సానియా టాప్ ర్యాంక్ పదిలం | Sania creates history, becomes World No.1 in doubles rankings | Sakshi
Sakshi News home page

సానియా టాప్ ర్యాంక్ పదిలం

Published Tue, May 12 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

సానియా టాప్ ర్యాంక్ పదిలం

సానియా టాప్ ర్యాంక్ పదిలం

న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా ఐదో వారం తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మాడ్రిడ్  ఓపెన్‌లో తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోనే ఓడినప్పటికీ సానియా ర్యాంక్‌లో ఎలాంటి మార్పురాలేదు. మరోవైపు హింగిస్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. సోమవారం మొదలైన రోమ్ ఓపెన్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న సానియా-హింగిస్ జంటకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.

మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న 21వ స్థానానికి చేరుకొని మరోసారి భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచాడు. లియాండర్ పేస్ 24వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్ నుంచి ఈ ఇద్దరే టాప్-100లో ఉన్నారు. సింగిల్స్‌లో సోమ్‌దేవ్ 173వ ర్యాంక్‌లో, యూకీ బాంబ్రీ 180వ ర్యాంక్‌లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement