మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో గ్రీస్ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిట్సిపాస్ 6–3, 7–6 (7/3)తో అలెజాంద్రో ఫొకీనా (స్పెయిన్)పై గెలిచాడు. సిట్సిపాస్ కెరీర్‌లో ఇది ఎనిమిదో టైటిల్. విజేతగా నిలిచిన సిట్సిపాస్‌కు 8,36,335 యూరోల (రూ. 6 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment