వార్సా (పోలాండ్): భారత మహిళా టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా వార్సా ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ ర్యాంక్‌లో ఉన్న అంకిత సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 4–6, 6–3, 6–1తో జోనా గార్లాండ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.
2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అంకిత 6–3, 6–1తో ఒలివియా లిన్సెర్ (పోలాండ్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో చైనా ప్లేయర్ యు యువాన్‌తో జతకట్టి అంకిత బరిలోకి దిగనుంది.
Comments
Please login to add a commentAdd a comment