
ఫ్లోరిడా (అమెరికా): మయామి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 107వ ర్యాంకర్ యూకీ 7–5, 6–3తో మీర్జా బేసిక్ (బోస్నియా)పై విజయం సాధించాడు.
గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ జాక్ సోక్ (అమెరికా)తో యూకీ తలపడతాడు.