
కెరీర్‌లో 19వ సింగిల్స్ టైటిల్ సాధించిన బెలారస్ స్టార్
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్‌లో 19వ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది.
విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్‌లో 17 టైటిల్స్ హార్డ్‌కోర్టులపై రావడం విశేషం.