Main draw
-
మెయిన్ ‘డ్రా’కు సహజ అర్హత
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ100 బోనితా స్ప్రింగ్స్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ప్రపంచ 309వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో క్రిస్టినా రోస్కా (అమెరికా)పై గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రషి్మక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. చివరి రౌండ్లో రషి్మక 4–6, 4–6తో విక్టోరియా (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
Monte Carlo Masters: 42 ఏళ్ల తర్వాత...
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ... భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రతిష్టాత్మక మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 7–5, 2–6, 6–2తో ప్రపంచ 55వ ర్యాంకర్ ఫాసుండో డియాజ్ అకోస్టా (అర్జెంటీనా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా ఈ టోరీ్నలో 42 ఏళ్ల తర్వాత సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. చివరిసారి భారత్ తరఫున 1982లో రమేశ్ కృష్ణన్ మోంటెకార్లో టోరీ్నలో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
మెయిన్ ‘డ్రా’కు అంకిత రైనా
వార్సా (పోలాండ్): భారత మహిళా టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా వార్సా ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ ర్యాంక్‌లో ఉన్న అంకిత సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 4–6, 6–3, 6–1తో జోనా గార్లాండ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అంకిత 6–3, 6–1తో ఒలివియా లిన్సెర్ (పోలాండ్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో చైనా ప్లేయర్ యు యువాన్‌తో జతకట్టి అంకిత బరిలోకి దిగనుంది. -
Tata Open: మెయిన్ ‘డ్రా’కు రామ్‌కుమార్
పుణే: భారత్‌లో జరిగే ఏకైక అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీ టాటా ఓపెన్‌లో భారత మూడో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 432వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 7–5తో ప్రపంచ 153వ ర్యాంకర్ మతియా బెలూచి (ఇటలీ)పై సంచలన విజయం సాధించాడు. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఏడుసార్లు కాపాడుకున్న రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)తో రామ్‌కుమార్ తలపడతాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో యూకీ 1–6, 4–6తో ఇలియాస్ ఈమర్ (స్వీడన్) చేతిలో ఓడిపోయాడు. నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ‘వైల్డ్ కార్డు’ పొందిన భారత టీనేజర్, 15 ఏళ్ల మానస్‌తో మైకేల్ మో (అమెరికా); సుమిత్ నగాల్ (భారత్)తో క్రయినోవిచ్ (సెర్బియా) తలపడతారు. 6,42,735 డాలర్ల (రూ. 53 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సింగిల్స్ విజేతకు 97,760 డాలర్లు (రూ. 80 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. -
Tata Open Maharashtra: రామ్‌కుమార్ శుభారంభం
టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్‌లు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు. పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్ ఒటో విర్టానెన్ (ఫిన్లాండ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
సుమీత్ నాగల్ సంచలనం
న్యూయార్క్: భారత టెన్నిస్ యువతార సుమీత్ నాగల్ తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల సుమీత్ ప్రధాన ‘డ్రా’లో బెర్త్ దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 190వ స్థానంలో ఉన్న సుమీత్ 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ లో 5–7, 6–4, 6–3తో జావో మెనెజెస్ (బ్రెజిల్)పై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో సుమీత్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో సుమీత్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో సుమీత్ తలపడనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మంగళవారం ఉదయం జరుగుతుంది. 1998 తర్వాత...: సుమీత్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంతో... 1998 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ యూఎస్ ఓపెన్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. తొలి రౌండ్లో అతను ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)తో తలపడతాడు. చివరిసారి 1998 వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి రూపంలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. ‘‘టెన్నిస్ రాకెట్ పట్టే ప్రతి ఒక్కరూ ఏనాడైనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో ఆడాలని కలలు కంటారు. నా విషయంలోనూ అంతే. యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో వేలాది మంది ప్రేక్షకుల నడుమ ఫెడరర్‌లాంటి దిగ్గజంతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. టెన్నిస్‌లో దేవుడిలాంటివాడైన ఫెడరర్‌తో తలపడే అవకాశం రావాలని ఇటీవలే కోరుకున్నాను. ఇంత తొందరగా నా కోరిక తీరుతుందని అనుకోలేదు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’’ – సుమీత్ నాగల్ -
మెయిన్ ‘డ్రా’కు శ్రీజ
కటక్: కామన్వెల్త్‌టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ పోటీల్లో గ్రూప్–6లో పాల్గొన్న శ్రీజ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ 11–7, 11–4, 11–6తో కొన్‌స్టాటినా (సైప్రస్)పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో శ్రీజకు ఆమె ప్రత్యర్థి తెగీనా నకిబులె (ఉగాండా) నుంచి వాకోవర్ లభించింది. శ్రీజతోపాటు భారత్ నుంచి కృత్విక సిన్హా రాయ్, సుతీర్థ ముఖర్జీ, మౌసుమి పాల్, ప్రాప్తి సేన్, సెలీనా సెల్వకుమార్, దివ్య దేశ్‌పాండే, సాగరిక ముఖర్జీ, అనూష కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. -
మెయిన్ ‘డ్రా’కు విష్ణు–బాలాజీ జంట
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్, చెన్నైకు చెందిన శ్రీరామ్ బాలాజీ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో విష్ణు–బాలాజీ జోడీ 6–3, 6–4తో టాప్ సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలెనె (స్లొవేనియా) జంటపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–3తో ఎడ్వర్డ్ కోరి–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అంకిత 2–6, 7–5, 4–6తో వితాలియా దియాత్‌చెంకో (రష్యా) చేతిలో పోరాడి ఓడింది. వింబుల్డన్ ప్రధాన టోర్నమెంట్ జూలై 2న ప్రారంభమవుతుంది. -
మెయిన్ ‘డ్రా’కు కృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కుదరవల్లి శ్రీ కృష్ణప్రియ మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయి0గ్ పోటీల్లో 18 ఏళ్ల కృష్ణప్రియ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి రౌండ్లో కృష్ణప్రియ 21-13, 21-12తో తసమోన్ సంగ్కవతానా (థాయ్‌లాండ్)పై, రెండో రౌండ్లో 21-15, 21-18తో బంతిటా ఖామ్సరుుతోంగ్ (థాయ్‌లాండ్) పై గెలిచింది. మరో తెలుగు అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో 13-21, 10-21తో ఒర్నిచా జాంగ్సతాపోర్న్పార్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి0ది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సుసాంతో (ఇండోనేసియా)తో కృష్ణప్రియ ఆడుతుంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో శ్రేయాన్‌ష జైస్వాల్ 17-21, 12-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో, హైదరాబాద్ ప్లేయర్ రోహిత్ యాదవ్ 16-21, 15-21తో పాంజీ అహ్మద్ మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
మెయిన్ ‘డ్రా’కు సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాయి దేదీప్య ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సాయి దేదీప్య రెండో రౌండ్లో 9-2తో అద్రిజా బిశ్వాస్ (బెంగాల్)పై, మూడో మ్యాచ్‌లో 6-0, 6-1తో విభశ్రీ గౌడ (కర్ణాటక)పై గెలిచింది. క్వాలిఫయింగ్ ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన శ్వేత నలెకల మూడో రౌండ్లో, సయ్యద్ గుల్స్ ్రబేగం తొలి రౌండ్లో ఓడిపోయారు. -
నేటి నుంచి ‘మెయిన్ డ్రా’ బ్యాడ్మింటన్
– పోటీలకు పుల్లెల గాయత్రి – రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు తిరుపతి సెంట్రల్ : నగరంలో జరుగుతున్న సిఫీ ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం నుంచి మెయిన్ డ్రా పోటీలు జరగనున్నాయి. మూడు రోజులుగా నిర్వహించిన అండర్ 17, అండర్–19 విభాగాల క్వాలిఫైయింగ్ పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. అందులో అర్హత సాధించి, ఇది వరకే ర్యాంకింగ్ కలిగిన క్రీడాకారులు నేరుగా మెయిన్ డ్రా పోటీల్లో హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు హాజరు కానున్న ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మెయిన్ డ్రా పోటీల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇదివరకే అండర్ 15 చాంపియన్ అయిన గాయత్రి ఈ పోటీల్లో అండర్–17 విభాగంలో తన ప్రతిభను ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు. మెయిన్ డ్రాకు అర్హత సాధించిన మహిళా క్రీడాకారులు సింగిల్ విభాగం బాలికల అండర్–17లో దీప్తికుట్టీ (గుజరాత్), రిచాముక్తీ బో«ద్, భార్గవి, ద్రితి యాతీష్(కర్ణాటక), అద్యపర్షర్ (ఢిల్లీ), కావిప్రియ (పాండిచ్చేరి), డబుల్స్ విభాగంలో వినోనా–నిల్వ (తమిళనాడు), సాహితి బంది, వర్షిణి (తమిళనాడు), రమ్య, షీతల్ (కర్ణాటక), కే యుర మోపటి, కావిప్రియ (పాండిచ్చేరి), అండర్–19 విభాగం సింగిల్స్‌లో మనీస్ సింగ్ (యూపి),దపాషా జోషి (పంజాబ్),ముగ్దఅరే(మహారాష్ట్ర), గరిమ సింగ్ (చంఢీఘడ్), ప్రీతి, దీప్తి రమేష్ (కర్ణాటక), ఉత్సవ పలిట్ (వెస్ట్‌బెంగాల్), కుయుర మోపటì ఎంపికయ్యారు. అలాగే డబుల్స్ విభాగంలో ముగ్ద అగ్రే, వైదేహీ చౌదరి(మహారాష్ట్ర), అపేక్ష నాయక్, అర్చనా పాయ్( కర్ణాటక), కావ్య గాంధీ, అనామిక కష్యప్ (యూపీ,ఢిల్లీ), శ్రుతి మిశ్రా, సమ్రిద్ది సింగ్ (యూపీ) ఉన్నారు. బాలురు విభాగం విభాగంలో.. సింగిల్స్ అండర్ 17లో ఈషన్ శెట్ట, వాహిద్ తాకియుద్దిన్, దేవషిస్ నవదికర్,తుకుం లా,సక్సం రాజ్పా,సిద్దార్థ్,శ్రీకర్ మదిన,బిద్యాసాగర్, కరన్ నెగి, అమిత్ రాథోఢ్, రోహిన్ గుర్బాణీ,అజయ్ సతీష్ కుమార్, విషాల్ దేవా, అభ్యుదయ అగర్వాల్, దేవాంగ్ ఉన్నారు. అలాగే డబుల్స్ విభాగంలో సంజీవ్‌రావు– కజ్యోయినుద్దీన్ షేక్, హేమంత్– సూర్యప్రసాద్, వికాష్ ప్రభు–కౌషిక్, ఆకాష్ ఠాగూర్–ఆకాష్ యాదÐŒ , కవీన్ ధరణీ రాజన్–మిత్రన్, రితిన్–చంద్ర, మనీష్ గౌతమ్–వివేక్ రతన్, అనుజ్గుప్తా–సాత్విక్ మహాజన్ ఉన్నారు. అండర్ 19 డబుల్స్ విభాగంలో భవిన్ జాదవ్–మైత్రేయి కత్రి, మన్మోహిత్ సంధూ– నాజూక్ వాలియా, సాయి పృథ్వీ–చక్రయుక్తరెడ్డి, బాలకేశ్వరి యాదవ్– మన్సిసింగ్, శ్రీకృష్ణ సాయికుమార్ పొదిలి–నిల్వ, అంకుర్ దిమన్–సమ్రిద్ది సింగ్, సౌరబ్ కెరాకర్– రితికా ఠాగూర్, రవి సింగ్– దాపష్ జోషి ఉన్నారు. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
ఇండియా ఓపెన్ టోర్నీ న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ పురుషుల సింగిల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. తొలి రౌండ్లో గురుసాయిదత్ 21-14, 21-9తో సతావత్ పొంగ్నైరత్ (అమెరికా)పై నెగ్గగా... రెండో రౌండ్లో 16-21, 21-14, 21-10తో థమాసిన్ సితికోమ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సీహెచ్ పూర్ణిమ తన భాగస్వామి సృ్మతి నాగర్‌కోటితో కలిసి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)తో; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్; లీ డాంగ్ కున్ (దక్షిణ కొరియా)తో గురుసాయిదత్ తలపడతారు. -
మెయిన్ ‘డ్రా’లో సోమ్‌దేవ్
చెన్నై: భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు చెన్నై ఓపెన్‌లో మెయిన్ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ఈనెల 30 నుంచి జనవరి 5 వరకు జరిగే ఈ టోర్నీలో సోమ్‌దేవ్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొనాల్సింది. అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న జర్గెన్ జాప్ (ఎస్తోనియా) గాయం కారణంగా వైదొలగడంతో అతని స్థానాన్ని సోమ్‌దేవ్‌తో భర్తీ చేశారు. భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో ఈసారీ పలువురు మేటి క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 15వ ర్యాంకర్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా), 16వ ర్యాంకర్ ఫాబియో ఫోగ్నిని (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ టిప్సరెవిచ్ (సెర్బియా) తమ ఎంట్రీని ఖరారు చేశారు. -
మెయిన్ ‘డ్రా’కు చేరువలో సోమ్‌దేవ్
న్యూయార్క్: మరో విజయం సాధిస్తే భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో సోమ్‌దేవ్ 7-6 (7/4), 2-6, 6-2తో రాబీ జినెప్రి (అమెరికా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన సోమ్‌దేవ్‌కు రెండో సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా ఫలితం లేకపోయింది. అయితే నిర్ణాయక మూడో సెట్లో సోమ్‌దేవ్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. జేమ్స్ వార్డ్ (బ్రిటన్)తో జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సోమ్‌దేవ్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతాడు. యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న ప్రారంభమవుతుంది.