
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్ 3–6, 7–6 (7/5), 1–6తో 46వ ర్యాంకర్ అలెజాంద్రో ఫొకినా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన జొకోవిచ్ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడాడు. 2018లో బార్సిలోనా ఓపెన్ తర్వాత జొకోవిచ్ ఓ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment