WTA
-
అనిసిమోవా అదరహో
దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్‌లో భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్‌స్లామ్ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్ ఓపెన్‌లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్‌గా నిలిచింది. దోహాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్ తర్వాత ఖతర్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్‌గా అనిసిమోవా గుర్తింపు పొందింది. ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్‌ను అందుకుంటుంది. ఓవరాల్‌గా అనిసిమోవా కెరీర్లో ఇది మూడో సింగిల్స్ టైటిల్. 2019లో బొగోటా ఓపెన్‌లో, 2022లో మెల్బోర్న్ ఓపెన్‌లో ఆమె టైటిల్స్ సాధించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత రైజింగ్ స్టార్స్, తెలంగాణ క్రీడాకారిణులు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్ బెస్ట్ర్యాంక్లను అందుకున్నారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 23 ఏళ్ల సహజ మూడు స్థానాలు ఎగబాకి 295వ స్థానంలో... 22 ఏళ్ల రషి్మక 22 స్థానాలు పురోగతి సాధించి 318వ స్థానంలో నిలిచారు. సహజ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... రషి్మక భారత మూడో ర్యాంకర్‌గా ఉంది. ఈ ఏడాది సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో నిలకడగా రాణిస్తోంది. మొత్తం 23 టోర్నీల్లో పోటీపడింది. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లాస్ఏంజె లిస్లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో సహజ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మరోవైపు రష్మిక కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 21 టోర్నీల్లో పాల్గొన్న రషి్మక 25 మ్యాచ్‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
WTA Mumbai Open: పోరాడి ఓడిన రష్మిక..
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. ముంబైలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రషి్మక 7–5, 4–6, 4–6తో రష్యా టీనేజర్, ప్రపంచ 134వ ర్యాంకర్ అలీనా కోర్నివా చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రషి్మక ఐదు ఏస్‌లు సంధించి, ఏకంగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు డబుల్స్ తొలి రౌండ్లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీ 3–6, 6–7 (1/7)తో రెండో సీడ్ సబ్రీనా (అమెరికా)–దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
రష్మిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ –125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రష్మిక 2–6, 6–1, 7–6 (7/5)తోప్రపంచ 93వ ర్యాంకర్, రెండో సీడ్ నావో హిబినో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. -
చాంపియన్ శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: టోర్నీ టోర్నీకీ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో 21 ఏళ్ల రష్మికచాంపియన్గా అవతరించింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రష్మిక6–0, 4–6, 6–3తో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌ను ఓడించింది. ప్రస్తుత జాతీయ చాంపియన్ రష్మికఈ మ్యాచ్‌లో 11 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన రష్మికకు 3,935 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫలితంగా నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రష్మిక 181 స్థానాలు పురోగతి సాధించి 706వ ర్యాంక్ నుంచి 525వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
మెయిన్ ‘డ్రా’కు అంకిత రైనా
వార్సా (పోలాండ్): భారత మహిళా టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా వార్సా ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ ర్యాంక్‌లో ఉన్న అంకిత సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 4–6, 6–3, 6–1తో జోనా గార్లాండ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అంకిత 6–3, 6–1తో ఒలివియా లిన్సెర్ (పోలాండ్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో చైనా ప్లేయర్ యు యువాన్‌తో జతకట్టి అంకిత బరిలోకి దిగనుంది. -
దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్
ఉక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారులు తమ దేశంపై రష్యా జరుపుతున్న అమానుష దాడిని వ్యతిరేకిస్తూ పలు విధాలుగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందని ఫుట్‌బాలర్స్ తాము ఆడుతున్న మ్యాచ్‌ల్లో దేశానికి తమ వంతు మద్దతు తెలుపుతూ అభిమానుల మనసులు చూరగొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గత శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ క్రీడల్లో రష్యా, బెలారస్‌కు చెందిన జాతీయ జెండాలను ప్రదర్శన చేయొద్దని కోరింది. ఇక దీనికి అదనంగా జాతీయ గీతం, సింబల్స్, కలర్స్‌ను కూడా ఎక్కడా వాడకూడదంటూ ఐవోసీ అధికారి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఐవోసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఎలినా విటోలినా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా వైఖరిని ఎండగడుతూ.. మాంటేరీ ఓపెన్‌లో ఆ దేశానికి చెందిన టెన్నిస్ ప్లుయర్ అనస్థీషియా పోటాపోవాతో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఆడేది లేదంటూ పేర్కొంది.ఈ విషయాన్ని ట్విటర్లో సుధీర్ఘంగా రాసుకొచ్చింది. ''డియర్ ఆల్.. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్ తరపున ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్ ఆర్గనైజేషన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఐవోసీ పేర్కొన్న నిబంధనల ప్రకారం రష్యా, బెలారస్‌కు చెందిన అథ్లెట్లను మాములుగా పరిగణించండి. ఆ దేశం తరపున ఎలాంటి జాతీయ జెండాలు, సింబల్స్, కలర్స్, జాతీయ గీతాలు ప్రదర్శన చేయకూడదు. ఇందులో భాగంగానే మాంటేరీ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణితో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. సదరు ఆర్గనైజేషన్స్ తమ వైఖరిని తెలిపే వరకు రష్యాతో ఎలాంటి మ్యాచ్ ఆడదలచుకోలేదు. అయితే రష్యన్ అథ్లెట్స్‌ను అవమానించడం ఎంతమాత్రం కాదు. మా దేశంపై దాడి చేయడంలో రష్యా ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడాకారులందరూ మద్దతుగా నిలవాల్సినవ అవసరం ఉంది. ముఖ్యంగా రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లు ముందు నిలబడాల్సిన అవసరం ఉంది.'' అంటూ పేర్కొంది. చదవండి: Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ Rohit Sharma-Saba Karim: కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్ ✊🏼🇺🇦 #Ukraine #Україна #StandWithUkriane pic.twitter.com/1LT4WjrYI9 — Elina Monfils (@ElinaSvitolina) February 28, 2022 -
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోరీ్నకి యాష్లే బార్టీ దూరం
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ వైదొలిగింది. వచ్చే నెల 10 నుంచి 17 వరకు మెక్సికోలని గ్వాడాలహారా నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ‘వచ్చే ఏడాదిలో కొత్త ఉత్సాహంతో బరిలో దిగేందుకు సీజన్ ముగింపు టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 25 ఏళ్ల బార్టీ తెలిపింది. ఈ సీజన్లో బార్టీ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీతో కలిపి మొత్తం ఐదు టైటిల్స్ సాధించి ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. -
చైనాలో 11 అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు రద్దు
వాషింగ్టన్: చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలపై కరోనా ప్రభావం చూపింది. ఈ దెబ్బకి సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో పాటు మరో 10 టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఏటీపీ, డబ్ల్యూటీఏ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో చైనా వేదికగా అక్టోబర్–నవంబర్ మధ్య పురుషుల, మహిళల విభాగాల్లో జరగాల్సిన మొత్తం 11 టోర్నీలు రద్దు అయ్యాయి. ఇందులో ఏడు మహిళల విభాగంలో (చైనా ఓపెన్, వుహాన్, జియాంగ్జి , జెంగ్జూ డబ్ల్యూటీఏ ఫైనల్స్, గ్వాంగ్జూ, జుహై ఓపెన్) ఉండగా... మిగతా నాలుగు (చైనా ఓపెన్, షాంఘై మాస్టర్స్ సిరీస్, చెంగ్డూ, జుహై ఓపెన్) పురుషుల విభాగానికి చెందినవి. చైనా ప్రభుత్వ క్రీడా పాలకుల సూచనల ప్రకారమే ఏటీపీ, డబ్ల్యూటీఏ ఈ నిర్ణయం తీసుకున్నాయి. -
క్రీడాకారుల సహాయనిధికి రూ. 45 కోట్లు
పారిస్: కరోనా కారణంగా టోర్నీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ధమాన క్రీడాకారులను ఆదుకునేందుకు టెన్నిస్ క్రీడా పాలక మండళ్లు నడుం బిగించాయి. వారి సహాయార్థం 60 లక్షల డాలర్ల (రూ. 45.57 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్లతో పాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీ కమిటీలు సంయుక్తంగా ఈ నిధిని ఏర్పాటు చేశాయి. 800 మంది టెన్నిస్ క్రీడాకారులు ఈ నిధితో లబ్ధి పొందే అవకాశముంది. -
‘డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా బార్టీ
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు టెన్నిస్ ముగింపు సీజన్ టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచిన ఆ్రస్టేలియా భామ యాష్లే బార్టీ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం గెల్చుకుంది. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన నయోమి ఒసాకా (జపాన్–ఆ్రస్టేలియన్ ఓపెన్ విజేత), సిమోనా హలెప్ (రొమేనియా–వింబుల్డన్ విజేత), బియాంక ఆండ్రెస్కూ (కెనడా–యూఎస్ ఓపెన్ విజేత) ఈ అవార్డు కోసం పోటీపడ్డా... 82 శాతం ఓట్లు పొందిన బార్టీనే అవార్డు వరించింది. ఇవోని గూలాగాంగ్ (1976లో) తర్వాత నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకున్న తొలి ఆసీస్ క్రీడాకారిణిగా బార్టీ నిలువడం మరో విశేషం. ఆమె కోచ్ క్రెయిగ్ టైజెర్ ‘డబ్ల్యూటీఏ కోచ్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. -
డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్ టోర్నీకి సంజన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సంజన సిరిమల్ల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్ స్టార్స్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. చైనాలోని షెన్జెన్లో ఈనెల 20 నుంచి 28 వరకు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో సంజన అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో బరిలో దిగనుంది. అండర్–14, అండర్–16 విభాగాల్లో జరిగే ఈ టోర్నీలో ప్రతి దేశం నుంచి ఇద్దరు క్రీడాకారిణులు పాల్గొంటారు. -
15 ఏళ్ల 7 నెలలకే...
లింజ్ (ఆస్ట్రియా): అమెరికా టీనేజ్ సంచలనం కోకో గౌఫ్ తన కెరీర్లో తొలి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన లింజ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో 15 ఏళ్ల 7 నెలల కోకో గౌఫ్ 6–3, 1–6, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై నెగ్గి... 34,677 యూరోల (రూ. 27 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీని దక్కించుకుంది. 2004లో వైదిసోవా (చెక్ రిపబ్లిక్–15 ఏళ్ల 3 నెలల 23 రోజులు; వాంకోవర్ ఓపెన్) తర్వాత పిన్న వయస్సులో డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా కోరి గుర్తింపు పొందింది. -
హలెప్ టాప్ ర్యాంకు పదిలం
మాడ్రిడ్: మహిళల టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్‌లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ తన టాప్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. తాజాగా విడుదుల చేసిన ర్యాంకింగ్స్‌లో హలెప్ 8,140 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాత స్థానాల్లో వొజ్నయాకి(డెన్మార్క్-6,790 పాయింట్లు), ముగురుజా(స్పెయిన్-5,970 పాయింట్లు), ఇలినా స్విటోలినా(ఉక్రెయిన్-5,630)లు ఉన్నారు. కాగా, యూఎస్ క్రీడాకారిణి స్టీఫెన్స్ తన కెరీర్లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం స్టీఫెన్స్ 3,938 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. -
కోచ్‌కు కటీఫ్ చెప్పిన స్టార్ క్రీడాకారిణి
కాలిఫోర్నియా: మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా తన కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ తో తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్లోనే షరపోవా పరాజయం చెందడంతో కోచ్‌కు కటీఫ్ చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో వారిద్దరి నాలుగు సంవత్సరాల భాగస్వామ్యానికి తెర పడింది. పరస్పర అంగీకారం మేరకే విడిపోతున్నట్టు షరపోవా తెలిపారు. కోచ్ అందించిన సహకారం మర్చిపోలేనిదని, ఆట, కోచింగ్ కంటే తమ మధ్య స్నేహం చాలా విలువైందని అన్నారు. అతని పని తీరు, నాపై తనకున్న విశ్వాసం అద్భుతమైందని తెలిపారు. ఇలాంటి పర్యవేక్షకుడు తనకు కోచ్‌గా ఉండటం ఒక అదృష్టంగా షరపోవా అభివర్ణించారు. డచ్ దేశానికి చెందిన గ్రోనెవెల్డ్.. 2014లో షరపోవాకు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. మరొకవైపు గ్రోనెవెల్డ్ పర్యవేక్షణలో రెండు టైటిల్స్‌ను షరపోవా గెలిచారు. తామిద్దరం విడిపోతున్న విషయాన్ని కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ ధ్రువీకరిస్తూ, ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వారిలో అత్యంత కష్టపడే వ్యక్తి షరపోవా అని, ఆమె భవిష్యత్తులో మరింత పోరాట పటిమను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓ వ్యక్తిగా, క్రీడాకారిణిగా తన పట్ల నాకు అమితమైన గౌరవం ఉందని అన్నారు. ఈ వారం జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్లోనే జపాన్ నంబర్ వన్ నయోమి ఒసాకాపై 6-4, 6-4 తేడాతో ఓడిపోయారు షరపోవా. అంతకుముందు నిషేధం తర్వాత ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేసిన షరపోవా.. మూడో రౌండ్లో ఏంజెలిక్ కెర్బెర్ చేతిలో కూడా ఓటమిపాలైంది. -
నంబర్ వన్‌గానే..
హైదరాబాద్:మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. మహిళల సీజన్ ముగింపు టెన్నిస్ టోర్నీ డబ్యూటీఏ ఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్స్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ల జోడి ఓడినప్పటికీ.. సానియా తన వ్యక్తిగత నంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. తద్వారా మహిళల డబుల్స్‌లో వరుసగా రెండో ఏడాది కూడా సానియా నంబర్ ర్యాంకును సాధించినట్లయ్యింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీ లో భాగంగా శనివారం జరిగిన సెమీస్ పోరులో సానియా-మార్టినా ఓటమి పాలైంది. దాంతో సానియా వ్యక్తిగత నంబర్ వన్ ర్యాంకుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తొలుత భావించారు. అయితే సెమీస్ లో సానియా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జంట డబ్యూటీఏ ఫైనల్స్ టైటిల్ గెలిచారు. దాంతో సానియా ర్యాంకుకు ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు. ఒకవేళ బెథానీ-సఫరోవా జోడి గెలిస్తే మాత్రం సానియా తన ర్యాంకును కోల్పోయేది. మరోసారి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం పట్ల సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది. 'చాలా సంతోషంగా ఉంది. రెండో ఏడాది కూడా నంబర్ వన్‌గా నిలిచాను. ఇదొక అద్భుతమైన నా ప్రయాణంగా భావిస్తున్నా' అని సానియా తెలిపింది. -
పోరాడి ఓడిన శివాని
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్స్టార్స్ ఫైనల్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు అమినేని శివాని రన్నరప్‌గా నిలిచింది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని పోరాడి ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆస్ట్రే లియా అమ్మాయి వయోలెట్ అపిసా 7-5, 6-4తో శివానిపై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ ఫిత్రియాని సబటిని (ఇండోనేసియా)పై 6-2, 6-1తో సంచలన విజయం సాధించిన శివాని ఫైనల్లో విజయం కోసం తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్‌గా నిలిచింది. అండర్-14 బాలికల విభాగంలో భారత్‌కే చెందిన తనిషా కశ్యప్ సెమీఫైనల్లో ఓడిపోయింది. గత ఏడాది ఇదే టోర్నీలో అండర్-16 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల విజేతగా నిలిచింది. -
కుజ్నెత్సోవాదే టైటిల్
సింగపూర్:మాస్కోలో జరిగిన క్రెమ్లిన్ కప్ టైటిల్‌ను రష్యా టెన్నిస్ క్రీడాకారిణి కుజ్నెత్సోవా నిలబెట్టుకుంది. శనివారం జరిగిన తుది పోరులో కుజ్నెత్సోవా 6-2, 6-2 తేడాతో డారియా గావ్రిలివో(ఆస్ట్రేలియా)పై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కుజ్నెత్సోవా ఆద్యంతం ఆకట్టుకుంది. గంట 13 నిమిషాలపాటు జరిగిన పోరులో కుజ్నెత్సోవాకు తిరుగేలేకుండా పోయింది. ఈ టైటిల్ సాధించడంతో కుజ్నెత్సోవా సీజన్ ముగింపు టోర్నీ డబ్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో టాప్-8లో ఉన్న వాళ్లు మాత్రమే డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో ఆడతారు. అయితే గాయం కారణంగా అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), సిమోనా హలెప్ (రొమేనియా), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెయిన), మాడిసన్ కీస్ (అమెరికా), సిబుల్కోవా (స్లొవేకియా) అర్హత సాధించారు. -
సానియా ‘టాప్’ ర్యాంక్ పదిలం
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌సలో భారత స్టార్ సానియా మీర్జా అగ్రస్థానంలో కొనసాగుతోంది. బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి గతవారం పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సానియా... సోమవారం విడుదల చేసిన డబుల్స్ ర్యాంకింగ్‌సలో 9730 పారుుంట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉంది. గత ఏడాది ఏప్రిల్ రెండో వారంలో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ ఇప్పటివరకు అదే స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇక పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌సలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 138వ స్థానానికి చేరుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ 229వ స్థానంలో, యూకీ బాంబ్రీ 282వ స్థానంలో ఉన్నారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 18వ, లియాండర్ పేస్ 60వ ర్యాంక్‌లో ఉన్నారు. -
ఆ జంట సూపర్!
గ్వాంగ్జూ: మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో జత కట్టిన అనంతరం భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన టైటిల్ వేటలో ముందుకు దూసుకుపోతోంది. ఈ ఏడాది హింగిస్ తో జత కట్టిన తరువాత మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కూడా చేజిక్కించుకుంది. 2015 వ సంవత్సరాన్ని ఇండియన్ వెల్స్ టైటిల్ తో శుభారంభం చేసిన ఈ జోడి... ఆపై మియామి ఓపెన్ ను, ఫ్యామిలీస్ సర్కిల్స్ టైటిల్స్ ను సాధించింది. అనంతరం వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ తో పాటు, యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ సానియా-హింగిస్ ల జోడి సాధించి సత్తాను చాటుకున్నారు. తాజాగా గ్వాంగ్ జూ డబ్యుటీఏ టైటిల్ ను కూడా సానియా జోడి దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా జోడీపై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకోవడం ద్వారా సానియా జోడి తమ టైటిల్ సంఖ్యను ఆరుకు పెంచుకుంది. ఈ ఏడాది ఏడు డబుల్స్ టైటిల్స్ ను సాధించిన సానియా .. హింగిస్ తో జోడి కట్టిన తరువాత ఆరు టైటిల్ ను సాధించడం గొప్ప విషయమే. గతేడాది డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ తర్వాత కారా బ్లాక్ (జింబాబ్వే)తో విడిపోయిన సానియా... ఈ ఏడాది సు వీ సెయి (చైనీస్ తైపీ)తో కలిసి నాలుగు టోర్నమెంట్లలో ఆడింది. ఖతార్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ జంట మిగతా మూడు టోర్నీల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. దాంతో పరస్పర అవగాహనతో వారి భాగస్వామ్యానికి తెరపడింది. అటు తరువాత హింగిస్ తో జతకట్టిన సానియా వరుస విజయాలను నమోదు చేస్తోంది. అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ఈ జోడి నిజంగా సూపర్ కదూ.. -
చిన్నారులకు మార్టినా పాఠాలు
సానియా అకాడమీలో సందడి సాక్షి, హైదరాబాద్ : టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నగరంలో సందడి చేసింది. ‘డబ్ల్యూటీఏ-ఆసియా పసిఫిక్ టెన్నిస్ మాస్టర్ క్లాసెస్’ ప్రచారంలో భాగంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె పాఠాలు నేర్పించింది. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో ముచ్చటించిన మార్టినా, అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగేందుకు తీవ్రంగా శ్రమించాలంటూ వారిలో స్ఫూర్తి నింపింది. ఈ సందర్భంగా డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జాను ప్రత్యేకంగా అభినందించిన మార్టినా... డబ్ల్యూటీఏ తరఫున జ్ఞాపికను అందజేసింది. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఏ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ మెలీసా పైన్, భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి కర్మణ్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. -
సానియా టాప్ ర్యాంక్ పదిలం
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా ఐదో వారం తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మాడ్రిడ్ ఓపెన్‌లో తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోనే ఓడినప్పటికీ సానియా ర్యాంక్‌లో ఎలాంటి మార్పురాలేదు. మరోవైపు హింగిస్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. సోమవారం మొదలైన రోమ్ ఓపెన్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న సానియా-హింగిస్ జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న 21వ స్థానానికి చేరుకొని మరోసారి భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచాడు. లియాండర్ పేస్ 24వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్ నుంచి ఈ ఇద్దరే టాప్-100లో ఉన్నారు. సింగిల్స్‌లో సోమ్‌దేవ్ 173వ ర్యాంక్‌లో, యూకీ బాంబ్రీ 180వ ర్యాంక్‌లో నిలిచారు. -
సానియా మీర్జాకు ఘన స్వాగతం