
ఫ్లోరిడా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) ఫైనల్‌కు చేరింది. మరియా సాకరి (గ్రీస్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బియాంక 2 గంటల 42 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 7–6 (7/4)తో విజయం సాధించింది. 2019లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత బియాంక మరో టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో బియాంక తలపడుతుంది. మరో సెమీఫైనల్లో బార్టీ 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment