Miami Open
-
మళ్లీ నంబర్‌వన్‌గా బోపన్న.. తన రికార్డు తానే తిరగరాసుకున్నాడు
ఫ్లోరిడా: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. గతవారం రెండో ర్యాంక్‌లో నిలిచిన 44 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో సోమ వారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 95వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత వారం 97వ ర్యాంక్‌లో నిలిచిన సుమిత్ రెండు స్థానాలు పురో గతి సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 61 స్థానాలు ఎగబాకి 349వ ర్యాంక్‌లో నిలిచాడు. -
మయామి ఓపెన్ చాంపియన్ కోలిన్స్
ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ అద్భుతం చేసింది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్ 7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. కోలిన్స్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్ స్టీఫెన్స్ తర్వాత మయామి ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆరో అమెరికన్ ప్లేయర్‌గా కోలిన్స్ గుర్తింపు పొందింది. -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి మయామి మాస్టర్స్ టైటిల్
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 26 డబుల్స్ టైటిల్‌కాగా... ‘మాస్టర్స్ సిరీస్’లో ఆరో టైటిల్ కావడం విశేషం. 44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్ సిరీస్’లో ఇండియన్ వెల్స్ (2023), మోంటెకార్లో ఓపెన్ (2017), మాడ్రిడ్ ఓపెన్ (2015), పారిస్ ఓపెన్ (2012), పారిస్ ఓపెన్ (2011) టైటిల్స్ సాధించాడు. లియాండర్ పేస్ (2012లో) తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. -
ఫైనల్లో బోపన్న జోడీ
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–1, 6–4తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ రెండు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 7–6 (7/3), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. భారత్‌కే చెందిన మహేశ్ భూపతితో కలిసి బోపన్న చివరిసారి 2012లో మయామి ఓపెన్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–5, 7–6 (7/3)తో హుగో నిస్ (మొనాకో)–జాన్ జిలెన్స్కీ (పోలాండ్) జోడీపై గెలిచింది. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. -
పరాజయంతో పునరాగమనం
ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ పరాజయంతో ప్రొఫెషనల్ సర్క్యూట్లో పునరాగమనం చేసింది. మయామి ఓపెన్ టోర్నీలో హలెప్ (రొమేనియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పౌలా బదోసా (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో హలెప్ 6–1, 4–6, 3–6తో ఓడిపోయింది. హలెప్ 2022లో డోపింగ్‌లో విఫలమవడంతో నాలుగేళ్ల నిషేధం విధించారు. అయితే ఈ నిషేధంపై ఆమె కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీల్ చేసింది. విచారణ తర్వాత హలెప్ నిషేధాన్ని 9 నెలలకు కుదించారు. -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండు వారాల క్రితం అతను తన టాప్ ర్యాంక్‌ను స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్కు కోల్పోయాడు.అయితే మయామీ ఓపెన్‌లో అల్కరాజ్ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్ కెరీర్ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం. -
Novak Djokovic: వ్యాక్సిన్ వేసుకోలేదని..
ఇండియన్‌వెల్స్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఇంకా కరోనా వ్యాక్సిన్ కష్టాలు వీడటం లేదు. అతను వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అతడిని అనుమతించలేదు. దాంతో ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌నుంచి అతను తప్పుకున్నాడు. తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జొకోవిచ్ చేసిన దరఖాస్తును అక్కడి అధికారులు తిరస్కరించారు. ఇండియన్వెల్స్తో పాటు మరో పెద్ద టోర్నీ మయామీ ఓపెన్‌కు కూడా జొకోవిచ్ దూరం కానున్నాడు. ఈ రెండు టోర్నీలు మార్చి 19 – ఏప్రిల్ 2 మధ్య జరుగుతాయి. -
Miami Open: మరో మ్యాచ్ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్
Tennis Star Daniil Medvedev - Miami Open 2022: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో మూడు వారాలపాటు నిలిచి ఆ తర్వాత జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన రష్యా టెన్నిస్ స్టార్ మెద్వెదెవ్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. మయామి ఓపెన్ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 7–5, 6–1తో బ్రూక్స్‌బై (అమెరికా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి మెద్వెదెవ్ సెమీస్ చేరితే ఏప్రిల్ 4న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. Yesterday, we completed our Men’s Singles Round of 1️⃣6️⃣! @AndrewKrasny highlights @janniksin, @DaniilMedwed, and @alcarazcarlos03's R4 victories ⤵️ pic.twitter.com/NSgnTBiTr2 — Miami Open (@MiamiOpen) March 30, 2022 -
క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ.. టాప్ సీడ్ జంటను ఓడించి బొపన్న జోడి సంచలనం
మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–ఫ్లిప్కెన్స్ జోడీ 6–2, 6–4తో డెసిరె క్రాజిక్ (అమెరికా)–డెమీ షుర్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. టాప్ సీడ్ జోడీని ఓడించి క్వార్టర్స్‌కు... మియామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–3, 7–6 (7/3)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంట పావిచ్–మెక్టిక్ (క్రొయే షియా)ను బోల్తా కొట్టించింది. ఈ ఓటమితో పావిచ్ వచ్చే వారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. -
మయామి ఓపెన్ ఫైనల్లో బియాంక
ఫ్లోరిడా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) ఫైనల్‌కు చేరింది. మరియా సాకరి (గ్రీస్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బియాంక 2 గంటల 42 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 7–6 (7/4)తో విజయం సాధించింది. 2019లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత బియాంక మరో టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో బియాంక తలపడుతుంది. మరో సెమీఫైనల్లో బార్టీ 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. -
ఫెడరర్‌కు షాక్
ఫ్లోరిడా (అమెరికా): వారం వ్యవధిలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు రెండో పరాజయం ఎదురైంది. గత ఆదివారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఓడిన ఫెడరర్... మయామి మాస్టర్స్ టోర్నీలో మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 6–3, 3–6, 6–7 (4/7)తో పరాజయం పాలయ్యాడు. గతేడాది ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ ఈసారి వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. మయామి టోర్నీలో రెండో రౌండ్లోనే ఓడినందుకు ఫెడరర్ భారీ మూల్యమే చెల్లించుకోనున్నాడు. ఏప్రిల్ 2న విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను తన టాప్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తాను క్లే కోర్టు సీజన్లో బరిలోకి దిగడంలేదని ఫెడరర్ ప్రకటించాడు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఫెడరర్ వరుసగా రెండో ఏడాది దూరం కానున్నాడు. తగినంత విశ్రాంతి తీసుకొని జూన్‌లో జరిగే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతానని తెలిపాడు. యూకీ బాంబ్రీ ఓటమి: మరోవైపు మయామి మాస్టర్స్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 3–6, 6–7 (3/7)తో ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో ఓడిన యూకీకి 25,465 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 55 వేలు)తోపాటు 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
యూకీ ముందంజ
ఫ్లోరిడా (అమెరికా): మయామి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 107వ ర్యాంకర్ యూకీ 7–5, 6–3తో మీర్జా బేసిక్ (బోస్నియా)పై విజయం సాధించాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ జాక్ సోక్ (అమెరికా)తో యూకీ తలపడతాడు. -
తొలి రౌండ్లోనే పరాజయం
మియామి:ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. మియామి ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ నుంచే సెరెనా నిష్ర్కమించింది. జపాన్‌కు చెందిన నయోమి ఒసాకాతో జరిగిన పోరులో సెరెనా 3-6, 2-6 తేడాతో ఓటమి పాలైంది. గంటా 17 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఓసాకా దాటికి సెరెనా ఏమాత్రం సమాధానం ఇవ్వలేకపోయింది. దాంతో మియామిలో సత్తాచాటాలనుకున్న సెరెనా ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. -
సానియా జంటకు షాక్
ఫ్లోరిడా (అమెరికా): ఈ ఏడాది రెండో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా –బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా–స్ట్రికోవా జంట 4–6, 3–6తో అన్‌సీడెడ్ ద్వయం గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–జు యిఫాన్ (చైనా) జంట చేతిలో ఓడింది. తొలిసారి జతగా ఆడిన తొలి టోర్నీలోనే దబ్రోవ్‌స్కీ–జు యిఫాన్ జోడీ టైటిల్ సాధించడం విశేషం. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 1,87,970 డాలర్లు (రూ. కోటీ 22 లక్షలు)... విజేతగా నిలిచిన దబ్రోవ్‌స్కీ–జు యిఫాన్ జోడీకి 2,85,170 డాలర్లు (రూ. కోటీ 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
మయామి ‘మాస్టర్’ ఫెడరర్
ఫ్లోరిడా (అమెరికా): నమ్మశక్యంకాని ఆటతీరుతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ ఏడాది తన ఖాతాలో మూడో ప్రతిష్టాత్మక టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నెగ్గిన ఫెడరర్ తాజాగా మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెడరర్ 6–3, 6–4తో విజయం సాధించాడు. ఓవరాల్‌గా ఫెడరర్ ఖాతాలో ఇది 91వ సింగిల్స్ టైటిల్‌కాగా... 26వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11 లక్షల75 వేల 505 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ చరిత్రలో ఐదోసారి ఫైనల్‌కు చేరుకున్న నాదల్ ఐదుసార్లూ ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏటీపీ సర్క్యూట్లో వెంటవెంటనే జరిగే ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీలను ఒకేసారి నెగ్గడం ఫెడరర్‌కు ఇది మూడోసారి. చివరిసారి ఫెడరర్ ఈ రెండు టైటిల్స్‌ను ఏకకాలంలో 2005, 2006లలో సాధించాడు. -
సానియా జంటకు షాక్
మయామి: వరుసగా రెండో టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 2-6తో మార్గరీటా గస్పర్యాన్ (రష్యా)-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడం గమనార్హం. గత నెల రోజుల్లో సానియా-హింగిస్ జంట వరుసగా మూడు టోర్నీల్లో (ఖతార్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. -
మియామీ టైటిల్ సెరెనా కైవసం
క్రీడలు గ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరు ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరును ఒక చిన్న గ్రహానికి 4538 విషీ ఆనంద్ అని పెట్టినట్లు ఏప్రిల్ 1న మైనర్ ప్లానెట్ సెంటర్ తెలిపింది. ఈ గ్రహాన్ని 1998వ సంవత్సరంలో అక్టోబర్ 10న కెంజో సుజుకీ గుర్తించారు. ఇది అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో ఉంది. సాధారణంగా కొత్తగా గుర్తించిన గ్రహాలకు వాటిని కనుగొన్న వారి పేర్లే పెడతారు. పదేళ్ల పాటు గ్రహానికి పేరు పెట్టకపోతే వేరే పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఖరారు చేస్తుంది. విశ్వనాథన్ కన్నా ముందు రోజర్ ఫెదరర్, జెస్సీ ఓవెన్స్, డొనాల్డ్ బ్రాడ్‌మెన్‌లకు ఈ గౌరవం దక్కింది. చెన్ లాంగ్, మారిన్‌లకు మలేసియా ఓపెన్ టైటిల్స్ మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను, కరోలినా మారిన్ (స్పెయిన్) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో లిన్ డాన్ (చైనా)ను చెన్ ఓడించాడు. భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లో జురుయ్ లీ చేతిలో ఓడిపోయింది. మియామీ టైటిల్ సెరెనా కైవసం మియామీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. ఫ్లోరిడాలో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్)ను ఓడించింది. సెరెనా ఎనిమిదోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. ఇది తన కెరీర్లో 66వ సింగిల్స్ టైటిల్. మహిళల డబుల్స్: టైటిల్‌ను భారత్‌కు చెందిన సానియా మిర్జా.. మార్టీనా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి రష్యాకు చెందిన ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నియాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్: టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ ఆండీ ముర్రేను ఓడించి గెలుచుకున్నాడు. ఇది జొకోవిచ్‌కు ఐదో మియామి మాస్టర్స్ టైటిల్. విశ్వవిజేత మరియా అంతర్జాతీయ మాస్టర్ మరి యా ముజిచిక్ (ఉక్రెయిన్) ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. సోచి (రష్యా)లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో నటాలియా పోగోనియా (రష్యా)ను మరియా ఓడించింది. సెమీఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్)కు కాంస్య పతకం దక్కింది. ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ కొత్త చైర్మన్‌గా రంజీబ్ బిస్వాల్ స్థానంలో రాజీవ్ శుక్లా ఎంపికయ్యారు. ఇందులో మాజీ ఆటగాళ్ల హోదాలో సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి ఉన్నారు. జాతీయం రిజర్వ్ బ్యాంకు 80వ వార్షికోత్సవం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 80వ వార్షికోత్సవం ఏప్రిల్ 2న జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పేద రైతులకు రుణాలు ఇవ్వడం, వసూలు చేసుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులను కోరారు. ఆర్థిక సమ్మిళితం సాధించేందుకు 20 ఏళ్ల మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆర్బీఐకి ప్రధాని సూచించారు. కీలకమైన సంఘటనలు నిర్దేశించుకొని లక్ష్యాలు ఏర్పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. 2015-20 వాణిజ్య విధానం 2015-20 వాణిజ్య విధానాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 1న ప్రకటించారు. ఇందులోని ముఖ్యాంశాలు: వస్తు, సేవల ఎగుమతులను 2020 నాటికి 900 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం. ఇవి 2013-14లో 465.9 బిలియన్ డాలర్లుగా ఉన్నా యి. విదేశీ వాణిజ్య విధానాన్ని ఇకపై రెండేళ్లకొకసారి సమీక్షించడం. ఇప్పటివరకు ఈ విధానంపై వార్షిక సమీక్ష జరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచడం. ఆం ధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరం పట్టణాలను టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ జాబితాలో చేర్చడం. దీంతో ఈ హోదా గల నగరాల సంఖ్య 23కు చేరుకుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉగ్రవాద నిరోధక బిల్లుకు ఆమోదం వివాదాస్పద గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేర నియంత్రణ బిల్లును గుజరాత్ శాసనసభ మార్చి 31న ఆమోదించింది. వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం అవసరమని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం బాగా పెరిగిపోవడంతో ఫోన్ సంభాషణలు కీలకమైన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయని తెలిపింది. సీఎంలు, సీజేల జాతీయ సదస్సు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు ఏప్రిల్ 5న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్గత స్వీయ మదింపు చర్యను ఏర్పాటు చేసుకోవాలని న్యాయమూర్తులను మోదీ కోరారు. వందకు పైగా ట్రైబ్యునళ్లకు అధిక నిధులు వ్యయమవుతున్నాయని, వాటి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు లో న్యాయవాద పదకోశాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అంతర్జాతీయం మయన్మార్‌లో శాంతి ఒప్పందం మయన్మార్‌లో జాతీయ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 31న కుదిరింది. ఈ ముసాయిదా ఒప్పందంపై ఆ దేశ అధ్యక్షుడు థీన్‌సేన్ సంతకం చేశారు. సాయుధ తిరుగుబాటు గ్రూపులతో జరిగిన ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. దేశ వ్యాప్తంగా కాల్పుల విరమణకు తోడ్పడే ఈ ముసాయిదా ఒప్పందాన్ని తిరుగుబాటు దళాల ప్రతినిధులు, సైన్యం, ప్రభుత్వం అంగీకరించాయి. ఈ శాంతి సంప్రదింపులకు ఐక్యరాజ్యసమితి పరిశీలక సంస్థగా వ్యవహరించింది. నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి విజయం నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ఆర్మీ జనరల్ మహ్మద్ బుహారీ విజయం సాధించారు. మార్చి 31న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు గుడ్‌లక్ జోనథాన్పై 25 లక్షల ఓట్ల మెజారిటీతో బుహారి భారీ విజయం సాధించారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా (173 మిలియన్) కలిగిన నైజీరియాలో ప్రజాస్వామ్యయుతంగా అధికార మార్పిడి జరిగింది. అవినీతి కుంభకోణాలు, ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిస్ట్‌కు చెందిన బోకోహారమ్ ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడం లాంటి వాటి వల్ల పీడీపీ ప్రజల మద్దతు కోల్పోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై సఫలమైన చర్చలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇందుకు సంబంధించిన చర్చలు స్విట్జర్లాండ్‌లోని లసానేలో ఏప్రిల్ 2న జరిగాయి. ఈ చర్చల్లో ఇరాన్‌తో పాటు ఆరు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు పాల్గొన్నాయి. రెండు వర్గాల మధ్య కుదిరిన కార్యచరణ ఒప్పందం జూన్ 30 నాటికి సమగ్రంగా పూర్తవుతుంది. ప్రస్తుత అంగీకారం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై పదేళ్లు పరిమితులు ఉంటాయి. ఇందుకు బదులుగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పలు దేశాలు ఎత్తివేశాయి. ఆపరేషన్ రాహత్ సఫలం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ రాహత్ ద్వారా ఎయిర్ ఇండియా ఏప్రిల్ 5 నాటికి 2,300 మందిని భారత్‌కు చేర్చింది. ఉగ్రవాదుల దాడిలో 150 మంది మృతి కెన్యాలో ఈశాన్య ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఏప్రిల్ 2న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 150మంది విద్యార్థులు మరణించగా, 79 మంది గా య పడ్డారు. సోమాలియాకు చెందిన ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఈ దాడులకు పాల్పడింది. రాష్ట్రీయం నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్ 1న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తూ అమరావతికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకొని 400 ఏళ్లు శాతవాహనులు పాలించారు. పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరాలయం పేరుతోనే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది. ఇటీవల వారసత్వ నగరాల్లో కేంద్రం ఎంపిక చేసిన వాటిలో అమరావతి ఒకటి. శ్రీసిటీలో పెప్సికో ఉత్పత్తి కేంద్రం ప్రారంభం పెప్సికోకు చెందిన సింగల్ లైన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏప్రిల్ 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పెప్సికో చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో కలిసి ప్రారంభించారు. 86 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1200 కోట్లతో చేపడుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఉత్పత్తి కేంద్రం.. దేశంలోనే ఆ సంస్థకు చెందిన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం కానుంది. పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి పర్వతారోహకుడు మల్లె మస్తాన్ బాబు (40) అర్జెంటినా, చీలీ మధ్యనున్న ఆండీస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. నల్గొండలో సిమి ఉగ్రవాదుల కాల్చివేత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఎంఐ-సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరిని తెలంగాణలోని నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం గ్రామంలో ఏప్రిల్ 4న పోలీసులు కాల్చి చంపారు. వీరిని మధ్యప్రదేశ్‌కు చెందిన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తించారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు, ఎస్సై సిద్ధయ్య మరణించారు. గుంటూరులో స్పైసెస్ పార్క్ ప్రారంభం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో నిర్మించిన స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల) పార్కును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 6న ప్రారంభించారు. 124 ఎకరాల్లోని ఈ పార్క్‌లో రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ 18 మంది పారిశ్రామికవేత్తలకు యూనిట్లు కేటాయించారు. ఈ పార్క్‌లో ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీ 2015-20 పారిశ్రామిక విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2015-20 పారిశ్రామిక విధానాన్ని ఏప్రిల్ 1న ప్రకటించింది. మౌలిక సదుపాయాల కల్పన, అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యాంశాలు: తయారీ రంగ వృద్ధిరేటు 15 నుంచి 17 శాతానికి, పారిశ్రామిక వృద్ధిరేటు 20.7 నుంచి 25 శాతానికి పెంచడం. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 15-20 లక్షల ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు - పరిశ్రమలకు 21 రోజుల్లోగా అనుమతులు కల్పించేందుకు సింగిల్ విండో ఏర్పాటు. పరిశ్రమల కోసం తీసుకునే భూమికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు. అవార్డులు ఆఫ్రికా గ్రూపునకు ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహిస్తున్న ఆఫ్రికన్ గ్రూపు ప్రాజెక్టు ఫర్ ద స్టడీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా (పిఆర్ఎఇఎస్ఎ-ప్రయిసా)కు తొలిసారి పిల్లల సాహిత్యంలో అందజేసే ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ దక్కింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అవార్డు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఏప్రిల్ 5న ప్రకటించారు. ఈ అవార్డును యూఏఈ మినిస్టర్ ఆఫ్ కల్చర్ దుబాయ్‌లో ఏప్రిల్ 20న ప్రదానం చేస్తారు.