![Alina Korneeva battles past Shrivalli in pre-quarterfinals - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/8/srivalli.jpg.webp?itok=Y_BuG8qM)
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. ముంబైలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రషి్మక 7–5, 4–6, 4–6తో రష్యా టీనేజర్, ప్రపంచ 134వ ర్యాంకర్ అలీనా కోర్నివా చేతిలో పోరాడి ఓడిపోయింది.
2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రషి్మక ఐదు ఏస్‌లు సంధించి, ఏకంగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు డబుల్స్ తొలి రౌండ్‌లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీ 3–6, 6–7 (1/7)తో రెండో సీడ్ సబ్రీనా (అమెరికా)–దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment