సాక్షి, హైదరాబాద్: టోర్నీ టోర్నీకీ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో 21 ఏళ్ల రష్మికచాంపియన్‌గా అవతరించింది.
గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రష్మిక6–0, 4–6, 6–3తో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌ను ఓడించింది. ప్రస్తుత జాతీయ చాంపియన్ రష్మికఈ మ్యాచ్‌లో 11 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన రష్మికకు 3,935 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఫలితంగా నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రష్మిక 181 స్థానాలు పురోగతి సాధించి 706వ ర్యాంక్ నుంచి 525వ ర్యాంక్‌కు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment