![NADAL RACES PAST NISHIKORI TO WIN RECORD 11TH MONTE CARLO TITLE - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/23/NADAL-MONTE-11.jpg.webp?itok=D0INeXm4)
మోంటెకార్లో: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2తో నిషికోరి (జపాన్)ను ఓడించాడు.
తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 11సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 9,35,385 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ కాకుండా నాదల్ బార్సిలోనా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లను 10 సార్లు చొప్పున గెలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 76వ సింగిల్స్ టైటిల్. మాస్టర్స్ సిరీస్‌లో అతనికి 31వ టైటిల్. నేడు మొదలయ్యే బార్సిలోనా ఓపెన్‌లోనూ నాదల్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment