విటోవా 7–6 (8/6), 4–6, 6–3తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీని మూడుసార్లు గెలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2011, 2015లలో కూడా క్విటోవా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. విజేత క్విటోవాకు 11,90,490 యూరోల (రూ. 9 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఎదురులేని హామిల్టన్
బార్సిలోనా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో టైటిల్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది రెండో టైటిల్ కాగా కెరీర్లో 64వ విజయం. నాటకీయ పద్ధతిలో మొదలైన ఈ రేసులో తొలి ల్యాప్‌లోనే హాస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా...మరో డ్రైవర్ ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. సీజన్లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. -
ఎన్టీఆర్ ‘అసామాన్యుడు’..?
జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడి సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ టైటిల్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో అజ్ఞాతవాసి సినిమా విషయంలో ఎన్నో వార్తల తరువాత ఫైనల్ గా టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. మరి ఎన్టీఆర్ సినిమా విషయంలో అయినా త్వరగా టైటిల్‌పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. -
నాదల్ రికార్డుస్థాయిలో...
మోంటెకార్లో: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2తో నిషికోరి (జపాన్)ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 11సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. విజేతగా నిలిచిన నాదల్కు 9,35,385 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ కాకుండా నాదల్ బార్సిలోనా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లను 10 సార్లు చొప్పున గెలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 76వ సింగిల్స్ టైటిల్. మాస్టర్స్ సిరీస్‌లో అతనికి 31వ టైటిల్. నేడు మొదలయ్యే బార్సిలోనా ఓపెన్‌లోనూ నాదల్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. -
విజేత అంకిత రైనా
గ్వాలియర్: భారత టెన్నిస్ ఆశాకిరణం అంకిత రైనా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ నెగ్గింది. శనివారం గ్వాలియర్‌లో ముగిసిన ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ ఫైనల్లో అంకిత 6–2, 7–5తో సెకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు సాగిన పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అంకిత వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. రెండో సెట్లో హెసీ నుంచి ప్రతిఘటన ఎదురైనా తుదికంటా పోరాడిన అంకిత విజేతగా నిలిచింది. 2014 డిసెంబర్లో చివరిసారి అంకిత పుణే ఐటీఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఆరు సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. -
ఐఎస్ఎల్ చాంప్ చెన్నైయిన్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ మళ్లీ మెరిసింది. ఈ లీగ్‌లో రెండోసారి టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3–2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు. డిఫెండర్ మెల్సన్ అల్వెస్ (17వ ని., 45వ ని.) అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు. ఆట ఆరంభంలోనే భారత స్టార్ సునీల్ చెత్రి (9వ ని.) గోల్ చేసి బెంగళూరును ఆధిక్యంలో నిలబెట్టగా... ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మెల్సన్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలో మిడ్‌ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో (67వ ని.) కీలకమైన గోల్ చేయడంతో... ప్రత్యర్థి జట్టు బెంగళూరు తరఫున మికు (ఇంజూరి టైమ్ 90+2) చివరి నిమిషాల్లో గోల్ చేసినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్‌లో నాలుగు హెడర్ ద్వారానే వచ్చాయి. చెన్నైయిన్ జట్టు 2015 సీజన్లోనూ టైటిల్ గెలిచింది. లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్‌సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్‌కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్‌రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు. -
ఫస్ట్ లుక్ : అచ్చం చెగువేరాలా ఉన్నాడే!
సాక్షి, సినిమా : కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఎన్జీకే అన్న టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సూర్యకు ఇది 36వ చిత్రం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సూర్య చెగువేరా స్టైల్లో ఉన్న వేషాధారణ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో విప్లవ నేపథ్యం ఉన్న థీమ్ ఉండటం విశేషం. వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న సెల్వరాఘవన్.. సూర్యతో ప్రయోగం చేయబోతున్నాడని పోస్టర్‌తో అర్థమౌతోంది. సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం.. పైగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఎన్జీకే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. Dear all! Need your love for #NGK Director @Selvaraghavan !! A very Happy birthday!!#NGKdiwali2018 #Suriya36@Sai_Pallavi92 @Rakulpreet @thisisysr @prabhu_sr @RelianceEnt @DreamWarriorPic pic.twitter.com/uVb42EJOgb — Suriya Sivakumar (@Suriya_offl) 5 March 2018 -
స్విస్ ఓపెన్ విజేత సమీర్ వర్మ
బాసెల్ (స్విట్జర్లాండ్): భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ స్విస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో సమీర్ వర్మ 21–15, 21–13తో జాన్ జోర్గెన్సెన్ (డెన్మా ర్క్)పై గెలుపొందాడు. తద్వారా ఈ టోర్నమెంట్ టైటిల్ నెగ్గిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో సైనా (2011, 2012), కిడాంబి శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016) ఈ ఘనత సాధించారు. ఈ గెలుపుతో సమీర్‌కు 11,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 28 వేలు)తోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జీవన్ జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్ తన కెరీర్లో ఐదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమెరికాలో జరిగిన డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)తో కలిసి జీవన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జీవన్–రుంగ్‌కాట్ జంట 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో లియాండర్ పేస్ (భారత్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. టైటిల్ నెగ్గిన జీవన్ జంటకు 4,650 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ ఖాతాలో మరో టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త ఏడాదిలో తొలి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో 25వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన న్యూపోర్ట్ బీచ్ ఓపెన్ టోర్నీలో తన భాగస్వామి జేమ్స్ సెరిటాని (అమెరికా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–సెరిటాని ద్వయం 6–4, 7–5తో డెనిస్ కుడ్లా (అమెరికా)–ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) జంటపై గెలుపొందింది. ప్రస్తుతం ప్రపంచ 61వ ర్యాంకులో ఉన్న పేస్ ఈ విజయంతో 125 పాయింట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడం ద్వారా 90 పాయింట్లు పొందాడు. వీటితో నేడు విడుదల కానున్న ర్యాంకింగ్స్‌లో పేస్‌కు టాప్–50 లో చోటు దక్కే అవకాశం ఉంది. పేస్ ఇప్పటివరకు చాలెంజర్ టూర్లలో 11 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
వర్మ ‘శపథం’ నిజమేనా?
సాక్షి, సినిమా : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల టైటిల్ విషయంలో కూడా కాస్త వైవిధ్యతను ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో నాగార్జున అక్కినేనితో తెరకెక్కిస్తున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయ్యారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి శపథం అనే టైటిల్ పరిశీలనలో ఉందంట. దానికి సరిగ్గా సరిపోయేలా రివెంజ్ కంప్లీట్స్ అనే ట్యాగ్ లైన్‌ను కూడా పెట్టేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించారని.. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందని సమాచారం. మరి ఈ వార్తలపై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైరా సరీన్ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. వచ్చే నెల చివరికల్లా చిత్ర షూటింగ్ పూర్తి చేసి.. సమ్మర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఆర్జీవీ యత్నిస్తున్నారు. -
తరుణ్–సౌరభ్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోనా తరుణ్‌కు టైటిల్ దక్కింది. ప్రిటోరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో తరుణ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 21–9, 21–15తో టాప్ సీడ్ ఆతిష్ లూబా–జూలియన్ పాల్ (మారిషస్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జోడీ 21–12, 21–10తో కొపోలో పాల్–థబారి మాథె (జింబాబ్వే) జంటపై... క్వార్టర్ ఫైనల్లో 21–16, 21–14తో బహాదీన్ అహ్మద్–నాసిర్ (జోర్డాన్) ద్వయం, సెమీఫైనల్లో 15–21, 21–14, 21–13తో ఆదర్శ్ కుమార్–జగదీశ్ యాదవ్ (భారత్) జోడీపై గెలిచాయి. -
విజేత రుత్విక శివాని
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రుత్విక 21–12, 23–21తో రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 20 ఏళ్ల రుత్విక రెండో గేమ్‌లో ఒకదశలో 17–20తో మూడు గేమ్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచిన రుత్విక 20–20తో స్కోరును సమం చేసింది. అనంతరం ఇద్దరూ చెరో పాయింట్ గెలవడంతో స్కోరు 21–21తో సమమైంది. ఈ దశలో రుత్విక వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. టాటా ఓపెన్‌ను రుత్విక నెగ్గడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి ఆమె ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 14–21, 19–21తో సితికామ్ థమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
మళ్లీ ప్రపంచాన్ని గెలిచాడు....
తాము ఎంచుకున్న ఆటలో ఒక్కసారైనా ప్రపంచ చాంపి యన్‌గా నిలవాలని క్రీడాకారులు కలలు కంటారు. అలాంటిది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 17 సార్లు ప్రపంచ టైటిల్ సాధిస్తే ఆ ఘనత అసాధారణం. భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ అలాంటి ఘనతనే సాధించాడు. ప్రపంచ టైటిల్ అంటే తనకు మంచినీళ్లప్రాయంలా మారిందని నిరూపిస్తూ ఈ బెంగళూరు ఆటగాడు ఆదివారం మరోసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. దోహా: గత ఏడాది ఫలితాన్ని పునరావృతం చేస్తూ భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (150 అప్ ఫార్మాట్) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6–2 (0–155, 150–128, 92–151, 151–0, 151–6, 151–0, 150–58, 150–21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. రసెల్‌తో జరిగిన ఫైనల్లో పంకజ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఫ్రేమ్‌ను రసెల్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దక్కించుకున్నాడు. అయితే రెండో ఫ్రేమ్‌లో పంకజ్ తేరుకొని స్కోరును సమం చేశాడు. మూడో ఫ్రేమ్‌ను కోల్పోయిన ఈ భారత స్టార్ నాలుగో ఫ్రేమ్ నుంచి తన జోరును ప్రదర్శించాడు. రసెల్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా ఐదు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ 5–2తో రూపేశ్ షా (భారత్)పై, రసెల్ 5–1తో పీటర్ గిల్‌క్రిస్ట్ (ఇంగ్లండ్)పై గెలిచారు. సోమవారం ఇదే వేదికపై లాంగ్అప్ ఫార్మాట్లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. ఈ ఫార్మాట్లోనూ పంకజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. లాంగ్అప్ ఫార్మాట్ పోటీలు ముగిశాక ఈనెల 15న విజేతలకు ట్రోఫీలను అందజేస్తారు. తాజా విజయంతో పంకజ్ తన ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్–2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్–2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. -
బోపన్న జంటకు టైటిల్
న్యూఢిల్లీ: ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం 7–6 (9/7), 6–7 (4/7), 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)–సామ్ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది. 37 ఏళ్ల బోపన్న ఈ ఏడాది సాధించిన మూడో డబుల్స్ టైటిల్ ఇది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 16వ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు ఫ్రాన్స్‌లో జరిగిన బ్రెస్ట్ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో దివిజ్ శరణ్ (భారత్)–స్కాట్ క్లేటన్ (బ్రిటన్) ద్వయం 4–6, 5–7తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–అంటోనియో సాన్సిచ్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. -
'ఈ నగరానికి ఏమైంది' అంటున్న వెంకీ
సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రామానాయుడు మరణం తరువాత గురు సినిమా మాత్రమే చేసిన వెంకీ.. మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకొని తేజ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. రానా హీరో నేను రాజు నేనే మంత్రి లాంటి భారీ హిట్ సాధించిన తేజ మరోసారి అదే బ్యానర్ లో అదే ఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ఫైనల్ చేశారన్న వార్త వినిపిస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో 'ఈ నగరానికి ఏమైంది..?' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ టైటిల్ వెంకీ, తేజ ల సినిమాకే అన్న ప్రచారం మొదలైంది. వెంకటేష్ సినిమాతోపాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ మరో సినిమాను కూడా నిర్మిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరి ఈ రెండింటిలో ఈ ఆసక్తికర టైటిల్ ఏ సినిమాకు ఫిక్స్ చేస్తారో చూడాలి. -
హారిక జట్టుకు ‘యూరోపియన్’ టైటిల్
అంటాల్యా (టర్కీ): భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సభ్యురాలిగా ఉన్న బతూమి చెస్ క్లబ్ నోనా జట్టు ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 12 క్లబ్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక బృందం 17.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. హారిక జట్టులో నానా జాగ్‌నిద్జె, నినో బతియాష్విలి, బేలా ఖొటెనాష్విలి, మెలియా సలోమి (జార్జియా) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీలో హారిక తాను ఆడిన ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించడం విశేషం.