Monte Carlo Masters Series
-
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. 2015 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ 4–6, 6–1, 4–6తో కాస్పర్ రూడ్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. జొకోవిచ్పై రూడ్కిదే తొలి విజయం కావడం విశేషం. గతంలో ఈ సెర్బియా స్టార్‌తో ఆడిన ఐదుసార్లూ రూడ్ ఓటమి చవిచూశాడు. మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 3–6, 6–4తో యానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచాడు. -
పోరాడి ఓడిన సుమిత్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సుమిత్ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 80వ ర్యాంక్ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందుతాడు. -
Monte Carlo Masters Series: సుమిత్ సంచలనం
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మరో గొప్ప విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డిని బోల్తా కొట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 5–7, 6–2, 6–4తో అర్నాల్డిపై గెలిచి క్లే కోర్టు మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో రెండో రౌండ్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను కోల్పోయినా ఆందోళన చెందలేదు. రెండో సెట్లో అద్భుతంగా ఆడి అర్నాల్డి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సుమిత్ తన దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో అర్నాల్డి సర్వీస్‌లను బ్రేక్ చేసి తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో సుమిత్ ఆడతాడు. రెండో రౌండ్లోకి ప్రవేశించడం ద్వారా సుమిత్ వచ్చే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 80వ స్థానానికి చేరుకోనున్నాడు. ఈ ఏడాది సుమిత్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరగా... చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
Monte Carlo Masters: 42 ఏళ్ల తర్వాత...
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ... భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రతిష్టాత్మక మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 7–5, 2–6, 6–2తో ప్రపంచ 55వ ర్యాంకర్ ఫాసుండో డియాజ్ అకోస్టా (అర్జెంటీనా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా ఈ టోరీ్నలో 42 ఏళ్ల తర్వాత సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. చివరిసారి భారత్ తరఫున 1982లో రమేశ్ కృష్ణన్ మోంటెకార్లో టోరీ్నలో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
రుబ్లెవ్ ఖాతాలో తొలి ‘మాస్టర్స్’ టైటిల్.. రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు..
Andrey Rublev : మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లెవ్ విజేతగా నిలిచాడు. మొనాకోలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ రుబ్లెవ్ 5–7, 6–2, 7–5తో తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై నెగ్గాడు. రుబ్లెవ్ కెరీర్లో ఇదే తొలి ‘మాస్టర్స్’ సిరీస్ టైటిల్ కావడం విశేషం. మూడో సెట్లో రుబ్లెవ్ 1–4తో వెనుకబడి పుంజుకున్నాడు. విజేత రుబ్లెవ్కు 8,92,590 యూరోల (రూ. 8 కోట్లు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్ నిలబెట్టుకున్న సిట్సిపాస్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో గ్రీస్ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిట్సిపాస్ 6–3, 7–6 (7/3)తో అలెజాంద్రో ఫొకీనా (స్పెయిన్)పై గెలిచాడు. సిట్సిపాస్ కెరీర్లో ఇది ఎనిమిదో టైటిల్. విజేతగా నిలిచిన సిట్సిపాస్‌కు 8,36,335 యూరోల (రూ. 6 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్ 3–6, 7–6 (7/5), 1–6తో 46వ ర్యాంకర్ అలెజాంద్రో ఫొకినా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన జొకోవిచ్ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడాడు. 2018లో బార్సిలోనా ఓపెన్ తర్వాత జొకోవిచ్ ఓ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. -
నాదల్ రికార్డుస్థాయిలో...
మోంటెకార్లో: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2తో నిషికోరి (జపాన్)ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 11సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. విజేతగా నిలిచిన నాదల్కు 9,35,385 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ కాకుండా నాదల్ బార్సిలోనా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లను 10 సార్లు చొప్పున గెలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 76వ సింగిల్స్ టైటిల్. మాస్టర్స్ సిరీస్‌లో అతనికి 31వ టైటిల్. నేడు మొదలయ్యే బార్సిలోనా ఓపెన్‌లోనూ నాదల్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. -
‘మోంటెకార్లో’ ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన భాగస్వామి పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–4, 6–3తో రొమైన్ అర్నియోడో (మొనాకో)–హుగో నిస్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్)లతో బోపన్న–క్యువాస్ తలపడతారు. చరిత్రకు విజయం దూరంలో: మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదిసార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) 11వ సారి ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో నాదల్ 6–3, 6–1తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అల్బెర్ట్ రామోస్ (స్పెయిన్)తో ఆడతాడు. నాదల్ విజేతగా నిలిస్తే ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నీని పదిసార్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.