మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. 2015 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ 4–6, 6–1, 4–6తో కాస్పర్ రూడ్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు.
జొకోవిచ్‌పై రూడ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. గతంలో ఈ సెర్బియా స్టార్‌తో ఆడిన ఐదుసార్లూ రూడ్ ఓటమి చవిచూశాడు. మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 3–6, 6–4తో యానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment