పరాజయంతో పునరాగమనం  | A comeback from defeat | Sakshi

పరాజయంతో పునరాగమనం 

Mar 21 2024 1:37 AM | Updated on Mar 21 2024 1:37 AM

A comeback from defeat - Sakshi

ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ పరాజయంతో ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో పునరాగమనం చేసింది. మయామి ఓపెన్‌ టోర్నీలో హలెప్‌ (రొమేనియా) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. పౌలా బదోసా (స్పెయిన్‌)తో జరిగిన మ్యాచ్‌లో హలెప్‌ 6–1, 4–6, 3–6తో ఓడిపోయింది.

హలెప్‌ 2022లో డోపింగ్‌లో విఫలమవడంతో నాలుగేళ్ల నిషేధం విధించారు. అయితే ఈ నిషేధంపై ఆమె కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో అప్పీల్‌ చేసింది. విచారణ తర్వాత హలెప్‌ నిషేధాన్ని 9 నెలలకు కుదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement