మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ... భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రతిష్టాత్మక మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 7–5, 2–6, 6–2తో ప్రపంచ 55వ ర్యాంకర్ ఫాసుండో డియాజ్ అకోస్టా (అర్జెంటీనా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా ఈ టోరీ్నలో 42 ఏళ్ల తర్వాత సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. చివరిసారి భారత్ తరఫున 1982లో రమేశ్ కృష్ణన్ మోంటెకార్లో టోరీ్నలో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment